build collapse
-
ముంబైలో ఘోర ప్రమాదం
ముంబై/న్యూఢిల్లీ: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం సంభవించింది. మూడంతస్తుల భవనంలోని రెండతస్తులు పక్కను న్న ఒకే అంతస్తు భవనంపై కూలిపో యాయి. మల్వానీ ప్రాంతంలోని న్యూ కలెక్టర్ కాంపౌండ్ వద్ద బుధవారం రాత్రి 11.15 గంటలకు జరిగిన ఈ దుర్ఘటనలో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. ఏడాదిన్నర నుంచి 15ఏళ్ల వయసులోపు ఉన్న మొత్తం ఎనిమిది మంది చిన్నారులు మరణించారు. ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. శిథాలాల నుంచి 18 మందిని కాపాడారు. ఒకే అంతస్తు భవనంలో అద్దెకు ఉంటున్న రఫీక్ షేక్(45) కుటుంబంలో ఆయన భార్యతోపాటు మరో ఎనిమిది మంది మరణించారు. కూలడానికి కొద్దిసేపు ముందే పాలు కొనేందుకు బయటకెళ్లడంతో రఫీక్ ప్రాణాలు దక్కించుకున్నారు. రఫీక్ కొడుకు సైతం ఔషధాల కోసం బయటికెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తిరిగి వచ్చాక తన కుటుంబ సభ్యులు విగత జీవులు కావడం చూసి రఫీక్ గుండెలవిసేలా రోదించారు. ఇటీవల టౌటే తుపాను ధాటికి భవనం దెబ్బతిన్నదని, అందుకే కూలిందని పోలీసు అధికారి విశ్వాస్ పాటిల్ పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి భవనం యజమాని, కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేయనున్నట్టు డీసీపీ విశాల్ ఠాకూర్ చెప్పారు. నష్ట పరిహారం ప్రకటించిన రాష్ట్ర సర్కారు భవన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం అందిస్తామన్నారు. -
‘నానక్‌రామ్‌గూడ’ ఘటనలో నలుగురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనకు సంబంధించిన కేసులో నలుగురిని సైబరాబాద్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరిలో భవన యజమాని తుల్జారామ్ సత్యనారాయణ సింగ్ అలియాస్ సత్తూ సింగ్, అతని కుమారుడు అనిల్ కుమార్‌సింగ్, మేస్త్రి బిజ్జా వేణుగోపాల్, సివిల్ ఇంజనీర్ అల్లం శివరామకృష్ణ ఉన్నారు. వీరిపై ఐపీసీ 304(టూ), 304(ఏ), 338, 427 ఆర్/డబ్ల్యూ సెక్షన్ల కింద గచ్చిబౌలి ఠాణాలో కేసులు నమోదు చేశారు. ఇతరుల ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసి సులువుగా డబ్బు వస్తుందనే ఆశతో భవనాన్ని నిర్మించారని పోలీసులు చెబుతున్నారు. గురువారం కూలిన భవనానికి పక్కనే ఉన్న ఇంటి యజమాని తుల్జారామ్ బీరేందర్ ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. (ఆశలు సమాధి!) నిబంధనలు అతిక్రమించారు: ‘భవన యజమాని సత్తూ సింగ్ 267 చదరపు గజాల్లో ఏడంతస్తుల భవనాన్ని నిర్మించారు. సరైన ప్లాన్ లేకుండా, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా నిబంధనలు అతిక్రమించి శివరామకృష్ణ ప్లాన్ ఇవ్వడం, దాన్ని మేస్త్రి వేణుగోపాల్ అమలు చేశారని విచారణలో తేలింది’ అని అడిషనల్ డీసీపీ(క్రైమ్స్) శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం విలేకరులకు తెలిపారు. ఈ నిర్మాణం విషయంలో కొంత మంది జీహెచ్ఎంసీ అధికారులకు లంచం ఇచ్చినట్టుగా కూడా గుర్తించామన్నారు. భవన శిథిలాలను పూర్తి స్థాయిలో తొలగిస్తే ఆ ప్రమాద తీవ్రత తెలుస్తుందన్నారు. నిందితులు గతంలో నిర్మించిన భవన నిర్మాణాల డిజైన్లను నిఫుణులకు అందించామని, వారి నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఢిల్లీలో కుప్పకూలిన పురాతన భవనం
-
ఢిల్లీలో కుప్పకూలిన పురాతన భవనం
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మరో పురాతన భవనం కుప్పకూలింది. బారా హిందూరావు ప్రాంతంలో ఓ మూడంతస్తుల భవనం ఈరోజు ఉదయం కూలింది. శిధిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. దాంతో శిధిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడినవారిని అధికారులు చికిత్స నిమిత్తం హిందూరావు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆరు అగ్నిమాపక వావహనాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం పురాతన భవనాలను కూల్చివేయాలని అధికారులను సూచించింది.