cabinet bearth
-
ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా కొమ్మినేని శ్రీనివాసరావు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ హోదాతో నియమిస్తూ ప్రభుత్వం గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా కొమ్మినేని రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. జర్నలిజంలో దిట్ట కొమ్మినేని కృష్ణా జిల్లా గన్నవరంలో పుట్టి పెరిగిన కొమ్మినేని శ్రీనివాసరావు 1978లో జర్నలిజంలో ప్రవేశించారు. పాత్రికేయ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు వివిధ పత్రికల్లో వివిధ హోదాల్లో పని చేశారు. 1978లో ఈనాడు పత్రికలో చేరిన కొమ్మినేని శ్రీనివాసరావు.. విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, న్యూఢిల్లీలో రిపోర్టింగ్ బాధ్యతలు నిర్వహించారు. 2002 ఆగస్టు నుంచి ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్‌గా పని చేశారు. 2007 జనవరి నుంచి NTVలో చీఫ్ ఎడిటర్‌గా, 2007 సెప్టెంబర్ నుంచి TV5లో ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. గత కొన్నాళ్లుగా సాక్షి టీవీలో కేఎస్ఆర్ లైవ్ షో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రచనలో మేటి రాష్ట్రంలో రాజకీయం పేరిట కొన్నాళ్లు పొలిటికల్ కాలమ్ రాసిన కొమ్మినేని శ్రీనివాసరావు.. నిఖార్సయిన ఆర్టికల్స్ రాయడంలో దిట్ట. తాజాకలం పేరుతో చాలా కాలం పాటు రాజకీయ వ్యాసాలు రాశారు. పాత్రికేయ పర్యటనలు పాత్రికేయుడిగా వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న కొమ్మినేని శ్రీనివాసరావు.. ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఆయన వెంట నెదర్లాండ్స్ వెళ్లి వచ్చారు. అలాగే అమెరికా, బ్రిటన్, చైనా, సింగపూర్ తదితర దేశాల్లో వేర్వేరు సందర్భాల్లో పర్యటించారు. విదేశీ పర్యటనలకు సంబంధించి ఆంధ్రా టు అమెరికా పుస్తకాన్ని రూపొందించారు. పరిశోధనే జీవితం తెలుగు రాజకీయాలపై కొమ్మినేని శ్రీనివాసరావు విస్తృతమైన పరిశోధన చేశారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో అసెంబ్లీలో జరిగిన ప్రొసీడింగ్స్‌పై కొమ్మినేని శ్రీనివాసరావు "ప్రాంతీయ ఉద్యమాలు-పదవీ రాజకీయాలు" పుస్తకాన్ని రాశారు. అలాగే రాష్ట్ర విభజన తర్వాత "తెలంగాణ ఆవిర్భావం- పాత్రధారులు, సూత్రధారులు" పుస్తకాన్ని రచించారు. కొమ్మినేని కలం "ప్రజా తీర్పు" పేరిట ఆయన రచించిన పుస్తకాలు ఎన్నో కీలకమైన అంశాలను తెరమీదికి తెచ్చాయి. విభజన అనంతరం "ఆంధ్రప్రదేశ్ ప్రజాతీర్పు", "తెలంగాణ ప్రజాతీర్పు" పేరుతో మరింత సమాచారాన్ని జోడించారు. 2002 నుంచి ప్రతీ ఎన్నికల తర్వాత వివిధ అంశాలతో పుస్తకాన్ని తెస్తున్నారు కొమ్మినేని శ్రీనివాసరావు. అలాగే 2019 ఎన్నికల తర్వాత "శాసన సభ్యులు - సామాజిక విశ్లేషణ" పుస్తకాన్ని రచించారు. తెలుగు రాజకీయాలపై కొమ్మినేనికి ఉన్నంత సాధికారిక పట్టు అద్భుతమైనది. నాలుగు దశాబ్దాల రాజకీయ నాయకులందరూ గుర్తు పట్టగలిగి పలకరించే అతికొద్ది మంది జర్నలిస్టుల్లో కొమ్మినేని ఒకరు. స్ట్రెయిట్ ఫార్వర్డ్ ముక్కుసూటిగా వ్యవహరించడం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, నిజాయతీగా వ్యవహరించడం కొమ్మినేని శ్రీనివాసరావు అనుసరించిన విధానం. నిబద్దత గల పాత్రికేయుడిగా ఎన్నో గుర్తింపులు పొందిన కొమ్మినేని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్ ఆకాడమీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. -
సీఎం జగన్ ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నా:బాలినేని
-
వైఎస్ఆర్ కుటుంబానికి నేను ఎప్పుడూ విధేయుడినే..
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమావేశం ముగిసింది. అనంతరం తనకు కేబినెట్లో చోటు దక్కకపోవడంపై బాలినేని శ్రీనివాస్ స్పందించారు. బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ కుటుంబానికి తాను ఎప్పుడూ విధేయుడినేనని స్పష్టం చేశారు. తాను రాజీనామా చేస్తున్నాననే వార్తలను ఖండించారు. పదవి కోసం ఎప్పుడూ పాకులాడలేదని.. పార్టీ కోసమే పని చేశానని అన్నారు. సీఎం జగన్ ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నానని వెల్లడించారు. పార్టీ ఒక కుటుంబం.. అందరూ కలిసి మెలిసి ఉండాలన్నదే తన ఉద్దేశ్యమన్నారు. పార్టీకి గతంలో కంటే ఎక్కువ సీట్లు వచ్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. సామర్థ్యం ఉన్న వారినే సీఎం జగన్ కేబినెట్లోకి తీసుకున్నారు. ఆదిమూలపు సురేష్‌తో తనకు ఎలాంటి విబేధాలు లేవని ఈ సందర్బంగా క్లారిటీ ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 70 శాతం మంత్రి పదవులు ఇచ్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీనే అని బాలినేని ప్రశంసించారు. అందరికీ పదవులు ఒకేసారి రావు అని అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు. -
అమెరికా విదేశాంగమంత్రిగా బ్లింకెన్!
వాషింగ్టన్: యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్(విదేశాంగ మంత్రిగా) ఆంటోనీ బ్లింకెన్‌ను జోబైడెన్ ఎంచుకోబోతున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. చాలా కాలంగా బైడెన్‌కు బ్లింకెన్ విదేశీ వ్యవహారాల్లో సలహాదారుగా ఉన్నారు. జాతీయ సెక్యూరిటీ సలహాదారుగా జేక్ సల్లివాన్ను బైడెన్ నియమించవచ్చని అంచనా. మంగళవారం బైడెన్ తన కేబినెట్ నియామకాలను వెల్లడించనున్నారు. ఒబామా రెండోమారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బ్లింకెన్ డిప్యుటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా వ్యవహరించారు. బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా పనిచేశారు. ఆదినుంచి బ్లింకెన్ భారత్‌కు గట్టి మద్దతుదారుగా ఉన్నారు. బ్లింకెన్‌ను బైడెన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా నియమించే యోచనలో ఉన్నారని వాల్‌స్ట్రీట్ జర్నల్, వాషింగ్టన్పోస్ట్, ద డైలీ కథనాలు వెలువరించాయి. మంగళవారం ఈ ప్రకటన అధికారికంగా వెలువడవచ్చన్నాయి. ఈ ఏడాది భారత స్వాతంత్య్ర సంబరాల సమయంలో బైడెన్ బృందం ఏర్పాటు చేసిన ఆన్లైన్ సదస్సులో బ్లింకెన్ భారత్ పక్షాన మాట్లాడారు. ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలను బైడెన్ కోరుతున్నారన్నారు. భారత్‌పై అణుపరీక్షల సమయంలో విధించిన ఆంక్షల తొలగింపులో బైడెన్ చేసిన కృషిని గుర్తు చేశారు. అదేవిధంగా ఇరుదేశాల మధ్య సివిల్న్యూక్లియర్ డీల్ కుదరడంలో కూడా బైడెన్ కీలక పాత్ర పోషించారన్నారు. మరోవైపు ఐరాసలో లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్‌ను నియమించాలని బైడెన్ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బాధ్యతల బరువు ట్రంప్ హయంలో పలు దేశాలతో యూఎస్ ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో తిరిగి ఆయాదేశాలతో సంబంధాలను గాడిన పెట్టాల్సిన పెద్ద బాధ్యత బ్లింకెన్‌పై ఉండనుంది. అలాగే డబ్లు్యహెచ్‌ఓ, పారిస్ ఒప్పందం, ఇరాన్ ఒప్పందం నుంచి ఏకపక్షంగా అమెరికా వైదొలగడం పలు దేశాలకు విముఖత కలిగించింది. ఈ పరిస్థితులను బ్లింకెన్ చక్కదిద్దాల్సిఉంటుంది. ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా.. ఇతర దేశాలను సహాయ సహకారాలందించడం ద్వారా అమెరికావైపు ఆకర్షిస్తామని బ్లింకెన్ గతంలో చెప్పారు. బైడెన్ బలహీనుడు: చైనా బీజింగ్: జో బైడెన్ అమెరికా అధ్యక్షుడయితే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయన్న భ్రమల నుంచి చైనా బయటకు రావాలని చైనా ప్రభుత్వ సలహాదారు ఒకరు పేర్కొన్నారు. అమెరికా తీసుకునే మరింత కఠిన వైఖరికి సిద్ధం కావాలని చైనా ప్రభుత్వాన్ని కోరారు. షెన్జెన్లోని అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ అండ్ కాంటెంపరరీ చైనా స్టడీస్‌కు డీన్‌గా ఉన్న ఝెంగ్ యొంగ్నియన్ ఇటీవల సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు పేర్కొన్నారు. బైడెన్ చాలా బలహీన అధ్యక్షుడు. అమెరికా సమాజంలో చైనా పట్ల ఉన్న వ్యతిరేకతను అవకాశంగా తీసుకుని, యుద్ధానికీ దిగుతారు’అని ఝెంగ్ విశ్లేషించారు. -
బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ‘ఇన్ఫోసిస్’ మూర్తి అల్లుడు
లండన్: ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి అల్లుడు, భారత సంతతి బ్రిటిష్ ఎంపీ రిషి సునక్(39) భారీ ప్రమోషన్ కొట్టేశారు. బ్రిటన్ కేబినెట్లో చోటుచేసుకున్న భారీ మార్పుల్లో భాగంగా ప్రధాని తర్వాత రెండో స్థానంగా భావించే ఆర్థిక మంత్రి పోస్టు ఆయనకు దక్కింది. ప్రధాని జాన్సన్ చీఫ్ స్పెషల్ అడ్వైజర్ డొమినిక్ కమ్మింగ్స్‌తో తలెత్తిన విభేదాల కారణంగా ఆర్థిక మంత్రి, పాక్ సంతతికి చెందిన సాజిద్ జావిద్ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఆ తర్వాతి పోస్టు, ఆర్థిక శాఖ చీఫ్ సెక్రటరీగా ఉన్న రిషి ఆ బాధ్యతల కోసం ప్రధాని ఎంపిక చేశారు. తాజా పరిణామంతో భారత సంతతికి చెందిన హోంమంత్రి ప్రీతీ పటేల్, రిషి సునక్ కీలక బాధ్యతల్లో ఉన్నట్లయింది. వీరితోపాటు ఆగ్రాలో జన్మించిన అలోక్ శర్మ(52)కు వాణిజ్యం, ఇంధన, పరిశ్రమల విధానం శాఖ మంత్రి, సుయెల్లా బ్రావర్‌మాన్(39)ను అటార్నీ జనరల్‌గా బాధ్యతలు అప్పగించారు. ఎక్కువ మంది భారతీయులు కీలకపోస్టుల్లో ఉన్న ఈ మంత్రివర్గాన్ని ‘దేశి కేబినెట్ ఇన్ యూకే హిస్టరీ’గా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఆర్థిక మంత్రిగా తనపై చాలా బాధ్యతలు ఉన్నాయని రిషి అన్నారు. వచ్చే నెలలో పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్‌ను రూపొందించాల్సి ఉంది. రిషి తండ్రి వైద్యుడు కాగా, తల్లి ఫార్మసిస్ట్. పంజాబ్‌కు చెందిన వీరు లండన్‌లో స్థిరపడ్డారు. 1980లో జన్మించిన రిషి వించెస్టర్ కాలేజీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీల్లో చదివారు. రిషి సునక్ నారాయణమూర్తి కుమార్తె అక్షతను వివాహం చేసుకున్నారు. -
యడ్డీ ముందు మరో సవాల్
సాక్షి, బెంగళూరు: అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను ఎన్నికల్లో గెలిపిస్తే మంత్రి పదవులు ఇస్తామని సీఎం యడియూరప్ప ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రకటించారు. ఎన్నికల్లో 13 మంది అనర్హులు బీజేపీ తరఫున పోటీ చేయగా 11 మంది విజయం సాధించారు. వారందరికీ మంత్రి పదవులు ఇస్తా రా? అనేది ఉత్కంఠగా మారింది. వారికి కేబినెట్లో చోటిస్తే బీజేపీలో సీనియర్ నేతలు భగ్గుమనే ప్రమాదం ఉంది. దీనికి తోడు ఓడిన ఎంటీబీ నాగరాజు, హెచ్.విశ్వనాథ్, టికెట్ దక్క ని ఆర్.శంకర్‌కు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలన్నా ఖాళీలు లేవు. జిల్లాకు నలుగురు మంత్రులా? ఉప ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారిన బెళగావి జిల్లా రాజకీయాలు ఫలితాల అనంతరం కూడా వేడిగానే ఉన్నాయి. జిల్లా నుంచి ప్రస్తుతం లక్ష్మణ సవది మంత్రివర్గంలో ఉన్నారు. అ యితే మరో ముగ్గురు (గోకాక్ – రమేశ్ జార్కిహోళి, కాగవాడ – శ్రీమంతపాటిల్, అథణి – మహేశ్ కుమటళ్లి) ప్రస్తుతం గెలిచారు. ఇచ్చిన మాట ప్రకారం ముగ్గురికి మంత్రి పదవులు వస్తే జిల్లా నుంచి నలుగురు కేబినెట్లో ఉంటారు. ఇక ఉత్తర కన్నడ జిల్లా నుంచి హెబ్బార్‌కు, చిక్కబళ్లాపుర నుంచి కె.సుధాకర్‌కు మంత్రి పదవి దక్కాల్సి ఉంది. బెంగళూరు నుంచి అరడజను పైగా మంత్రివర్గంలో బెర్తు ఆశించిన యశవంతపుర – ఎస్టీ సోమశేఖర్, మహలక్ష్మి లేఅవుట్ – కె.గోపాలయ్య, కృష్ణరాజపురం – భైరతి బసవరాజుకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని సమాచారం. కాగా బెంగళూరు పరిధిలో ప్రస్తుతం అశ్వర్థ నారాయణ (మల్లేశ్వరం), ఆర్.అశోక్ (పద్మనాభనగర), సురేశ్ కుమార్ (రాజాజీనగర), సోమణ్ణ (గోవిందరాజనగర) కేబినెట్లో కొనసాగుతున్నారు. మండ్య నుంచి కేబినెట్లో చేరే ఏకైక మంత్రిగా కేసీ నారాయణెగౌడ అవుతారు. అదేవిధంగా బళ్లారి జిల్లాకు కూడా (ఆనందసింగ్ – విజయనగర) మంత్రిగిరి రావాలి. వీరందరికీ పదవులు ఎలా సాధ్యం, యడియూరప్ప ఎలా పరిష్కరిస్తారన్నది పార్టీలో చర్చనీయాంశమైంది. -
మోదీ ఆఫర్ ఇచ్చారు.. నేనే వద్దన్నా!
ముంబై: ప్రధాని మోదీ కలిసి పనిచేద్దామంటూ ఇచ్చిన ఆహ్వానాన్ని తానే తిరస్కరించానని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. రాష్ట్రపతి పదవిని తనకు ప్రధాని ఇవ్వజూపారన్న వార్తలను పవార్ కొట్టిపారేశారు. ఓ మరాఠా టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన. గత నెలలో ప్రధాని మోదీతో భేటీ, అనంతర రాజకీయ పరిణామాలకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. ‘కలిసి పనిచేద్దామంటూ మోదీ నన్ను అడిగారు. మన మధ్య వ్యక్తిగత సంబంధాలు చాలా బాగున్నాయి. వాటిని అలాగే కొనసాగనివ్వండి. కానీ, కలిసి పనిచేయడం మాత్రం కుదరదు అని ప్రధానికి తెలిపా’నన్నారు. ఆ భేటీలో తనకు రాష్ట్రపతి పదవి ఇవ్వజూపారంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ..‘అలాంటిదేమీ లేదు. కానీ, నా కుమార్తె సుప్రియా సూలేకు కేబినెట్లో చోటు కల్పిస్తామని చెప్పారు’అని పవార్ వివరించారు. దేవేంద్ర ఫడ్నవీస్‌తో అనూహ్యంగా చేతులు కలిపినందుకే అజిత్ పవార్‌కు ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్లో స్థానం కల్పించలేదన్నారు. ‘అజిత్ ప్లేటు ఫిరాయించిన విషయం తెలియగానే మొట్టమొదటగా ఉద్ధవ్ ఠాక్రేకు ఫోన్ చేశా. అజిత్ అలా చేసి ఉండకూడదు.. నాపై నమ్మకముంచండి.. ఆ తిరుగుబాటును అణిచివేస్తానని ఠాక్రేకు తెలిపా’అని చెప్పారు. ‘అజిత్‌కు ఎన్సీపీ మద్దతు లేదని తెలియగానే అతడి వెంట ఉన్న ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరిగిపోయింది. అందుకే వెంటనే వచ్చేశారు’అని వివరించారు. ‘ఫడ్నవీస్ పక్షంను వీడి రావాలంటూ నా కుటుంబ సభ్యులు ఎవరైనా అజిత్‌ను కోరిన విషయం నాకు తెలియదు. కానీ, అజిత్ చేసింది తప్పని అంతా భావించారు’ అని తెలిపారు. ‘నువ్వు క్షమించరాని పని చేశావు. దీనికి ఫలితం ఎవరైనా సరే అనుభవించాల్సిందే. నువ్వు అందుకు మినహాయింపు కాదు’అని అజిత్‌కు చెప్పానన్నారు. -
ఛాన్స్ ఎవరికో?
మంత్రివర్గ విస్తరణకు ఉగాదినాడే ముహూర్తం – ‘పల్లె’ను తప్పించే యోచనలో చంద్రబాబు - సునీత కొనసాగింపు విషయంలో అంతర్మథనం – కేబినెట్ బెర్త్ కోసం బీకే, కాలవ, కేశవ్ పోటీ (సాక్షిప్రతినిధి, అనంతపురం): మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అనంత’ టీడీపీలోని ఆశావహుల ఆశలు త్వరలోనే ఫలించనున్నాయి. ఈనెల 29న ఉగాది పండుగ రోజున రాష్ట్ర మంత్రి విస్తరణ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. విస్తరణ ముహూర్తాన్ని టీడీపీలోని క్రియాశీలక నేతలు కూడా ధ్రువీకరిస్తున్నారు. దీంతో జిల్లాలో ఇపుడున్న ఇద్దరు మంత్రులను కొనసాగిస్తారా..?...లేదా..? కొత్తగా ఎవరికి కేబినెట్లో చోటు దక్కుతుందన్న చర్చ ఇపుడు టీడీపీతో పాటు ఇతర పార్టీలోనూ జోరుగా సాగుతోంది. పార్టీ పరిస్థితిపై కలవరం రాష్ట్రంలోని 13 జిల్లాలలో అనంతపురాన్ని టీడీపీకి కంచుకోటగా ఇన్నాళ్లూ చంద్రబాబు భావించేవారు! కానీ ఇటీవల ఆయన స్వయంగా చేయించిన సర్వేలో అన్ని జిల్లాలలో కంటే ‘అనంత’లోనే పార్టీ పతనావస్థకు చేరిందని తేలింది. ఏకంగా 92 శాతం పార్టీకి నష్టం జిరిగినట్లు సర్వేరిపోర్ట్ వచ్చిందని ఫిబ్రవరిలో నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు ‘అనంత’నేతలతో స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎమ్మెలతో పాటు మంత్రులపైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేకంగా ఇద్దరు మంత్రులకు ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. ‘పార్టీవల్ల మీరు లబ్ధి పొందడం మినహా..మీ వల్ల పార్టీకి దమ్మిడీ ఉపయోగం లేదు. కేబినెట్ విస్తరణలో మీ సంగతి చూస్తా! సిద్ధంగా ఉండండి!’ అని బాహాటంగానే హెచ్చరించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ఇద్దరిలో ఎవరిని తొలగిస్తారు? ఇద్దరినీ తొలగిస్తారా? అనే సందిగ్ధం పార్టీ నేతల్లో నెలకొంది. ఇద్దరిపైనా అసంతృప్తి! ప్రస్తుతం కేబినెట్లో అత్యంత బలహీనంగా ఉన్న మంత్రుల్లో పల్లె, సునీత ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీశాఖ మంత్రిగా పల్లె ఘోరంగా విఫలమయ్యారనే భావనలో సీఎం ఉన్నట్లు తెలిసింది. చివరకు సమాచారశాఖలో డీపీఆర్ఓలు కూడా మంత్రిమాటను ఖాతరు చేసే పరిస్థితి లేదు. తనకు అప్పగించినశాఖలను గాడిలో పెట్టడంలో విఫలం కావడం, స్వయంగా తాను ఆర్థికంగా ఎదగాలనే స్పృహ మినహా మంత్రిపదవిలో తనదైన ప్రత్యేకమై ముద్ర వేయడం ‘పల్లె’ ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఇతనిపై వేటు వేసేందుకు బాబు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అలాగే మంత్రి పరిటాల సునీతపై కూడా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. ఆమె కేవలం ఐదో తరగతి చదవడం, కనీసం జీఓలు కూడా చదవలేకపోవడం, మంత్రిగా ఉన్నప్పటికీ అసెంబ్లీలో మాట్లాడే స్థాయిలో విషయం లేకపోవడాన్ని చంద్రబాబు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు జిల్లాలో పార్టీ ఉన్నతికి మూడేళ్లలో సునీత చేసిన కృషి ఏమీలేదనేది చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే పరిటాల ప్రభావం జిల్లాలో పూర్తిగా తగ్గిందనే భావనకు చంద్రబాబు వచ్చారు. కేవలం రాప్తాడు మినహా పెనుకొండ, ధర్మవరం నియోజకవర్గాల్లో పూర్తిగా పట్టుకోల్పోయారని భావిస్తున్న బాబు.. ఆమె కొనసాగింపుపై కూడా ఆలోచనలో పడ్డారు. వీరిద్దరి వద్ద ‘సబ్జెక్ట్’ లేకపోవడంతో జిల్లాలోని సమీక్ష సమావేశాల్లో అధికారుల ముందు తేలిపోతున్నారు. ఇప్పటికే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిన పరిస్థితుల్లో ఇలాంటి మంత్రులతో ఎన్నికలకు వెళితే ఫలితాలు దారుణంగా ఉంటాయనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలిసింది. ఆ ముగ్గురిలో చోటెవ్వరికో మంత్రివర్గ విస్తరణపై చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌లు భారీగా ఆశలు పెట్టుకుని ఉన్నారు. జిల్లాలో బీసీల ప్రాబల్యం అధికమని, బీసీ మంత్రి లేకపోవడం కూడా పార్టీ పతనానికి కారణమని జిల్లా నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బీసీలకు మంత్రి పదవి ఇవ్వాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రిపదవిపై బీకే బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు ఇటీవల సీఎంను కలిసినప్పుడు విస్తరణపై చర్చించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే కేబినెట్లో తనకు చోటు కల్పించాలని కాలవ కోరినట్లు తెలిసింది. దీంతో బీకే పార్థసారథి, కాలవ శ్రీనివాసులల్లో ఒకరికే చోటు దక్కే అవకాశం ఉంది. పల్లెను తప్పిస్తే ఆ స్థానంలో ఈ ఇద్దరిలో ఒకరికి చోటు ఇవ్వవచ్చు. ఇక రెండోబెర్త్ కోసం పరిటాల, పయ్యావుల పోటీ పడుతున్నారు. నారా లోకేశ్‌ను కేబినెట్లోకి తీసుకుంటే రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గానికి బెర్త్ దొరకదు. మూడేళ్లు సునీత పదవిలో ఉన్నారు కాబట్టి, కేశవ్‌కు రెండేళ్లు అవకాశం ఇచ్చేందుకు తప్పుకోవాలని చంద్రబాబు సూచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్లో ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు చురుకైన నేత లేకపోవడంతో కేశవ్‌ను తీసుకోవాలని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సునీతను తొలగించి కేశవ్‌కు మంత్రి పదవి ఇస్తారా? అనేది సందేహమే! పోనీ సునీతను కొనసాగిస్తూ, కేశవ్‌కు చోటు కల్పిస్తే ఒకే సామాజికవర్గానికి రెండు మంత్రిపదవులు కట్టబెట్టినట్లవుతుంది. దీంతో రెండోస్థానంపైనే చంద్రబాబు డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆశావహుల్లోని ముగ్గురిలో ఒకరికి మాత్రమే బెర్త్ దక్కుతుందా? ఇద్దరిని మంత్రి పదవి వరిస్తుందా? అనేది చూడాలి!!