Builders Association of India
-
బీఏఐ అధ్యక్షుడిగా పులహండి
న్యూఢిల్లీ: ప్రభుత్వ గుర్తింపు పొందిన భారత నిర్మాణదారుల సంఘం(బీఏఐ) అధ్యక్షుడిగా తమిళనాడుకు చెందిన పులహండి ఎన్నికయ్యారు. ఐదుగురు వైస్‌ప్రెసిడెంట్లు ఉండే ఈ సంఘానికి ఉపాధ్యక్షుడిగా చెరువు రామకోటయ్య ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రామకోటయ్య అన్నారు. దేశవ్యాప్తంగా బీఏఐకి 165 శాఖలున్నాయనీ, వీటిలో 18,000 మంది సభ్యులుగా ఉన్నారన్నారు. ప్రస్తుతం తాను ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌ట్రావెలర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఈఎస్ఐ కార్పొరేషన్ మెంబర్‌గా సేవలందిస్తున్నట్లు తెలిపారు. -
కలిసి నడవాలి
చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశం ప్రగతి పథంలో పయనించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడవాలని కేంద్ర పట్టణాభివృద్ధి, దారిద్య్ర నిర్మూలన శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కోరారు.బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటైన నిర్మాణ రంగ యంత్రాల అంతర్జాతీయ ప్రదర్శనను శుక్రవారం చెన్నై ట్రేడ్ సెంటర్లో ఆయన ప్రారంభించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆలోచనా ధోరణే చాలా భిన్నమైనదని, ప్రగతి దిశగా పరుగులు తీస్తోందని అన్నారు. వ్యవసాయం, రహదారు లు, భవన నిర్మాణ రంగం ఇలా అన్నింటిపైనా ఆయన ఆలోచన ధోరణిని అందుకోవాలని కోరారు. దేశ ఆర్థిక వనరుల్లో 43 శాతం వడ్డీల చెల్లింపునకే సరిపోతోందన్నారు. ఈ పరిస్థితిని అధిగమిం చాలంటే మరింత ఆర్థిక పురోగతి అవసరమని అభిప్రాయ పడ్డారు. అందుకే ప్రధాని మోదీ తాను నిద్రపోకుండా, ఎవ్వరినీ నిద్రపోనీకుండా పని చేస్తున్నామన్నారు. ప్రశంసా త్మకమైన మోదీ పనితీరును విపక్షాలు మెచ్చుకోవడం మాని మోకాలొడ్డడమే పనిగా పెట్టుకున్నాయని వ్యాఖ్యానించారు. నల్లధనాన్ని ఒక్కరోజులో తేలేమన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రదర్శన సావనీర్‌ను వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. సభానంతరం ప్రదర్శన కమిటీ అధ్యక్షులు రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడారు. సి మెంటు కంపెనీల యజమానులు ఇష్టారాజ్యం గా ధరలు పెంచడం వల్ల నిర్మాణ రంగం పూర్తిగా కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల నియంత్రణకు కేంద్ర స్థాయిలో సిమెంటు రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ నెల 11వ తేదీ వరకు ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
ఉమ్మడి రాష్ట్రంలోనే కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలి
బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు వి. సత్యమూర్తి హైదరాబాద్, ఉమ్మడి రాష్ర్టంలో చేసిన పనులకు రాష్ర్టం కలసి ఉన్న సమయంలోనే బిల్లులు చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు వి. సత్యమూర్తి కోరారు. విభజన నేపథ్యంలో ఆరు నెలలుగా తాము పూర్తి చేసిన ప్రభుత్వ పనులకు గానూ సుమారు రూ. 1500 కోట్లు రావాల్సి ఉన్నా.. ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. ఈ బిల్లులను ఈ నెల 24లోపు చెల్లించే విధంగా గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ సచ్చిదానందరెడ్డి, సోమ శ్రీనివాస్‌రెడ్డిలతో కలసి శుక్రవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్ అండ్ బీలో రూ. 540 కోట్లు, ప్రాణహిత- చేవెళ్ల పనులకు గాను రూ. 500 కోట్లు పంచాయతీ రాజ్ శాఖ నుంచి పూర్తి చేసిన పనులకు గాను రూ. 500 కోట్లు పలువురు కాంట్రాక్టర్లకు కావాల్సి ఉన్నా వాటిని మంజూరు చేయడంలో అధికారులు తాత్సారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుపెట్టుకొని పూర్తయిన పనుల బిల్లులు పే అండ్ అకౌంట్స్ కార్యాలయానికి వచ్చినా చెల్లింపులు చేయడం లేదన్నారు. తమ సమస్యను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.