bunkers
-
భారత సరిహద్దుల్లో చైనా బంకర్ల నిర్మాణం!
భారత్‌ను కవ్వించే ప్రయత్నాలు చేస్తోంది చైనా. ఇప్పటికే భారత సరిహద్దులను డ్రాగన్ దేశం అస్థిరపరిచే కుట్రను గత కొన్నేళ్లుగా అమలు చేస్తోంది. అయితే తాజాగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) తూర్పు లడఖ్‌లోని ప్యాగ్యాంగ్ సరస్సు చుట్టుపక్కల అండర్‌గ్రౌండ్ బంకర్లు నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా కనిపిస్తోందని రక్షణ రంగ నిపుణులు వెల్లడించారు. ఆయుధాలు, ఇంధనం, సైనిక వాహనాల కోసం చైనా ఆర్మీ బంకర్లు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ప్యాగ్యాంగ్ సరస్సుకు ఉత్తర వైపు పర్వతాల మధ్య చైనా ఆర్మీ బేస్ సిర్జాప్ వద్ద బంకర్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ బంకర్ల నిర్మాణాలు వాస్తవాధీన రేఖకు కేవలం ఐదు కిలోమిటర్ల దూరంలోనే ఉంది. ప్రస్తుతం ఈ బంకర్లు నిర్మిస్త్ను ప్రాంతంలో 2020 ప్రారంభమైన ప్రతిష్టంభనకు ముందు ఎటువంటి మానవ సంచారం లేదు.2021-22 మధ్య నిర్మించిన బంకర్లుగా కనిపిస్తున్నాయి. ఈ బేస్‌లో ఆయుధాలు, ఇంధనం, ఇతర సామాగ్రి భద్రపరచం కోసం నిర్మించిన బంకర్లుగా కనిపిస్తున్నాయి. యూఎస్‌కు చెందిన బ్లాక్‌స్కై సంస్థ అందించిన ఉపగ్రహ చిత్రాల ఈ విషయం తెలుస్తోంది. సాటిలైట్ మే 30న తీసినఫొటోలో ఒక పెద్ద బంకర్.. దానికి ఎనిమిది ఎన్ట్రెన్స్లు. మరో చిన్న బంకర్.. దానికి ఐదు ఎన్ట్రెన్స్ ఉన్నట్లు స్పష్టం తెలుస్తోంది.అదే విధంగా పక్కనే పలు పెద్ద బిల్డింగ్లు, సైనిక వాహనాలతో అనేక షెల్టర్లు ఉన్నాయి. సైనిక వాహనాలను గగనతల దాడుల నుంచి రక్షించుకోవడానికి చైనా ఆర్మీ షెల్టర్లు నిర్మించుకున్నట్లు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు.. ఇటీవల జరిగిన ఎస్సీవో సదస్సు సందర్భంగా ఆస్తానాలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భేటీ అయ్యారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలపై లోతుగా చర్చించారు. సరిహద్దుల్లో నెలకొన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఇరు నేతలూ తీర్మానించారు. ఇందుకోసం సైనిక, దౌత్య మార్గాల్లో ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు అంగీకారం తెలిపారు. -
మావోల బంకర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు నిర్మించిన బంకర్‌ను భద్రతాబలగాలు గుర్తించారు. బస్తర్ డివిజన్లో మావోయిస్టులు బంకర్లను నిర్మించి వినియోగిస్తున్న విషయం బయటపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బస్తర్‌లో ఇలాంటివి ఉండొచ్చని భద్రతా బలగాలకు సమాచారం ఉందిగానీ ఇన్నాళ్లలో ఎన్నడూ ఒక్కదానిని కూడా గుర్తించలేకపోయారు. బీజాపూర్–దంతెవాడ జిల్లాల మధ్య ఇంద్రావతి నదీతీరంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరలను గుర్తించేందుకు జిల్లా రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా బీజాపూర్ జిల్లాలోని తోడోపాట్–ఉస్పారీ గ్రామ సమీప అడవిలో మంగళవారం ఈ బంకర్‌ను భద్రతా బలగాలు గుర్తించాయని దంతేవాడ అదనపు ఎస్పీ బర్మన్ చెప్పారు. ఈ సొరంగం 130 మీటర్ల పొడవు, 6 అడుగుల లోతు, 3 అడుగుల వెడల్పుతో ఉంది. బంకర్ కనపడకుండా ప్రవేశమార్గాన్ని మట్టితో కూడిన కర్రలను కప్పి వాటిపైన చెట్ల పొదలను పరిచారు. మావోలు డంపింగ్ ప్రాంతంగానూ దీనిన వినియోగించినట్లు భద్రతాబలగాలు గుర్తించాయి. జనవరి 9న మావోయిస్టుల తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకున్నారు. మైదాన ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేస్తే డ్రోన్ల సాయంతో జాడ కనిపెట్టే అవకాశం ఉండటంతో ఇటీవలే ఈ బంకర్ నిర్మించి సమావేశం జరిపి ఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఇంద్రావతి నదిఒడ్డున ఏర్పాటు చేసిన ఈ బంకర్లో 100 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా దాక్కునేందుకు వీలుగా ఉంది. ఇలాంటి బంకర్లు ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరిన్ని ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు, వాటిని గుర్తించేందుకు అడవుల్లో సోదాలు గాలింపు ముమ్మరం చేశారు. అబూజ్మడ్ అడవుల్లో ఇలాంటివి ఎన్ని బంకర్లు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? అనే అంశాలపై భద్రతాదళాలకు కొత్త సవాల్‌గా మారినట్టయ్యింది. వచ్చే వేసవిలో విస్తృతంగా కూంబింగ్ చేపట్టేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్న భద్రతాదళాలకు కనిపించని బంకర్లతో మరిన్ని చిక్కులు వచ్చి పడే అవకాశముంది. గాలి, వెలుతురు సోకేలా ఏర్పాట్లు బైరాంఘర్ పోలీస్‌స్టేషన్, భద్రతాదళాల బేస్ క్యాంప్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఈ బంకర్ ఉంది. బంకర్లోకి వచ్చి వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. గాలి, వెలుతురు సోకేలా ప్రతీ ఆరు మీటర్లకు ఒకటి చొప్పున ద్వారాలు ఏర్పాటు చేశారు. అయితే, ఇవి బయటకు కనిపించకుండా చెట్ల పొదలు అడ్డుపెట్టారు. మావో అగ్రనేతలు తలదాచుకునేందుకు ఉపయోగించుకోవడంతో పాటు మెరుపు దాడులకు వీలుగా దీనిని నిర్మించారని వార్తలొచ్చాయి. అయితే దీని నిర్మాణ వివరాలను భద్రతా బలగాలు ఇంకా అధికారికంగా బహిర్గతంచేయలేదు. -
Russia-Ukraine War: అసలేంటీ ఈ బంకర్లు.. ఇండియాలో ఉన్నాయా?
ఉక్రెయిన్‌పై రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది, అక్కడున్న భారతీయులు సహా అంతా బంకర్లలోకి వెళ్లి తలదాచుకుంటున్నారు. నాలుగైదు రోజులుగా ఈ వార్తలు వింటున్నాం. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా బంకర్లో దాక్కున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. అసలు ఏమిటీ బంకర్లు, వాటిలోకి వెళితే ఉండే రక్షణ ఏంటి? వాటిని ఎందుకు కట్టారు? ఎలా కట్టారు? మన దేశంలోనూ ఉన్నాయా? అనే ప్రశ్నలెన్నో తలెత్తుతున్నాయి.ఆ వివరాలేమిటో తెలుసుకుందామా.. యుద్ధం, విపత్తు ఏదైనా.. రక్షణ బంకర్ల ఏర్పాటు ప్రధాన లక్ష్యం యుద్ధాలు, విపత్తుల నుంచి రక్షణ పొందడం కోసమే. సింపుల్‌గా చెప్పాలంటే.. భూమిలో (అండర్‌గ్రౌండ్) రహస్యంగా కట్టుకునే గదులు, ఇళ్లనే బంకర్లు అనొచ్చు. నలుగురికి సరిపడే స్థాయి నుంచి.. పదుల సంఖ్యలో తలదాచుకోవడానికి వీలుగా బంకర్లను కట్టుకుంటుంటారు. అత్యవసర పరిస్థితిలో పనికొచ్చే మందులు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, నీళ్లు, ఆహారం, జనరేటర్లు వంటివాటిని బంకర్లలో సిద్ధంగా ఉంచుకుంటారు. చదవండి: ఊహించని పరిణామం.. రష్యాకు మరో షాకిచ్చిన ఉక్రెయిన్ సైనికులు బంకర్ ఏదైనా సరే.. ఓ వైపు నుంచి చిన్నగా ఉపరితలానికి దారి, మెట్లు ఉంటాయి. ఎలాంటి కిటికీలుగానీ, ఇతర మార్గాలుగానీ దాదాపుగా ఉండవు. లోపల దాక్కున్నవారికి ఊపిరి ఆడేందుకు వీలుగా గాలి వచ్చిపోయేలా వెంటిలేషన్ ఏర్పాటు చేస్తారు.యుద్ధ సంక్షోభ ప్రాంతాల్లో..బంకర్ల వినియోగం చాలాకాలంగా ఉన్నా.. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వాటి వినియోగం ఎక్కువైంది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో వైమానిక దాడుల కారణంగా బంకర్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రధానంగా యూరప్, మధ్య ఆసియా దేశాలు, అమెరికాలో ఆయా దేశాల సైన్యం, రహస్య విభాగాలు బంకర్లు కట్టుకుని పోరాడగా.. జనం కూడా రక్షణ కోసం పెద్ద సంఖ్యలో బంకర్లు నిర్మించుకున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్‌లో ఉన్న బంకర్లలో చాలా వరకు ఆ సమయంలో కట్టినవే. చదవండి: పుతిన్ తలను తెగనరకండి.. రష్యా కుబేరుడి సంచలన ప్రకటన ► తరచూ యుద్ధాలు, తిరుగుబాట్లు జరిగే ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పలు ఇతర గల్ఫ్ దేశాలు, చైనాతో సరిహద్దుల్లోని దేశాలు, ఆఫ్రికా ఖండంలోని సంక్షుభిత దేశాల్లో బంకర్లు నిర్మించుకోవడం సాధారణ విషయమే. ► ఎప్పుడూ ఏదో అలజడి ఉండే దేశాల్లో చాలా మంది ధనికులు, రాజకీయ నాయకులు.. విలాసవంతమైన బంకర్లు నిర్మించుకుంటుంటారు. ► అమెరికా, చెక్ రిపబ్లిక్, చైనా వంటి కొన్నిదేశాల్లో.. అణు బాంబుల దాడిని కూడా తట్టుకునేలా భూమిలో ఏకంగా పది, పదిహేను అంతస్తుల లోతు వరకు ఉండే భారీ బంకర్లు ఉన్నాయి. పలుచోట్ల కొండలు, గుట్టలను తొలిచి బంకర్లు నిర్మించారు. అవి సమీపంలో అణుదాడి జరిగినా తట్టుకునేలా ఉంటాయి. గుహల్లా కొన్ని.. ఇళ్లలా కొన్ని.. ► భూమి అడుగున గుహల్లా తవ్వి వాడుకునే బంకర్లు సాధారణమైనవి. తీవ్రవాద ప్రాంతాల్లో, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ వంటి దేశాల్లో తిరుగుబాటు దారులు ఇలాంటి బంకర్లను వాడుతుంటారు. మిగతావాటితో పోలిస్తే వాటికి ఖర్చు తక్కువ. కానీ రక్షణ, సదుపాయాలు కూడా తక్కువే. ► భూమిలో పెద్ద గుంత తవ్వి, దాని అడుగు నుంచీ కాంక్రీట్‌తో ఇల్లులా నిర్మించి.. పైన కొంత ఎత్తున మట్టిని కప్పేసేవి పెద్ద, భారీ బంకర్లు. సైన్యం వాడేందుకు, రహస్య ఆపరేషన్ల కోసం, యుద్ధాలు జరిగే ప్రాంతాలు, సరిహద్దుల్లో ప్రజల కోసం ఇలాంటివి నిర్మిస్తారు. వీటిలో రక్షణ సదుపాయాలు ఎక్కువ. ► కంటెయినర్లలా రెడీమేడ్‌గా ఉక్కుతో తయారు చేసే బంకర్లూ ఎక్కువే. భూమిలో అవసరమైన మేర గుంత తవ్వి ఈ రెడీమేడ్ బంకర్లను అందులో పెట్టి.. పైన మట్టి కప్పేస్తారు. అమెరికా, యూరప్ దేశాల్లో జనం ఇలాంటివి ఏర్పాటు చేసుకుంటుంటారు. ► ఏర్పాటు చేసుకునే బంకర్‌ను బట్టి కనీసం రూ.10 లక్షల నుంచి ఖర్చు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ► చాలాచోట్ల బంకర్లపైన భూమిపై చిన్నపాటి పార్కులు, లాన్, గోల్ఫ్ కోర్సులు, చిన్నపాటి రేకుల షెడ్లు వంటివి ఏర్పాటు చేస్తుంటారు. దేశంలో.. కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో.. మన దేశంలోనూ జమ్మూకశ్మీర్, లడఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో విదేశీ సరిహద్దుల వెంబడి బంకర్లు ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దుల్లో మన ఆర్మీతోపాటు సాధారణ జనం కూడా బంకర్లు కట్టుకుంటుంటారు. పాకిస్తాన్ సైన్యం తరచూ కాల్పులు జరుపుతుండటం, ఉగ్రవాదుల చొరబాట్ల నేపథ్యంలో.. సరిహద్దుల్లోని ప్రజలకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వేల సంఖ్యలో బంకర్లను నిర్మించి ఇస్తోంది. అందులో కుటుంబాలకు వ్యక్తిగత బంకర్లతోపాటు ఎక్కువ మంది తలదాచుకునేలా కమ్యూనిటీ బంకర్లు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికే సుమారు 10వేల బంకర్లను నిర్మించినట్టు అధికారులు తెలిపారు. ఇవన్నీ పాకిస్తాన్, ఆక్రమిత కశ్మీర్ సరిహద్దులకు మూడు కిలోమీటర్ల లోపు.. కీలకమైన రాజౌరీ, పూంఛ్, ద్రాస్ వంటి సెక్టార్లలో ఉన్నట్టు వివరించారు. మనకు ఆపద వస్తే ఎలా? మన దేశంలో అత్యవసర పరిస్థితి వస్తే.. రాష్ట్రప తి, ప్రధాని, ఇతర కీలక ప్రముఖులకు రక్షణ కల్పించేలా బంకర్లు ఉన్నట్టు ప్రచారంలో ఉంది. కానీ కచ్చితమై ధ్రువీకరణ లేదు. దేశంలో పాకి స్తాన్, చైనా, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోనే బంక ర్లున్నాయి. అంతేతప్ప ఎక్కడా బంకర్లు అనేవే లే వని రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో భారతదేశం ఎప్పుడూ ప్రధాన యుద్ధరంగంలో లేదని.. అందువల్ల మన దేశానికి బంకర్ల అవసరమే రాలేదని అంటున్నారు. అంతేకాదు.. ఒకవేళ వైమానిక, క్షిపణి దాడులు జరిగినప్పుడు సురక్షితంగా ఉండేందుకు ఏం చేయాలి?, ఎక్కడికి వెళ్లాలన్న దానిపై మన దేశంలో ఎవరికీ అవగాహన కూడా లేదని పేర్కొంటున్నారు. -
ఉక్రెయిన్‌లో ఇంటికో బంకర్.. సైరన్ మోగితే చాలు..
సాక్షి, హైదరాబాద్: ‘రాత్రి పగలూ తేడా లేకుండా బాంబుల మోతలు.. సైరన్ల హెచ్చరికలు.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ.. మూడు రోజులుగా నిద్రాహారాలు లేకుండా గడుపుతున్నాం’. అని ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన పలువురు తెలుగు విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వినితియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న వందలాది మంది విద్యార్థులు శనివారం ఉదయమే అక్కడి నుంచి రొమేనియాకు చేరుకొనేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. రొమేనియా సహా పోలెండ్, హంగేరీ తదితర దేశాలకు జనం తరలి వెళ్లడంతో రాకపోకలు స్తంభించాయి. ►ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను రోడ్డు మార్గంలో పొరుగుదేశాలకు తరలించి అక్కడి నుంచి విమానాల ద్వారా భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్రం రెండు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కానీ వాహనాల రద్దీ కారణంగా చాలా మంది రొమేనియా తదితర పొరుగు దేశాలకు చేరుకోవడం కష్టంగా మారింది. సైరన్ మోగినప్పుడు స్తంభించిన వినితియా నగరంలోని ఓ రహదారి ►ఈ క్రమంలోనే వినిత్స నుంచి రొమేనియాకు బయలుదేరిన సుమారు 300 మంది విద్యార్థులు (కొంతమంది తెలుగు వారు కూడా) చివరి క్షణంలో భారత రాయబార కార్యాలయం నుంచి అనుమతి లభించకపోవడంతో నిలిచిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ►రాత్రింబవళ్లు నిద్రాహారాలు లేకుండా గడుపుతున్నామని, తమను తక్షణమే ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థి వినోద్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ‘సాక్షి’కి వివరించారు. సైరన్ మోగితే పరుగులే... ►వినితియా మెడికల్ వర్సిటీలో చదువుతున్న విద్యార్థులు స్థానికంగా అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. మొదటి నుంచి యుద్ధ భయాన్ని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ ప్రజలు తమ ఇళ్ల నిర్మాణంలో భాగంగా బంకర్లను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఒక బంకర్ ఉంటుందని, సైరన్ మోగగానే అందరు వెళ్లి అందులో తలదాచుకుంటారని వినోద్ తెలిపారు. ►మూడు రోజులుగా ఎప్పుడు బంకర్ మోగితే అప్పుడు తామంతా బంకర్లకు పరుగులు తీస్తున్నామని వాపోయారు. వినితియాకు ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరంలో బాంబుల మోత వినిపిస్తోందని, ఏ క్షణంలో తాము ఉన్న నగరానికి యుద్ధం ముంచుకొస్తుందో తెలియడం లేదని చెప్పారు. నగరంలోని ఎల్బీనగర్, మల్కాజిగిరి, పిర్జాదిగూడ తదితర ప్రాంతాలకు చెందిన పలువురు విద్యార్ధులు జెప్రోజియా, వినితియా విశ్వవిద్యాలయాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. యుద్ధానికి ముందే కొందరు భారత్‌కు తిరిగి వచ్చినప్పటికీ ఇంకా చాలా మంది అక్కడే ఉండిపోయారు. కొరవడిన స్పష్టత.. భారత రాయబార కార్యాలయం ప్రకటనల్లో స్పష్టత లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ‘మొదట అందరూ బయలుదేరాలని ప్రకటించారు. తీరా సామగ్రి సర్దుకొని వెళ్లేందుకు సిద్ధమైన అనంతరం ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని ప్రకటించారు. తాము ఉన్న చోట భద్రత ఉంటే అక్కడే ఉండిపోవాలని చెబుతున్నారు. కానీ ఇలా భయం భయంగా ఎంతకాలం బతకాలి’ అని వినోద్ ఆవేదన వక్యం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారని, సరిహద్దు దేశాలకు చేరుకొనేందుకు అవకాశం లేక, రాత్రింబవళ్లు బంకర్లలో తలదాచుకోలేక బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నామని పేర్కొన్నారు. -
విశాఖ పురాతన చరిత్రకు సాక్ష్యం
సాక్షి, విశాఖపట్నం : నగర ప్రాచీన చరిత్రకు సాక్ష్యంగా నిలిచే బంకర్ ఒకటి బయటపడింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో శత్రువులపై దాడి కోసం నిర్మించిన ఈ బంకర్ లు చాలా వరకు విశాఖ తీరంలో ఉన్నాయి. అయితే కాలక్రమంలో సముద్రపు అలల తాకిడికి కొన్ని ఇసుకలో కూరుకుపోయాయి. జాలరి పేట వద్ద మాత్రం బంకర్ శిధిల స్థితిలో కనిపిస్తుంటుంది. తాజాగా వాతావరణ మార్పులతో పాండురంగ స్వామి టెంపుల్ సమీపాన ఓ బంకర్ బయటపడింది. రెండో ప్రపంచ యుద్ధంలో సముద్రపు గుండా వచ్చే శత్రువులపై దాడి చేసేందుకు సైనికులు ఈ బంకర్లను నిర్మించుకుని అక్కడినుంచి దాడులకు దిగినట్టు చరిత్రకారులు చెబుతుంటారు. ప్రాచీన నాగరికతకు ఆనవాలుగా చెప్పుకునే ఈ బంకర్ బయటపడడంతో విశాఖ వాసులు సందర్శిస్తున్నారు. కేవలం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోనే కాదు రాతి యుగంలో కూడా విశాఖలో నాగరికత ఉన్నట్టు చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఇక ప్రాచీన చరిత్ర కలిగిన బంకర్ బయట పడిందన్న విషయం తెలిసి ఉదయాన్నే కొందరు సందర్శకులు అక్కడ చేరుకున్నారు. -
కరోనా: బంకర్లలోకి బిలియనీర్స్
వాషింగ్టన్: ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారిన పడకుండా తప్పించుకునేందుకు అమెరికాలోని శతకోటీశ్వరులు న్యూజిలాండ్ వెళ్లిపోయి అక్కడి తమ విలాసవంతమైన బంకర్ల (నేల మాళిగలు)లో తలదాచుకుంటున్నారు. వారిలో సిలికాన్ వ్యాలీకి చెందిన శతకోటీశ్వరులు కూడా ఎంతో మంది ఉన్నారు. ఏదో ఒక రోజు ప్రపంచ ప్రళయం (డూమ్స్ డే) వచ్చి అందరూ చనిపోతారని నమ్మే కొంత మంది శతకోటీశ్వరులు న్యూజిలాండ్‌లో అత్యంత ఖరీదు చేసే విలాసవంతమైన బంకర్లను ఎన్నడో కొని పెట్టుకున్నారని ‘డెయిలీ మెయిల్’ వెల్లడించింది. వారిలో ‘పేపాల్’ వ్యవస్థాపకుడు, ఫేస్బుక్ శతకోటీశ్వరుడు పీటర్ తియాల్, టెక్సాస్‌లోని బ్లూబెర్గ్ కంపెనీ జనరల్ మేనేజర్ గేరీ లించ్ కూడా ఉన్నారు. పీటర్ తియాల్ న్యూజిలాండ్‌లోని అందమైన క్వీన్స్‌టౌన్‌లో మల్టీపర్సన్ భవనాన్ని కొనుగోలు చేశారు. అంటే భూమిపైన మామూలుగా కనిపించే ఆ భవనంలోనే అవసరమైనప్పుడు తలదాచుకునేందుకు ‘ప్యానిక్ రూమ్’ ఒకటి ఉంది. దాన్ని ఆయన 4.7 మిలియన్ డాలర్లు (దాదాపు 35.15 కోట్ల రూపాయలు) పెట్టి కొనుగోలు చేసినట్లు తెల్సింది. ఇప్పుడాయన అక్కడికి వెళ్లారో, లేదో తెలియడం లేదు. అయితే గేరీ లించ్ లాంటి శతకోటీశ్వరులు ప్రాణాంతకమైన కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందంటూ వార్తలు వెలువడిన తొలుతలోనే అమెరికా నుంచి విమానాలు పట్టుకొని న్యూజిలాండ్ వెళ్లారు. వారిలో ప్రముఖ వ్యాపారవేత్త మిహాయి దినులెస్కూ తన భార్యతో కలిసి మార్చి 12వ తేదీన న్యూజిలాండ్ వెళ్లారు. రైజింగ్ ఎస్ కంపెనీ న్యూజిలాండ్‌లో ఇలాంటి బంకర్లను కొన్నింటిని ఇప్పటికే నిర్మించగా మరికొన్నింటిని నిర్మిస్తోంది. వాటిని మూడు మిలియన్ డాలర్ల నుంచి ఎనిమిది మిలియన్ డాలర్ల వరకు విక్రయిస్తోంది. వాటిలో 22 మంది నిద్రించే అవకాశం ఉన్న మూడు మాస్టర్ బెడ్ రూమ్‌లు, లివింగ్ రూమ్, డైనింగ్ హాల్, కిచెన్‌తోపాటు ఓ ఫిట్నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్ ఉన్న బంకర్లు కూడా ఉన్నాయి. కొన్ని బంకర్లు కూడా భూమిలోపల రెండు, మూడు అంతస్తులుగా ఉన్నాయి. వాటన్నింటికి కావాల్సిన ఆక్సిజన్, విద్యుత్ నిరంతరాయంగా సరఫరాకు ఏర్పాట్లు ఉన్నాయి. వాటిల్లో కొందరు శతకోటీశ్వరులు ఏడాది పాటు కొదవ లేకుండా తినుపదార్థాలను నిలువ చేసుకున్నారు. చదవండి: కరోనా కట్టడిపై చిగురిస్తున్న ఆశలు -
సరిహద్దుల్లో బంకర్లు..
-
సరిహద్దుల్లో 14వేల బంకర్లు..
శ్రీనగర్: నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి నివసిస్తున్న ప్రజల రక్షణ కోసం భారత ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది. దాయాది దేశం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లఘించి దాడులు జరిపినప్పుడల్లా సైన్యంతో పాటు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి పరిస్థితి తల్తెతకుండా ఉండేందుకు సరిహద్దుల్లో నివసిస్తున్న కుటుంబాల కోసం దాదాపు 14వేలకు పైగా బంకర్లను భారత ప్రభుత్వం నిర్మిస్తుంది. తద్వారా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు, కాల్పులు జరిగినప్పుడు అక్కడి ప్రజలు బంకర్లలో రక్షణ పొందవచ్చు. కశ్మీర్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో వీటి నిర్మాణం జరుగుతుందని భారత రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. సరిహద్దుల్లో కాల్పులు జరిగిన ప్రతిసారి అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారని పూంచ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ రాహుల్ యాదవ్ తెలిపారు. బంకర్ల నిర్మాణం ద్వారా ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించవచ్చని ఆయన పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నప్పుడు అక్కడి ప్రజలను బంకర్లకు తరలించనున్నారు. కాగా, 60 మిలియన్ డాలర్లతో నిర్మిస్తున్న ఈ బంకర్ల నిర్మాణం గతేడాది జూన్‌లో ప్రారంభించినట్టు ప్రభుత్వ ఇంజనీర్లు తెలిపారు. వీటిని చాలా దృఢంగా నిర్మిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లు పేర్నొన్నారు. సాధారణంగా చేపట్టే ఇళ్ల నిర్మాణం కన్నా ఇవి పది రెట్లు మందంగా ఉంటాయని అన్నారు. వాటితో పోల్చితే 10 రెట్లు ఎక్కువ స్టీలు వీటి నిర్మాణంలో ఉపయోగిస్తున్నట్టు వెల్లడించారు. -
14 వేల బంకర్లు
జమ్మూ: పాకిస్తాన్‌తో అంతర్జాతీయ, పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దుల వద్ద 14,460 బంకర్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాకిస్తాన్ తరచూ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ మోర్టార్లతో దాడు లు చేస్తున్నందున సరిహద్దు గ్రామాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ బంకర్లను నిర్మించనున్నారు. కాగా, ఈ బంకర్ల నిర్మాణానికి కేంద్రం రూ.415.73 కోట్లను ఇటీవలే విడుదల చేసింది. ఈ భూగర్భ బంకర్లలో ఎల్వోసీ వెంట పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో 7,298, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, కథువా, సాంబా జిల్లాల్లో 7,162 బంకర్లను నిర్మించనున్నారు. ఇందులో 13,029 వ్యక్తిగతమైనవి కాగా, 1,431 సామాజిక బంకర్లున్నాయి. వ్యక్తిగత భూగర్భ బంకర్లు 160 చదరపు అడుగులు (ఎనిమిది మంది ఉండేందు కు వీలుగా), సామాజిక బంకర్లు 800 చదరపు అడుగులు (40 మంది ఉండేందుకు వీలుగా) ఉంటాయి. గతేడాది పాకిస్తాన్ కవ్వింపు చర్యల కారణంగా 35 మంది (23 మంది సైనికులు, 12 మంది పౌరులు) మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం బంకర్ల నిర్మాణానికి చొరవతీసుకుందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. -
దొంగదెబ్బ కొడుతున్న చైనా
న్యూఢిల్లీ : పాకిస్తాన్-చైనా మధ్య ఆర్థిక, సైనిక సంబంధాలు రోజురోజుకూ బలోపేతమవుతున్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా డ్రాగన్ కంట్రీ పాక్‌కు అన్ని రకాల సహకారాలు అందిస్తోంది. తాజాగా పొరుగుదేశానికి అవసరమైన సైనిక సౌకర్యాలను కల్పిస్తోంది. అందులో భాగంగా సైనికులకు అవసరమైన మౌలిక సౌకర్యాలను కమ్యూనిస్ట్ కంట్రీ అందిస్తోంది. కశ్మీర్ నుంచి గుజరాత్ వరకూ ఉన్న సరిహద్దు వెంబడి.. పాకిస్తాన్ సైనికుల కోసం చైనా అత్యాధునిక బంకర్లను నిర్మిస్తోంది. కీలకమైన రాజస్తాన్ సరిహద్దు వద్ద ఎయిర్ బేస్‌ను ఆధునీకరించడంతో పాటు, 350 స్టోన్ బంకర్లను డ్రాగన్ దేశం నిర్మించింది. అంతేకాక బోర్డర్ అవుట్ పోస్ట్‌లను కలుపుతూ.. రోడ్నెర్క్ను సైతం అభివృద్ధి చేస్తోంది. ఒక వేళ యుద్ధం సంభవిస్తే.. సైన్యానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా సరిహద్దు వెంబడి బంకర్స్‌తో పాటు కెనాల్స్‌కు చైనా ఏర్పాటు చేస్తోంది. భారత్ సరిహద్దుకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉండే ఖైరాపూర్ ఎయిర్‌బేస్‌లో కొన్ని నెలలుగా చైనా సైన్యం తిష్ట వేసింది. ఈ ఎయిర్బేస్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చైనా అభివృద్ధి చేస్తోంది. ఇదిలావుండగా.. పాక్‌కు అవసరమైన సహజవాయువు, ముడిచమురు, ఖనిజ వనరులను చైనానే అందిస్తోంది. -
చైనా దొంగబుద్ధి..!?
చైనా, పాకిస్తాన్‌లు భారత్ వెనుక గొయ్యి తీస్తున్నాయా? పాకిస్తాన్-చైనా ఎకనమిక్ కారిడార్ పేరుతో.. సైనిక సహకారం అందించుకుంటున్నాయా? ఇండో-పాక్ సరిహద్దులో బంకర్ల ఏర్పాటుకు చైనా సహకరిస్తోందా? సరిహద్దుల వెంబడి పాకిస్తాన్‌ను చైనా అండగా ఉంటోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సాక్షి, న్యూఢిల్లీ : ఇండో-పసిఫిక్ రీజియన్‌లో అజేయ శక్తిగా ఎదుగుతున్నభారత్‌ను దొంగ దెబ్బ కొట్టేందుకు పాకిస్తాన్‌ను చైనా రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తోందని ఒక అంతర్జాతీయ సర్వే ప్రకటించింది. దిమ్మతిరిగే వాస్తవాలను సర్వే వెలువరించింది. ఈ సర్వే ప్రకారం.. ఇండో-పాక్ సరిహద్దులో పాకిస్తాన్ సైన్యానికి అనుకూలంగా చైనా బంకర్లను ఏర్పాటు చేస్తోంది. అంతేకాక జమ్మూ కశ్మీర్ నుంచి గుజరాత్‌కు వరకూ ఉన్న సరిహద్దు వెంబడి పాకిస్తాన్ బంకర్ల నిర్మాణం చేపడుతోందని తెలుస్తోంది. అంతేకాక సరిహద్దుల్లో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రెండు ఎయిర్‌పోర్టుల నిర్మించగా.. మరో రెండు నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు సర్వేలో వెల్లడయింది. సరిహద్దుల్లోనే! రాజస్థాన్‌లోని జైలస్మీర్కు సరిహధ్దుకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలోని ఖైరాపూర్ వద్ద చైనా సహకారంతో పాకిస్తాన్ ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి చేసింది. ప్రస్తుతంఈ ఎయిర్ బేస్‌లో చైనాకు చెందిన రక్షణ శాఖ హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఎయిర్‌పోర్టుకు రక్షణగా చైనా సైనికులు పహారా కాస్తున్నట్లు సర్వే ప్రకటించింది. అలాగే గుజరాత్ సరిహద్దుకు దగ్గర్లోని మిథి వద్ద పాకిస్తాన్ మరో ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇదిలా ఉండగా ఈ ఎయిర్‌పోర్టుకు సమీపంలోనే చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ప్రతిపాదిత రహదారి వెళుతోంది. భారీగా బంకర్లు చైనా సహకారంతో పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇప్పటికే 350 బంకర్లను నిర్మించుకున్నట్లు సర్వే తెలుస్తోంది. అంతేకాక రక్షణ కోసం వినియోగించే సొరంగాలను ఏర్పాటు చేసుకుంది. చైనా పరికరాలు సరిహద్దుల్లో పాకిస్తాన్ నిర్మించిన ఎయిర్‌పోర్టుల్లో చైనాకు చెందిన ఆధునిక రాడార్ వ్యవస్థ, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. నిఘా వర్గాలేమంటున్నాయి! పాకిస్తాన్-చైనా మధ్య రక్షణ సహకారం పెరుగుతోందని భారత నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కొన్నాళ్లుగా సరిహద్దుల్లో పాకిస్తాన్ భారీ నిర్మాణాలను చేపడుతున్న విషయం నిజమని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. చైనా చర్యలు ఉపఖండంలో పరిస్థితులను విషమంగా మార్చేలా ఉన్నాయని నిఘావర్గాలు తెలిపాయి. -
దినదిన గండం.. అక్కడ బతకడం
వారికి చెవులకు ప్రార్థనా గీతాలు వినిపించకపోవచ్చు.. కానీ తుపాకీ చప్పుళ్లు వినిపించని రోజుండదు.. దాహార్తికి అలమటించిన క్షణాలు ఉండొచ్చు.. కానీ మోర్టార్ గుళ్ల వర్షం కురవని క్షణాలు ఉండవు. అంతర్జాతీయ సరిహద్ధులోని 42 భారతీయ గ్రామాల్లోని ప్రజలు నిత్యం సమరమే.. ప్రతి క్షణం దినదిన గండమే. ఎప్పుడు తుపాకులు విరుచుకుపడతాయో.. ఏ క్షణంలో పాకిస్తాన్ ముష్కరమూకల మోర్గార్లు పేలుతాయో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు అక్కడి ప్రజలు. ఆర్నియా సెక్టార్.. జమ్మూ కశ్మీర్‌లోని పాక్ సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. ఈ సరిహద్దు వెంబడి 42 గ్రామాల్లో 45 వేల మంది ప్రజలు జీవిస్తున్నారు. మొత్తం 198 కిలోమీటర్ల ఈ సరిహద్దు ప్రజలు నిరంతరం పాక్ సైన్యం జరిపే కాల్పులకు బలి అవుతూనే ఉన్నారు. ఇరు దేశాల మధ్య 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా.. పాకిస్తాన్ మాత్రం దానిని ప్రతి రోజూ ఉల్లంఘిస్తోంది. పాక్ సైన్యం ఎప్పుడు మోర్టార్ కాల్పులకు తెగబడుతుందో.. ఏ అర్దరాత్రి.. ఏకే 47 తుపాకులు గుళ్ల వర్షం కురిపిస్తాయో తెలియక.. ఇళ్లలో కన్నా బంకర్లలోనే ప్రజలు కాలం గడుపుతున్నారు. మోర్టార్ల బీభత్సం కశ్మీర్ సరిహద్దు ప్రజలకు శాంతి అంటే.. మోర్టార్లు, తుపాకులు పేలడం అగడం వరకూ అని మాత్రమే తెలుసు. ఆగిన కొద్ది సేపటిలో పనులు పూర్తి చేసుకుని తిరిగి గుళ్ల వర్షం కురిసే లోపు.. సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలి. సెప్టెంబర్16-17 తేదీల్లో పాకిస్తాన్ సైన్యం ఆర్నియా సెక్టార్లోఅర్దరాత్రి కాల్పులకు తెగబడింది. ఈ సమయంలో సరిహద్దు గ్రామంలోని రత్నాదేవి (50) అనే మహిళకు బుల్లెట్లు తాకి అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై ఆమె భర్త చునాయి లాల్ మాట్లాడుతూ.. పాక్‌సైన్యం రాత్రంతా కాల్పులు జరుపుతూనే ఉందన్నారు. ఇటువంటివి ఇక్కడ ప్రతి రోజూ జరుగుతాయని చెప్పారు. చిన్నారుల పరిస్థితి విషయం సరిహధ్దు గ్రామాల్లోని చిన్నారుల పరిస్థితి మరీ విషయంగా ఉందని గ్రామస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర 16-17 తేదీల్లో పాక్ కాల్పుల్లో ఎనిమిది మంది చిన్నారులు తీవ్రగాయాల పాలయ్యారు. ఇక పాక్‌రేంజర్ల కాల్పుల్లో వందలాది మంది చిన్నారులు కాళ్లు, చేతులు కోల్పోవడం, చూపు దెబ్బతినడం జరిగిందని బాధితులు చెబుతున్నారు. ముఖ్యంగా పాక్‌రేంజర్లు 82, 120 ఎంఎం మోర్టార్లతో జరిపే కాల్పుల్లో ప్రమాదాల తీవ్రత అధికంగా ఉంటోందని వారు స్థానికులు చెబుతున్నారు. భవిష్యత్ అగమ్యగోచరం సరిహద్ధు ప్రాంతాల్లోని చిన్నారుల భవిష్యత్ అగమ్యగోచరమే. ఇక్కడి చిన్నారులు సాధారణ జీవితానికి చాలా దూరం. ఆర్నియా సబ్ సెక్టార్లో మొత్తం 33 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో 1500 మంది చిన్నారులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఈ పాఠశాలలు ఏడాది మొత్తం కొన్ని వారాలు మాత్రమే పనిచేస్తాయని.. స్థానికులు అంటున్నారు. చిన్నారులు స్వేచ్ఛగా తిరగడం, ఆడుకోవడం, చదువుకోవడం ఇక్కడ కుదరదు. బంకర్లే ఆవాసాలు సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు భారత సైన్యం ఏర్పాటు చేసిన బంకర్లే స్థిర నివాసాలుగా మారాయి. ఇక్కడ ఒక్కో బంకర్లో సగటున 7 వేల మంది ఉంటున్నారు. ఈ బంకర్లలోనే ప్రజలు నెలలతరబడి గడిపేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వమే సరిహద్దు గ్రామాల్లోని ప్రతి ఇంటికి ఒక బంకర్‌ను నిర్మించింది. ప్రభుత్వం సుమారు రూ. 5లక్షలతో ఏర్పాటు చేసిన బంకర్ల తరువాత పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చిందని థోరు రామ్ (56) చెబుతున్నారు. మోర్టార్ శబ్దాలు మొదలవగానే.. మేమంతా బంకర్లలోకి వెళ్లిపోతామని ఆయన చెబుతున్నారు. ఇక రాజౌరీ జిల్లాల్లో 621 కమ్యూనిటీ బంకర్లను 8,197 వ్యక్తిగత బంకర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించాయి. -
పాక్‌కు దీటైన జవాబు
భారత్ ఎదురుకాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికుల మృతి ► ఎల్వోసీ వెంట పాక్ ఆర్మీ పోస్టు ధ్వంసం ► పుల్వామాలో ఆర్మీ శిబిరంపై గ్రనేడ్ దాడి.. జవానుకు గాయాలు శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లోని నియం త్రణ రేఖ వెంట కాల్పుల మోత కొన సాగుతోంది. ఎలాంటి కవ్వింపు లేకుండా శని వారం ఉదయం నుంచి పాకిస్తాన్ బలగాలు కొనసాగిస్తున్న కాల్పుల్ని భారత భద్రతా దళాలు దీటుగా తిప్పికొట్టాయి. పాకిస్తాన్ పోస్టులే లక్ష్యంగా శనివారం రాత్రి, ఆదివారం భారత్ జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు పాకిస్తాన్ సైనికులు మరణించగా, మరో ఐదు గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 16 మంది గాయపడ్డారు. పాకి స్తాన్‌లోని పూంచ్ జిల్లా హజీరా సెక్టార్‌లోని సరిహద్దు గ్రామాల్లో ఈ మరణాలు సంభవిం చాయి. టెట్రినోట్ సెక్టార్‌లోని బహైరా, అబ్బాస్‌పూర్‌లోని సత్వాల్, దక్కీ చాఫర్, చత్రీలోని పొలాస్ ప్రాంతాల్లో పాకిస్తాన్‌కు నష్టం వాటిల్లినట్లు భారత ఆర్మీ వర్గాలు అనధికారికంగా పేర్కొన్నాయి. కాల్పుల్లో ఏడుగురు పాకిస్తానీ సైనికులు గాయపడ్డారని, వారిలో ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. భారత్‌లోని చక్కా ద బాగ్, ఖారీ కమారా సెక్టార్లకు ఆవలివైపున పాకిస్తాన్ ‘24 ఫ్రాంటియన్ ఫోర్స్’ యూనిట్‌కు చెందిన సైనికులుగా వీరిని గుర్తించారు. భారత దళాల ఎదురుదాడిలో పాకిస్తాన్ ఆర్మీ పోస్టు పూర్తిగా ధ్వంసమైంది. అంతకుముందు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడంతో భారత్‌కు చెందిన ఆర్మీ జవాన్ మహమ్మద్ షౌకత్, అతని భార్య సఫియా బీ మరణించారు. పూంచ్ జిల్లా కర్మారా గ్రామంలోని వారి ఇంటిపై శనివారం 120 ఎంఎం మోర్టార్ షెల్ పడడంతో ప్రాణాలు కోల్పోయారు. వారి ఇద్దరు కుమార్తెలతో పాటు, మరొకరు గాయపడ్డారు. శనివారం ఉదయం నుంచి పాక్ బలగాలు ఎల్వోసీ వెంట కవ్వింపుకు పాల్పడుతూనే ఉన్నాయి. వరుసగా రెండో రోజూ భారత్‌కు పాక్ నిరసన నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ వరుసగా రెండో రోజూ భారత డిప్యూటీ హై కమిషనర్‌కు పాకిస్తాన్ నిరసన తెలిపింది. ఎలాంటి కవ్వింపు లేకుండా భారత్ జరిపిన కాల్పుల్లో పౌరులు మరణించడంపై భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్‌కు నిరసన తెలిపామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. భారత దళాల కాల్పుల్లో శనివారం ముగ్గురు పౌరులు మరణించారని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరోపించారు. దీంతో మృతిచెందిన పౌరుల సంఖ్య ఐదుకు చేరిందని, వారిలో నలుగురు మహిళలున్నారని ఆయన చెప్పారు. పూంచ్, క్రిష్ణఘట్టి సెక్టార్లలో మొదటగా పాకిస్తాన్ దళాలే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని, వాటిని భారత దళాలు ప్రతిఘటించాయని నిన్నటి సమావేశంలో పాక్‌కు జేపీ సింగ్ స్పష్టం చేశారు. వనీని పాక్ పొగడటంపై భారత్ నిరసన ఉగ్రవాది బుర్హాన్ వనీని పాకిస్తాన్ పొగడటాన్ని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న మద్దతును, ప్రోత్సాహాన్ని అందరూ ఖండించాలని విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే ట్వీట్ చేశారు. వనీని పొగుడుతూ శనివారం పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ ట్వీట్ చేశారు. కాగా జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలో భద్రతాదళాల శిబిరంపై ఉగ్రవాదుల గ్రనేడ్ దాడిలో ఒక సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డాడు. త్రాల్ పట్టణంలోని అరిబల్ వద్ద శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. గాయపడ్డ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వారు వెల్లడించారు. ఈ దాడికి బాధ్యులమని పేర్కొంటూ ఇంతవరకూ ఏ ప్రకటనా వెలువడలేదని చెప్పారు. -
సరిహద్దుల్లో భయం భయం..
• బిక్కుబిక్కుమంటున్న గ్రామస్తులు • పాక్‌నుంచి నిరంతరాయంగా దాడులు • సరిపోని బంకర్లు.. రక్షణ లేని ఇళ్లు సాక్షి నేషనల్ డెస్క్ : భారత సర్జికల్ దాడుల తర్వాత పాక్ చేస్తున్న దాడుల్లో సరిహద్దు ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రాణాలు కోల్పోవటంతోపాటు.. పలు సందర్భాల్లో తీవ్ర గాయాలపాలవుతున్నారు. ఇళ్లలోనుంచి బయటకు రాలేక.. ఇళ్లలోనూ ఉండలేక బిక్కుబిక్కుమంటున్నారు. ఉడీ, పూంచ్, రాజౌరీ, నౌషేరా, ఆర్ఎస్ పుర సెక్టార్లలో పరిస్థితిదారుణంగా ఉంది. ఇప్పటికే చాలా మంది గ్రామస్తులు పాక్ దాడుల్లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో వదిలి వెళ్లలేక చాలా మంది గ్రామాల్లో ఉంటూ నరకం అనుభవిస్తున్నారు. గ్రామస్తులకు రక్షణ కల్పించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కమ్యూనిటీ బంకర్లను నిర్మిస్తున్నాయి. కానీ ఇవి సరిపోవటం లేదు. ‘ఒక్కో గ్రామంలో 400-500 మంది ఉంటారు. ఒక్కో బంకర్ల్లో 25-30 మందే పడతారు మరి మిగిలినవారి సంగతేంటి?’ అని అశోక్ అనే గ్రామస్తుడుప్రశ్నించాడు. చాలా మంది ఇళ్లలోనే ఉంటూ మోర్టార్ల దాడిలో గాయపడుతున్నారు. మిగిలిన వాళ్లు తట్టా, బుట్టా సర్దుకుని గొడ్డు, గోదాతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. దీంతో చాలా ఊళ్లు ఖాళీ అయ్యాయి. రమేశ్ లాల్ (45) అనేవ్యక్తి పాక్ దాడుల్లో తన సోదరుణ్ని కోల్పోయాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ తండ్రికి చికిత్స చేయిస్తే.. రూ. 3 లక్షలు ఖర్చయింది. కానీ ప్రభుత్వం తీవ్రంగా గాయపడిన వారికి రూ.75వేలు మాత్రమే ఇచ్చింది. సరిహద్దుల్లో బతకటమే కష్టమనుకునే పరిస్థితుల్లో ఇంత మొత్తాన్ని ఎలా భరించాలనేది రమేశ్ ఆవేదన. దీపావళి అంటే తెలీదు‘: దేశమంతా దీపావళి జరుపుకుంటోంది. కానీ సరిహద్దుల్లోగస్తీ సైనికులకు పండగ లేదం’టూ లతామంగేష్కర్ పాడిన గీతం చాలా ఫేమస్. కానీ సైనికులకే కాదు. వారి బూట్ల చప్పుళ్లతో అప్రమత్తంగా ఉండే సరిహద్దు గ్రామాలకూ దీపావళి లేదు. టపాసులు పేలిస్తే.. ఆ వెలుతురు ఆధారంగా పాక్ దాడులు చేస్తుందని.. దశాబ్దాలుగా వీళ్లు పండగ జరుపుకోలేదు. అలాంటిది ఇప్పుడు, రేయింబవళ్లు. గ్రామాల్లో కాల్పుల మోత మోగుతోందని గ్రామస్తులు అంటున్నారు. -
చరిత్రకు చిహ్నాలు బంకర్లు