Building contractor
-
బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్‌కు కోటి రూపాయల వాచ్ గిఫ్ట్
పంజాబ్‌లో నివాస భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టర్‌కు కోటి రూపాయల విలువైన రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడో వ్యాపారవేత్త. నాణ్యతగా, వేగవంతంగా నిర్మాణాన్ని పూర్తి చేయడంతలో కాంట్రాక్టర్ రాజిందర్ సింగ్ రూప్రా చూపిన ఖచ్చితమైన శ్రద్ధను గుర్తిస్తూ ఆయనకు ఈ బహుమతి అందించినట్లు భవన యజమాని గుర్దీప్ దేవ్‌బత్ చెప్పారు.కాంట్రాక్టర్ రాజిందర్ సింగ్ రూప్రా అందుకున్న ఈ వాచ్ 18-క్యారెట్ల బంగారంతో రూపొందించిన రోలెక్స్ ఓస్టెర్ పెర్పెచ్యువల్ స్కై-డ్వెల్లర్. చూడగానే బంగారు కాంతులతో ధగాధగా మెరిసిపోతున్న ఈ వాచ్‌కి బలమైన బంగారు లింక్‌లతో తయారైన సిగ్నేచర్ ఓస్టెర్ బ్రాస్లెట్ ఉంది. అలాగే ఇందులో షాంపైన్-రంగు డయల్ కూడా ఉంది.200 మందికిపైగా కార్మికులుపంజాబ్లోని జిరాక్పూర్ సమీపంలో 9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భవనం విషయానికి వస్తే ఇది ఆధునిక కోటను పోలి ఉంటుంది. పంజాబ్‌లోని షాకోట్‌కు చెందిన రూప్రా అనే కాంట్రాక్టర్ అనుకున్న ప్రకారం రెండు సంవత్సరాల వ్యవధిలో 200 మందికి పైగా కార్మికులతో నిరంతరం పనులు చేసి నిర్మాణం పూర్తి చేశారు.వాస్తుశిల్పి రంజోద్ సింగ్ భవనం డిజైన్‌ను రూపొందించారు. దృఢమైన సరిహద్దు గోడతో ఒక ప్రైవేట్ కోటలా దీన్ని నిర్మించారు. ఇందులో విశాలమైన హాళ్లు, అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన గార్డెన్లు ఉన్నాయి. అంతేకాకుండా నిర్మాణపరంగా విశిష్టమైన ప్రత్యేకతలెన్నో ఈ భవనంలో ఉన్నాయి. -
మేడకు నేర్పిన నడకలివీ..
నెమలికి నేర్పిన నడకలివీ’ అన్నాడు ఓ సినీకవి. దాన్ని ఇప్పుడు మనం ‘మేడకు నేర్పిన నడకలివీ’ అని అనుకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు ఎటూ కదలని భవనాలు మొదలైన వాటిని ‘స్థిరా’స్తులుగా చెప్పుకొనేవారు. ఇప్పుడవి కదులుతూ ‘చరా’స్తులుగా మారాయి. దానికి ఉదాహరణగా నిలుస్తోంది రంగంపేటలో ఓ రెండంతస్తుల మేడ. అదేంటో తెలుసుకుందామా.. సాక్షి, రంగంపేట (తూర్పుగోదావరి) : పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం అసాధ్యాలను సైతం సుసాధ్యం చేస్తూ అబ్బురపరుస్తోంది. ‘స్థిర’ ఆస్తులుగా చెప్పుకొనే భవనాలు ‘చర’ ఆస్తులుగా మారి అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. జీవరాశులే కాదు.. నేను కూడా నడుస్తున్నాను చూడండంటూ రంగంపేటలోని ఓ రెండంతస్తుల మేడ 26 అడుగులు వెనక్కు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. రాజానగరం నుంచి సామర్లకోట వరకూ ఏడీబీ రోడ్డును ఆరులైన్ల రోడ్డుగా అభివృద్ధి చేస్తున్న విషయం విదితమే. ఈ విస్తరణలో రంగంపేట మెయిన్ రోడ్డు పక్కన ఉన్న రెండంతస్తుల భవనం తొలగించాల్సి ఉంది. అది ఇష్టం లేని ఆ భవన యజమాని పోతుల రామ్‌కుమార్ దాన్ని వెనక్కు జరపాలని నిశ్చయించుకున్నారు. దాంతో చెన్నైకి చెందిన ఏజే బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ కంపెనీకి, విజయవాడకు చెందిన ఒక సబ్ కాంట్రాక్టర్‌కు భవనాన్ని 33 అడుగులు వెనక్కి జరిపేందుకు కాంట్రాక్టు ఇచ్చారు. బీహార్ రాష్ట్రానికి చెందిన టెక్నిషియన్లు మేడను వెనుకకు జరిపే పనులు ప్రారంభించారు. ఈ మొత్తం పనులు పూర్తి కావడానికి రెండు నెలలకు అగ్రిమెంట్ చేసుకున్నట్టు రామ్‌కుమార్ తెలిపారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న రెండు భవనాలు పక్కపక్కన ఉండేవి. వెనక్కి నడిచిన పెద్ద భవనం ఇప్పుడిలా.. ఇప్పటికి పనులు ప్రారంభించి 57 రోజులు కాగా 33 అడుగులకు గాను 26 అడుగులు మేడ వెనక్కి జరిగింది. మరో వారం రోజుల్లో మేడ మొత్తం 33 అడుగులు వెనక్కి జరుగుతుందని రామ్‌కుమార్ తెలిపారు. ఈ భవనం కదులుతున్న తీరు గమనిస్తే.. భవనం ఫ్లోరింగ్ మొత్తం తవ్వి పిల్లర్లకు 350 రోలింగ్ జాకీలు అమర్చారు. ఆ జాకీలపై భవనాన్ని ఉంచి మరికొన్ని భారీ జాకీలను మేడకు దన్నుగా ఉంచి ఒక్కొక్క జాకీ వద్ద ఇద్దరు వ్యక్తులు జాకీలను తిప్పడంతో భవనం అతి సూక్ష్మంగా వెనక్కి కదులుతోంది. అలా ఇంతవరకూ 26 అడుగులు వెనక్కు జరిగింది. మేడ మొత్తం 33 అడుగులు వెనక్కి నడిచిన తరువాత భవనాన్ని 2 అడుగుల ఎత్తు కూడా భవనాన్ని చేయిస్తామని రామ్‌కుమార్ తెలిపారు. మేడ వెనక్కి జరుగుతున్న తీరును తిలకించేందుకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తరలివస్తున్నారు. దాంతో ఈ ప్రాంతం జనసందోహంతో కళకళలాడుతుంది. -
కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి బాసట
- జెడ్పీకాంప్లెక్స్ నిర్మాణ పనులకు మరోసారి గడువు పొడిగింపు - అంచనావ్యయం పెంచేందుకు పావులు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ భవన నిర్మాణ కాంట్రాక్టర్‌పై ప్రభుత్వం అనవసర ప్రేమను కురిపిస్తోంది. నాలుగేళ్లయినా పునాదులు దాటని జెడ్పీ కాంప్లెక్స్ నిర్మాణ గడువును మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లా పరిషత్ బహుళ అంతస్తు భవన సముదాయం నిర్మించే పనిని 2012లో కాంట్రాక్టు సంస్థకు అప్పగించింది. ఒక్కో అంతస్తులో 20వేల చదరపు అడుగులు ఉండేలా డిజైన్ చేసిన ఈ భవనం నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించింది. గత మే నెలాఖరునాటికే ఈ భవనం అందుబాటులోకి రావాల్సివుండగా పనుల జాప్యం కారణంగా ఇప్పటికీ పునాదులకు నోచుకోలేదు. ఈ క్రమంలోనే మరో ఏడాది కాలపరిమితిని కూడా పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ, నిర్మాణం పూర్తయ్యే అవకాశాల్లేకపోవడంతో మరోసారి కాంట్రాక్టు కాలపరిమితిని పెంచాలని కోరుతూ పంచాయతీరాజ్‌శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి సానుకూలంగా స్పందించిన ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రేమాండ్ పీట ర్ 2015 మార్చినాటికీ జెడ్పీ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా పరిషత్ సాధారణ నిధులతో ప్రతి పాదించిన ఈ బిల్డింగ్ ను త్వరితగతిన పూర్తి చేయాల్సిన యంత్రాంగం.. ఆ దిశగా చర్యలు తీసుకోకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యాన్ని వెనుకేసుకొస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అంచనా వ్యయాన్ని కూడా మరో రూ.రెండు కోట్లు పెంచేందుకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముందుచూపు లేకుండా 2003లో నేలమట్టం చేసిన పాత భవనం స్థానే బహుళ అంతస్తుల సముదాయాన్ని నిర్మించాలనే ప్రతిపాదనలకు అడుగడుగునా అవరోధాలే ఎదురవుతున్నాయి. నిర్మాణం మొదలు పెట్టింది తడువు రాజకీయ వివాదంతో కొన్నేళ్లు బిల్డింగ్ పనులు నిలిచిపోగా, తాజాగా పనులు మొదలైనప్పటికీ, నల్లా కనెక్షన్ తీసుకోవడంలో చేస్తున్న జాప్యంతో పనులు పెండింగ్‌లో పెట్టడం అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తోంది.