cannot
-
ఆ అధికారం వారికి లేదు: వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ: భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జాతీయ శాసనసభ్యుల సదస్సులో మాట్లాడుతూ న్యాయస్థానాలకు చట్టాల రూపకల్పనలో జోక్యం చేసుకునే హక్కు లేదన్నారు. రాజ్యాంగం న్యాయస్థానాల విధులను, చట్టసభల విధులను స్పష్టంగా వివరించిందని, మేము గొప్పంటే మేము గొప్పని ఎవ్వరూ ఆధిపత్యం ప్రదర్శించాల్సిన అవసరం లేదని అన్నారు. ఇటీవల సుప్రీం కోర్టు పార్లమెంటు చట్టం చేసే లోపు ప్రధాన ఎన్నికల కమీషనరును, ఎన్నికల కమీషనర్లను ఎన్నుకునేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం జరిగిన జాతీయ శాసనసభ్యుల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. శాసనాలను చేసే అధికారం రాజ్యాంగం శాసనసభలకు మాత్రమే ఇచ్చింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు చట్టాలు చేసేటప్పుడు బిల్లు ప్రయోజనాలపై కూలంకషంగా చర్చించి, వాదోపవాదాలు చేస్తారు. అనంతరం అవి ప్రజలకు ఉపయోగపడే అంశమై అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆమోదయోగ్యమైతే తప్ప వాటిని ఆమోదించరు. ప్రజాస్వామ్యంలో అదొక భాగమని తెలిపారు. చట్టసభల్లో ఆమోదించిన బిల్లులు చట్టబద్ధంగానూ, రాజ్యాంగబద్ధంగానూ ఉన్నాయా? లేదా? అని మాత్రమే న్యాయవ్యవస్థ చూడాలి తప్ప చట్టాలు చేసి అధికారం రాజ్యాంగం వారికి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ చట్టాలన్నిటినీ శాసనసభ నిర్ణయిస్తుంది, ఎగ్జిక్యూటివ్ అమలు చేస్తుంది. ఈ క్రమంలో ఎక్కడైనా నిబంధనలను ఉలంఘించినట్లు అనిపిస్తే ఎవ్వరైనా కోర్టును ఆశ్రయించవచ్చని, అలాంటి సందర్భాల్లో మాత్రం వారు సత్వర న్యాయం చేయాలని ఆయన అన్నారు. ఇది కూడా చదవండి: ప్లాట్ఫారం నాయకుడిలా మాట్లాడకండి.. నోరు జాగ్రత్త! -
69 ఏళ్లలో దళితులకు ఒరిగిందేమీ లేదు
వర్గీకరణ విషయంలో ఏఎమ్మార్పీఎస్ది న్యాయమైన పోరాటం –వెనుకబడిన కులాలు ఏకం కావాలి –హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకాంత్, ప్రజా యుద్ధనౌక గద్దర్ ఆలేరు: స్వాతంత్య్రం సిద్ధించి 69 సంవత్సరాలు గడిచినా దళితులకు ఒరిగిందేమీ లేదని హైకోర్టు రిటైర్ట్ జడ్జి జస్టిస్ చంద్రకాంత్ అన్నారు. రాజ్యాంగ పరంగా ఎస్సీ వర్గీకరణ సాధించుకోవాలని పిలుపునిచ్చారు. మండలంలోని కొలనుపాకలో ఆదివారం ఎమ్మార్పీఎస్(టీఎస్) ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కోరుతూ మాదిగ చైతన్య పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ వర్గీకరణ విషయంలో ఎమ్మార్పీఎస్ న్యాయమైన పోరాటం చేస్తుందన్నారు. వర్గీకరణ విషయంలో పాలకులు నాటకం ఆడుతున్నారని, పార్లమెంట్లో బిల్లును పెట్టేవరకు ఉద్యమించాలన్నారు. ప్రజయుద్ధనౌక గద్దర్ మాట్లాడుతూ వెనకబడిన కులాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో 85శాతం కులాలు వెనుకబాటుకు గురవుతున్నాయని, 15 శాతం కులాలు మాత్రమే ఆధిపత్యాన్ని చెలయిస్తున్నాయని పేర్కొన్నారు. కులవృత్తులు నానాటికీ కుంటుపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్(టీఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు సుంకపాక యాదయ్య, యాతాకుల భాస్కర్, జాతీయ గౌరవ అధ్యక్షుడు సండ్రపల్లి వెంకటయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్య, వైద్యులు ఆదాం, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.