Building structures
-
ఆ భయం వల్లేనా..!
సాక్షి,హైదరాబాద్: హైడ్రా భయం భవన నిర్మాణాలపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీకి గతంలో వచ్చిన ఆదాయం ఈ సంవత్సరం రాలేదు. చెరువులు, సరస్సులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన హైడ్రా ఎందుకనోగానీ ప్రజల్లో..ముఖ్యంగా రియల్టర్లలో వణుకు పుట్టిస్తోంది. వాస్తవానికి హైడ్రా రియల్టర్ల జోలికి వెళ్లడం లేదు. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల మేరకు చెరువులను కబ్జాలు చేసి నిరి్మస్తున్న భవనాలనే కూల్చివేస్తోంది. కానీ అనవసర భయాలతో రియల్టర్లు కొత్త ప్రాజెక్టులకు వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. జీహెచ్ఎంసీకి గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం భవన నిర్మాణ ఫీజుల ద్వారా రావాల్సిన ఆదాయం గణనీయంగా తగ్గడం ఇందుకు ఉదాహరణ. పెద్దపెద్ద నిర్మాణాలు జరిగితేనే ఫీజుల రూపేణా అధిక ఆదాయం వస్తుంది. పెద్ద నిర్మాణాలు స్తంభించడంతో ఆదాయం తగ్గినట్లు తెలుస్తోంది. గడచిన ఆరి్థక సంవత్సరం (2023–24)లో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం ద్వారా రూ.1695 కోట్ల ఆదాయం జీహెచ్ఎంసీ ఖజానాకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం (2024–25) అక్టోబర్ నెలాఖరు వరకు వచి్చంది రూ.459 కోట్లు మాత్రమే. నవంబర్, డిసెంబర్‌లలోనూ పెద్ద నిర్మాణాల అనుమతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 2023–24 తోపోలిస్తే ఇంకా సగం ఆదాయం కూడా రాలేదు. ప్రస్తుత ఆరి్థక సంవత్సరం ముగిసేందుకు మిగిలిన మూడునెలల్లో ఏమేర ఆదాయం వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రూ.1000 కోట్లు సమకూరడం కూడా కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేనిపోని భయాలు కొత్త నిర్మాణాలకు రియల్టర్లు వెనుకడుగు వేస్తుండటంతో మెజార్టీ రియల్టర్లు ఇంతకాలం చెరువులు, సరస్సులను కబ్జాచేసే నిర్మాణాలు చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే భారీ నిర్మాణాలు జరిగినందున ఖాళీ స్థలాలంటూ లేనందున కొత్తగా నిర్మాణాలు జరగడం లేవని టౌన్‌ప్లానింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సాచురేషన్ స్థాయి మించిపోయిందని అంటున్నాయి. పాతభవనాలను కూల్చి అధునాతనంగా నిరి్మంచే వారుంటే తప్ప పెద్ద నిర్మాణాలు వచ్చే అవకాశాల్లేవని కూడా చెబుతున్నాయి. కూల్చివేతలకే కాదు.. హైడ్రా అనగానే ప్రజలకు కూల్చివేతలే గుర్తుకొస్తుండటం దారుణం. మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి ఆస్తులు కూల్చివేసింది రెవెన్యూ విభాగం అయినప్పటికీ, హైడ్రా కూల్చివేసిందనే ప్రచారంతో అదే ముద్ర పడింది. హైడ్రా ఉన్నది కేవలం కూల్చివేతలకే కాదు..దానికున్న విధుల్లో అదొక భాగం మాత్రమే. అన్ని రకాల ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణలు కూడా ఉన్నాయి. ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికీ పనిచేస్తుంది. వీటి గురించి సామాన్య ప్రజలకు తగిన అవగాహన లేకపోవడం హైడ్రా నిందల పాలయ్యేందుకు కారణమైంది. ఈ అంశంలో ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరముందని పట్టణ ప్రణాళిక నిపుణులు చెబుతున్నారు. -
‘ఇంటర్నేషనల్’ గురుకుల భవనాలు!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ స్కూళ్లకు దీటుగా సమీకృత గురుకుల పాఠశాలల భవనాల నిర్మాణాలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. రూ.2,500 కోట్లతో ఈ ఏడాది రాష్ట్రంలో 100 ఎస్సీ, బీసీ, మైనారిటీల గురుకుల పాఠశాల భవనాల నిర్మాణం చేపడుతు న్నామని, ఒక్కో భవనానికి రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేసినట్లు చెప్పారు. సచివాలయంలో గురుకుల పాఠశాలల భవన నిర్మాణాలపై విద్య, సంక్షేమ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎస్సీ, బీసీ, మైనార్టీల గురుకుల పాఠశాలల భవనాలను సమీకృతంగా ఒకేచోట నిర్మిస్తుండటంతో స్థల సమస్య తీరుతుందని, క్రీడా మైదానాలు వంటి ఉమ్మడి సదుపాయాలను అన్ని గురుకులాల విద్యార్థులు వాడుకోవచ్చన్నారు. మధిరలో పైలట్ ప్రాజెక్టు సమీకృత గురుకుల పాఠశాలల భవన నిర్మాణానికి మధిర నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్టు భట్టి విక్రమార్క తెలిపారు. చింతకాని మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియం సమీపంలోని 10 ఎకరాల్లో నిర్మిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్థలాల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భవనాల నిర్మాణం సత్వరంగా పూర్తి చేయడానికి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి అహమ్మద్ నదీమ్‌ను ఆదేశించారు. దేశంలో తాము నిర్మించిన ఇంటర్నేషనల్ మోడల్ పాఠశాలలపై బెంగళూరు ఆర్కిటెక్ట్ సంస్థ సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. నాలెడ్జ్ కేంద్రాల ఏర్పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు శిక్షణ కోసం నియోజకవర్గ కేంద్రాల వారీగా నాలెడ్జ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు భట్టి తెలిపారు. త్వరలో టీఎస్పీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్న నేపథ్యంలో పేద, మధ్య తరగతి కుటుంబాల నిరుద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి వీటిని ప్రారంభిస్తున్నామన్నారు. జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ క్షేత్రంగా నియోజకవర్గాల్లోని నాలెడ్జ్ సెంటర్లకు వచ్చే నిరుద్యోగులకు నేరుగా ఆన్లైన్ కోచింగ్ ఇప్పించే ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. -
కూలీ ఎక్కడైతే అక్కడే స్కూలు
భవన నిర్మాణ వలస కూలీలుగా వెళ్లడం అంటే ఉద్యోగంలో బదలీ మీద వెళ్లడం లాంటిది కాదు. పని తప్ప అక్కడ ఏమీ ఉండదు. పిల్లలకు బడి ఉండదు. చంటి పిల్లలకు అమ్మ ఒడి అందుబాటులో ఉండదు. భద్రంగా ఒక ఇల్లు ఉండదు. పెద్దవాళ్లు పని చేస్తున్నంత కాలం.. పని చేస్తున్నంత సేపూ.. పిల్లలు అలా గాలికి, ధూళికీ ఆ కొత్త ప్రదేశంలో.. కొత్త వాతావరణంలో అలా తిరుగుతుండవలసిందే. అలాంటి వాళ్ల సంరక్షణ కోసం ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తలకెత్తుకుంది. ఇండియా అంటేనే నిర్మాణాలు జరిగే దేశం. ఈ మాట ఎక్కడో మీరు వినే ఉంటారు. వినడం ఏముందీ, నిత్యం ఎక్కడో ఒకచోట నిర్మాణాలు జరుగుతుండమూ మీరు చూస్తూనే ఉంటారు. అయితే ఈ నిర్మాణాల దేశంలో బాలల భవిష్యత్తును నిర్మించే పనే.. భవన నిర్మాణాలంత భద్రంగా, వేగంగా జరగడం లేదన్నది నిజం! ఇందుకు పెద్దపెద్ద నిదర్శనాలు అక్కర్లేదు. భవన నిర్మాణాల కార్మికులను చూస్తే చాలు. ఉన్న ఊరిని వదిలేసి, పని వెతుక్కుంటూ పిల్లల్ని చంకనేసుకుని మహా నగరాలకు చేరుకుంటారు. ఆ కట్టడాలు పూర్తయ్యే వరకు.. ఆ కంకర, ఇటుకలు, సిమెంటు మధ్యనే వారి నివాసం. నిర్మాణానికి ఓ పక్కన గుడారం వేసుకుని ఎండకు, వానకు, చలికి ఆ గుడారాల్లోనే ఉంటారు. పగలంతా సైట్లో రెక్కలు ముక్కలు చేసుకోవడం, రాత్రవగానే అక్కడే ఓ మూల పిల్లల్ని పక్కలో వేసుకుని తలదాచుకోవడం. మరి ఇటుకలు మోస్తున్నప్పుడు, తడి కంకర స్లాబు పైకి చేరుస్తున్నప్పుడు, బేల్దారి పర్యవేక్షణలో తల తిప్పేందుకైనా వీలు చిక్కని పనిలో ఉన్నప్పుడు ఈ భవన నిర్మాణ కార్మికుల పిల్లలు ఎక్కడుంటారు? అక్కడే ఒక చోట ఆడుకుంటూ ఉంటారు. వారు ఆడుకునే పరిసరాలు పరిశుభ్రంగా ఉండవు. ప్రమాదరహితంగా ఉండవు. అంతకన్నా కూడా.. భద్రంగా అసలే ఉండవు. పని జరిగే చోటే క్రెచ్‌లు బడిలో వదిలేస్తేనన్నా వాళ్ల గురించి చింత ఉండదు. కానీ ఈ కూలీలేమైనా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ఉద్యోగులా.. అక్కడి స్కూల్లో టీసీ తీసుకుని వచ్చి ఇక్కడిస్కూల్లో చేర్పించడానికి?! ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, ఇంకో ఇంకో రాష్ట్రం అయినా దేశం మొత్తమీద రాష్ట్ర రాజధానులకు వలస వచ్చి నెలలకు నెలలు ఉండిపోయే వలస కార్మికులు లక్షల సంఖ్యలోనే ఉంటారు. వారి పిల్లలందరూ నిర్మాణాలు పూర్తయ్యేవరకు తల్లిదండ్రుల కనుసన్నలలో ఆ చుట్టుపక్కలే గాలిలో గాలిగా, ధూళిలో ధూళిగా ఉండవలసిందే. ఇప్పుడు ఇలాంటి పిల్లల కోసం కర్ణాటక కార్మిక శాఖ ప్రత్యేక శ్రద్ధను తీసుకుని తల్లి ఒడిలాంటి రక్షణను, శిక్షణను ఇవ్వబోతోంది! బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్, కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థలలో కాలం తీరిన కారణంగా షెడ్డులలో పడి ఉన్న బస్సులను నామమాత్రపు ధరకు కొనుగోలు చేసి వాటిని పునరుద్ధరించి, మొబైల్ క్రెచ్‌లుగా తీర్చిదిద్దబోతోంది. ఆ క్రెచ్‌లు.. నిర్మాణంలో ఉన్న పెద్ద పెద్ద భవనాల దగ్గర వలస కార్మికుల పిల్లల కోసం నగరమంతటా తిరుగుతుంటాయి. క్రెచ్‌ల లోపల పిల్లలకు ఇష్టమైన తినుబండారాలు, పిల్లలకు నచ్చే ఆటబొమ్మలు, కథల పుస్తకాలు ఉంటాయి. క్రెచ్ వాహనాలపై రంగు రంగుల పెయింటింగులతో పూల బొమ్మలు, పక్షుల బొమ్మలు, మనుషుల బొమ్మలు ఉంటాయి. క్రెచ్ లోపల తాగేందుకు పరిశుభ్రమైన నీరు ఉంటుంది. తినుబండారాలు కూడా ఎదిగే వయసులో పిల్లలకు అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి! ఈ ఏర్పాటు వల్ల పిల్లలు స్వచ్ఛమైన, సురక్షితమైన వాతావరణంలో ఉంటారు. వేళకు ఆహారం ఉంటుంది. బుద్ధీ వికసిస్తుంది. పిల్లలు తమ కళ్లెదుటే మంచి స్కూలు లాంటి పరిసరాలలో ఉన్నారన్న నిశ్చింత వారి తల్లిదండ్రులకూ ఉంటుంది. దీపావళికి ముందే వెలుగు క్రెచ్‌ల ఏర్పాటు కోసం రాజ్యసభ సభ్యులు జి.చంద్రశేఖర్ ఎంపీ నిధుల నుంచి ఇప్పటికే 25 లక్షల రూపాయలను విడుదల చేశారు. ఈ డబ్బును బస్సులు కొనడానికి, వాటిని బాగు చేసుకోసుకుని పిల్లలకు ఇష్టమయ్యేలా మలచడానికి ఉపయోగిస్తారు. తర్వాత వాటిని ఎన్జీవో సంస్థలకు అప్పగిస్తారు. ప్రధానంగా బెంగళూరుతో పాటు, రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో ఈ క్రెచ్‌ల తయారీ కోసం కర్ణాటక ప్రధాన కార్యదర్శి టి.ఎం. విజయ భాస్కర్ తొలి విడతగా వంద బస్సుల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. దీపావళి లోపు ఈ క్రెచ్‌లను ఆరంభించేందుకు అధికార యంత్రాంగం త్వర త్వరగా పనులు పూర్తి చేస్తోంది. పెద్దవాళ్లు వర్తమాన భారతాన్ని నిర్మిస్తుంటే.. వాళ్ల పిల్లల్ని భావితరం నిర్మాతలుగా మలిచేందుకు జరుగుతున్న ఈ కృషి ముందు.. ఎంత భారీ ప్రాజెక్టు నిర్మాణం అయినా కూడా చిన్నదిగానే కనిపిస్తుంది. -
రెరా నమోదిత ప్రాజెక్ట్స్‌లో నో ఫైర్ సేఫ్టీ
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ నిబంధనలు పాటించని ప్రాజెక్ట్‌లు సైతం రెరాలో నమోదవుతున్నాయా? రెరాలో రిజిస్టర్ అయిన ప్రాజెక్ట్‌లను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే నిజమే అనిపిస్తుంది. తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్–రెరా)లో ఇప్పటివరకు నమోదు చేసుకున్న అపార్ట్మెంట్లలో చాలా వాటిల్లో ఫైర్ సేఫ్టీ గానీ ఇంధన, పర్యావరణ శాఖ నిబంధనలు పాటించలేదు. భవన నిర్మాణ నిబంధన ప్రకారం.. 15 మీటర్ల కంటే ఎత్తయిన భవనాలకు అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ), 15 మీటర్ల కంటే తక్కువ ఉంటే జీహెచ్ఎంసీ నుంచి ఎన్వోసీ ఉండాలి. కానీ, కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు చేపడుతున్న హైరైజ్ భవనాలు మినహా చాలా ప్రాజెక్ట్‌లు ఎలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించలేదు. అయినా సరే రెరా అధికారులు ప్రాజెక్ట్‌లను రిజిస్టర్లో చేయడం, గుర్తింపు పత్రం, సంఖ్య కూడా కేటాయించారు. ఈ రోజుల్లో నివాస భవనాల నిర్మాణంలో ఫాల్స్ సీలింగ్, ఫోమ్ సీలింగ్, అదనపు లైట్ల ఏర్పాట్లు, పైప్డ్ గ్యాస్ కనెక్షన్స్ వంటి ఏర్పాట్లు ఎక్కువయ్యాయి. వీటికి వేడిని గ్రహించే శక్తి ఎక్కువగా ఉండటంతో అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. అందుకే ఫైర్ ఎన్వోసీ ఉంటేనే రెరాలో రిజిస్ట్రేషన్ చేయాలని, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే ప్రమాదాలను ఊహించలేమని రెసిడెన్స్ అసోసియేషన్ హెచ్చరిస్తుంది. ఇంధన, పర్యావరణ నిబంధనలు కూడా.. రెరాలో నమోదైన చాలా ప్రాజెక్ట్‌లు ఫైర్ సేఫ్టీ మాత్రమే కాదండోయ్ ఇంధన, పర్యావరణ నిబంధనలు కూడా గాలికొదిలేశాయి. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ), రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంకుడు గుంతలు వంటి ఏర్పాట్లేవీ లేని ప్రాజెక్ట్‌లు సైతం రెరాలో రిజిస్టరయ్యాయి. 300 చ.మీ. కంటే ఎక్కువ స్థలంలో నిర్మించే భవనాల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాట్లు ఉండాల్సిందే. కానీ, నగరంలోని ప్రధాన ప్రాంతాలతో పాటూ శివారుల్లోని అర్హత ఉన్న భవనాల్లోనూ నిబంధనలు పాటించలేదు. ‘‘కొన్ని సందర్భాల్లో ఇలాంటి ప్రాజెక్ట్‌లు రెరాలో నమోదైన విషయం వాస్తవమే. సంబంధిత ప్రాజెక్ట్ నిర్మా ణం పూర్తయ్యాక తగిన చర్యలు తీసుకుంటామని’’ రెరా అధికారులు తెలపడం గమనార్హం. -
నిఘా.. నిద్ర నటిస్తోంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి రావాల్సిన సొమ్ము వస్తుందా? రాకుంటే ఎందుకు రావడం లేదు, దాని వెనకున్న కారణాలేంటి? ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల్లో అధికార యంత్రాంగం లేదా కాంట్రాక్టర్ల వ్యవస్థ సరైన రీతిలో పనిచేస్తోందా లేదా అన్న దానిపై ఎప్పటికప్పుడు నివేదికలివ్వాల్సిన రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం గాడితప్పినట్టు కనిపిస్తోంది. గతంలో విజిలెన్స్ విభాగం నుంచి నివేదిక వచ్చిందంటే సంబంధిత అధికారులుగానీ, కాంట్రాక్టర్లుగానీ వణికిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పూర్తిగా నత్తనడకన సాగుతోందని సచివాలయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చేయి తడిపితే చాలు.. హైదరాబాద్ నగరంతో పాటు ప్రధాన నగరాల్లో అక్రమ కట్టడాలు నిర్మించే బిల్డర్లు, నిర్మాణాలు చేస్తున్న యజమానుల నుంచి నిబంధనల ప్రకారం జరిమానా వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఏ ప్రణాళికైనా వారి జేబులు నింపుకోవడానికే పరిమితమైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి డివిజన్‌పరిధిలో భవనాలు నిర్మిస్తున్న ఓ బిల్డర్ నిబంధనలు అతిక్రమించి కట్టడాలు సాగిస్తున్నాడని జీహెచ్ఎంసీ నోటీసులు జారీచేసింది. అయితే నోటీసులు స్వీకరించిన సంబంధిత బిల్డర్లు అధికారులకు ఎంతో కొంత సమర్పించుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదే బిల్డర్‌కు నోటీసులు జారీచేశారు. దీంతో కంగారుపడ్డ సంబంధిత బిల్డర్ జీహెచ్ఎంసీ అధికారిని ఫోన్లో ఆరా తీయగా, తమకు ఇచ్చినట్టుగానే విజిలెన్స్ అధికారులకు కూడా ఇస్తే నిర్మాణం సక్రమంగా సాగుతుందని తేల్చిచెప్పాడు. దీంతో చేసేదేమీలేక సంబంధిత అధికారికి రూ. 3 లక్షలు సమర్పించుకున్నట్టు తెలిసింది. ఇలా హైదరాబాద్‌లోని వందలాదిమంది బిల్డర్లు, సంబంధిత యజమానులకు ఇదే రీతిలో నోటీసులు జారీచేయడం, వాటి పేరున దండుకోవడం చేస్తున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. మరోవైపు మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇదే రీతిలో రేషన్ బియ్యాన్ని రైస్‌మిల్లర్లకు అమ్ముతున్నారని రెండు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీంతో పోలీస్ శాఖ అధికారులు దాడులు చేసి రెండు లారీలను శుక్రవారం ఉదయం పట్టుకున్నట్టు తెలిసింది. ఈ రెండు ఘటనలే కాదు, ఇలాంటి వ్యవహారాలు చాలానే గుట్టుగా సాగిపోవడానికి విజిలెన్స్ అధికారుల ఆమ్యామ్యాల వ్యవహారమే కారణమని చర్చ జరుగుతోంది. గతంలో నల్లగొండ విజిలెన్స్ అధికారి భాస్కర్‌రావు లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినా, ఏమాత్రం ప్రభావం లేకపోవడం ఉన్నతాధికారులనే కలవరానికి గురిచేస్తుంది. రిపోర్టులేవి..? ప్రభుత్వాలకు పథకాల అమలు, అమలులో ఉన్న సమస్యలు, అవినీతి వ్యవహారాలు, పక్కదారి పట్టిస్తున్న అధికారుల వివరాలతో కూడిన నివేదికలను ప్రతినెలా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పంపాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న అధికార వ్యవస్థ ఎక్కడా కూడా ఏ పథకాలపైగానీ, ఏ ప్రాజెక్టుపైగానీ, లోపభూయిష్టమైన ఏ వ్యవస్థపైనా ఇప్పటివరకు ఒక్క నివేదిక కూడా పంపిన దాఖలాల్లేవని సచివాలయ వర్గాలు చెబుతున్నా యి. పైగా అక్రమాలపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే అవతలి వ్యక్తికి సమాచారమిచ్చి వసూళ్లు చేసుకుం టున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇలా ఆరోపణలెదుర్కుంటున్న సంస్థలు, ఆయా వ్యక్తులకు మేలు చేకూర్చేలా నివేదికలివ్వడాన్ని ఇంటెలిజెన్స్, ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. పాలన గాడి తప్పినట్టేనా? ఉమ్మడి రాష్ట్రంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు పూర్తి స్థాయి డైరెక్టర్ జనరల్ హోదా అధికారి ఉండి అజమాయిషీ చేసేవారు. కానీ ఇప్పుడు డీజీ లేకపోవడంతో పాలనాపరమైన సమస్యలు రావడం, సమీక్షించే సమయం కూడా లేకపోవడంతో విజిలెన్స్ విభాగం గాడితప్పినట్టు ప్రభుత్వ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగున్నరేళ్లలో విజిలెన్స్ నివేదికలపై ఏ ఒక్క సంస్థపైగానీ, అధికారిపైగానీ చర్యలు తీసుకోలేదంటే పనితీరు ఎలా ఉందో తెలుస్తోంది. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌గా రాజీవ్ త్రివేది వ్యవహరిస్తున్నారు. అయితే రాజీవ్ త్రివేది హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉండటంతో ఈ విభాగంలో జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి పెట్టలేకపోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. పనిఒత్తిడితో సచివాలయానికే పరిమితం కావడం వల్ల విజిలెన్స్ విభాగం గాడితప్పుతున్నట్టు స్వంత విభాగంలోనే చర్చించుకుంటున్నారు. -
భవనాలు నిర్మించకుండానే 2 కోట్లు డ్రా
సాక్షి, హైదరాబాద్: చారిత్రక ఆంధ్రా విద్యాలయంలో భవన నిర్మాణాలు చేయకుండా రికార్డుల్లో చేసినట్లుగా చూపించి రూ.2 కోట్లకు పైగా స్వాహా చేశారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆంధ్రా విద్యాలయం ఎడ్యుకేషన్ సొసైటీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఓయూ విద్యార్థి నాయకుడు జె.శంకర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మంగళవారం హైకోర్టు విచారించింది. పిటిషనర్ ఆరోపణలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ప్రతివాదుల్ని ఆదేశించింది. తెలంగాణ ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, కాలేజీ విద్యా శాఖ కమిషనర్, ఏవీ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి, అకౌంట్ జనరల్ ప్రిన్సిపాల్, ఏవీ కాలేజీ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ ప్రిన్సిపాల్స్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం చేపడతామని తెలిపింది. అక్రమాలపై కాగ్ నివేదిక.. ఏవీ ఎడ్యుకేషన్ సొసైటీని 1944లో దోమల్‌గూడలోని గగన్‌మహల్‌లో రాజ బహుదూర్ వెంకటరామారెడ్డి, సురవరం ప్రతాప్‌రెడ్డి, మాడపాటి హనుమంతరావు వంటి మహనీయులు ఏర్పాటు చేశారని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఏవీ ఎడ్యుకేషన్ సొసైటీ అక్రమాలకు పాల్పడుతోందని అధికారులకు ఫిర్యా దుచేసినా ఫలితం లేకపోయిందని, ఇప్పుడు సొసైటీ అక్రమాలపై కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్(కాగ్) సైతం నివేదిక ఇచ్చిందన్నారు. సొసై టీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ప్రతివాదుల్ని ఆదేశించింది. -
ఇక వేగంగా భవన నిర్మాణాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కన్స్ట్రక్షన్, బిల్డింగ్ మెటీరియల్ మ్యానుఫాక్చరింగ్ పార్కు ఏర్పాటు కానుంది. యూఏఈకి చెందిన కెఫ్ ఇన్ఫ్రా (కేఈఎఫ్ ఇన్ఫ్రా), రాష్ట్ర ప్రభుత్వం కలసి సంయుక్తంగా ఈ పారిశ్రామికవాడను నిర్మించనున్నాయి. కెఫ్ ఇన్ఫ్రా సంస్థ రూ.650 కోట్ల పెట్టుబడితో ఈ పార్కులో కన్స్ట్రక్షన్, బిల్డింగ్ మెటీరియల్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 1,600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. పార్కులో ఏర్పాటు కానున్న 60–70 అనుబంధ పరిశ్రమలతో మొత్తం 10 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, దీనికి మూడింతల మందికి పరోక్ష ఉపాధి దొరకనుంది. రంగారెడ్డి లేదా మేడ్చల్ల్లో ఈ పార్కు ఏర్పాటుకు 4 స్థలాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు, కెఫ్ ఇన్ఫ్రా ఫౌండర్ చైర్మన్ ఫాజిల్ కొట్టికొల్లన్లు శనివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. భవన విడిభాగాలను అమర్చుకోవడమే... దేశంలో ఎక్కడా లేనివిధంగా కెఫ్ ఇన్ఫ్రా ఉపయోగించే పరిజ్ఞానంతో అత్యంత వేగంగా నిర్మాణాలు పూర్తి చేయవచ్చని కేటీఆర్ తెలిపా రు. ప్లాంట్‌లో నిర్మించే భవన విడిభాగాల (ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్)ను సైట్‌కు తీసుకెళ్లి అమర్చడం ద్వారా తక్కువ సమయంలో నిర్మాణా లు జరపొచ్చన్నారు. కెఫ్ ఇన్ఫ్రా బెంగళూరులో 13 నెలల్లో ఐటీ పార్కును, కోయంబ త్తూరులో 12 నెలల్లో ఆస్పత్రిని నిర్మించిందన్నారు. తమిళనాడులోని క్రిష్ణగిరిలో ఇప్పటికే ఈతరహా పార్కును నిర్మించిందన్నారు. అందుబాటు వ్యయంతో గృహ నిర్మాణం, ప్రభుత్వం జరిపే నిర్మాణాలు, బ్రిడ్జీలు, మురుగు కాల్వ లు, మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీజీ) వంటి రకాల నిర్మాణాలకు ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుందన్నారు. దీనితోనే డబుల్ బెడ్ రూం ఇళ్లనూ నిర్మించే అవకాశముందన్నారు. స్థానిక ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తోందని, ప్రభుత్వం జరిపే ప్రొక్యూర్మెంట్లలో సైతం వీటికే ప్రాధాన్యత ఇస్తామని కేటీఆర్ చెప్పారు. ఇటీవల విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు కెఫ్ ఇన్ఫ్రా చైర్మన్‌తో ఫోన్లో మాట్లాడి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించానని, రాష్ట్రానికి వచ్చిన ఆయన కేవలం ఒకే రోజు వ్యవధిలో ఈ మేరకు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షించదగిన పరిణామమన్నారు. జహీరాబాద్‌లో కన్‌స్ట్రక్చన్ మెటీరియల్ ఎక్విప్మెంట్ పార్కు ఏర్పాటు కోసం ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ సైతం ఏర్పాటు కానుందన్నారు. ఈ పార్కులో తొలుత కెఫ్ ఇన్ఫ్రా పెట్టుబడి పెట్టనుందని, ఈ కంపెనీ భాగస్వాములు సైతం ఇదే పార్కులో పరిశ్రమలు స్థాపించేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ సహకారం వల్లే పెట్టుబడులు: కొట్టికొల్లన్ రాష్ట్రంలో భద్రత, ప్రభుత్వం అందిస్తున్న సహకా రం పరిశీలించాకే పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని కెఫ్ ఇన్ఫ్రా చైర్మన్ ఫాజిల్ కొట్టికొల్లన్ తెలిపారు. ఢిల్లీ, చండీగఢ్‌తోపాటు అన్ని రాష్ట్రాల నుంచి తమకు ఆహ్వానాలు అందినా తెలంగాణ వైపే మొగ్గు చూపామన్నారు. భౌగోళికంగా దేశం మధ్యలో తెలంగా ణ ఉండటం కూడా ఇందుకు కారణమన్నారు. తాము స్థాపించే ప్లాంట్‌లో వాడే టెక్నాలజీతో ఆస్పత్రులు, పాఠశాలలు, హోటళ్లు, ఐటీ భవనాల నిర్మాణాన్ని అత్యంత తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చని కొట్టికొల్లన్ వివరించారు. ప్లాంట్‌లో భవన సామగ్రిని తయారు చేసి నిర్మాణ ప్రాంతానికి తీసుకెళ్లి అమర్చుకోవడం (అసెంబుల్) ద్వారా తక్కువ సమయంలో నిర్మాణాలు పూర్తి చేయొచ్చన్నారు. బ్రిడ్జీలు, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, తాగునీటి సదుపాయానికి సంబంధించిన పనులను 34 నెలలకు బదులు 6 నెలల్లోనే పూర్తి చేయగలమన్నారు. -
హద్దు మీరిన మిద్దెలు!
♦ చూసీ వదిలేస్తున్న నగర పాలక అధికారులు ♦ ఫిర్యాదులు అందినా పట్టించుకోని వైనం.. ♦ అక్రమ భవన నిర్మాణాల్లో అవినీతి బాగోతం కార్పొరేషన్లో కొందరు అధికారుల విచ్చలవిడితనం నగర ప్రజలకు శాపంగా మారుతోంది. అక్రమ నిర్మాణాలు, నాసిరకం పనులు, లోపిస్తున్న పారిశుధ్యంతో రూ.లక్షలు దుబారా అవుతున్నాయి. ప్రధానంగా టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, రెవెన్యూశాఖల్లో పెరిగిన అవినీతి, అక్రమాలు అభివృద్ధికి అవరోధాలుగా మారుతున్నాయి. నగరాల సుందరీకరణపై ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నాయి. ఏడాదిలో 150కిపైగా అక్రమ నిర్మాణాలు వెలిసినా కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు.. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని శాఖల్లో పేరుకు పోయిన అవినీతి, అక్రమాలు, అలసత్వం, నిర్లక్ష్యం, నిధుల దుబారా,భవన నిర్మాణాల్లో అతిక్రమణలపై ‘సాక్షి’ వరుస కథనాలు.. ఏడాదిలో 150కి పైగా నిర్మాణ అతిక్రమణలు మొదట నోటీసులు.. ఆపై వసూళ్ల బేరం.. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో భవన నిర్మాణాలు వేగం పుంజుకున్నారుు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో నివాస సముదాయ నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. వీటితోపాటు అపార్టుమెంట్ల నిర్మాణాలు ఉపందుకుంటున్నాయి. ఏడాదిలో 150కి పైగా నిర్మాణాల్లో అతిక్రమణలు జరిగినట్లు గుర్తించినా చర్యలు లేవు. ఐదేళ్లలో 1200లకు పైగా నిర్మాణాల అతిక్రమణలు జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. నగర పరిధిలో ఈ నిర్మాణాలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. నిర్మాణాలు జరుగుతున్నా స్పందించని అధికారులు ఆపై నోటీసులు జారీ చేయడం, వసూళ్లకు పాల్పడడం జోరుగా కొనసాగుతోంది. నగరంలో చాలాచోట్ల అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. వీటిలో కొన్నిచోట్ల కార్పొరేటర్లు అధికారులను రక్షించగా మరికొన్ని చోట్ల పట్టణ ప్రణాళిక విభాగం వసూళ్ల పర్వం కొనసాగిస్తోంది. కార్పొరేషన్ పరిధిలో ఇదీ పరిస్థితి.. పట్టణంలో ఇదివరకే నిర్మాణాలు కొనసాగిన అక్రమ భవనాలు ఎన్నో ఉన్నాయి. గతంలో వినాయక్‌నగర్‌లో ఓ అపార్ట్మెంట్ నిర్మాణంలో నలుగురు మృతిచెందగా హుటాహుటిన స్పందించిన కార్పొరేషన్ అధికారులు 104 అక్రమ భవనాలకు నోటీసులు జారీ చేశారు. స్పందించకుంటే కూల్చివేస్తామని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ.. నోటీసులు అందినా పక్షం రోజుల తరువాత ఈ ప్రక్రియపై అధికారులు మౌనం వహించారు. ముఖ్యంగా ఖలీల్‌వాడి ప్రాంతంలో 60 శాతం భవనాలకు నోటీసులు అందించినా కార్పొరేషన్ అధికారులు ఆపై చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేశారు. ఈ నోటీసుల వల్ల నిర్మాణాలు అతిక్రమించిన ఒక్కో యజమాని నుంచి భారీగా వసూళ్లు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఆరా తీసిన ఎంపీ కల్వకుంట్ల కవిత మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు కూడా ఆదేశించారు. అయితే తర్వాత ఇప్పుడున్న అధికారులుకు ఇదీ షరా‘మామూలే’ అయ్యింది. నిర్మాణ అతిక్రమణలు.. ♦ ఖలీల్‌వాడి ప్రాంతంలో ఓ ప్రైవేట్ వైద్యుడు ప్రధాన చౌరస్తా వద్ద నూతనంగా భారీ భవనం నిర్మించాడు. ఈ భవనానికి అనుమతులు లేవు. ఇందులో ఓ ప్రజాప్రతినిధి భర్త భవన నిర్మాణదారునితో ఒప్పందం చేసుకుని కార్పొరేషన్ అధికారుల నుంచి చర్యలు లేకుండా కాపాడుకొచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమీపంలో మరో అపార్ట్మెంట్ నిర్మాణం కొనసాగింది. దీనికి అనుమతి లేకుండా కొనసాగడంతో సదరు ప్రజాప్రతినిధి భర్త అందులో ఒక ప్లాట్‌ను అతి తక్కువ రేటు(రూ.10 లక్షలకే)కు లాగేసుకున్నారు. ఈ రెండు భవనాల వైపు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు కనీసం కన్నెత్తి చూడడం లేదు. ♦ హైదరాబాద్ రోడ్డులోని ఓ హోటల్ సమీపంలో భారీ భవన నిర్మాణం కొనసాగుతోంది. దీనికి అనుమతి లేకుండానే నిర్మాణాలు పూర్తి అవుతున్నాయి. ఈ వ్యవహారంలో అధికారులు కనీసం పరిశీలన చేయకుండా ప్రశ్నించకుండానే నిమ్మకుండిపోయారు. ఇందులో ఓ కార్పొరేటర్ మధ్యవర్తిగా అధికారులకు భారీగానే ముడుపులు అందించినట్లు తెలిసింది. ♦ గౌతంనగర్‌లోని ఓ అపార్ట్మెంట్ నిర్మాణం గతేడాది పూర్తయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ స్థలంలో వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇవి కొనసాగుతున్నాయి. నిబంధనల కు విరుద్ధంగా ఉండడంతో నోటీసులు అందించిన అధికారులు ఏడాది అవుతున్నా నేటి వరకు వాటిపై చర్యలు తీసుకోవడం లేదు. ♦ గూపన్పల్లి చౌరస్తాలో ఓ అపార్టుమెంట్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం సాగ డం, అందులోని ప్లాట్లు విక్రయించిన తరువాత యజమాని ఆక్రమ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. వీటిని ఆపాలని అపార్టుమెంట్ వాసులు కమిషనర్ నాగేశ్వర్‌కు ఫి ర్యాదు చేశారు. అయినా కూడా నేటి వరకు ఈ అపార్టుమెంట్ సమస్యను అధికారులు పరిష్కరించలేదు. వాటిని పరిశీలించలేదు. ♦ దుబ్బ ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతంగా ప్రకటించిన ఏరియలో ప్రస్తుతం నాలుగు నివాస గృహాలు నూతనంగా నిర్మిస్తున్నారు. వీటికి అనుమతి ఇవ్వకూడదు. ఈ నివాసాలు అక్రమంగా జరుగుతున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదు. పట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి ముడుపులు అందుకొని వీరికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ♦ ఖలీల్వాడిలో రెండు భవనాలు గతంలో మున్సిపాలిటీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని కూల్చివేశారు. ప్రస్తు తం వాటి నిర్మాణం పూర్తి అయి యథావిధిగా కొనసాగుతున్నారుు. అనుమతి ఏలా వచ్చింది అన్నది సందిగ్ధం. అధికారుల సహకారం, కార్పొరేషన్ స్థాయి ఓ ప్రజాప్రతినిధి మధ్యవర్తిత్వం వహించి ముడుపులు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ♦ జిల్లా పరిషత్ సమీపంలో నూతనంగా ఓ అపార్టుమెంట్ నిర్మాణం కొనసాగుతోంది. అతి తక్కువ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఈ అపార్టుమెంట్‌ను అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ నిర్మాణానికి మున్సిపాలిటీ అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సుభాష్‌నగర్ లోని బ్యాంకు వద్ద అతి తక్కువ స్థలంలో అపార్టుమెంట్ నిర్మాణం పూర్తి అయింది. దీనిపై అధికారులు స్పందించడం లేదు. ♦ సుభాష్‌నగర్‌లో ఓ ప్రైవేట్ పాఠశాల భవనం నివాస సముదాయం అనుమతితో నిర్మాణం పూర్తి చేసుకుంది. గతంలో ఫిర్యాదులు రావడంతో నిర్మాణాలు నిలిపివేసి కూల్చివేశారు. ప్రస్తుతం ఈ భవనం నివాస సముదాయంగానే పాఠశాల నడుస్తోంది. ♦ పారిశ్రామిక ప్రాంతంగా ప్రకటించిన అర్సపల్లి, ఆటోనగర్, మాలపల్లి ప్రాంతాల్లో నివాస సముదాయాలు జరుగుతున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదు. వీటిపై ఫిర్యాదులు వస్తున్న పట్టించుకోవడం గమనార్హం. -
సుదర్శన చక్రం
- జేఎన్టీయూ(ఏ)లో రూ.74.32 కోట్ల పనులకు టెండర్లు లేకుండానే అప్పగించేందుకు యత్నం - ఈ ప్రొక్యూర్మెంట్ కాకుండా సీల్డ్కవర్ల విధానం - ప్రకటనలు ఇవ్వకుండా కేవలం వెబ్సైట్లో వివరాల వెల్లడి - 15 రోజుల్లో నూతన వీసీ రానుండడంతో హడావుడి నిర్ణయాలు - ఇన్చార్జ్ వీసీ తీరుపై సర్వత్రా విమర్శలు యూనివర్సిటీ : జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ-అనంతపురం)లో యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. రూ.74.32 కోట్లతో వర్సిటీ పరిధిలో చేపట్టనున్న పలు భవన నిర్మాణాలకు ఎలాంటి టెండర్లు లేకుండానే కొటేషన్ల ద్వారా పనులు కట్టబెట్టేందుకు నిర్ణయించడం వివాదాస్పదమవుతోంది. ఈ నెల 15లోపు జేఎన్టీయూకు నూతన వైస్ ఛాన్సలర్‌ను నియమిస్తామని స్వయాన మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే...ఈలోపే ఇన్చార్జ్ వీసీ ఆచార్య హెచ్.సుదర్శనరావు హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటుండడం విమర్శలకు తావిస్తోంది. ఇన్చార్జ్ వీసీ అయినప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకుంటుండడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. వర్సిటీ నిబంధనల ప్రకారం ఇన్చార్జ్ వీసీ రోజువారీ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కావాలి. అత్యవసరమైతే తప్ప కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. అయినప్పటికీ నిబంధనలకు విరుదంగా రెండేళ్ల కాల వ్యవధిలో పూర్తయ్యే భవన నిర్మాణాలకు అంకురార్పరణ చేస్తుండడం గమనార్హం. చట్టంలోని లొసుగులే వెసులుబాటుగా.. రాష్ట్రవ్యాప్తంగా 15 యూనివర్సిటీలలో భవన, రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన పనులను ప్రభుత్వ ఏజెన్సీ, అనుబంధ సంస్థలు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన నిర్మాణ సంస్థలకు అప్పగించాలని గత నెల 12న ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమత్రా దావ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ జీవో వర్సిటీకి చేరిందో..లేదో ఇంతలోనే గత నెల 20న జేఎన్టీయూ అధికారిక వెబ్సైట్లో కొటేషన్లను ఆహ్వానించారు. ఇంటిగ్రేటెడ్ లెక్చరర్ హాల్ కాంప్లెక్స్ 13,500 చదరపు అడుగులు , నూతన పరిపాలన భవనం 9000 చదరపు అడుగులు, ఓటీఆర్‌ఐలో ఫార్మసీ బ్లాక్ 5000 చదరపు అడుగులు, జిమ్ అండ్ యోగా హాలు 240 చదరపు అడుగులు, పులివెందులలో బాలుర హాస్టల్ 4900 చదరపు అడుగుల మేర నిర్మించడానికి కొటేషన్లు కోరారు. ఇవన్నీ రెండేళ్ల కాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు. ఆసక్తి గల ప్రభుత్వ ఏజెన్సీలు షీల్డ్ కవర్ ద్వారా అందజేయాలని, తక్కువ మొత్తానికి కోట్ చేసే వారికి పనులను గంపగుత్తగా అప్పగిస్తామని తెలిపారు. ఈ- ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా కాకుండా ఆఫ్‌లైన్‌లో కొటేషన్లు అందచేయాలని కోరడం పలు అనుమానాలకు తావిస్తోంది. వాటికి సంబంధించిన బాక్స్‌లను వర్సిటీలో ఏర్పాటు చేయలేదు. దీంతో అక్రమాలు జరిగే అవకాశాలు ఉండవచ్చుననే ప్రచారం సాగుతోంది. అందులోనూ పత్రికలకు ప్రకటనలు ఇవ్వకుండా కేవలం వెబ్సైట్ ద్వారా కొటేషన్లు ఆహ్వానించడం వల్ల అన్ని ఏజెన్సీలకు తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. రెండేళ్లుగా పెండింగ్ ఉన్న పనులకు సైతం.. వెబ్సైట్లో కొటేషన్లు ఆహ్వానించడానికి వర్సిటీ అత్యుత్తమ పాలకవర్గమైన మానిటరింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ అనుమతి తప్పనిసరి. ఇదేమీ లేకుండానే కేవలం వీసీ ప్రొసీడింగ్స్ ప్రకారం కొటేషన్లు ఆహ్వానిస్తున్నామని వెబ్సైట్లో పేర్కొన్నారు. ఆచార్య లాల్‌కిశోర్ వీసీగా ఉన్నప్పుడు భవన నిర్మాణాలు చేపట్టాలని తలచినప్పటికీ బిల్డింగ్ కమిటీ నిర్ధారించిన విధానాలు లేకపోవడంతో ఆలస్యమైంది. దీనివల్ల రెండేళ్ల నుంచి నిర్మాణాలకు ఆటంకాలు ఎదురయ్యాయి. వీటిని ఇన్చార్జ్ వీసీ టెండర్లు లేకుండానే కొటేషన్ల ద్వారా అప్పగించేందుకు సమాయత్తం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
స్విమ్స్ మెడికల్ కళాశాల అడ్మిషన్లపై మల్లగుల్లాలు
తిరుపతి: స్విమ్స్‌కు అనుబంధంగా ఏర్పాటవుతున్న శ్రీపద్మావతి మహిళా మెడికల్ కళాశాలలో అడ్మిషన్ల విషయమై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. 150 సీట్ల సామర్ధ్యంతో కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతితో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు లభించడంతో ఈ విద్యా సంవత్సరం నుంచే కోర్సులు ప్రారంభించాలని స్విమ్స్ అధికారులు నిర్ణయించారు. మెడికల్ కళాశాల కోసం సుమారు రూ.70 కోట్లతో భవన నిర్మాణాలు దాదాపు పూర్తయ్యా యి. అయితే మిగతా పనులు పూర్తి కావడానికి నెలన్న ర రోజులు పట్టే అవకాశం ఉండడంతో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాలా వద్దా అనే ఆలోచనలో స్విమ్స్ అధికారులు పడ్డారు. హడావిడిగా అడ్మిషన్లు కానిచ్చి ఆ తర్వాత విమర్శలు ఎదుర్కోవడం ఎందుకని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎస్వీ మెడికల్ కళాశాల కు అనుబంధంగా మంజూరైన 300 పడ కల ఆస్పత్రిని పద్మావతి మెడికల్ కళాశాలకు అనుబంధం చేస్తూ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 78 వివాదాస్పదంగా మారింది. మెడికల్ కళాశాల విద్యార్థులు ఈ జీవోను వ్యతిరేకిస్తున్నారు. మాతా, శిశు సంరక్షణ కోసం పనిచేస్తూ రాయలసీమలోనే అతి పెద్దదైన తిరుపతి ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రి సేవల విస్తృతిలో భాగంగా ఏర్పాటు చేసిన 300 పడకల ఆస్పత్రిని స్వి మ్స్ మెడికల్ కళాశాలకు అప్పగించడాన్ని నిరసిస్తూ వారు ఉద్యమబాట పట్టారు. మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలంటే అనుబంధంగా జనరల్ ఆస్పత్రి కలిగి ఉండాలని ఎంసీఐ నిబంధన ఉంది. 300 పడకల ఆస్పత్రి కోసం ఎస్వీ మెడికల్ విద్యార్థులు చేపట్టిన ఉద్యమం తీవ్రరూపం దాల్చే పరిస్థితులు కనిపిస్తున్నా యి. ఈ నేపథ్యంలో పద్మావతి మెడికల్ కళాశాలకు అనుబంధంగా మరో జనరల్ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తారా అన్నది ప్రశ్నగా ఉంది. అయితే మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నపుడు మాతా, శిశు సంరక్షణ కోసం ఉద్దేశించిన 300 పడకల ఆస్పత్రిని ఆ కళాశాలకు అప్పగించడమే సబబుగా ఉంటుందన్న వాదన వినిపిస్తోం ది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి అడ్మిషన్ల జోలికి పోకుండా అడ్డంకులన్నీ తొలగిపోయిన తర్వాత వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభించాలనే యోచనలో కూడా స్విమ్స్ అధికారులు ఉన్నట్టు తెలిసింది. -
నిధుల గ్రహణం
సాక్షి, ఖమ్మం: జిల్లాలో అంగన్వాడీ భవన నిర్మాణాలకు నిధుల గ్రహణం పట్టింది. భవనాలు మంజూరై సంవత్సరాలు గడుస్తున్నా సరిపడా డబ్బు మంజూరు కాకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ఈ ఏడాది కూడా అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగించాల్సి వస్తోంది. అయితే కొత్త ప్రభుత్వాలపై అంగన్వాడీ ఉద్యోగులు కోటి ఆశలు పెట్టుకున్నారు. నిధులు మంజూరు చేస్తే అద్దె భవనాల్లో అవస్థల నుంచి విముక్తి లభిస్తుందని వారు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో మొత్తం 3,670 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 1,634 సొంత భవనాలు కాగా, 2,036 కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. వీటిలో వసతులు సరిగా లేకపోవడం, శిథిలావస్థకు చేరుకోవడంతో ఆయా కేంద్రాల సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. నూతన భవనాలు మంజూరైనా అవి కాగితాలకే పరిమితం కావడంతో సిబ్బంది, పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత ఐదేళ్లలో జిల్లాకు బీఆర్జీఎఫ్, నాబార్డు, ఎల్‌డబ్ల్యూఈఏ, ఐఏపీ (ఇంప్లిమెంటేషన్ ఆన్యువల్ ప్రోగ్రామ్) కింద మొత్తం 1,364 అంగన్వాడీ భవనాలు మంజూరయ్యాయి. అయితే నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో ఏళ్లు గడిచినా ఇందులో ఇప్పటి వరకు 583 భవనాల నిర్మాణం మాత్రమే పూర్తయింది. మిగిలిన కేంద్రాల పనుల్లో ఏమాత్రం పురోగతి లేదు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచే విడుదలయ్యే నిధులు కావడంతో జిల్లా స్థాయిలో అధికారుల పర్యవేక్షణ కూడా కొరవడింది. రూ.కోట్లలో నిధులు అవసరమని సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా వాటికి మోక్షం కలగడం లేదు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు మిగతా పనులు పూర్తి చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది కూడా అంగన్వాడీ నూతన భవనాల నిర్మాణం పూర్తయి, ఉపయోగంలోకి వచ్చేలా కనిపించడం లేదు. పనులు ప్రారంభించని 159 కేంద్రాలు... కొన్ని భవనాలు మంజూరైనట్లు కాగితాల్లో చూపిస్తున్నా.. ఏళ్లు గడిచినా ఇంకా నిర్మాణ పనులే ప్రారంభం కాకపోవడం గమనార్హం. బీఆర్జీఎఫ్ కింద మంజూరైన వాటిలో 2, ఐఏపీ ద్వారా మంజూరైన 157 భవనాల పనులు ప్రారంభానికే నోచుకోలేదు. ఇందులో అత్యధికంగా వెంకటాపురం మండలంలోనే 62 కేంద్రాలున్నాయి. ఇవి మంజూరైతే అయ్యాయి కానీ.. నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని ఐసీడీఎస్ అధికారులు చెపుతున్నారు. వీటి కోసం పలుమార్లు ప్రతిపాదనలు పంపినా కేంద్రం నుంచి స్పందన లేదంటున్నారు. నిధులు విడుదల కాకపోవడంతో అసలు ఈ భవనాల నిర్మాణం పూర్తవుతుందా..? లేక మంజూరు రద్దు అవుతుందా..? అనే సందిగ్ధం నెలకొంది. కాగా, ప్రస్తుతం ఉన్న సొంత భవనాల్లోనూ 371 కేంద్రాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటి మరమ్మతుకు ఒక్కో భవనానికి రూ.లక్ష వరకు అవసరం. అయితే అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకునే సమయం దగ్గర పడతున్నా.. ఈ నిధులూ మంజూరు కాలేదు. ఈ పరిస్థితుల్లో శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే కేంద్రాలు నిర్వహించాల్సి రావడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడడంతో ఇకనైనా నిధులు విడుదలవుతాయని సిబ్బంది ఆశగా ఎదురుచూస్తున్నారు. -
మో‘డల్’ పాఠశాలలు లేనట్టే
గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకూ కార్పొరేట్ తరహా విద్య అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన మోడల్ పాఠశాలలు బాలారిష్టాలను దాటడం లేదు. పాఠశాలల్లో సవాలక్ష సమస్యలు తిష్టవేసుకొని ఉన్నాయి. కొన్ని చోట్ల భవన నిర్మాణాలు పూర్తి కాలేదు. తరగతులు ప్రారంభమైన చోటా పూర్తిస్థాయిలో వసతులు లేవు. భవనాల నిర్మాణం పూర్తి కాకపోవడంతో 21 మండలాల పేద విద్యార్థులకు మోడల్ స్కూళ్లలో చదివే అవకాశం లేకుండా పోయింది. అందిస్తున్నారు. సీబీఎస్ఈ సిలబస్‌ను అమలు చేస్తుండడంతో మోడల్ పాఠశాలల్లో అడ్మిషన్లకు డిమాండ్ బాగానే ఉంది. ఇప్పటివరకు నిజాంసాగర్, మద్నూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, సదాశివనగర్, సిరికొండ, ధర్పల్లి, నందిపేట్, నవీపేట్, ఆర్మూర్, జక్రాన్‌పల్లి, వర్ని, డిచ్పల్లి, రెంజల్ మండలాల్లోనే మోడల్ పాఠశాలలకు సొంత భవనాలను నిర్మించారు. ఆయా పాఠశాలల్లోనే తరగతులు ప్రారంభించారు. దీంతో బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్, భీమ్‌గల్, లింగంపేట్, గాంధారి, మాచారెడ్డి, బోధన్, ఎడపల్లి, జుక్కల్, బిచ్కుంద, పిట్లం, బీర్కూర్, కోటగిరి, తాడ్వాయి, కామారెడ్డి, నిజామాబాద్, మాక్లూర్, దోమకొండ, భిక్కనూరు మండలాల్లోని విద్యార్థులు మోడల్ విద్యకు దూరంగా ఉండాల్సి వచ్చింది. మోడల్ పాఠశాలలకు సొంత భవనం నిర్మించే వరకు అద్దె భవనాల్లో తరగతులను నిర్వహించాలని మొదట అధికారులు భావించారు. అయితే అనువైన అద్దె భవనాలు దొరకవనే ఉద్దేశంతో సొంత భవనాలు నిర్మించే వరకు పాఠశాలలను ప్రారంభించేది లేదని అధికారులు నిర్ణయించారు. కొన్ని మండలాల్లో పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడం, మరి కొన్ని మండలాల్లో భూ సేకరణ దశలోనే ఉండటంతో విద్యార్థులు నష్టపోవాల్సి వచ్చింది. సమస్యలెన్నో.. మోడల్ పాఠశాలల్లో పలు సమస్యలున్నాయి. చాలా పాఠశాలల్లో సరిపోయేంత ఫర్నిచర్ లేదు. ల్యాబ్ సౌకర్యాలు లేవు. ఉపాధ్యాయుల కొరత ఉంది. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవడంతో కొన్ని ఆదర్శ పాఠశాలల్లో కాంట్రాక్టు ఉపాధ్యాయులను నియమించారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి డిప్యుటేషన్‌పై కొందరిని పంపించారు. ఇంటర్ పాఠ్యాంశాలు బోధించడానికి పూర్థిస్థాయిలో లెక్చరర్స్‌ను నియమించకపోవడంతో సిలబస్ పూర్తి కాకుండానే విద్యార్థులు పరీక్షలకు వెళ్లాల్సి వచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఏడు, తొమ్మిది, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభమవుతున్నాయి. అయితే ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయపోవడంతో ఈసారీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం కష్టమే. -
ఆదర్శం అపహాస్యం
ఈ ఏడాదీ వసతి లేకుండానే ప్రవేశాలు మూడేళ్లుగా కొనసాగుతున్న భవన నిర్మాణాలు స్థల అన్వేషణలోనే రావికమతం వసతిగృహం పాఠశాలల్లో విద్యార్థులకు తప్పని అవస్థలు ప్రైవేటుసంస్థలకు దీటుగా పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో మెరుగైన రీతిలో విద్యా బోధన చేయాలన్న లక్ష్యం నీరుగారిపోతోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదర్శ పాఠశాలలు ఆపహాస్యమవు తున్నాయి. హాస్టల్‌తో కలిపి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి, తరగతులు ప్రారంభించి ఏడాదవుతున్నా నేటికీ వసతి సమకూరలేదు. దీంతో విదార్థులు డేస్కాలర్‌గా పాఠశాలకు వెళ్లేందుకు అనాసక్తి కనబరుస్తున్నారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీషు మీడియంలో ప్రత్యేక బోధనకు అప్పటి ప్రభుత్వం ఆదర్శపాఠశాలలు ఏర్పాటు చేసింది. ఆశయం బాగున్నా..ఆచరణలో మాత్రం వీటి పరిస్థితి మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కు చందంగా మారింది. నర్సీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలోని నర్సీపట్నం మండలం వేములపూడి, రావికమతం మండలం మరుపాక, తేగాడ కశింకోట మండలం, మంచాల చీడికాడ మండలం, పాటిపల్లి మునగపాక మండలాల్లో ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసింది. వీటిల్లో విద్యార్థులకు వసతిని కల్పించి తరగతులు ప్రారంభించాలని అప్పట్లో సంకల్పించింది. మొదటి ఏడాది పాఠశాల భవనాల నిర్మాణం సైతం పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో అప్పట్లో తరగతులు వాయిదా వేశారు. పాఠశాల భవనాలు పూర్తికావడంతో తదుపరి ఏడాది నుంచి తరగతులు ప్రారంభించారు. అప్పుడు తీరిగ్గా వసతిగృహ నిర్మాణాలు ప్రారంభించారు. అవి పూర్తికాకుండానే వసతి కల్పిస్తామంటూ విద్యార్థులను మభ్యపెట్టి ప్రవేశాలు పూర్తిచేశారు. దీంతో చదువులు బాగుంటాయన్న ఆశతో విద్యార్థులు తరగతుల్లో చేరారు. ఈ భవనాలు నేటికీ పూర్తికాలేదు. ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యమే కారణమని సంబంధిత ఇంజినీరింగు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రావికమతం మండలం మరుపాక పాఠశాల వసతి గృహానికి నేటికీ స్థల సమస్య వేధిస్తోంది. మిగిలిన నాలుగు చోట్ల భవనాలు నిర్మాణాలు కొనసాగుతున్నాయి. దీంతో విద్యార్థులు గతేడాదంతా ఇళ్ల నుంచి రాకపోకలు సాగించారు. ఆయా మండలాలకు చెందనివారి పరిస్థితి దయనీయంగా ఉంది. వసతి ఉంటుందని భావించి, పాఠశాలల్లో చేరిన విద్యార్థులు రోజూ తరగతులకు హాజరయ్యేందుకు అవసరమైన ప్రయాణ సాధనాలు లేక నానా ఇబ్బందులు పడ్డారు. వీటిని పట్టించుకోకుండా అధికారులు ఈ ఏడాది సైతం ప్రవేశాలకు చర్యలు చేపట్టారు. ఆరో తరగతిలో ఒక్కో పాఠశాలలో 80 మంది చొప్పున ఐదింట 400 మందికి మంగళవారం ప్రవేశాలు కల్పించారు. ఇంటర్మీడియట్లో ప్రవేశానికి ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటున్నారు. గతేడాది పరిస్థితే ఈ ఏడాదీ పునరావృతం కానుండడంతో ఏం చేయాలో పాలుపోక విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ భవనాలు నిర్మాణం పూర్తికాకపోవడంతో హాస్టల్ వసతి కల్పించడం లేదన్నారు. ఇవి పూర్తయిన వెంటనే వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. -
టౌన్ ప్లానింగ్‌లో అవినీతి అంతస్తులు
పాలకొండ, న్యూస్‌లైన్: నగర పంచాయతీగా మారిన స్వల్పకాలంలోనే పాలకొండ మున్సిపాలిటీ అక్రమాల కొండలా తయారైంది. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్‌లో అవినీతి మిగిలిన మున్సిపాలిటీలను తలదన్నుతోంది. పట్టణం మున్సిపాలిటీ స్థాయికి ఎదగడంతో నివాస, వాణిజ్య భవన నిర్మాణాలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. ఇదే అదనుగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది ముడుపులు దండుకొని ఎడాపెడా అనుమతులు మంజూరు చేసేస్తున్నారు. ఒక ఇంటి ప్లాన్ ఆమోదానికి నగర పంచాయతీ కమిషనర్ లంచం తీసుకుంటూ నాలుగు రోజుల క్రితం ఏసీబీకి దొరికిపోయిన అనంతరం టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నగర పంచాయతీగా ఆవిర్భవించిన తర్వాత సాధారణ నివాస గృహాలతోపాటు సామూహిక గృహాలు, వాణిజ్య భవనాలు, కల్యాణ మండపాలు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలకు అనుమతి కోరుతూ ఇప్పటివరకు నగర పంచాయతీకి 63 దరఖాస్తులు అందాయి. ప్లాన్ ఆమోదం కోసం దరఖాస్తుదారుల దగ్గర నుంచి రూ.30 లక్షల వరకు టౌన్‌ప్లానింగ్ విభాగం దండుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. కమిషనర్‌పై ఏసీబీకి ఫిర్యాదు చేసిన వ్యక్తి తాను టౌన్ ప్లానింగ్ విభాగానికి సైతం భారీగానే ముడుపులు చెల్లించుకున్నట్టు చెప్పినట్లు తెలుస్తోంది. దీనికితోడు మంజూరు చేసిన ప్లాన్ అనుమతులు కూడా వివాదాస్పదంగా కనిపించడంతో జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి సురేష్ నేతృత్వంలో ఒక బృందం శాఖాపరమైన విచారణ జరిపింది. గత మూడు రోజులుగా క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపిన ఈ బృందం పలు నిర్మాణాలకు అనుమతులు కోరుతూ నగర పంచాయతీకి సమర్పించిన ప్లాన్లకు, నిర్మాణంలో ఉన్న భవనాలకు ఎటువంటి పొంతన లేని విషయాన్ని గుర్తించారు. ఇదే విషయమై సదరు భవనాల యజమానులను ప్రశ్నించగా ఉల్లంఘనలు వాస్తవమేనని అం గీకరిస్తూ, దాని కోసమే ముడుపులు చెల్లించినట్లు బృందానికి వెల్లడించారు. దాంతో నిబంధనలకు విరుద్దంగా ఉన్న ఇంటి ప్లాన్లను రాష్ట్ర అధికారులకు పంపినట్టు తెలిసింది. ఈ నేపధ్యంలో టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. నగర పంచాయతీలోని టౌన్ ప్లానింగ్ విభాగంలోని రికార్డులను సైతం విచారణాధికారులు స్వాధీనం చేసుకొని తమతో తీసుకెళ్లారు. స్థానికంగా వీటిపై విచారణ జరిగితే ఒత్తిళ్లు పెరుగుతాయన్న భావనతోనే వాటిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. బహిర్గతమవుతున్న భాగోతాలు... ఇంటి ప్లాన్ల విషయంలో మరిన్ని భాగోతాలు బహిర్గతమవుతున్నాయి. వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్న యజమానులు నగర పంచాయతీ ఆదాయాన్ని ఎగ్గొంటేందుకు తప్పుడు ప్లాన్లు రూపొందించి, అధికారులకు కొంత ముట్టజెప్పి ఆమోద ముద్ర వేయించుకుంటున్నారు. దండిగా ముడుపులు ముడుతుండటంతో ఎవరు చూస్తారులే అన్న ధీమాతో యజమానులు కోరిన విధంగా ప్లాన్లను అధికారులు ఆమోదిస్తున్నారు. మరికొందరు పలుకుబడి ఉన్నవారు తమనెవరు పట్టించుకుంటారులే అన్న నిర్లక్ష్య వైఖరితో కనీసం అనుమతి కోరుతూ దరఖాస్తు కూడా చేయడం లేదు.