CAIRN
-
కోవర్టు లాబీయింగ్ చేశాయి
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ప్రమోటర్లపై ఆరోపణలు గుప్పించిన ఓసీసీఆర్పీ తాజాగా పారిశ్రామిక దిగ్గజం అనిల్ అగర్వాల్‌కి చెందిన కంపెనీలు వేదాంత, కెయిర్న్ ఇండియాను టార్గెట్ చేసింది. పర్యావరణ చట్టాలను అనుకూలంగా మార్చుకునేందుకు వేదాంత కోవర్టు లాబీయింగ్ నడిపినట్లు కొత్తగా మరో నివేదికలో ఆరోపించింది. ప్రభుత్వం కూడా ప్రజలను సంప్రదించకుండా నిబంధనల మార్పులను ఆమోదించి, ‘అక్రమ పద్ధతుల్లో’ అమలు చేసినట్లు పేర్కొంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోరి్టంగ్ ప్రాజెక్టు (ఓసీసీఆర్పీ) విడుదల చేసిన నివేదికలోని కొన్ని ప్రధానాంశాలు.. ► కొత్తగా పర్యావరణ అనుమతుల అవసరం లేకుండా దేశీయంగా ఉత్పత్తిని 50% వరకు పెంచుకునేందుకు మైనింగ్ కంపెనీలకు అనుమతినిస్తే ఆర్థిక వ్యవస్థ రికవరీ మరింత వేగవంతం కాగలదని 2021 జనవరిలో వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ అప్పటి పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు లేఖ రాశారు. ► ‘‘2022 తొలినాళ్లలో పలు దఫాల సమావేశాల అనంతరం పర్యావరణ శాఖ నిబంధనలను సడలించింది. ప్రజాభిప్రాయాల సేకరణ నిర్వహించాల్సిన అవసరం లేకుండా మైనింగ్ కంపెనీలు 50 శాతం వరకు ఉత్పత్తిని పెంచుకునేందుకు అనుమతించింది’’ అని ఓసీసీఆర్పీ తెలిపింది. ► వేదాంత తరహాలోనే దాని అనుబంధ సంస్థ కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ కూడా వ్యవహరించింది. చమురు అన్వేషణ ప్రాజెక్టుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిబంధనను ఎత్తివేసేందుకు లాబీయింగ్ చేసింది. ► అధికార బీజేపీకి వేదాంత గణనీయంగా విరాళాలు కూడా ఇచి్చనట్లు (2016–2020 మధ్య కాలంలో రూ.43.5 కోటు)్ల ఆధారాలు ఉన్నాయని ఓసీసీఆర్పీ తెలిపింది. వేదాంత స్పందన ఇదీ.. ఓసీసీఆర్పీ ఆరోపణలను నిర్దుష్టంగా ఖండించకుండా వేదాంత స్పందించింది. ‘దిగుమతులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి అనుకూలమైన విధానాల్లో దేశీయంగా ఉత్పత్తిని పెంచాలనేది మా లక్ష్యం. దానికి అనుగుణంగా దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, సహజ వనరుల విషయంలో భారత్ స్వావలంబన సాధించడంలో తోడ్పాటు అందించే ఉద్దేశంతో ప్రభుత్వ పరిశీలన కోసం పలు విజ్ఞప్తులు చేశాము‘ అని సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. -
కెయిర్న్ వన్ టైమ్ సెటిల్మెంట్ చేసుకోవాల్సిందే..: కేంద్రం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: బడ్జెట్లో ప్రకటించిన వన్‌టైమ్ పన్ను సెటిల్మెంట్కు బ్రిటిష్ సంస్థ కెయిర్న్ ఎనర్జీ ఒప్పుకునేవరకూ రికవరీ ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది. 2006లో కెయిర్న్ ఎనర్జీ భారత్ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణలో ఆర్జించిన మూలధన లాభాలకు గాను పన్ను, వడ్డీ రూపంలో దాదాపు రూ.29 వేల కోట్లను చెల్లించాలంటూ ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ తుది నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెట్రోస్పెక్టివ్(పాత లావాదేవీలకూ పన్ను వర్తింపు) పన్ను వివాదాలకు తెరదించే చర్యల్లో భాగంగా 2016-17 బడ్జెట్లో ఆర్థిక మంత్రి జెట్లీ వన్‌టైమ్ సెటిల్మెంట్ ఆఫర్‌ను ప్రకటించారు. అంటే రెట్రోస్పెక్టివ్ పన్నుకు సంబంధించి అసలు మొత్తాన్ని చెల్లిస్తే.. వడ్డీ, జరిమానాలను మాఫీ చేస్తారు. ‘ఈ అవకాశాన్ని కంపెనీలు వినియోగించుకోవచ్చు. అప్పటివరకూ సాధార రికవరీ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగానే వడ్డీని కూడా కలిపి తుది పన్ను నోటీసులను కెయిర్న్ ఎనర్జీకి పంపడం జరిగింది’ అని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. కెయిర్న్ ఎనర్జీకి ఇచ్చిన తుది నోటీసుల్లో రెట్రోస్పెక్టివ్ పన్ను రూపంలో రూ.10,247 కోట్లు ఉండగా.. 2007 నుంచి లెక్కించిన వడ్డీ మొత్తం రూ.18,800 కోట్లు కావడం గమనార్హం. కాగా, కంపెనీ అంతర్గత పునర్వ్యవస్థీకరణపై రెట్రోస్పెక్టివ్ పన్ను విధింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని.. దీనిపై అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్రక్రియను మొదలుపెట్టినట్లు కెయిర్న్ ఎనర్జీ పేర్కొంది కూడా. అంతేకాకుండా బిలియన్ డాలర్ల(దాదాపు రూ.6,700 కోట్లు) నష్టపరిహారాన్ని కూడా డిమాండ్ చేస్తోంది. -
‘కెయిర్న్’ ట్యాక్స్ వివాదం.. జైట్లీకి సంకటం
న్యూఢిల్లీ: ఇంధన రంగ దిగ్గజం కెయిర్న్ ఎనర్జీకి ఆదాయ పన్ను శాఖ రూ. 10,247 కోట్ల పన్నుల నోటీసులు జారీ చేయడం.. బ్రిటన్‌లో పర్యటించనున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సంకటంగా మారనుంది. శుక్రవారం లండన్‌లో ఆయన విదేశీ ఇన్వెస్టర్లతో భేటీ కానున్నారు. రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ (గత డీల్స్‌ను తిరగదోడి పన్నులు విధించడం)పై తమ ప్రభుత్వ విధానాన్ని ఈ సమావేశంలో ఆయన వివరించనున్నారు. ఈలోగా కెయిర్న్ ఎనర్జీకి నోటీసులివ్వడంతో ఇన్వెస్టర్ల నుంచి ఆయన ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదుర్కొనాల్సి రావొచ్చని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. జైట్లీ మూడు రోజుల పాటు బ్రిటన్‌లో అధికారికంగా పర్యటించనున్నారు. మరోవైపు, నిబంధనల ప్రకారమే కెయిర్న్ ఎనర్జీకి నోటీసులు ఇచ్చినట్లు ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. నిబద్ధత చేతల్లోనూ చూపాలి: బ్రిటన్ భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ విదేశాంగ మంత్రి హామండ్ గురువారం జైట్లీతో సమావేశంలో కెయిర్న్ ఎనర్జీకి నోటీసుల అంశాన్ని చర్చించారు. నోటీసులు గత ప్రభుత్వ హయాంనకు సంబంధించినవని, ఇకపై కొత్తవి ఉండబోవని జైట్లీ హామీ ఇచ్చినట్లు హామండ్ విలేకరులకు తెలిపారు. వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించడమన్నదిమాటలకే పరిమితం చేయకుండా భారత్ ఆచరణలో కూడా చూపించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. బ్రిటన్‌లో పర్యటించబోతున్న జైట్లీ ఇదే విషయంపై అక్కడి ఇన్వెస్టర్లకు నమ్మకం కలిగించాల్సి ఉంటుందన్నారు. భారీ సంస్కరణల ఆశలు సరికావు: అరవింద్ సుబ్రమణియన్ కాగా భారత్‌వంటి భారీ ప్రజాస్వామ్య దేశాల్లో భారీ సంస్కరణల అంచనాలు పెట్టుకోవడం సముచితం కాదని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ చెప్పారు. భారత్‌లో అధికార కేంద్రాలు అనేకం ఉంటాయని, కేంద్రం తీసుకునే నిర్ణయాలను రాష్ట్రాలు, ప్రభుత్వ సంస్థలు కూడా తిరస్కరించవచ్చని పేర్కొన్నారు. వాషింగ్టన్‌లోని ప్రతిష్టాత్మక పీటర్సన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్‌లో ప్రసంగించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. -
9 వేల కోట్లతో కొత్తబావుల్లో ఉత్పత్తి
ఉప్పలగుప్తం, న్యూస్‌లైన్ : కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలో ఉప్పలగుప్తం మండలం సూరసేన యానాంలో గల ‘రవ్వ’ చమురు క్షేత్రంలో రూ.9 వేల కోట్లతో కొత్తబావుల్లో ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు క్షేత్రం యాజమాన్య సంస్థల్లో ఒకటైన కెయిర్న్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా 20 అతిపెద్ద స్వతంత్ర చమురు అన్వేషణ, ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన తమ సంస్థ చమురు, సహజవాయు నిక్షేపాలు వెలికితీతతో పాటుగా స్థానికాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పేర్కొంది. భారతదేశంలో గత రెండు దశాబ్దాలుగా హైడ్రోకార్బన్ల అన్వేషణ, ఉత్పత్తిలో ఎన్నో రికార్డులు సాధించిందని, కనుగొన్న బావుల్లో త్వరితగతిన ఉత్పత్తి మొదలుపెట్టి దేశంలో 25% ముడిచమురు అందిస్తున్న ఘనతను సొంతం చేసుకుందని తెలిపిం ది. రవ్వ యాజమాన్య సంస్థలైనఓఎన్జీసీ, వీడియోకాన్, రవ్వ ఆయిల్ భాగస్వామ్యంతో ఉత్పత్తి ప్రారంభించిన తొలినాళ్లలో రోజుకు 3500 బారెల్స్ చమురు ఉత్పత్తి చేశామని, ఇప్పటి వరకు 245 మిలియన్ బారెల్స్ ముడిచమురు, 330 బిలియన్ క్యూబిక్ ఫీట్ గ్యాస్‌ను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. 2013-14 ఆఖరి క్వార్టర్లో అంచనాను మించి 29,151 బారల్స్ ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి జరిగినట్టు వివరించింది. సామాజిక సేవలతో అవార్డులు దాదాపు 1400 హెక్టార్లలో విస్తరించి ఉన్న రవ్వ ప్లాంట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో భాగంగా గ్రామంలోని ఆరువేల మంది జనాభాకు వివిధ సేవలు అందిస్తున్నట్లు కెయిర్న్ తెలిపింది. గ్రామంలో 560 వ్యక్తిగత మరుగుదొడ్లు, పేదలకు 200 పక్కాగృహాలు నిర్మించి, తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొంది.