British media
-
ఇంగ్లండ్‌పై కివీస్ చారిత్రక విజయం.. బ్రిటిష్ మీడియా ఆశ్చర్యకర స్పందన
నరాలు తెగే ఉత్కంఠ నడుమ, నాటకీయ పద్ధతిలో చివరి నిమిషం వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన న్యూజిలాండ్-ఇంగ్లండ్ రెండో టెస్ట్ మ్యాచ్‌పై బ్రిటిష్ మీడియా ఆశ్చర్చకర రీతిలో స్పందించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పరుగు తేడాతో సంచలన విజయం సాధించి, అతి తక్కువ మార్జిన్‌తో విజయం సాధించిన రెండో జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ నేపథ్యంలో బ్రిటిష్ మీడియా ఆతిధ్య న్యూజిలాండ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతూనే, బజ్ బాల్ ఫార్ములా అంటూ ఓవరాక్షన్ చేసి ఓటమిని కొని తెచ్చుకున్న ఇంగ్లండ్‌ను వెనకేసుకొచ్చింది. ఛేదనలో ఇంగ్లండ్ కుప్పకూలిన వైనాన్ని పక్కకు పెట్టిన అంగ్రేజ్ మీడియా.. ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో భాగమైనందుకు స్టోక్స్ సేనను ప్రశంసించింది. ప్రముఖ బ్రిటిష్ దినపత్రిక టెలిగ్రాఫ్, చరిత్రలో చిరకాలం నిలబడిపోయే ఈ మ్యాచ్‌పై స్పందిస్తూ.. ఇది న్యూజిలాండ్ విజయమో లేక ఇంగ్లండ్ ఓటమో కాదు.. ఈ విజయం మొత్తంగా టెస్ట్ క్రికెట్‌ది అంటూ కివీస్‌కు దక్కాల్సిన క్రెడిట్‌ను దక్కనీయకుండా సైడ్‌లైన్ చేసింది. ఓవరాక్షన్ (తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి) చేసి ఓటమిపాలైనందుకు గాను సొంత జట్టును నిందించాల్సిన మీడియా.. ఏదో సాధించాం అన్నట్లు స్టోక్స్ సేనకు మద్దతుగా నిలవడంపై యావత్ క్రీడా ప్రపంచం అసహనం వ్యక్తం చేస్తుంది. ఇది చాలదన్నట్లు తమ జట్టే టెస్ట్ క్రికెట్‌ను కాపాడుతుందని ఇంగ్లిష్ మీడియా బిల్డప్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెస్ట్ క్రికెట్‌ను వినోదాత్మకంగా మార్చడమే లక్ష్యంగా ఇంగ్లండ్ జట్టు శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని, ఇందులో భాగంగానే ఈ మ్యాచ్ జరిగిందని అక్కడి మీడియా డప్పు కొట్టుకోవడం హ్యాస్యాస్పదంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూకే మీడియా నుంచి వచ్చిన ఈ అనూహ్య స్పందన చూసి నివ్వెరపోవడం క్రికెట్ అభిమానుల వంతైంది. కాగా, బజ్ బాల్ ఫార్ములా అంటూ విజయవంతంగా సాగుతున్న ఇంగ్లండ్ జైత్రయాత్రకు వెల్లింగ్టన్ టెస్ట్‌తో బ్రేకులు పడ్డాయి. టెస్ట్ క్రికెట్లో వేగం పెంచి మంచి ఫలితాలు రాబట్టిన ఇంగ్లీష్ జట్టుకు తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఇంగ్లండ్-న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌లో అంతిమంగా న్యూజిలాండ్ విజయం సాధించింది. ఫలితంగా 2 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. -
మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శిస్తాం.. బీజేపీ తీవ్ర అభ్యంతరం
తిరువనంతపురం/వాషింగ్టన్: ప్రధాని మోదీపై ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ పేరిట బ్రిటిష్ వార్తా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శిస్తామని కేరళలోని వివిధ రాజకీయ పార్టీల అనుబంధ విభాగాలు మంగళవారం వెల్లడించాయి. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం విజయన్ జోక్యం చేసుకోవాలని, వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రదర్శనను అడ్డుకోవాలని డిమాండ్ చేసింది. డాక్యుమెంటరీని ప్రదర్శించబోతున్నామంటూ సీపీఎం యువజన విభాగమైన డీవైఎఫ్ఐ ఫేసుబుక్‌లో పేర్కొంది. అనంతరం సీపీఎం విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అనుబంధ విభాగాలు ప్రకటించాయి. రాష్ట్రంలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనకు ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దని బీజేపీ కేరళ అధ్యక్షుడు కె.సురేంద్రన్ కోరారు. మత కలహాలు సృష్టించడానికే ఈ డాక్యుమెంటరీని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. డాక్యుమెంటరీ గురించి తెలియదు: అమెరికా బీబీసీ డాక్యుమెంటరీ గురించి తమకేమీ తెలియదని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. అమెరికా, భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని పేర్కొంది. ఇరు దేశాల నడుమ బలమైన సంబంధ బాంధవ్యాలను తాము కోరుకుంటున్నామని వెల్లడించింది. ఇరు దేశాలు విలువలను కలిసి పంచుకోవాలన్నదే తమ ఆకాంక్ష అని ఉద్ఘాటించింది. బీబీసీ డాక్యుమెంటరీ విషయంలో బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్ గతవారం ప్రధాని మోదీకి అనుకూలంగా మాట్లాడారు. మోదీపై అసత్యాలు ప్రచారం చేయొద్దని హితవు పలికారు. కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శన డాక్యుమెంటరీని ఎస్‌ఎఫ్‌ఐతోపాటు పలు సంఘాలు మంగళవారం కేరళలో కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శించాయి. ఈ ప్రదర్శనలను వ్యతిరేకిస్తూ బీజేపీ యువమోర్చా కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి, నిరసన వ్యక్తం చేశారు. పాలక్కాడ్, ఎర్నాకుళం తదితర ప్రాంతాల్లో యువమోర్చా కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పోలీసులు రంగంలోకి దిగి, వారిని అడ్డుకున్నారు. కేవలం కేరళలోనే కాదు, దేశవ్యాప్తంగా డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని సీపీఎం యువజన విభాగం డీవైఎఫ్ఐ మంగళవారం తేల్చిచెప్పింది. -
Rishi Sunak: రిషి ఓటమి వెనుక కారణాలివే..
రెడీ ఫర్ రిషి అంటూ బ్రిటన్ ప్రధాని అభ్యర్థి ఎన్నికలో మొదట్లో దూకుడు చూపించిన రిషి సునాక్ ఎందుకు ఓటమి పాలయ్యారు? ఎంపీల మద్దతు పుష్కలంగా ఉన్నా టోరీ సభ్యుల అండదండలు ఎందుకు లభించలేదు? భారత్‌ను వలసరాజ్యంగా మార్చిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒక భారతీయుడు పాలించే రోజు వస్తుందన్న ఆశలు ఎందుకు అడియాసలయ్యాయి? దీనిపై బ్రిటిష్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి... ► కోవిడ్–19 పార్టీ గేట్ కుంభకోణంలో ఇరుక్కొన్న ప్రధాని బోరిస్ జాన్సన్‌కు రిషి వెన్నుపోటు పొడిచారన్న అభిప్రాయం కన్జర్వేటివ్ పార్టీలో బలంగా ఏర్పడింది. రాజకీయ గురువని కూడా చూడకుండా జాన్సన్‌కు వ్యతిరేకంగా పని చేసి ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి కల్పించారని టోరీ సభ్యులు విశ్వసించారు. ఆర్థిక మంత్రి పదవికి రిషి రాజీనామా చేయడంతో ఇతర మంత్రులూ అదే బాట పట్టారు. వారికి మద్దతుగా 50 మంది ఎంపీలు కూడా రాజీనామా చేయడంతో ఒత్తిడి పెరిగి జాన్సన్ గద్దె దిగాల్సి వచ్చింది. దీన్ని నమ్మకద్రోహంగానే టోరి సభ్యులు చూశారు. ఆ వెంటనే రెడీ ఫర్ రిషి అంటూ పోటీకి దిగి దూకుడుగా ప్రచారానికి తెర తీయడంతో ప్రధాని పదవి కోసమే అంతా చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. బోరిస్ కూడా రిషికి వ్యతిరేకంగా పని చేశారు. ► ప్రతి మగవాడి విజయం వెనకా ఒక మహిళ ఉంటుందంటారు. కానీ రిషి పరాజయం వెనుక దురదృష్టవశాత్తూ ఆయన భార్య, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షత ఉన్నారు. ఆమె ఎలిజెబెత్ రాణి కంటే సంపన్నురాలన్న ప్రచారముంది. అలాంటి వ్యక్తి పన్నులు ఎగ్గొట్టడానికి నాన్ డొమిసైల్ హోదాను అడ్డం పెట్టుకున్నారన్న ఆరోపణలు కూడా రిషికి ప్రతికూలంగా మారాయి. ► తన ప్రత్యర్థి లిజ్ ట్రస్ ప్రకటించిన పన్ను రాయితీలను వ్యతిరేకించడం కూడా రిషి కొంప ముంచింది. వాటివల్ల ద్రవ్యోల్బణం పెచ్చరిల్లుతుందన్న రిషి వాదనకు కాకలు తీరిన ఆర్థికవేత్తలు మద్దతిచ్చినా టోరీ సభ్యులు మాత్రం ట్రస్ తక్షణం ఉపశమన చర్యలకే జై కొట్టారు. ► రిషీ అమెరికా గ్రీన్ కార్డు వివాదం కూడా ఆయనకు వ్యతిరేకంగా మారింది. బ్రిటన్‌కు మకాం మార్చాక కూడా గ్రీన్ కార్డును ఆయన అట్టిపెట్టుకున్నారని, ఎప్పటికైనా అమెరికాకు వెళ్లిపోవడానికే ఈ పని చేశారని సోషల్ మిడియాలో బాగా ప్రచారమైంది. ఆర్థిక మంత్రి కాగానే గ్రీన్‌కార్డును వదులుకున్నానని రిషి వివ రణ ఇచ్చినా అప్పటికే నష్టం జరిగిపోయింది. ► రిషి విలాసవంతమైన జీవితం కూడా ఆయనకు కాస్త చేటు చేసింది. ఆయన ఖరీదైన సూటు, బూటు, ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ఫొటో సెషన్లో ఖరీదైన మగ్గుతో ఫోటోలు దిగడం వంటివి పత్రికల్లో పతాక శీర్షికలయ్యాయి. కరువు గుప్పిట్లో చిక్కిన బ్రిటన్‌లో గుక్కెడు నీళ్ల కోసం జనం విలవిల్లాడుతుంటే రిషీ యార్క్‌షైర్‌లోని తన కొత్తింట్లో 4 లక్షల పౌండ్లతో స్విమ్మింగ్ పూల్ నిర్మించడం వివాదాస్పదమైంది. ‘నా ఫ్రెండ్స్ అంతా ధనవంతులే. నా స్నేహితుల్లో సామాన్యులెవరూ లేరు’ అంటూ ఎప్పుడో ఆయన మాట్లాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో రిషి అందరివాడు కాదన్న ప్రచారానికి బలం చేకూరింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వికెట్లను కాకుండా వ్యక్తులను టార్గెట్ చేయడమేంటి..?
లండన్: టీమిండియాతో లార్డ్స్ వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్టులో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న ఇంగ్లండ్ జట్టు తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటోంది. సొంత తప్పిదంతోనే మ్యాచ్ ఓడిపోయారని బ్రిటీష్ మీడియా సహా ఆ దేశ అభిమానులు, మాజీలు దుమ్మెత్తిపోస్తున్నారు. చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ని పక్కకు పెట్టి, బుమ్రాపై ప్రతీకారానికి వెళ్లిన ఇంగ్లండ్ జట్టు తగిన మూల్యం చెల్లించుకుందని బీబీసీ ఏకి పారేసింది. ఈ ఘోర పరాభవానికి రూట్ చెత్త కెప్టెన్సీనే కారణమని, అసలు టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించడమే తప్పుడు నిర్ణయమని ధ్వజమెత్తింది. షమీ, బుమ్రాల విషయంలో ఇంగ్లీష్ బౌలర్ల అంచనా తప్పిందని, వికెట్లు తీయడానికి బదులు ఆటగాళ్లపై భౌతిక దాడికి ప్రయత్నించమే ఇంగ్లీష్ జట్టు కొంపముంచిందని బీబీసీ పేర్కొంది. ఓ పక్క స్కోరు పెరుగుతున్నా.. ఇంగ్లండ్ బౌలర్ల తీరు మారలేదని, తీరా పరిస్థితి చేతులు దాటాక ఏం చేయలేక చేతులెత్తేశారని మండిపడింది. 1980లో వెస్టిండీస్, 1990-2000లో ఆస్ట్రేలియా ఎంత బలంగా ఉన్నాయో.. ఇప్పుడు భారత్ కూడా అంతే బలంగా ఉందని ప్రముఖ ఫోర్బ్స్ వార్తా సంస్థ టీమిండియాను ఆకాశానికెత్తింది. మరోవైపు, లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టు ఘోర వైఫల్యాలపై ఆ దేశ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఆటగాళ్ల కుతంత్రాలే ఇంగ్లండ్ విజయావకాశాలను దెబ్బ తీసాయని మండిపడ్డాడు. వికెట్ల మీదికి కాకుండా.. షమీ, బుమ్రాల వైపు బంతులేయడమేంటని ఆయన ఇంగ్లండ్ బౌలర్లను నిలదీశాడు. బుమ్రాని టార్గెట్ చేసి.. షమీని ఔట్ చేయడంలో నిర్లక్ష్యం వహించారని చురకలంటించాడు. కాగా, ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా-షమీ జోడీ 9వ వికెట్‌కి అజేయంగా 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. దీంతో కోహ్లీ సేన.. ఇంగ్లండ్‌కు 272 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఛేదనలో టీమిండియా పేసర్ల ధాటికి రూట్ సేన 120 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (33) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా టీమిండియా 151 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. చదవండి: అక్కడ కూడా నవ్వలేదు.. ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్‌పై ప్రధాని మోదీ ఫిర్యాదు -
22 వేలమంది ఉగ్రవాదుల జాడ తెలిసింది
లండన్: ఒకరు కాదు ఇద్దరు కాదు. ఏకంగా వేలమంది ఉగ్రవాదుల వివరాలను బ్రిటన్‌కు చెందిన ఓ మీడియా బయటపెట్టింది. దాదాపు 22 వేలమందికి పైగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల వ్యక్తిగత వివరాలను, వారి కుటుంబ సమాచారాన్ని వెల్లడించింది. ఇలా బయటపెట్టిన వివరాల్లో బ్రిటన్‌తో సహా 51 దేశాలకు చెందినవారు ఉన్నారు. దాదాపు అన్ని దేశాలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరికలు జరుగుతున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న దేశాల నుంచి బలహీనంగా ఉన్న దేశాలనుంచి ఈ సంస్థలో చేరుతున్నారు. అయితే, అలా చేరుతున్నవారి వివరాలు ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేస్తే తప్ప తెలియడం లేదు. అలాంటిది బ్రిటన్‌కు చెందిన స్కై న్యూస్ అనే సంస్థ మాత్రం దానికి సంబంధించిన వివరాలను బయటపెట్టింది. బ్రిటన్, ఉత్తర యూరప్, మధ్యాసియా, ఉత్తర ఆఫ్రికా, అమెరికా, కెనడాలకు చెందినవారు ఇందులో ఉన్నారు. వారి పేర్లు, చిరునామాలు, టెలిఫోన్ నెంబర్లు, కుటుంబ సమాచారం అందులో ఉన్నాయి. ఇప్పటికీ ఈ ఫోన్లలో కొన్ని పనిచేస్తున్నాయని కూడా మీడియా సంస్థ తెలిపింది. కొంతమంది ఉగ్రవాదులు ఉగ్రవాద సంస్థలో చేరిన తర్వాత తమ కుటుంబాలను విధ్వంసం సృష్టించేందుకు వాడుకుంటున్నాయని వివరించింది. -
‘కొత్త జిహాదీ జాన్’గా భారత సంతతి వ్యక్తి
-
‘కొత్త జిహాదీ జాన్’గా భారత సంతతి వ్యక్తి
లండన్: ‘కొత్త జిహాదీ జాన్’గా భారత సంతతి వ్యక్తి ఉగ్రవాద వీడియోల్లో ప్రత్యక్షమయ్యాడు. మాస్క్ ధరించి ఉగ్రవాద వీడియోల్లో భయానకంగా కనిపిస్తూ మాట్లాడే వ్యక్తిని బ్రిటన్ మీడియా ‘జిహాదీ జాన్’గా అభివర్ణిస్తోంది. బ్రిటన్‌లో బీభత్స ఘటనలకు పాల్పడనున్నట్లు చెబుతున్న ఓ వీడియోను ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఆదివారం విడుదల చేసింది. ఈ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి బ్రిటన్‌కు చెందిన భారత సంతి ముస్లిం సిద్ధార్థ ధర్గా బ్రిటన్ పోలీసులు గుర్తించారు. సిద్ధార్థ అలియాస్ అబు రుమేసహ్.. భార్య, నలుగురు పిల్లలతో 2014లో బ్రిటన్ నుంచి పారిపోయి సిరియాకు వెళ్లి ఐసిస్‌లో చేరాడు. హిందువు అయిన ఇతను వ్యాపారం నిమిత్తం బ్రిటన్ వెళ్లి.. అక్కడ ఇస్లాం మతం స్వీకరించాడు. ఇంగ్లాండ్‌లో అల్ ముహజిరౌన్ అనే రాడికల్ గ్రూప్‌లో చేరాడు. అక్కడి నుంచి సిరియా వెళ్లి ఐసిస్‌తో చేతులు కలిపాడు. కాగా ధర్ వీడియోను అతని తల్లి, చెల్లెలు కూడా వీక్షించారు. అయితే అది తన కొడుకు గొంతా? కాదా? అన్నది చెప్పలేనని శోభితా ధర్ పేర్కొన్నారు. వీడియో గొంతు గుర్తుపట్టేలా లేదని.. ఇది తనను షాక్‌కు గురిచేసిందని ధర్ సోదరి కోనికా చెప్పారు.