Building pinalaijesan scheme
-
బీపీఎస్ దరఖాస్తులు ఎన్ని వచ్చాయి?
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్) కింద మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. అందులో క్రమబద్ధీకరణకు అర్హమైనవెన్ని.. దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ఉత్తర్వులు జారీ చేయడానికి ఎంత సమయం పడుతుంది.. తదితర వివరాలను తమ ముందుంచాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను హైకోర్టు ఆదేశించింది. ఈ వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. ‘గ్రేటర్’పరిధిలోని అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు వీలుగా జీహెచ్ఎంసీ చట్టానికి చేసిన సవరణలను, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ నిమిత్తం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స కార్యదర్శి ఎ.పద్మనాభరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం.. రెండు రోజుల క్రితం మరోమారు విచారించింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది కేశవరావు స్పందిస్తూ, దరఖాస్తుల పరిశీలనకు కొంత గడువు కావాలని కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం, బీపీఎస్ కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ఎన్ని అర్హమైనవి.. వాటి విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం పడుతుంది.. తదితర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేశవరావును ఆదేశించింది. -
‘బీపీ’ఎస్!
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) అధికారులు, పాలకులకు బీపీ పెంచుతోంది. ఈ ప్రక్రియ మూడడుగులు ముందుకు.. ఏడడుగులు వెనక్కు చందంగా నడుస్తోంది. స్కీమ్‌కు ఈ నెల 31తో గడువు ముగియనుంది. ఇప్పటివరకు 5,899 దరఖాస్తులు అందాయి. బీపీఎస్‌కు సుమారు 15 వేల దరఖాస్తులు వస్తే రూ.100 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు, పాలకులు కలలు కన్నారు. తాజా పరిణామాలను పరిశీలిస్తే అందులో మూడో వంతు ఆదాయం కూడా వచ్చేలా కనిపించడం లేదని పెదవి విరుస్తున్నారు. నగరపాలక సంస్థలు, మునిసిపాల్టీల్లో భవన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. మే 27 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఇప్పటికి మూడుసార్లు గడువు పొడిగించారు. తొలి గడువు ఆగస్ట్ 31 వరకు 4,150 దరఖాస్తులు అందాయి. సెప్టెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు 1,749 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. క్లియరెన్స్ ఏదీ? ఇప్పటివరకు అందిన బీపీఎస్ దరఖాస్తుల్ని క్లియర్ చేయడంలోనూ టౌన్‌ప్లానింగ్ అధికారులు విఫలమయ్యారు. నవంబర్ 20వ తేదీ నుంచి క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు. నవంబర్ 16న గుంటూరు, 17న విశాఖపట్నం, 18న అనంతపురం రీజియన్లలో ఎంపికచేసిన టౌన్‌ప్లానింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఆన్లైన్ విధానంలో బీపీఎస్ చేసేందుకు ట్యాబ్‌లు కొనుగోలు చేసుకోవాల్సిందిగా డీటీసీపీ ఆదేశాలు జారీచేశారు. గ్రేటర్ విశాఖ, గుంటూరు నగరపాలకసంస్థల్లో క్రమబద్ధీకరణ ప్రారంభం కాగా విజయవాడలో అడుగు ముందుకు పడలేదు. ట్యాబ్‌లు కొనుగోలు చేయకపోవడమే ఇందుకు కారణమని టౌన్‌ప్లానింగ్ ఉద్యోగులు చెబుతున్నారు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కొత్తగా దరఖాస్తు చేసేందుకు గృహనిర్మాణదారులు ఆసక్తి కనబరచడం లేదు. అమలుకాని ఆదేశాలు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో అధికారుల్లో హైరానా మొదలైంది. బీపీఎస్‌కు 2008లో 15,826 దరఖాస్తులు రాగా 11,287 క్లియర్ చేశారు. టౌన్‌ప్లానింగ్ ద్వారా ఏడాదికి 2,500 గృహ నిర్మాణ ప్లాన్లు మంజూరు చేస్తారు. ఈ లెక్కన సుమారు 15 వేల దరఖాస్తులు వస్తాయని లెక్కలేశారు. 2007 నుంచి ఇప్పటివరకు మంజూరు చేసిన బిల్డింగ్ ప్లాన్ల ఆధారంగా స్పెషల్ డ్రైవ్‌ను ముమ్మరం చేయాలని కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. డీవియేషన్లు ఉన్న గృహాలకు బీపీఎస్ అని రాసి ఇంటూ మార్క్ వేయాల్సిందిగా పేర్కొన్నారు. ఇదంతా మొక్కుబడి తంతుగా మారిందనే విమర్శలు ఉన్నాయి. టౌన్‌ప్లానింగ్ సిబ్బంది సైతం సమగ్ర సర్వే విధులకు హాజరుకావడంతో బీపీఎస్ అటకెక్కిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇబ్బందులు తప్పవు క్రమబద్ధీకరణకు ముందుకు రాకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు. అక్రమ నిర్మాణాలకు నూరుశాతం ఆస్తిపన్ను పెంచుతాం. డీవియేషన్ స్థాయిని బట్టి భవనాలను కూల్చివేయడానికి కూడా వెనుకాడేది లేదు. నగరంలో బీపీఎస్ దరఖాస్తుల క్లియరెన్స్ ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తాం. -జి.వి.రఘు, టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ డెరైక్టర్ -
బీపీఎస్కెళితే బుక్కే!
విజయవాడ నగరపాలక సంస్థ 2008లో బీపీఎస్ దరఖాస్తులు 15,826 క్లియర్ అయినవి 11,287 ఈ ఏడాది దరఖాస్తులు 5,700 గుంటూరు నగరపాలక సంస్థ 2008లో బీపీఎస్ దరఖాస్తులు 9,965 క్లియర్ అయినవి 9,935 ఈ ఏడాది దరఖాస్తులు 4,750 ఇదీ నల్లకుబేరుల ఆందోళన ఆన్లైన్ విధానంతో ‘బ్లాక్’ భయం మంత్రి దృష్టికి తీసుకెళ్లే యోచనలో అధికారులు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్)కు ఆన్‌లైన్‌తో అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. బహుళ అంతస్తుల భవనాల క్రమబద్ధీకరణకు రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఫీజును ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంది. ఫీజు మొత్తం ఆన్లైన్లో చెల్లిస్తే బ్లాక్‌మనీ బండారం బద్దలై ఆదాయ పన్ను శాఖ అధికారుల కన్ను తమపై పడుతుందనే భయంతో నల్ల కుబేరులు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం డెడ్లైన్ల పేరిట నెలల తరబడి గడువు పెంచినా టార్గెట్ పూర్తవటం లేదు. విజయవాడ సెంట్రల్ : రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, మునిసిపాల్టీల్లో భవన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం మే 27 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 59,600 దరఖాస్తులు అందాయి. 2008తో పోలిస్తే ఇది మూడో వంతేనని అధికారులు చెబుతున్నారు. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల్లో 10,450 దరఖాస్తులు అందాయి. ఈ రెండు నగరాల్లోనే సుమారు 25 వేల దరఖాస్తులు వస్తాయని భావించిన టౌన్‌ప్లానింగ్ అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. ఆన్లైన్ విధానం వల్లే గృహనిర్మాణ యజమానులు ముందుకు రావడం లేదన్న నిర్ధారణకు అధికారులు వచ్చారు. ఈ విషయమై మునిసిపల్ మంత్రి నారాయణతో చర్చించాలని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అసలు కథ ఆన్లైన్ తర్వాతే... బీపీఎస్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయగానే టౌన్‌ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు వస్తారు. గృహాన్ని నిశితంగా పరిశీలించి కొలతలు తీసుకుంటారు. దరఖాస్తులో పేర్కొన్న విధంగా అన్నీ సక్రమంగా ఉంటే బీపీఎస్‌ను ఓకే చేస్తారు. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఆన్లైన్లోనే మిగతా సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం విజయవాడ, గుంటూరు నగరాల్లో కొన్ని బహుళ అంతస్తుల భవనాలను క్రమబద్ధీకరించాలంటూ సుమారు రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బీపీఎస్ కింద సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని అధికారులు లెక్కలేశారు. ఈ మొత్తం సొమ్మును ఆన్లైన్లో ఒకే ఖాతా నుంచి జమచేసినట్లయితే బ్లాక్ మనీ బాగోతం వెలుగుచూసి ఎక్కడ బుక్కయిపోతామోనని నల్లకుబేరులు హడలెత్తుతున్నారు. మాన్యువల్ పద్ధతిలో అయితే వేర్వేరు ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసి బీపీఎస్‌కు చెల్లించే అవకాశం ఉండేదన్నది వారి వాదన. స్పెషల్ డ్రైవ్‌కు అధికారుల నిర్ణయం బీపీఎస్ గడువు డిసెంబర్ 31తో ముగియనుంది. గడచిన ఐదు నెలలుగా ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో అధికారుల్లో హైరానా మొదలైంది. 2007 నుంచి ఇప్పటి వరకు మంజూరు చేసిన బిల్డింగ్ ప్లాన్ల ఆధారంగా ముమ్మరంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. డీవియేషన్లు ఉన్న గృహాలకు బీపీఎస్ అని రాసి ‘ఇంటూ మార్క్’ వేస్తున్నారు. ఆ గృహ నిర్మాణదారుడి నుంచి దరఖాస్తు అందిన వెంటనే ‘ఇంటూ మార్క్’ను చెరిపేసే విధంగా ప్లాన్ చేశారు.అప్పుల ఊబిలో ఉన్న విజయవాడ నగరపాలక సంస్థ బీపీఎస్‌పై గంపెడాశ పెట్టుకుంది. సుమారు రూ.100 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా కట్టింది. అయితే బీపీఎస్ ఆదాయానికి ఆన్లైన్ విధానం గండికొడుతోంది. ఆన్లైన్ వల్లే ఇబ్బంది ఆన్లైన్ విధానం వల్లే ఆశించిన స్థాయిలో బీపీఎస్‌కు దరఖాస్తులు రావడం లేదు. మా వంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కొన్ని ఇబ్బందుల వల్ల బహుళ అంతస్తుల భవన యజమానులు ముందుకు రావడం లేదు. గడువులోపు లక్ష్యాన్ని చేరుకొనేందుకు ప్రయత్నిస్తాం. - జి.వి.రఘు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్, విజయవాడ దరఖాస్తు ప్రక్రియ ఇలా... బీపీఎస్ దరఖాస్తుదారులు అప్రూవ్డ్, డీవియేషన్ ప్లాన్లను స్కాన్ చేయాలి. ఆటో క్యాడ్ మ్యాప్ తీసి రిజిస్ట్రేషన్ విలువ ఎంత అనేది స్పష్టంగా పేర్కొనాలి. భవనం ఎలివేషన్ ఫొటోను స్కాన్ చేయాలి. ఆన్లైన్ విధానంలో ఇవన్నీ చేశాక కంప్యూటర్ పేమెంట్ మోడ్ అడుగుతుంది. క్రెడిట్ కార్డు, ఏటీఎం, నెట్ బ్యాంకింగ్‌లలో ఏదో ఒకదాన్ని టిక్ చేయాలి. వెంటనే రూ.10 వేలు దరఖాస్తుదారుడి ఖాతా నుంచి నగదు జమ అవుతుంది. ఆ వెంటనే ఐదు డిజిట్ల నంబర్.. మెసేజ్ రూపంలో ఫోన్‌కు వస్తుంది. దీంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. -
రా..రమ్మని!
బీపీఎస్ కోసం ఇంటిబాట కరపత్రాలు, సదస్సుల ద్వారా ప్రచారం బిల్డింగ్ ఇన్స్పెక్టర్లకు రోజువారీ టార్గెట్లు కార్పొరేషన్ ఖజానా నింపేందుకు కసరత్తు విజయవాడ సెంట్రల్ : అప్పుల ఊబిలో కూరుకుపోయిన కార్పొరేషన్ ఖజానా నింపుకొనేందుకు భవనాల క్రమబద్ధీకరణ (బీపీఎస్) చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు 2007 నుంచి ఇప్పటివరకు మంజూరు చేసిన బిల్డింగ్ ప్లాన్ల ఆధారంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. గూగుల్ మ్యాప్, ఇంటిపన్ను రసీదులను పరిగణనలోకి తీసుకుని బీపీఎస్‌ను వర్తింపజేయాలన్న ఆలోచనకు వచ్చారు. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం నిబంధనలు గందరగోళంగా మారడంతో గృహ నిర్మాణదారుల నుంచి స్పందన కరువైంది. గడిచిన పది రోజుల్లో కేవలం 30 దరఖాస్తులు మాత్రమే ఆన్లైన్లో వచ్చాయి. మరో నెలా ఇరవై రోజుల్లో గడువు పూర్తికానుంది. పెద్దసంఖ్యలో బీపీఎస్ దరఖాస్తులు స్వీకరించాలని కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ మేర కసరత్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయికి వెళదాం టౌన్ ప్లానింగ్ విభాగం ఏడాదికి సగటున 2,500 ఇళ్ల ప్లాన్లు మంజూరుచేస్తోంది. 2007లో బీపీఎస్‌కు 15,826 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 11,287 క్లియర్ చేశారు. కోర్టు కేసులు, గడువు లోపు దరఖాస్తులు అందకపోవడం వంటి కారణాలతో 4,539 దరఖాస్తులను తిరస్కరించారు. 2007 తర్వాత మంజూరు చేసిన బిల్డింగ్ ప్లాన్ల ఆధారంగా క్షేత్రస్థాయి పర్యటన చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ కాలంలో సుమారు 18,500 వరకు ప్లాన్లు మంజూరు చేయగా ఆయా ప్రాంతాల్లో పర్యటించి భవన నిర్మాణాలను పరిశీలించనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న గృహాలకు బీపీఎస్ అని రాసి ఇంటూ మార్క్ వేస్తారు. ఆ గృహ నిర్మాణదారుడి నుంచి దరఖాస్తు అందిన వెంటనే ఇంటూ మార్క్‌ను చెరిపేసే విధంగా ప్లాన్ చేశారు. ఇలా చేయడం ద్వారా బీపీఎస్‌కు సంబంధించి గృహ నిర్మాణదారులను రమ్మని ఆహ్వానించినట్లవుతుందని టౌన్ ప్లానింగ్ అధికారులు భావిస్తున్నారు. రోజుకు వంద టార్గెట్ అప్పుల ఊబిలో ఉన్న నగరపాలక సంస్థ బీపీఎస్‌పై గంపెడాశ పెట్టుకుంది. రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా కట్టింది. 1985 జనవరి 1 నుంచి 2014 డిసెంబర్ 31 వరకు నిర్మించిన భవనాలకు మాత్రమే బీపీఎస్‌ను వర్తింపజేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గూగుల్ మ్యాప్ ఆధారంగానే గృహనిర్మాణాల్లో అక్రమాలను గుర్తించాలని నిర్ణయించారు. పన్ను రసీదును పరిగణనలోకి తీసుకోవాలని బిల్డింగ్ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఇక వారు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి రోజుకు ఒక్కో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కనీసం వందకు తగ్గకుండా దరఖాస్తులు స్వీకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. నగరంలోని 14 మీ-సేవ కేంద్రాలు, మూడు సర్కిల్ కార్యాలయాలతోపాటు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో రెండు స్పెషల్ కౌంటర్లను ఏర్పాటుచేశారు. సంబంధిత పత్రాలతో గృహ నిర్మాణదారులు ఈ కేంద్రాలకు వచ్చినట్లయితే ఆన్లైన్లో దరఖాస్తు బాధ్యతను ప్రత్యేక సిబ్బందే చూసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ముమ్మర ప్రచారం బీపీఎస్‌పై ముమ్మరంగా ప్రచారం చేయనున్నట్లు సిటీ ప్లానర్ ఎస్.చక్రపాణి ‘సాక్షి’కి చెప్పారు. కరపత్రాలు, డివిజన్లలో సదస్సుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. సుమారు 16 వేల దరఖాస్తులు అందాలన్నది లక్ష్యమన్నారు. గతంలో తిరస్కరించిన దరఖాస్తుల విషయంలో ఏం చేయాలనేదానిపై ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. -
ఇక స్వాధీనమే
అక్రమ నిర్మాణాల అడ్డుకట్టకు ప్రభుత్వ యోచన మరోసారి తెరపైకి బీపీఎస్ రూ.250 కోట్ల ఆదాయంపై దృష్టి అక్రమ నిర్మాణాలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం హెచ్చరించడం... ఒక్కోసారి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించడం... దీన్ని సాకుగా తీసుకొని అక్రమార్కులు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించడం... ఇదీ ఇప్పటి వరకూ మనం చూస్తున్నది. ఇకపై దీనికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంటోంది. క్రమబద్ధీకరణలు... కూల్చివేతలకు స్వస్తి చెప్పి... నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాన్ని ఏకంగా స్వాధీనం చేసుకోవాలని యోచిస్తోంది. సిటీబ్యూరో: ప్రభుత్వ భూముల్లో 125 చదరపు గజాలలోపు నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి ఉచిత క్రమబద్ధీకరణ... అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలోని వారి నుంచి క్రమబద్ధీకరణ ద్వారా భారీ ఆదాయం సముపార్జనకు యత్నిస్తున్న ప్రభుత్వం...మలిదశలో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్(బీపీఎస్) మళ్లీ అమలుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక మూడో దశలో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. క్రమబద్ధీకరణ అవకాశాన్ని వినియోగించుకోని వారి అక్రమ నిర్మాణాలను స్థానిక సంస్థలే స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీని దృష్టిలో పెట్టుకొని ఈ చర్చలు జరుగుతున్నప్పటికీ ...త రువాత దశలో తెలంగాణ రాష్ట్రమంతటా దీన్ని వర్తింపజేయాలనేది లక్ష్యంగా తెలుస్తోంది. పెండింగ్ దరఖాస్తులకు మోక్షం జీహెచ్ఎంసీలో అనుమతి పొందిన ప్లాన్‌కు మించి అదనంగా నిర్మాణాలు చేపట్టడం... ఆమోదం పొందకుండానే నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గతంలో బీపీఎస్‌ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన జీవో 2007 డిసెంబర్ 31న జారీ కాగా... పలుమార్లు పొడిగించారు. అలా 2010 వరకు అవకాశం కల్పించారు. దీనికోసం జీహెచ్ఎంసీకి 2.05 లక్షల దరఖాస్తులు రాగా.... ప్రభుత్వ స్థలాలు, పార్కుల ప్రదేశాల్లో నిర్మించిన 55,901 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. 1,44,353 దరఖాస్తులు బీపీఎస్ నిబంధనల మేరకు ఉండడంతో భవనాలు క్రమబద్ధీకరించారు. మిగతా దరఖాస్తులకు సంబంధించి అవసరమైన పత్రాలు లేకపోవడం, ఫీజులు చెల్లించకపోవడం, ఇతరత్రా కారణాలతో పెండింగ్‌లో ఉంచారు. బీపీఎస్ ద్వారా జీహెచ్ఎంసీకి అప్పట్లో దాదాపు రూ.868 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం ప్రభుత్వ భూముల్లో భవనాలు నిర్మించుకున్న వారికీ అవకాశం కల్పించడంతో పాటు ఇదే చివరి గడువని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల అప్పట్లో తిరస్కరణకు గురైన వారు క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కలగనుంది. గతంలో అవకాశాన్ని వినియోగించుకోని వారితో పాటు ఆ తర్వాత కొత్తగా వచ్చిన అక్రమ నిర్మాణాలు కలిపి దాదాపు లక్షన్నర వరకు ఉండవచ్చుననే ది అంచనా. వీటితో పాటు ప్రభుత్వ భూముల్లోని అక్రమ నిర్మాణాలు కలిపితే సుమారు రెండు లక్షల దాకా ఉంటాయని భావిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలోనివి కావడంతో గతంలో వచ్చినంత కాకపోయినా రూ. 200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని టౌన్ ప్లానింగ్ నిపుణుల అంచనా. స్వాధీనమే పరిష్కారమని... భవిష్యత్‌లో తిరిగి అక్రమ నిర్మాణాలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అక్రమ నిర్మాణాల క్రమబద్ధీక రణకు ఇదే చివరి అవకాశంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే... నిబంధనలు ఉల్లంఘించినంత మేరకు భవనంలోని భాగాన్ని జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకోనుంది. అలా స్వాధీనం చేసుకున్న వాటిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించడమో లేక వేలం ద్వారా విక్రయించడమో చేయాలనే దిశగా సమాలోచనలు జరుగుతున్నట్లు తెలిసింది. దీనికి అవసరమైన చట్ట సవరణ, నిబంధనలపై ఉన్నతస్థాయి అధికారులు దృష్టి సారించారు. ఇప్పటి వరకు అక్రమంగా వెలసిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తుండటం తెలిసిందే. తద్వారా ఎంతో సంపద నష్టం కావడమే కాక... కొంతకాలానికి తిరిగి వెలుస్తున్నాయి. కొత్తగా అమల్లోకి తేనున్న ‘స్వాధీనం’ యోచనతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం చాలామంది ఒకఅంతస్తుకు అనుమతి పొంది.. రెండు, మూడంతస్తులు.... నాలుగంతస్తుల వరకు అనుమతి ఉంటే అదనంగా మరో రెండు అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇలాంటి అదనపు అంతస్తులను స్వాధీనం చేసుకోవడం వల్ల అక్రమాలు పునరావృతం కావని భావిస్తున్నారు. దీనివల్ల జీహెచ్ఎంసీకి వచ్చే రాబడి కంటే ప్రజలు అక్రమాల జోలికే వెళ్లకుండా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. బీపీఎస్.. దరఖాస్తులు.. పరిష్కారం 2007 డిసెంబర్ 31న బీపీఎస్‌కు సంబంధించిన జీవోను ప్రభుత్వం వెలువరించింది. 2007 డిసెంబర్ 15 కన్నా ముందు నిర్మించిన అక్రమ భవనాలకే ఇది వర్తిస్తుంది. బీపీఎస్ కోసం జీహెచ్ఎంసీకి అందిన మొత్తం దరఖాస్తులు: 2,05,006 పరిష్కారమైనవి: 1,44,353 తిరస్కరించినవి: 55,901 బీపీఎస్ ద్వారా జీహెచ్ఎంసీకి వచ్చిన ఆదాయం: రూ.868.87 కోట్లు బీపీఎస్‌కు ముగింపు పలికింది: 31 మే 2013