Cabinet Sub Commmittee
-
Telangana: ఈ ఏడాది నుంచే ఇంగ్లిష్ మీడియం
సాక్షి, హైదరాబాద్: 2022–23 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలంటూ కేబినెట్‌కు సిఫార్సు చేయాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. ఇందుకు సంబం ధించిన విధి విధానాలు, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో బుధవారం సమావేశమైంది. మంత్రులు కేటీఆర్, టి.హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ ఈ భేటీలో పాల్గొన్నా రు. ఇంగ్లిష్ మీడియం అమలుపై సీఎంతో చర్చించాక విధివిధానాలు రూపొందించాలని సమావేశం నిర్ణయించింది. ఈలోగా ఆంగ్ల మాధ్యమానికి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించింది. విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండేలా ద్విభాషా విధానంలో పాఠ్య పుస్తకాలను ముద్రించాలని కోరింది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని, విద్యార్థుల్లో ఆంగ్లంలో ప్రత్యేక మెళకువలు నేర్పేందుకు అవసరమైతే టీ–శాట్ ద్వారా కోర్సులను అందుబాటులోకి తేవాలని సూచించింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై ఉపసంఘం చర్చించింది. దీని పై మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, అధికారులు సయ్యద్ ఒమర్ జలీల్ పాల్గొన్నారు. -
తిరుపతి రుయా ఘటన బాధాకరం: మంత్రి ఆళ్ల నాని
సాక్షి, విజయవాడ: మంత్రి ఆళ్లనాని అధ్యక్షతన మంగళగిరి ఏపీఐఐసీ భవనంలో జరిగిన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం మంత్రి ఆళ్లనాని మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆక్సిజన్, బెడ్స్, రెమిడెసివర్ అంశాలపై చర్చించాం. రుయా లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఆక్సిజన్ సరఫరాపై సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆక్సిజన్ పైప్లైన్లను పరిశీలించాలని కలెక్టర్లను ఆదేశించాం. జిల్లాల్లో ఆక్సిజన్ బెడ్ల సంఖ్య పెంచాం. ఆక్సిజన్ వృథా కాకుండా ప్రతి జిల్లాలో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తాం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఆక్సిజన్ మేనేజ్మెంట్ ఉండాలి. ఆక్సిజన్ కోటా పెంచాలని కేంద్రాన్ని కోరాం. రాష్ట్రంలో ఆక్సిజన్ అవసరాలపై ఇప్పటికే ప్రధానికి సీఎం లేఖ రాశారు. 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరముంటుందని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్‌పై గ్లోబల్ టెండర్లకు వెళ్తాం. వ్యాక్సినేషన్‌పై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. ఏపీలో ఒకే రోజు 6 లక్షల డోసులు వేశాం. 6 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖలు కూడా రాశాం. ప్రజలందరికీ వ్యాక్సిన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలిపాం. వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఆక్సిజన్ అంశం కేంద్రం చేతిలో ఉన్న అంశాలు.. వ్యాక్సినేషన్‌పై కేంద్రం సుప్రీంలో అఫిడవిట్ వేసింది చంద్రబాబుకు తెలియదా?.. క్లిష్ట పరిస్థితుల్లో కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. తిరుపతి రుయా ఘటన బాధాకరం. కలెక్టర్ నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’’ అని అన్నారు. కాగా, ఈ భేటీలో మంత్రులు మేకతోటి సుచరిత, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాధ్, కన్నబాబు పాల్గొన్నారు. -
కరోనా అలర్ట్: ‘అలా చేస్తే కఠిన చర్యలు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలి కోవిడ్-19 కేసు నమోదైన నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం భేటీ అయింది. కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారి సహాయార్థం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని మంత్రులు సూచించారు. 24 గంటల పాటు నడిచే కాల్ సెంటర్ ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న కాల్ సెంటర్ సామర్థ్యాన్ని మరింతగా పెంచాలని అన్నారు. గతంలో వచ్చిన ఇతర వైరస్‌లతో పోల్చితే కరోనా వైరస్‌లో మరణాల రేటు తక్కువగా ఉంటుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రులు చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని వివరించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరుగిన ఈ భేటీలో మంత్రులు ఈటల రాజేందర్, కె.తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖతోపాటు వివిధ శాఖల అధిపతులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (చదవండి: కరోనా బ్రేకింగ్: గాంధీలో 8 మంది అనుమానితులు!) తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు కరోనా వస్తే చనిపోతారన్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో హోర్డింగ్‌లతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. వైరస్‌పై అసత్య ప్రచారం చేసే వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. (చదవండి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘కరోనా’ అలర్ట్) కరోనా సమస్యను ఉపయోగించుకుని.. ఎవరైనా వ్యాపార ప్రయోజనాలకు వాడుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో కరోనా మెడికేషన్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని గుర్తు చేశారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు, ప్రజలను చైతన్యం చేసేందుకు పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నిర్వహించాలని, దీనికోసం సమాచార, ప్రచార శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. కరోనాకు ప్రత్యేక ఆస్పత్రి: ఆరోగ్య శాఖ మంత్రి ఈటల వైద్యారోగ్య శాఖ పరంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. కరోనా పేషంట్లకు చికిత్స అందించేదుకు ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. 9 విభాగాల సమన్వయంతో పనిచేస్తాం. ప్రతి విభాగానికి ఒక నోడల్ ఆఫీర్ ఉంటారు. ఊపిరితత్తుల వ్యాధి నిపుణులు, నర్సులను సరిపడా మందిని తీసుకుంటాం. ప్రైవేటు ఆస్పత్రులను కూడా అప్రమత్తం చేస్తున్నాం. కరోనా అనుమానం ఉన్న రోగులకు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించండని కోరాం. ప్రజలకు విశ్వాసం కలిగించడం మన బాధ్యత. ఎంటర్ ద ‘వైరస్’ ఓ మై గాడ్.. కోవిడ్.. ఆస్పత్రిలో సునితా -
నా మీద కూడా ఎన్నో ఒత్తిళ్లు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అవినీతిపై పోరాటంలో ఏమాత్రం వెనకడుగు వేయొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తనపై కూడా ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయని, అయితే వాటికి లొంగే ప్రసక్తే లేదని తెలిపారు. టెండర్ల ప్రక్రియ మొదలు, తీసుకువచ్చిన అప్పుల వరకూ పైస్థాయిలో ఏది చూసినా వందలు, వేలకోట్ల రూపాయాల్లో కుంభకోణాలు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రజాధనానికి మనం కాపలాదారులుగా ఉండాలా? లేక అవినీతి చేసినవారిని వదిలేయాలా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం విషయాన్ని తీసుకున్నా ఇదే పరిస్థితి ఉందని, అవినీతి లేకుండా అదే ఇళ్లు, తక్కువ ఖర్చుకు లభించేవి కదా? అని అన్నారు. రివర్స్ టెండరింగ్ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని, దీనివల్ల మిగిలే ప్రతి పైసా ప్రజలకే చెందుతుందని అన్నారు. దేశంలోనే అత్యున్నత విధానాలతో అవినీతిరహిత పాలనను అందించే ప్రతి ప్రయత్నానికి గట్టిగా సహకరించాలని, ఒత్తిళ్లను ఖాతరు చేయొద్దని సూచించారు. మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి పంచాయతీరాజ్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం, సలహాదారులు శామ్యూల్, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా గత ప్రభుత్వ పాలసీలను సమీక్షించేందుకు ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 30 అంశాల్లో అవినీతిని వెలికితీసే బాధ్యతను ఈ సబ్ కమిటీ చేపట్టింది. ఐదేళ్లుగా గత ప్రభుత్వం సాగించిన అవినీతి బాగోతాలపై విచారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి ఈ మంత్రివర్గ ఉప సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు ప్రత్యేక ఆహ్వానితులుగా, సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ ఈ కమిటీకి కార్యదర్శిగా వ్యవహరిస్తారు. -
పంచాయతీరాజ్ చట్టంపై సబ్‌కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో నూతన పంచాయతీరాజ్ చట్టం రూపకల్పనపై మంగళవారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్రావు, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు సంబధిత అధికారులు హాజరయ్యారు. కాగా,రాష్ట్రంలో నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకురావాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం అందుకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. -
సీమాంధ్ర ఉద్యోగ సంఘాలతో రేపు చర్చలు
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న మూడు ఉద్యోగ సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఏపీ ఎన్జీవో, రెవెన్యూ, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగ సంఘాలను చర్చలకు రావాలని పిలిచింది. ఈ మూడు సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరపనుంది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఉదయం 11:30 గంటలకు మూడు సంఘాలతో సమ్మె విరమణపై చర్చించనుంది. మంత్రివర్గ ఉప సంఘంతో సోమవారం సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు ఫలవంతం కాలేదు. సమ్మె నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం చేసిన విజ్ఞప్తిని సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు సోమవారం అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగాయి. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెను విరమింపజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.