burning effigy
-
ఉపాధి కూలీలు సోమరిపోతులా?
► ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అనుచిత వ్యాఖ్యలపై మండిపాటు రాస్తారోకో, ధర్నా, ► దిష్టిబొమ్మ దహనం ఎమ్మెల్యే క్షమాపణ ► చెప్పాలని డిమాండ్ దేవరాపల్లి: గ్రామీణ పేదలు సోమరిపోతులు అంటూ ఉపాధి కూలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజే పీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తీరుపై వ్యవసాయ కార్మిక సంఘం మండిపడింది. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా మండల కేంద్రం దేవరాపల్లిలో బుధవారం ధర్నాతో పాటు రాస్తా రోకో నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో విష్ణుకుమార్‌రాజు దిష్టిబొమ్మ దహనం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్.రాజు మాట్లాడుతూ గ్రామీణ పేదలు, ఉపాధి కూలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే తక్షణమే వారికి క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ ఉపాధి చట్టం వల్ల సోమరిపోతులుగా మారుతున్నారని.. అనేక పనులకు ఆటంకం కల్గుతోందని.. సంక్షేమ పథకాలు, కిలో రూపాయి బియ్యం సరఫరా చేయడం వల్ల బద్ధకస్తులుగా మారి.. పనికిమాలిన వారుగా తయారవుతున్నారని అనుచిత వ్యాఖ్యాలు చేశారన్నారు. విశాఖ జిల్లాలో సుమారు 1.50 లక్షలు కుటుంబాలు ఉపాధి పనులు చేసుకుంటున్నారని తెలిపారు. పేదల కష్టంపై జాలి, దయా లేకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. ఉపాధి చట్టం నిలుపుదల చేయాలని డిమాండ్ చేయడంతో పేదలపై బీజే పీకి ఎంత చులకన భావం ఉందో అర్ధమవుతోందన్నారు. ఈ నిరసనలో వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు కర్రి సన్యాశినాయుడు, కె.బుచ్చిబాబు, ఈగల నాయుడు, ఈ.రవి, ఎస్.భారతి తదితరులు పాల్గొన్నారు. -
షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి
► అఖిలపక్ష రైతు సంఘాల నాయకుల డిమాండ్ ► నంద్యాల-నూనెపల్లి ప్రధాన రోడ్డులో చైర్మన్ దిష్టిబొమ్మ దహనం నంద్యాల రూరల్: బకాయిలు చెల్లించకుండా రైతులను బెదిరించిన షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ మధుసూదన్గుప్తను వెంటనే అరెస్ట్ చేయాలని అఖిల పక్ష రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాల టెక్కె మార్కెట్ యార్డు ఆవరణలో భారతీయ కిసాన్‌సంఘ్ ఆధ్వర్యంలో చెరుకు రైతుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అతిథిగా జాతీయ రైతు సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ రైతులు పొలాలు, షేరుధనం పోగొట్టుకొని చెరుకు ఫ్యాక్టరీ నిర్మిస్తే ప్రభుత్వం కారుచౌకగా ప్రైవేటు యాజమాన్యానికి విక్రయించడం బాధాకరమన్నారు. ప్రభుత్వంతో షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ కుమ్మక్కై నంద్యాల చెరుకు రైతులను చంపుతానని బెదిరించారని, జిల్లా కలెక్టర్, ఎస్పీలు వెంటనే జోక్యం చేసుకుని అతడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భారతీయకిసాన్సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు వంగాల సిద్ధారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టి బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అఖిల పక్ష రైతు సంఘాల నాయకులు, చెరుకు రైతులు షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ మధుసూదన్‌గుప్త దిష్టిబొమ్మను ఊరేగింపుగా తీసుకొనివచ్చి నంద్యాల-నూనెపల్లె ప్రధాన రహదారిపై దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ సిద్ధం శివరాం, నంది రైతు సమాఖ్య అధ్యక్షులు ఎంవీ కృష్ణారెడ్డి, ఎర్రబోలు ఉమామహేశ్వరరెడ్డి, ఏపీ రైతు సంఘం డివిజన్ కార్యదర్శి పుల్లా నరసింహ, టీడీపీ జిల్లా నాయకుడు జిల్లెల్ల శ్రీరాములు, బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జి మేడా మురళీ, షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘాల ఐక్య కన్వీనర్ నాగేశ్వరరావు, భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు మహేశ్వరరెడ్డి, బంగారురెడ్డి పాల్గొన్నారు. -
రాజస్థాన్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం
శివమొగ్గ: ఉన్నత పాఠశాలల నూతన పాఠ్యంశాల్లో రాజస్థాన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, స్వాతంత్య్రం పోరాటంలో పాల్గొన్న ఇతర కాంగ్రెస్ నాయకుల గురించి పాఠ్యాంశాల్లో భోధించడం విస్మరించిందని ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఆరోపించారు. బుధవారం నగరంలోని మహవీర సర్కిల్లో ఎన్ఎస్యూఐ కార్యకర్తలు రాజస్థాన్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. -
కార్పొరేట్ విద్యాసంస్థల దిష్టిబొమ్మ దహనం
రాజంపేట్(వైఎస్సార్): కార్పొరేట్ విద్యాసంస్థలకు వ్యతిరేకంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం రాజంపేట పట్టణంలోదిష్టిబొమ్మ దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలతో కుమ్మక్కు కాకుండా విద్యార్థినీల ఆత్మహత్యకు కారణమైన కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.