Bus passes
-
అస్తవ్యస్తం.. ఆర్టీసీ ప్రయాణం
సాక్షి, గోదావరిఖనిటౌన్(రామగుండం)/ మంథని : ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రయాణికుల పాలిట దినదిన గండంగా మారింది. పండక్కి వచ్చినవారు.. విద్యార్థులు బస్సులో ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు ముందస్తుగా బస్సు టికెట్లు రిజర్వేషన్ చేయించుకున్నప్పటికీ సమ్మె కారణంగా అధికారులు వారి సొమ్మును తిరిగిచ్చేశారు. దీంతో చాలా మంది సెలవుల అనంతరం దూర ప్రాంతాలకు వెళ్లేవారు ప్రయివేటు వాహనాలను ఆశ్రయించి జేబులు గుళ్ల చేసుకుంటున్నారు. గోదావరిఖని నుంచి చాలా మంది హైదరాబాద్, బెంగళూరు.. తదితర దూరప్రాంతాల్లో స్థిరపడినవారున్నారు. పండక్కి వచ్చినవారు పెద్దమొత్తంలో వెచ్చించి తిరుగుపయనమవుతున్నారు. గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే రూ.250 ఉండగా.. ఇప్పుడు రూ.400 వసూలు చేస్తున్నట్లు వాపోతున్నారు. మరికొందరు ప్రయివేటు ఆపరేటర్లు రూ.600 సైతం తీసుకుంటున్నారని చెబుతున్నారు. బస్సుపాసుల పరిస్థితి మరీ దారుణం విద్యార్థులు, ఉద్యోగులు, వికలాంగుల పాసులు పనిచేయకపోవడంతో జిల్లావ్యాప్తంగా దాదాపు 1600మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండువేల మంది రెన్యువల్ చేసుకోవాల్సినవారున్నారు. ఈ నెల 13న విద్యాసంస్థలకు సెలవులు ముగుస్తుండడంతో పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం బస్‌పాసులను అంగీకరించాలని ఆర్టీసీకి సూచించినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇక రాయితీ టిక్కెట్, క్యాట్‌కార్డు, వనితకార్డు, ఫ్రీకార్డులను సైతం అంగీకరించడం లేదు. పల్లెకు వెళ్లని బస్సు.. దసరా పండుగకు సొంతూర్లకు వచ్చిన వారంతా తిరుగు పయణమవుతున్నారు. దీంతో మంథని బస్టాండ్‌లో రద్దీ పెరిగింది. డిపో నుంచి గురువారం 38 ఆర్టీసీ, 12 అద్దెబస్సులు నడిపించారు. అయితే హైదరాబాద్, కరీంనగర్, గోదావరిఖని, భూపాలపల్లి రూట్లలోనే నడిపించారు. దీంతో పల్లెలకు వెళ్లాల్సినవారు.. అక్కడి నుంచి రావాల్సినవారు ఇబ్బంది పడ్డారు. అధికచార్జీలు వసూలు చేయకుండా డిపోపరిధిలోని బస్సులకు చార్జివివరాల షీట్లను అతికించారు. ఫిర్యాదులుంటే డిపో మేనేజర్ 9959225923, కంట్రోల్ రూం 8728297555 కుసంప్రదించాలని సూచించారు. -
ఇక ఈజీ!
అమరచింత: జిల్లాలోని దివ్యాంగుల కోసం ఆర్టీసీ అధికారులు బస్ పాస్‌లు ఇచ్చేందుకు సరికొత్త ప్రణాళిక రూపొందించారు. వైకల్యం కలిగిన ప్రతిఒక్కరికీ 50శాతం రాయితీతో కూడిన బస్ పాస్‌లను నేరుగా వారికే అందించాలని భావిస్తున్నారు. ఇందుకోసం జిల్లాలోని అన్ని గ్రామాలు, మండల మహిళా సమాఖ్య కార్యాలయాల్లో ఏపీఎంల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. వారి నుంచి ఆధార్ జిరాక్స్ కాపీ, సదరం సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోతో పాటు రూ.30 ఫీజును తీసుకుని దరఖాస్తు చేసుకున్నవారికి 24 గంటల వ్యవధిలోనే పాస్ అందజేస్తున్నారు. దివ్యాంగుల కష్టాలకు చెల్లు ! జిల్లాలో మొత్తం 15,847 మంది దివ్యాంగుల్లో ఆర్థోపెడిక్ లోపం కలిగిన వారు 9,904 మంది, చూపు లేనివారు 2,059, చెవిటివారు 1,151, మానసిక వ్యాధిగ్రస్తులు 1414, ఇతర దివ్యాంగులు 1,271 మంది ఉన్నారు. డీఆర్డీఏ ద్వారా 11,053 మంది దివ్యాంగులు ఆసరా పింఛన్లు పొందుతున్నారు. వీరందరికీ తప్పనిసరిగా ప్రభుత్వపరంగా ఆర్టీసీ రాయితీ బస్సు పాసులు ఇవ్వాలని భావిస్తున్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఆర్టీసీ బస్ పాస్‌లను పొందాలంటే నరకయాతన అనుభవించేవారు. ప్రతినెలా 27, 28 తేదీల్లోనే సాధారణ బస్ పాస్‌లతో పాటు దివ్యాంగులకు సైతం పాసులు ఇచ్చేవారు. దీంతో దివ్యాంగులు ఆయా డిపోల వద్ద గంటల తరబడి వేచి ఉండేవారు. ఇక వాటిని పొందాలంటేకష్టసాధ్యమని తెలుసుకున్న దివ్యాంగులు వాటిని తీసుకునేందుకు చాలామంది ఆసక్తిచూపేవారు కాదు. ఈ క్రమంలో ఇప్పటివరకు కేవలం 3500 మంది దివ్యాంగులు మాత్రమే ఆర్టీసీ రాయితీ పాసులు పొందుతున్నారు. ప్రతి ఒక్కరికీ బస్‌పాస్ అందించాలి 40శాతం వైకల్యం ఉన్నవారికి మాత్రమే రాయితీ బస్ పాస్‌లు ఇస్తున్నారు. 40 కంటే తక్కువ శాతం ఉన్నవారికి కనీసం ఇవ్వాలి. దివ్యాంగులను ప్రభుత్వమే ఆదుకోవాలి. – కుర్మన్న, మస్తీపురం ఇన్నాళ్లూ ఇబ్బందిపడ్డారు.. గతంలో దివ్యాంగుల ఆర్టీసీ రాయితీ బస్ పాస్‌లను పొందడానికి ఇబ్బందులు పడేవారు. నెలలో రెండు రోజులు మాత్రమే సాధారణ బస్ పాస్‌లతో పాటు దివ్యాంగులకు సైతం ఇస్తుండటంతో గంటల తరబడి వేచిచూస్తూ బాధపడేవాళ్లం. ఆర్టీసీ అధికారులు తీసుకున్న నిర్ణయంతో ప్రతిఒక్కరూ పొందుతున్నారు. – మాకం శ్రీనివాసులు, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, తిప్పుడంపల్లి -
మెట్రో బస్సుల్లో వికలాంగులకు పాసులివ్వాలి
సుందరయ్య విజ్ఞానకేంద్రం: హైటెక్, మెట్రో బస్సుల్లో వికలాంగులకు బస్ పాసులను అనమతించాలని కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. బోర్డు సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో సమితి అధ్యక్షుడు గోరెంకల నర్సింహ, కార్యదర్శి ఎం. అడివయ్య, నాయకులు వెంకటేష్, వెంకట్, చంద్రమోహన్, నాగలక్ష్మి తదితరులు ఉన్నారు. -
‘బస్‌పాస్’ల సొమ్ము గోల్మాల్!
ప్రై వేటు ఏజెన్సీ సిబ్బంది చేతివాటం గుట్టుగా కొనసాగుతున్న విచారణ చిలకలూరిపేట టౌన్ : ఆర్టీసీ బస్‌పాస్‌ల జారీ విషయంలో ప్రై వేటు ఏజెన్సీ సిబ్బంది లక్షల రూపాయలు స్వాహా చేసిన సంఘటన వెలుగుచూసింది. ఆర్టీసీ అధికారుల కన్నుగప్పి కొంతకాలంగా బస్‌పాస్‌ల జారీకి వసూలు చేసిన డబ్బులు ప్రై వేటు ఏజెన్సీ సిబ్బంది కాజేసినట్లు సమాచారం. సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డుపెట్టుకొని జరిగిన ఈ వ్యవహారం చివరకు ఆర్టీసీ హెడ్ ఆఫీస్‌లోని ఐటీ విభాగం అధికారులు గుర్తించేవరకు గుంటూరు రిజియన్ పరిధిలో యథేచ్ఛగా కొనసాగింది. గత ఏడాది జూన్ ముందు వరకు ఆర్టీసీ నెలవారీ పాసులు, స్టూడెంట్ పాసులు, క్యాట్ కార్డులు వంటివి ఆర్టీసీ సిబ్బందే స్వయంగా జారీచేసేవారు. ఆ తర్వాత నుంచి ఈ పాసులు జారీ చేసే విధానాన్ని ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. సంబంధిత ఏజెన్సీ నియమించిన సిబ్బంది అప్పటి నుంచి పాసులను జారీ చేస్తోంది. ఈ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకొని సిబ్బంది హస్తలాఘవం చూపారు. ఉదాహరణకు చిలకలూరిపేట– గుంటూరు నెల పాస్ రూ.1780 ఉంటే ఈ పాస్ కోసం ఎవరైనా వచ్చినప్పుడు ఆన్లైన్లో బుక్ చేస్తారు. ఆ తరువాత దానిని క్యాన్సిల్ చేస్తారు. చివరకు ఏదో ఒక విద్యార్థికి సుమారు రూ.100తో ఒక పాస్ బుక్ చేసి, ఇంతకు ముందు క్యాన్సిల్ చేసిన నంబరుతో మామూలు సీజన్ పాస్‌కు సంబంధించిన మొత్తాన్ని ప్రింట్ చేసి ఇస్తారు. అప్పుడు రూ.1780లో రూ.100 పోగా మిగిలిన రూ.1680 సిబ్బంది జేబులోకి వెళ్తాయి. ఇలా ఒక్క చిలకలూరిపేట బస్ స్టేషన్ పరిధిలోనే రూ.2.25 లక్షలు కొట్టేసినట్లు తెలుస్తోంది. చిలకలూరిపేటతో పాటు గుంటూరు రిజియన్ పరిధిలోని తెనాలి, నరసరావుపేట, మంగళగిరి, సత్తెనపల్లి బస్స్టేషన్ల పరిధిలోనూ ఈ వ్యవహారం కొనసాగించి ఆర్టీసీ సొమ్ము స్వాహా చేసినట్లు సమాచారం. చివరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు మోసాన్ని గుర్తించి స్థానిక అధికారులకు సమాచారం తెలియజేయటంతో విషయం బయటకు పొక్కింది. దీంతో జిల్లా వ్యవహారాలు పర్యవేక్షించే ఏజెన్సీ ప్రతినిధి ఒకరు చిలకలూరిపేట పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో మరో కొత్త విషయం వెలుగుచూసినట్లు సమాచారం. ఎవరైతే ఏజెన్సీ తరఫున జిల్లాలోని ఆర్టీసీ బస్స్టేషన్లలో పాసుల జారీ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారో అతని సహకారంతోనే ఈ స్వాహాపర్వం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేయించకుండా ఎవరైతే అవకతవకలకు పాల్పడ్డారో ఆ సిబ్బంది నుంచి డబ్బు రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై ‘సాక్షి’ చిలకలూరిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ జి.వెంకటేశ్వర్లును వివరణ కోరగా సొమ్ము చెల్లించే పూర్తి బాధ్యత కృష్ణ ఇన్ఫోటెక్ ఏజెన్సీ వారిదేనని తెలిపారు. సిబ్బంది అవకతవకలకు పాల్పడిన విషయం ఏజెన్సీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. పాసుల జారీ విషయంలో రూ.2.25 లక్షలు తగ్గినట్లు గుర్తించామని తెలిపారు. ఫిర్యాదు అందింది.. ఇదే విషయంపై చిలకలూరిపేట పట్టణ ఎస్ఐ పి.కోటేశ్వరరావును వివరణ కోరగా ఏజెన్సీ తరఫున జిల్లా ఇన్చార్జి సంగమేశ్వరరావు డబ్బు గోల్మాల్ అంశంలో ఇద్దరిపై ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు విచారణ దశలో ఉందన్నారు. విచారణ చేసి కేసు నమోదు చేస్తామన్నారు. -
ఆన్లైన్లో బస్‌పాసులు
శ్రీకాకుళం అర్బన్ : విద్యార్థులు బస్సు పాసులను ఆన్లైన్లో పొందాలని ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కుప్పిలి శ్రీనివాసరావు చెప్పారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ డీసీటీఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఆర్టీసీలో సమయపాలన, ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బస్ పాసులు ఆన్లైన్ విధానంలో అందజేయడం మొదటిసారన్నారు. ఉత్తరాంధ్రలో నెక్ రీజియన్‌లో దీన్ని ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఈ విధానం వల్ల పాసు కోసం క్యూలైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేదని చెప్పారు. డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.ఏపీఎస్ ఆర్టీసీ పాస్. ఇన్ వెబ్సైట్లో వివరాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. బస్‌పాస్‌లు పొందిన విద్యార్థులు రెన్యువల్ కోసం సంస్థ నుంచి ఒక మెసేజ్ వస్తుందని, దీని ప్రకారం పాస్‌లు అప్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఎంఎస్టీ, పీహెచ్. క్యాట్, నవ్య, వనిత కార్డులను కూడా ఆన్లైన్లో పొందవచ్చన్నారు. పుష్కరాలకు ప్రత్యేక బస్సులు వచ్చేనెల 14వ నుంచి 25వ తేదీ వరకూ జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 115 బస్సులను నడపనున్నామన్నారు. ముఖ్యంగా 18, 19, 20 తేదీలలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్సుల సంఖ్యను పెంచే అవకాశం ఉందన్నారు. వీటికి సంబందించి ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంటుందన్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్లు బస్సులను నడుపుతామన్నారు. అలాగే విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో ప్రత్యేక బస్సులను నడుపుతామన్నారు. సమావేశంలో ఆర్టీసీ ఒకటి, రెండు డిపోల మేనేజర్లు డి.ఢిల్లేశ్వరరావు, నంబాళ్ల అరుణకుమారి, బస్ స్టేషన్ మాస్టర్ బీఎల్పీ రావు, ఓపీఆర్ఎస్ ప్రతినిధి ఎం.డి.బాషా పాల్గొన్నారు. -
విద్యార్థులకు ఆర్టీసీ వరాలు
రాయితీతో బస్‌పాస్‌లు జారీ చేస్తున్న అధికారులు నిజామాబాద్ నాగారం: పాఠశాలలు, కళాశాలలు పున:ప్రారంభమయ్యాయి.. విద్యార్థులంతా బడిబట పట్టారు.. తమ గ్రామం నుంచి ఇతర ప్రాంతానికి వెళ్లి చదువుకునే వి ద్యార్థులకు ప్రయాణం భారంగా మారకుండా వారికి అవసరమైన బస్సుపాస్‌లు జారీ చేసేందుకు ఆర్టీసీ రం గం సిద్ధం చేసింది. జిల్లాలోని అన్ని ప్రధాన బస్టాండ్‌లో బస్సు పాస్‌లు ఇస్తున్నారు. నిజామాబాద్-1, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, డిపోలతోపాటు, ప్రధాన బస్టాండ్‌లో సైతం ఈ బస్సు పాస్‌లు జారీ చేస్తున్నారు. రూ.20తో బస్‌పాస్‌లు.. 12 ఏళ్లలోపు లేదా 7వ తరగతి వరకు చదివే విద్యార్థులు(బాలురు) వారి గ్రామం నుంచి పాఠశాల వరకు 20కిలో మీటర్లలోపు ఉంటే బస్ పాస్‌లు జారీ చేస్తారు. 12 జూన్ నుంచి ఏప్రిల్ 24, 2015 వరకు ఈ పాస్ చెల్లుబాటు అవుతుంది. దీనికోసం విద్యార్థులు రూ.20 చెల్లిస్తే సరిపోతుంది. 18 ఏళ్లలోపు లేదా పదో తరగతి చదివే విద్యార్థినులకు(బాలికలు) వారి గ్రామం నుంచి పాఠశాల వరకు 20కిలోమీటర్లలోపు బస్ పాస్‌లు జారీ చేస్తారు. 12 జూన్ 2014 నుంచి ఏప్రిల్ 24 2015 వరకు ఈ పాస్ చెల్లుబాటు అవుతుంది. ఈ ఉచిత బస్‌పాస్‌లు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మా త్రమే జారీ చేస్తారు. కావాల్సిన పత్రాలు.. విద్యార్థులు ప్రభుత్వపరంగా గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు సంబంధించిన ధ్రవీకరణ పత్రాలను సంబంధిత ప్రధానోపాధ్యయుడు, ప్రిన్సిపల్‌తో ధ్రువీకరించి దరఖాస్తులు సమర్పించాలి. * విద్యార్థి ప్రవేశ నంబరు, పేరు, బ్రాంచ్, చదువుతున్న తరగతి వంటి వివరాలు పొందుపర్చాలి. * రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో ఎవరికి అవసరమైతే వారే స్వయంగా బస్‌పాస్ కేంద్రానికి రావాలి. * జిల్లాలో ఏ డిపో పరిధిలోని విద్యార్థులకు ఆ డిపో పరిధిలోనే పాస్‌లు జారీ చేస్తారు. కళాశాలలకు నేరు గా వచ్చి ఆర్టీసీ అధికారులే బస్సుపాస్‌లు అందిస్తున్నారు. * ఆదివారం, సెలవురోజుల్లో బస్‌పాస్‌లు జారీ చేయరు. రాయితీ బస్‌పాస్‌ల ధరలు.. ఈ పాస్ పొందాలంటే 35 కిలోమీటర్లలోపు విద్యా సంస్థ ఉండాలి. ఇందుకోసం ధ్రువీకరణ పత్రాలతోపాటు, బస్‌పాస్ ఫారం కోసం రూ.15 చెల్లించాలి. వీటిని ప్రతినెల పునరుద్ధరణ చేయించుకోవాలి. అలాగే దీంతోపాటు 3 నెలల రాయితీ పాస్‌లు ఒకేసారి తీసుకుని 3 నెలలు రాయితీపై ప్రయాణించవచ్చు. వాటి వివరాలు...