CBI Questioning
-
మా నాన్నకు ఏమన్నా అయితే.. ఎవ్వరినీ వదలను: లాలూ కూతురు
న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం కేసులో బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను సీబీఐ ప్రశ్నిస్తున్నసమయంలో ఆయన కుతూరు రోహిణి ఆచార్య కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ తన తండ్రికి ఏమైనా అయితే ఎవ్వరినీ వదలనని హెచ్చరించారు. తన తండ్రిని తరచూ వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రోహిణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరికాదని పేర్కొన్నారు. ఇప్పుడు జరుగుతున్నంతా గుర్తుపెట్టుకుంటామని, టైం వచ్చినప్పుడు వాళ్ల పనిచెబుతామని వ్యాఖ్యానించారు. ఒకవేళ లాలూకు ఏదైనా జరిగితే ఢిల్లీ పీఠాన్ని కదిలించే శక్తి తమకు ఉందని రోహిణి ట్వీట్ చేశారు. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని, దాన్ని పరీక్షిస్తున్నారని ధ్వజమెత్తారు. पापा को लगातार परेशान किया जा रहा है। अगर उन्हें कुछ हुआ तो मैं किसी को नहीं छोड़ूंगी। पापा को तंग कर रहे हैं यह ठीक बात नहीं है। यह सब याद रखा जाएगा। समय बलवान होता है, उसमें बड़ी ताकत होती है। यह याद रखना होगा। — Rohini Acharya (@RohiniAcharya2) March 7, 2023 రోహిణి ఆచార్య.. లాలూ యాజవ్ రెండో కుమార్తె. తన తండ్రి కిడ్నీలు చెడిపోతే ఈమె ఒక కిడ్నీని దానం చేసి ఆయనపై ప్రేమను చాటుకున్నారు. సింగపూర్‌లో ఈ శస్త్రచికిత్స జరిగింది. ఫిబ్రవరి 11న భారత్‌కు తిరిగివచ్చిన లాలూ తన పెద్ద కుమార్తె, ఎంపీ మిసా భారతి ఢిల్లీ నివాసంలో ఉంటున్నారు. అయితే ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కుంభకోణానికి సంబంధించి లాలూను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు మంగళవారం ఉదయం మిసా భారతీ నివాసానికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే తన తండ్రి అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా వేధిస్తున్నారని రోహిణి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ఆర్ఎస్ఎస్ ఓ రహస్య సమాజం: రాహుల్ గాంధీ -
అలహాబాద్ బ్యాంక్ సీఈవోను ప్రశ్నించిన సీబీఐ
పీఎన్బీ కుంభకోణానికి సంబంధించి అలహాబాద్ బ్యాంక్ సీఈవో, ఎండీ ఉషా అనంతసుబ్రమణియన్‌ను సీబీఐ మంగళవారం ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవలే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)కి చీఫ్‌గా ఎన్నికైన ఉష.. గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో సీనియర్ స్థానాల్లో కూడా పనిచేశారు. 2015 ఆగస్టు 14 దాకా ఆమె పీఎన్బీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా వ్యవహరించారు. ఆ తర్వాత 2017 మే 6న అలహాబాద్ బ్యాంక్ సీఈవోగా నియమితులయ్యారు. తాజా కేసులో ఆమెను నిందితురాలిగా ప్రశ్నించడం లేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. బ్యాంకు పర్యవేక్షణ వ్యవస్థ కన్నుగప్పి.. ఇంత భారీ లావాదేవీలు ఎలా చోటుచేసుకున్నాయి, ఇలాంటి వాటి గురించి ఆడిటర్లు ఎప్పుడైనా తమ నివేదికల్లో హెచ్చరికల్లాంటివేమైనా చేశారా లేదా అనే అంశాలపై స్పష్టత కోసం ఉషను ప్రశ్నిస్తున్నట్లు వివరించాయి. గీతాంజలి జెమ్స్ ఖాతాల ఫోరెన్సిక్ ఆడిట్.. గీతాంజలి జెమ్స్ మోసానికి పాల్పడిందా లేదా అన్నది నిర్ధారించుకునేందుకు సంస్థ ఖాతాల ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని బ్యాంకులు నిర్ణయించాయి. ఇందుకోసం టీఆర్ చద్ధా అండ్ కంపెనీని నియమించుకున్నాయి. ఆడిట్ పలితాలను బట్టి ఈ ఖాతాను ప్రామాణికమైనదిగానో లేదా మొండిపద్దుగానో పరిగణించడంపై బ్యాంకులు నిర్ణయం తీసుకోనున్నాయి. -
ఆస్తులు ఎలా సంపాదించానో తెలియదు: సీఎం
సిమ్లా: అక్రమ ఆస్తుల కేసులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తన భార్య, పిల్లల పేరుతో ఆయన కూడబెట్టిన అక్రమ ఆస్తులకు సంబంధించి సీబీఐ గట్టి ఆధారాలు సంపాదించినట్టు తెలుస్తోంది. వీరభద్ర సింగ్, ఆయన అనుచరులు, భాగస్వాములు కుట్రలు చేసి ఏవిధంగా ఆస్తులు సంపాదించారనే దానిపై సీబీఐ వద్ద సాక్ష్యాలున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వీరభద్ర సింగ్ ను గురువారం సీబీఐ అధికారులు ప్రశ్నించారు. తన భార్య, పిల్లలు పేరు మీద ఆస్తులు ఎలా సంపాదించాననో తెలియదని సీబీఐ విచారణలో ఆయన చెప్పినట్టు సమాచారం. ఎఫ్ఐఆర్ లో పేర్లు ఉన్నవారందిరినీ త్వరలోనే సీబీఐ అధికారులు ప్రశ్నించే అవకాశముంది.