cambridge uinversity
-
ఆహా ఏమి రుచి... ఎంత కృషి!
అవసరమే ఆవిష్కరణలకు కారణం అవుతుంది... అంటారు. అవసరమే అన్నీ నేర్పిస్తుంది... అని కూడా అంటారు. అస్మాఖాన్‌కు వంటలలో ఓనమాలు తెలియవు. ఇంగ్లాండ్‌కు వెళ్లిన కొత్తలో స్వదేశి ఇంటి వంటల రుచులు ఆమెకు దూరం అయ్యాయి. దీంతో పనిగట్టుకొని వంటలు నేర్చుకుంది. అయితే ఆమె అక్కడే ఆగిపోలేదు. ఆల్–ఉమెన్ ‘డార్జిలింగ్ ఎక్స్‌ప్రెస్ రెస్టారెంట్’ ద్వారా సూపర్‌ఫాస్ట్‌గా దూసుకుపోతోంది.. ‘అస్మాఖాన్ ఏమిటి?’ అనే సింగిల్ ప్రశ్నకు ఎన్నో జవాబులు దొరుకుతాయి. అందులో కొన్ని... మంచి చెఫ్: ఆమె గరిట తిప్పితే వంటల రుచులు ఎక్కడికో వెళ్లిపోతాయి. స్టార్ రెస్టారెటర్: వ్యాపారం అంటే ఆషామాషీ విషయం కాదు. అయినప్పటికీ ఆ వ్యాపారంలో దూసుకుపోయింది. ఎంతోమంది ఔత్సాహికులకు ఉత్సాహాన్ని ఇస్తోంది. వంటల పుస్తకాల రచయిత్రి: వంటల పుస్తకాలు చదివించేలా ఉండడమే కాదు, చదువు పూర్తయిన తరువాత వంటగదిలోకి పరుగెత్తేలా చేయాలి... అంటారు. అస్మాఖాన్ పుస్తకాలు అలాంటివే. ఘనత: బిజినెస్ ఇన్సైడర్ ‘100 కూలెస్ట్ పీపుల్ ఇన్ ఫుడ్ అండ్ డ్రింక్’ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. కోల్‌కత్తాలో పుట్టిపెరిగిన అస్మాఖాన్ వివాహం తరువాత కేంబ్రిడ్జి (ఇంగ్లాండ్) కి వచ్చింది. వంటల విషయంలో భర్త అభిప్రాయానికి, తన అభిరుచికి మధ్య చాలా తేడా ఉండేది. ఆయన విషయంలో భోజనం అంటే... జస్ట్ ఫర్ ఎగ్జిస్టింగ్! తనకు మాత్రం భోజనం అనేది కేవలం భోజనం మాత్రమే కాదు... అదొక గొప్ప సంస్కృతి. ఇప్పుడు తాను ఆ సంస్కృతికి దూరం అయింది, పుట్టింట్లో ఇష్టంగా తిన్న వంటకాలు గుర్తుకు వచ్చి నోట్లో నీరు ఊరేది. దీంతో ‘ఎలాగైనా సరే వంటలు నేర్చుకోవాలి’ అనే నిర్ణయానికి వచ్చింది. కేంబ్రిడ్జిలో ఉంటున్న బంధువు దగ్గర వంటలలో ఓనమాలు నేర్చుకుంది. ఆ తరువాత... మూడు నెలల పాటు ఇండియాలో గడపడానికి వచ్చినప్పుడు... తల్లి, ఇంటి వంటమనిషితో పాటు ఎంతోమంది బంధువుల దగ్గర ఎన్నో వంటకాలు నేర్చుకుంది. తక్కువ సమయంలో వాటిలో నేర్పు సాధించి ‘ఆహా ఏమి రుచి!’ అనిపించుకుంది. తిరిగి కేంబ్రిడ్జికి వచ్చిన కొంతకాలానికి... ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ప్రారంభించాలనుకుంది. కానీ అది ఎలాంటి కాలం అంటే... ఇండియన్ రెస్టారెంట్ల విషయంలో ‘నేడు ప్రారంభం’ ‘మూడు రోజుల తరువాత మూసివేత’ అన్నట్లుగా ఉండేది. దీనికి కారణం అక్కడ నివసిస్తున్న భారతీయులు కూడా ‘ట్రెండ్’ పేరుతో రకరకాల రుచులను ఆస్వాదించేవారు తప్ప భారతీయ భోజనాల దగ్గరకు అరుదుగా వచ్చేవారు. రెస్టారెంట్ ఆలోచన భర్తకు నచ్చలేదు. అలా అని ఆయన వద్దని వారించలేదు. ఒక శుభముహుర్తాన లండన్‌లో ఆల్–ఉమెన్ ‘డార్జిలింగ్ ఎక్స్‌ప్రెస్ రెస్టారెంట్’ మొదలుపెట్టింది అస్మాఖాన్. పేరుకు తగ్గట్టే దూసుకుపోయింది. ‘ఆహా ఏమి రెస్టారెంట్’ అనిపించింది. ‘ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్... మొదలైన దేశాల్లో వంటగదులు మహిళల ఆధ్వర్యంలోనే ఉంటాయి. రెస్టారెంట్ల దగ్గరికి వచ్చేసరికి మగ చెఫ్‌లే ఎక్కువగా కనిపిస్తారు’ అంటున్న అస్మాఖాన్ తన రెస్టారెంట్లో మహిళా చెఫ్‌లు, ఉద్యోగులకే ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి ఆదివారం ఈ రెస్టారెంట్ ‘చెఫ్’లుగా రాణించాలనుకుంటున్న మహిళల కోసం శిక్షణ కేంద్రంగా మారుతుంది. వృత్తిలో విజయశిఖరం అందుకున్న అస్మాఖాన్ ఆ విజయం దగ్గర మాత్రమే ఆగిపోలేదు. సామాజిక బాధ్యతను తన కర్తవ్యంగా భావిస్తుంది. 2019లో ఇరాక్‌కు వెళ్లి ఉగ్రవాద బాధిత మహిళల కోసం ‘ఆల్–ఉమెన్ రెస్టారెంట్’ను ప్రారంభించింది. ఇక మనదేశం విషయానికి వస్తే... ‘మళ్లీ ఆడపిల్లే’ అని నిట్టూర్చే కుటుంబాల మానసిక ధోరణిలో మార్పు తీసుకువచ్చేలా ‘సెకండ్ డాటర్ ఫండ్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా కృషి చేస్తోంది అస్మాఖాన్. ఉదా: రెండోసారి ఆడపిల్ల పుట్టిన కుటుంబాలకు స్వీటు ప్యాకెట్లు పంపించడం. స్వీట్లు పంపించడమే కాదు ఆడపిల్లల చదువు విషయంలోనూ తన వంతుపాత్ర పోషిస్తున్న అస్మాఖాన్ భవిష్యత్‌లో మరిన్ని సామాజికసేవా కార్యక్రమాల కోసం సిద్ధం అవుతోంది. రెండోసారి ఆడపిల్ల పుట్టిన కుటుంబాలకు స్వీటు ప్యాకెట్లు పంపించడం. స్వీట్లు పంపించడమే కాదు ఆడపిల్లల చదువు విషయంలోనూ తన వంతుపాత్ర పోషిస్తోంది ఆస్మాఖాన్. -
డెల్టాతో ఆస్పత్రిపాలయ్యే ప్రమాదం అధికం!
-
కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ ‘జిన్’ పోరు
లండన్: బ్రిటన్‌లోని ప్రముఖ యూనివర్సిటీలు కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్‌లు తమ సంప్రదాయ వైరాన్ని మర్చిపోలేదు. తాజాగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తన సొంత బ్రాండ్ జిన్ క్యూరేటర్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టడం ద్వారా ఆక్స్‌ఫర్డ్‌తో మరో పోటీకి తెరతీసింది. గత ఏడాది ఆక్స్ఫర్డ్ వర్సిటీ తన సొంత ఫిజిక్ బ్రాండ్ జిన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. వర్సిటీ గార్డెన్‌లోని చెట్లు, మొక్కల నుంచి రూపొందించిన ఈ జిన్ ధర 35 పౌండ్లుగా నిర్ణయించింది. అయితే, ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఇసాక్ న్యూటన్ సాపేక్ష సిద్ధాంతం కనుగొనేందుకు కారణమైన యాపిల్స్ నుంచి తాము క్యూరేటర్ జిన్ తయారు చేస్తున్నట్లు కేంబ్రిడ్జ్ తెలిపింది. దీనిని తమ బొటానికల్ గార్డెన్స్‌లోని యాపిల్స్ నుంచి రూపొందిస్తున్నట్లు పేర్కొంది. ఈ జిన్ ధర 40 పౌండ్లుగా తెలిపింది. ఇప్పటికే యూనివర్సిటీలోని దాదాపు 12 కళాశాలలకు ఈ జిన్ను అందజేస్తున్నట్లు తెలిపింది. తాజాగా, ఇదే కోవలోకి లీసెస్టర్ యూనివర్సిటీ కూడా వచ్చి చేరింది. తమ వర్సిటీ బొటానిక్ గార్డెన్‌లోని మొక్కల నుంచి జిన్ తయారు చేసేందుకు ఇటీవలే తమ విద్యార్థులకు అనుమతినిచ్చింది. -
అవిశ్రాంత గ్రహాంతర జీవాన్వేషి
గ్రహాంతరాల్లో జీవం ఉన్నదని నార్లికర్ చేసిన పలు పరిశోధనలు సాధికారికంగా నిరూపించాయి. 2001లో ఆయన నేతృత్వంలో ఇస్రో హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక ప్రయోగంలో నేలకు 41 మీటర్ల ఎత్తులోని వాతావరణంలో సూక్ష్మజీవుల ఉనికిని గుర్తించారు. అంతరిక్షంలో జీవ రాశి ఉనికిని కనుగొని, గ్రహాంతర పరిశోధనలో నవ శకానికి నాంది పలికిన శాస్త్రవేత్త జయంత్ విష్ణు నార్లికర్. పుణెలోని ప్రొఫెసర్ నార్లికర్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో 1938 జులై 19న జన్మించారు. తండ్రి వాసుదేవ నార్లికర్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర అధ్యాపకులు. తల్లి సంస్కృత పండితురాలు. తండ్రి ప్రభావంతో ఆయన ఖగోళ, గణిత, భౌతిక శాస్త్రాలపై మక్కువ పెంచుకున్నారు. ఖగోళ శాస్త్రవేత్త కావాలని కలలుగన్నారు. ఆ కలలను సాకారం చేసుకోడానికి తొలి మెట్టుగా జయంత్ పాఠశాల, కళాశాల విద్య లో అద్భుత ప్రతిభను కనబరిచారు. 1957లో బీఎస్సీ పూర్తి చేసి, 19 ఏళ్ల నవ యువకునిగా ఇంగ్లండ్‌లో తండ్రి చదివిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోనే గణిత శాస్త్రంలో ఎంఏ చేశారు. ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త ఫ్రెడ్ హోయల్ పర్యవేక్షణలో పీహెచ్డీ (1963) చేశారు. కేంబ్రిడ్జిలోని కింగ్స్ కాలేజీ ఫెలోగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ థియరిటికల్ ఆస్ట్రానమీ వ్యవస్థాపకునిగా, అధ్యాపకునిగా భౌతిక, విశ్వసృష్టి శాస్త్ర పరిశోధనలకు పునాదిని పటిష్టం చేసుకున్నారు. హోయల్‌తో కలసి అంతరిక్ష పరిశోధనలో ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతానికీ, మాక్ సిద్ధాంతానికి మధ్య సమన్వయాన్ని సాధించే ప్రయత్నం చేశారు. వారి ప్రతిపాదన ‘హోయల్-నార్లికర్ సిద్ధాంతం’గా సుప్రసిద్ధమైంది. ఈ కీర్తి ప్రతిష్టలతో సంతృప్తి చెందక ఆయన అంతరిక్ష రహస్య ఛేదన దిశగా నిర్విరామ పరిశోధన సాగించారు. మాతృదేశాభిమానంతో స్వదేశానికి తిరిగి వచ్చి ‘టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెం టల్ రీసెర్చ్’లో ప్రొఫెసర్‌గా (1972-89) పనిచేశారు. ఆయన నేతృత్వంలోని ‘థియరిటికల్ ఆస్ట్రోఫిజిక్స్’ విభాగం అంతర్జాతీయ గుర్తింపును సాధించింది. ఆ ప్రేరణతోనే యూజీసీ పుణెలో ‘ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్’ విభాగాన్ని ఏర్పాటు చేసి సారథ్య బాధ్యతలను నార్లికర్‌కు అప్పగించింది. వారి నేతృత్వంలో ఆ సంస్థ ప్రపంచవ్యాప్తమైన గుర్తింపును పొందింది. 2003లో పదవీ విరమణ చేసినా ఎమిరిటస్ ప్రొఫెసర్‌గా ఆయన అక్కడే పనిచేస్తున్నారు. గ్రహాంతరాల్లో జీవం ఉందన్న జయంత్ నమ్మకాన్ని ఆయన చేసిన పలు పరిశోధనలు సాధికారికంగా నిరూపించాయి. 2001 జనవరిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నార్లికర్ నేతృత్వంలో హైదరాబాద్‌లో ఒక ప్రయోగం నిర్వహించింది. ఒక భారీ బెలూన్‌కు పేలోడ్‌ను అనుసంధానించి భూమి ఉపరితలం నుంచి 41 మీటర్ల ఎత్తులోని వాతావరణంలోకి పంపి, అక్కడ సూక్ష్మజీవుల ఉనికిని గుర్తించారు. భూమి పై నుంచి సూక్ష్మజీవులు అంత ఎత్తుకు వెళ్లలేవు. కాబట్టి అవి ఇతర గ్రహాలకు చెందినవేననే అభిప్రాయానికి వచ్చారు. ఈ ప్రయోగం అనంత విశ్వం నుంచి జీవ కణాలు భూమిపైకి దూసుకొస్తున్నాయనీ, ఆ కణాలే భూమిపై జీవరాశికి విత్తనాలని చెప్పే సిద్ధాంతానికి దారి తీసింది. త ద్వారా అది అంగారకుడిపై ప్రయోగాలకు నాంది పలికింది. మరో ప్రయోగంలో నార్లికర్ తాను కనుగొన్న సూక్ష్మజీవుల్లో ఒక జాతికి తన గురువు పేరిట ‘జనీబేక్టర్ హోయలీ’ అని నామకరణం చేశారు. మరో జాతికి ఇస్రో పేరిట ‘బేసిల్లెస్ ఇస్రోనెన్సిస్’ అని, మూడో జాతికి ‘బేసిల్లెస్ ఆర్యభట్ట’ అని పేర్లు పెట్టారు. ఈ పరిశోధనలకు ముందు జయంత్ ‘బిగ్ బ్యాంగ్’ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయ నమూనాలను ప్రతిపాదించారు. అపార మేధోనిధి నార్లికర్ 26 ఏళ్లకే ‘పద్మభూషణ్’ (1965) పురస్కారాన్ని అందుకున్నారు. 2004లో పద్మవిభూషణ్ సత్కారం పొందారు. ప్రతిష్టాత్మక భట్నాగర్ అవార్డు, నేషనల్ సైన్స్ అకాడమి వారి ఇందిరాగాంధీ అవార్డును పొందారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ‘మహారాష్ట్ర భూషణ్’ బిరుదునిచ్చి ఘనంగా సత్కరించింది. మరెన్నో జాతీయ, అంతర్జాతీయ బహుమతులు, పురస్కారాలు అందుకున్నారు. పుస్తకా లు, వ్యాసాల ప్రచురణతో, రేడియో, టీవీ ప్రసంగాలతో శాస్త్ర విజ్ఞాన ప్రచారం సాగిస్తున్నారు. శాస్త్ర విజ్ఞానాన్ని సామాన్య ప్రజలతో పంచుకోవటానికి ఆయన శాస్త్రీయ కాల్పనిక రచనా మార్గాన్ని ఎంచుకోవటం మరో విశేషం. అశాస్త్రీయమైన జ్యోతి ష్యం, అద్భుత ప్రదర్శనలకు వ్యతిరేకంగా, మహిళల పట్ల వివక్షను ఎండగడుతూ రచనలు చేస్తున్నారు. నార్లికర్ భార్య మం గళ రాజవాడే, ముగ్గురు కుమార్తెలు పీహెచ్‌డీలు చేసి, శాస్త్ర విజ్ఞాన పరిశోధనా రంగంలోనే ఉండటం విశేషం. విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ అవార్డును మార్చి 1వ తేదీన ఆయన స్వస్థలమైన తెనాలిలో ప్రముఖ అంతరిక్ష పరిశోధకుడు జయంత్ విష్ణు నార్లికర్‌కు బహూకరిస్తున్న సందర్భంగా... పి.విష్ణుమూర్తి వ్యవస్థాపకులు, డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక ట్రస్ట్ -
ప్రపంచ రంగస్థలిపై మన్మోహన్
మన్మోహన్ కోసం అంతర్జాతీయ రంగస్థలిపై ఒక ముఖ్య భూమిక వేచి చూస్తోంది. పగ, విద్వేషాలకు అతీతమైన తటస్థ స్వరం మన్మోహన్కుంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనాలతోపాటూ సంక్షోభ ప్రాంతాల నడుమ ఉన్న అన్ని దేశాలలోను ఆయనకు విశ్వసనీయత ఉన్నది. సముచితమైన, ఆచరణాత్మక తీర్పరితనం, ప్రశాంతత ఆయనకు పెన్నిధి. ప్రధానిగా మన్మోహన్సింగ్ అవతార అస్తమయం తదుపరి ఆయన ఏమి చేస్తారా అని అనవసరంగా ఆందోళన చెందనివారిగా కనిపిస్తున్నది ప్రధాన మం త్రి ఒక్కరే. అది ఆయన వ్యక్తిత్వంలోనే ఉంది. ఉన్నత ప్రభుత్వాధికారిగా ఆయన తన నైపుణ్యాన్నంతటినీ ప్రదర్శించి ప్ర భుత్వ యంత్రాంగపు జారుడు మెట్ల నిచ్చెనలను అధిరోహించారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ఉపకార వేతనం అందుకున్న బాలుని దశ నుంచి రిజర్వు బ్యాంకు గవర్నరు హోదా వరకు ఆయన వృత్తిపరమైన జీవితమంతా అద్భుతంగా సాగింది. అయితే పదవీ విరమణ తదుపరి మన్మోహన్ సాధిం చిన వాటికి మాత్రం ఏదీ సాటిరాదు. అదంతా భగవంతుడు మహా ఉదార మానసిక స్థితిలో ఉన్నప్పుడు రాసిన తలరాత మాత్రమే అయివుండాలి. 1991లో ఆయన ఆర్థిక మంత్రి అయినందుకు భారత దేశం విస్తుపోయింది. పదమూడేళ్ల తర్వాత ఆయన ప్రధాని కావడంతో ప్రపంచమే నిర్ఘాంత పోయింది. ‘పదమూడు’ పాశ్చాత్య ప్రపంచానికే దురదృష్టకరమైన సంఖ్య. .. ప్రాచ్య ప్రపంచానికి కాదు. రాహుల్ గాంధీకి సలహాల గోరు ముద్దలను తిని పిస్తూ కాలాన్ని వృధా చేయడం మన్మోహన్ చేయని పనుల్లో ఒకటి. అక్కర్లేని వాటిని ఆయన ఇవ్వజూపడం అతి అరుదు. అణగిమణిగి ఉన్నా ఆయన ఎప్పుడు, ఏది సరిగ్గా సముచితమైనదో నిర్ణయించగల అద్భుత తీర్పరి. సంరక్షక పాత్రలో గద్దె చుట్టూ తచ్చాడే ప్రయత్నం ఆయన ఎంత మాత్రమూ చేయరు. రాచరిక యుగంలోనే అలాం టి పనిని ఈసడించేవారు. ఇక ప్రజాస్వామ్యంలో అది మరింత అవాంఛనీయమైనది. రాహుల్ కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించడంతోనే స్టేట్ మంత్రులు మినహా నేటి మంత్రి వర్గంలోని వారంతా విలువను కోల్పోతారు. పేరుపేరునా చెప్పడం బాధాకరం కావచ్చు. ప్రత్యేకించి వచ్చే ఎన్నికల్లో ఓడిపోయినవారి విషయంలో ఇది తప్పదు. గత దశాబ్ద కాలంగా పతాక శీర్షికల్లో కిక్కిరిసి కనిపించిన పలువురు అత్యంత బలహీనమైన గొంతుకతో కడపటిసారిగా జయజయ ధ్వానాలను చేస్తుండటాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అరవైలు, డెబ్భైలలో ఉన్న గత తరం కాంగ్రెస్ నేతలకు మన్మోహన్ పెద్ద తలకాయగా సైతం మారరు. రాహుల్ మాట్లాడుతున్నది భిన్నమైన భాష. అది... మన్మోహన్సింగ్, ప్రణబ్‌ముఖర్జీల వంటివారి భాష కంటేనే కాదు, రాహుల్ కన్నా రెండు దశాబ్దాలు పెద్దవారైన సీనియర్ల భాష కంటే కూడా భిన్నమైనది. అయితే ఏంటి, మన్మోహన్ పదవీ విరమణ తదుపరి జీవితాన్ని లైబ్రరీలోనే గడుపుతారా? నిర్వికార ప్రసన్నమూర్తి అయిన ఆయన తన అసాధారణమైన జీవితంలో అత్యంత ఉద్విగ్నమైన మెరుపులను చూశారు. ప్రత్యేకించి ప్రధాన మంత్రి దినచర్యతో ఆయన శరీరం ఎంతగా అలసిపోయిందో మేధస్సు, ఆత్మ కూడా అంతగానూ అలసిపోయాయి. కాబట్టి తొలి ఆలోచనగా పుస్తక పఠనంలోని శాంతి ఆయనను ఊరిస్తుంది. అయితే త్వరలోనే ఆయన శరీరక స్థితి మెరుగుపడుతుంది. బ్రిటన్ ఆర్థికశాస్త్రవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ తన వృత్తి జీవితం కంటే ఎక్కువ కాలం కమ్యూనిస్టేతర వామపక్షవాదులకు ఎజెండాను సమకూర్చారు. గత జ్ఞాపకాల కలబోతగా కీన్స్ పుస్తకాల్లోని పేజీలను తిరగేయడంతోనే రోజు వెళ్లబుచ్చడం కంటే మించినది ఏదైనా చేయాలని మన్మో హన్ కోరుకుంటారు. ఇక చేయడానికి ఆయనకు ఏముం టుంది? అంతర్జాతీయ రంగస్థలిపై మన్మోహన్ మాత్రమే నిర్వహించాల్సిన ఒక భూమిక వేచి చూస్తోంది. నేడు ఆయన కాంగ్రెస్ ఊత కర్రలపై కుంటుకుంటూ దేశ రాజకీయ రంగస్థలి వెలుగులకు దూరం కావాల్సి వస్తున్న మాట నిజమే. అయితే అది ప్రత్యామ్నాయ రంగంలో ఆయనను నిరోధించగలిగేదేమీ కాదు. నేడు ఆయనలో దాగివున్న ఆందోళనంతా ఆయన నిష్ర్కమణతోనే మటుమాయమై మరపున పడిపోతుంది. రాజకీయాల్లో పైకి ఎగసినది ఏదైనాగానీ కిందకు రాక తప్పదని బాగా ఎరిగిన అంతర్జాతీయ అభిమానుల బృందం ఆయనకు ఉంది. వచ్చే జనవరి నాటికి మన్మోహన్ పీడకల ముగిసిపోతుంది. నేడు ఆసియాలోని యుద్ధ ప్రాంతాలు లెబనాన్, పాకిస్థాన్‌ల నుంచి మధ్య అసియా, పశ్చిమ చైనా ప్రాంతాలకు విస్తరిస్తుండగా, తూర్పు మధ్య ఆఫ్రికా నరమేధపు ఊబిగా దిగజారిపోతోంది. పేరుకుంటున్న ఈ అంతర్జాతీ య సంక్షోభం వచ్చే జనవరి నాటికి విపత్కర ప్రమాణాలకు చేరుతుంది. జాతీయ సరిహద్దులను దాటి గణనీ యంగా గుర్తింపు ఉన్న వాళ్లు నేడు ఇద్దరే ఉన్నారు... బిల్ క్లింటన్, టోనీ బ్లయర్. క్లింటన్ ఎక్కడికి వెళితే అక్కడ అయన చెప్పేది వినేవారున్నారు. బ్లయర్ ఉపన్యాసాలకు రుసుం చెల్లిస్తారు. క్లింటన్ నేడు మనకు అవసరమైన ప్రపంచ రాజనీతిజ్ఞుడు కాగలవారు. కానీ ఆయన హృదయమంతా అమెరికా రాజధాని వాషింగ్టన్‌పైనే ఉంది, ఆయన భార్య శ్వేత సౌధ పీఠం కోసం పోటీకి దిగే అవకాశాలపైనే ఉంది. మధ్యప్రాచ్యం గాయాలకు ఉపశమన కారిగా, భావజాల పరిరక్షకునిగా పాశ్చాత్య దేశాలు టోనీ బ్లయర్ లాంటి దారి దొంగను ఎంచుకోవడం కొంత దిగ్భ్రాంతికరమైన విషయమే. ఇరాక్‌లో బ్లయర్ నిర్వాకం ప్రపంచంలోనే అతి పెద్ద విప్లవకర అతివాదపు (రాడికల్ ఎక్స్‌ట్రీమిజం) మరుగుదొడ్లలో ఒకటిగా నిలుస్తుంది. అవసరమైనదాని కంటే ఎక్కువ కాలమే సహించిన గత కాలపు మిడిసిపాటు నేతగా ఆయనను వదిలి వేయడమే బహుశా జరగు తుంది. పైగా ఆఫ్రో-ఆసియా దేశాలకు కావాల్సింది ఆఫ్రో-ఆసియన్ నాయకత్వమే. విద్వేషపూరితమైన యుద్ధాలకు ఆజ్యాన్ని పోసే ఉద్వేగాలలో చిక్కుపడిపోయిన ప్రాంతాలలోని పగ, విద్వేషాలకు అతీతమైన తటస్థ స్వరం మన్మోహన్‌కు ఉన్న అతి పెద్ద అనుకూలత. అరబ్బు-ఇజ్రాయెల్‌ల చారిత్రాత్మక యుద్ధం విషయంలో మాత్రమే అది ఒకప్పుడు నిజం. కానీ సిరియా అంతర్యుద్ధం, ఇరాక్‌లో తిరిగి నెలకొన్న అరాచకత్వం పాలస్తీనాను కమ్మేసాయి. అఫ్ఘానిస్థాన్‌లో అమెరికా ఉనికి ఒక స్థావరానికి, మూసిన తలుపులకు కుంచించుకుపోయాక కాబూల్ తాలిబన్ల మధ్య యుద్ధాలు తీవ్రమై, పాకిస్థాన్‌కు పాకుతాయి. యుద్ధాలకు సరిహద్దులపై ఎప్పుడూ గౌరవం ఉండదు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా ప్రభుత్వాలతో పాటూ సంక్షోభ ప్రాంతాల నడుమ ఉన్న అన్ని దేశాల ప్రభుత్వాల వద్ద మన్మోహన్‌కు బోలెడంత విశ్వసనీయత ఉన్నది. ఆయనకు అంతా మంచి, అంతా చెడూ అనే నలుపు-తెలుపు ఎంపిక పద్ధతి లేదు. ఆయనలోని ఈ లక్షణం అలసట చెంది ఉన్న యోధులకు సాంత్వనను కలుగ జేస్తుంది. మన్మోహన్‌లోని సముచితమైన, ఆచరణాత్మక మైన తీర్పరితనం, ప్రశాంతత పెన్నిధి కాగలుగుతాయి. ఆ రెండు గుణాలకు బహుమతులుంటాయి.