cellphone driving
-
కస్సు బస్సు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సులు రోడ్లపై హడలెత్తిస్తున్నాయి. సిటీ, ఇతర జిల్లాలు, రాష్ట్రాల బస్సులనే తేడా లేకుండా యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. ఇటీవల ఆ సంస్థ తీసుకున్న ‘డ్రైవర్ నంబర్’ నిర్ణయం సైతం సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను ప్రోత్సహించేలా ఉంది. మరోపక్క నగరంలో ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గించే ఉద్దేశంతో పోలీసు విభాగం ప్రతిపాదించిన రూట్ల పొడిగింపు అంశాన్నీ ఆ సంస్థ పట్టించుకోవట్లేదు. నడిరోడ్లే వారికి బస్‌బేలు.. నగరంలో తిరిగే సిటీ బస్సుల కోసం అనేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా బస్టాపులు, బస్ బేలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఇతర వాహనాలు ఆగకుండా కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ సిబ్బంది కూడా పని చేస్తుంటారు. అనేక సిటీ బస్సులు వీటిల్లో కాకుండా నడిరోడ్డుపై ఆగుతుంటాయి. ఒకేసారి అనేక బస్సులు రావడంతో పాటు డ్రైవర్ల నిర్లక్ష్యమూ దీనికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఇది చాలదన్నట్లు ఇటీవల ఆర్టీసీ అధికారులు ప్రయాణికులు ఎక్కడ చెయ్యెత్తితే అక్కడ బస్సులు ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో బస్టాప్‌లు, బస్ బేలు ఉన్న చోట మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ నడిరోడ్లపై ఆగుతున్న ఆర్టీసీ బస్సులు ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతున్నాయి. రూట్లపై స్పందన నామమాత్రం.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరే ఆర్టీసీ బస్సుల గమ్యస్థానం మెహిదీపట్నంగా ఉంటోంది. ఈ రూట్లు ఇక్కడితో ముగిసిపోతుండటంతో స్థానికంగా ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయి. అవే ఆర్టీసీ బస్సు రూట్లు అటు షేక్‌పేట్, ఇటు అత్తాపూర్ వరకు ఉంటే మెహిదీపట్నం ప్రాంతంలో రద్దీ తగ్గుతుంది. రాజధానిలోని అనేక ఆర్టీసీ రూట్లు ఇలానే ఉన్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సిటీ ట్రాఫిక్ వింగ్ వీటి పొడిగింపుపై దృష్టి పెట్టింది. దీనికి అవసరమైన అధ్యయనంలో బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ నిపుణుల సహాయం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆర్టీసీ అధికారులను కోరింది. దీనిపైనా ఆ విభాగం నుంచి నామమాత్రపు స్పందనే వచ్చింది. అధ్యయనానికి ఏమాత్రం ఉపకరించని విధంగా ప్రతిపాదనలు పంపడం విమర్శలకు తావిస్తోంది. (చదవండి: పైసలు తీసుకుంటూ పట్టుబడ్డారు) -
సెల్ ఫోన్ డ్రైవింగ్ వీకెండ్లోనే ఎక్కువ.. ఎందుకంటే!
చట్టాలు కఠినతరం చేస్తున్నా, జరిమానాలు భారీగా విధిస్తున్నా ట్రాఫిక్ ఉల్లంఘనలు ఆగడం లేదు. అడ్డదిడ్డంగా వాహనాలు నడపడం, సిగ్నల్స్ పట్టించుకోకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్న వారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(ఐఐపీహెచ్), మరో రెండు స్వచ్ఛంద సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన అధ్యయనంలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్‌తో పరేషాన్ హైదరాబాద్‌లో 16.5 శాతం మంది దిచక్ర వాహన చోదకులు డ్రైవింగ్ చూస్తూ ఫోన్ మాట్లాడుతున్నారని అధ్యయనంలో తేలింది. వీరిలో 71.7 శాతం మంది ఫోన్‌ను చేతితో పట్టుకోకుండానే వాహనాలు నడుపుతున్నారు. అంటే ఇయర్‌ఫోన్స్, బ్లూటూత్ వినియోగిడం లేదా ఫోన్‌ను హెల్మెట్ లోపల పెట్టుకుని మాట్లాడుతున్నారన్న మాట. వీక్‌డేస్(35.49%)తో పోలిస్తే వారాంతాల్లో సెల్‌ఫోన్ డ్రైవింగ్(64.51%) చేసే వారే ఎక్కువగా ఉన్నారు. బిజీ రోడ్లలో 26.08%, రద్దీ లేని రహదారుల్లో 73.92% మంది దిచక్ర వాహనదారులు ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారు. రద్దీ సమయాల్లో పోలిస్తే(30.09%), రద్దీలేని సమయంలోనే (69.91%) ఈ ట్రెండ్ ఎక్కువగా కనబడుతోంది. చట్టంలో సవరణలు చేయాలి అధ్యయంలో భాగంగా మాదాపూర్ ఐటీ కారిడార్, అమీర్‌పేట, మేడ్చల్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను వీడియో తీసి విశ్లేషించారు. ఏయే సమయాల్లో ఆయా రహదారులపై వాహనదారులు సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారనే విషయాన్ని లోతుగా పరిశీలించారు. ‘ఎక్కువ మంది వాహన చోదకులు హేండ్ ఫ్రీ మోడ్‌లోనే డ్రైవ్ చేస్తున్నారు. ఫోన్ మాట్లాడుతూ బండి నడిపే వారి సంఖ్య వీకెండ్లోనే అధికంగా ఉంటోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే నాన్-బిజీ రోడ్లపై రద్దీ తక్కువగా సమయంలోనే సెల్‌ఫోన్ డ్రైవింగ్ ఎక్కువగా కనబడుతోంది. వీక్‌డేస్‌తో పోలిస్తే ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వారి సంఖ్య వారాంతాల్లో ఒకటిన్నర శాతం అధికంగా ఉన్నట్టు గుర్తించాం. చేతులతో ఫోన్ పట్టుకుని వాహనం నడిపేవారితో పాటు హేండ్ ఫ్రీ ఫోన్ డ్రైవింగ్ చేసే వారికి కూడా జరిమానాలు విధించేలా మోటార్ వెహికల్ చట్టంలో సవరణలు చేర్చాల’ని పరిశోధకులు కోరుతున్నారు. (క్లిక్: ఫోర్త్ వేవ్‌కు అవకాశాలు తక్కువ.. కానీ) మూడేళ్లలో 85 వేల కేసులు సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. గత మూడేళ్లలో 85,862 సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్టు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. ఫోన్ మాట్లాడుతూ.. వాహనాలు నడిపే వారిపై మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 184 కింద కేసులు నమోదు చేస్తామన్నారు. 85,862 కేసుల్లో దాదాపు 68,900 కేసులకు సంబంధించి జరిమానాలు వసూలయ్యాయని.. 16,782 జరిమానాలు పెండింగ్‌లో ఉన్నట్టు వెల్లడించారు. 2021లో 36,566 సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. (క్లిక్: మెడికల్ పీజీ ‘బ్లాక్’ దందా!) -
సెల్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే 10 వేలు ఫైన్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రోడ్డు భద్రతా నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే వాహనదారులకు రూ.10 వేలు జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భారీగా జరిమానాలు విధిస్తేనే పౌరుల్లో బాధ్యత పెరుగుతుందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం గత ఏడాదిగా మద్యం మత్తులో డ్రైవ్ చేసినా, అంబులెన్స్‌లకు దారి ఇవ్వకపోయినా చోదకుల నుంచి 10 వేల రూపాయల వరకు జరిమానా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు మొబైల్ మాట్లాడటం కూడా అందులో చేరింది. -
బండిపై హలో.. జైలుకి చలో..!
సాక్షి, అమరావతిబ్యూరో: సెల్ఫోన్లో మాట్లాడుతూ రోడ్డుపై వాహనం నడుపుతున్నారా? అయితే మీ డ్రైవింగ్ లెసెన్స్ రద్దుతోపాటు మీరు జైలుకు వెళ్లడం ఖాయం. ఎందుకంటే.. సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. ఇది ప్రమాదాలకు దారితీస్తోందంటూ కోర్టులకు నివేదించనున్నారు. ఇప్పటికే మెట్రో నగరాల్లో ఇలాంటి కేసుల తీవ్రతను పరిశీలిస్తున్న న్యాయమూర్తులు జరిమానాతో పాటు జైలుశిక్షలు విధిస్తున్నారు. ఇటీవల నగర కమిషనరేట్ పరి«ధిలోనూ సెల్‌ఫోన్ చూస్తూ వాహనదారులు చేస్తున్న ప్రమాదాలు పెరుగుతుండడంతో పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమై ఈ ప్రమాదాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదాల కారణాలు.. నగర ట్రాఫిక్ పోలీసులు వాహనచోదకులు సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తున్నా, హెల్మెట్‌లో ఫోన్‌ను ఉంచుకుని వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని పట్టుకుంటున్నారు. పోలీసులు లేని చోట్ల కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానమైన సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. 2019 జనవరి నుంచి 2020 జనవరి వరకు 5,388 మందిపై సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశారు. సెల్ఫోన్లో మాట్లాడుతూ వెళ్తున్న చోదకులు చేస్తున్న ప్రమాదాలు పెరుగుతుండడంతో కొన్ని ప్రత్యేక బృందాలు వాహనచోదకుల తీరును గమనిస్తున్నాయి. సెల్‌ఫోన్‌తో మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు చోదకుల ప్రవర్తనల్లో మార్పులను బృందం సభ్యులు పరిశీలించారు. ఫోన్ మోగగానే... ద్విచక్రవాహనచోదకులు వెంటనే దాన్ని చేతికి తీసుకుని మరో చేత్తో వాహన వేగాన్ని నియంత్రిస్తున్నారు. మరికొందరు అవతలి వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు వినిపించకపోవడంతో ఫోన్ దగ్గరగా పట్టుకునే ప్రయత్నంలో యాక్సిలేటర్ ఎక్కువగా ఇస్తున్నారు. దీంతో ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొడుతున్నారు. మూడేళ్లలో వెయ్యిమందికిపైగా మృత్యువాత.. విజయవాడలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటా వీటి సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. జరిగిన ప్రమాదాలను విశ్లేషిస్తే 80 శాతంపైగా ప్రమాదాలు సెల్ఫోన్లో మాట్లాడుతున్న సందర్భంలోనే చోటుచేసుకున్నట్లుగా దర్యాప్తులో తేలింది. 2017లో 349 మంది వాహనచోదకులు మృత్యువాత పడగా.. 2018లో 359 మంది, 2019 నుంచి 2020 జనవరి నాటి వరకూ 375 మంది మరణించారు. కఠిన చర్యలు ఉంటాయి.. అధిక శాతం మంది ట్రాఫిక్ నిబంధనలను పాటించకకుండా అడ్డదిడ్డంగా వాహనాలు నడపుతున్నారు. దీనివల్ల వారి ప్రాణాలతో పాటు ఎదుటి వారి ప్రాణాలు పోవడానికి కారకులవుతున్నారు. అత్యధిక శాతం ప్రమాదాలు సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న సందర్భంలోనే జరిగాయి. గత పదమూడు నెలల కాలంలో నగరంలో 5,388 మంది వాహనచోదకులు సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలను నడుపుతుండటం వల్ల వారిపై కేసులు నమోదు చేశాం. ఇప్పటి వరకు కేవలం జరిమానాలతో సరిపెట్టాం. ఇకపై కఠిన చర్యలు తీసుకుంటాం. – టీవీ నాగరాజు, విజయవాడ ట్రాఫిక్ డీసీపీ -
డ్రైవింగ్‌లో ఫోన్ ముట్టుకుంటే ఫైన్!
న్యూఢిల్లీ : రోడ్లపై డ్రైవ్ చేస్తూ మొబైల్ ఫోన్లో మాట్లాడటాన్ని దాదాపు అన్ని దేశాలు నిషేధించిన విషయం తెల్సిందే. అయినప్పటికీ అంతటా కొందరు ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తున్నారు. బ్రిటన్‌లో భారీ ఫైన్లు, కఠిన శిక్షలు ఉన్నప్పటికీ అక్కడి కూడా మొబైల్ ఫోన్ల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తగ్గడం లేదు. ఫోన్లే మాట్లాడినట్లు సీసీ టీవీ కెమేరాలకు ఒకటి, రెండు సార్లు ఫైన్లు, అంతకన్నా ఎక్కువ దొరికితే లైసెన్స్ రద్దు లాంటి శిక్షలు విధించినా ఎందుకు నేరాలు తగ్గడం లేదనే కోణంలో పరిశీలించగా బ్రిటన్ మోటారు వాహన చట్టంలో లోపం ఉన్నట్లు తేలింది. ఇంతవరకు ఫోన్లో మాట్లాడితేనే శిక్షలు విధిస్తూ వస్తున్నారు. మొబైల్ ఫోన్లో ఫోటోలు చూసినా, తీసినా, మిస్సెజ్‌లు చదివినా, మ్యూజిక్ ఆప్‌లు సర్చ్ చేసినా శిక్షలు లేవు. మొబైల్లో ఫోన్లో ఇలాంటి చేయడం వల్లనే ప్రమాదాలు తగ్గడం లేదని నిపుణులు సూచించడంతో బ్రిటన్ ఈ రోజు నుంచి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. వాహనాన్ని నడుపుతూ ఏ కారణంతోనైనా మొబైల్ ముట్టుకుంటే చాలు 200 పౌండ్ల (18.500 రూపాయలు) వరకు ఫైన్. ఆరు పాయింట్ల విధింపు. 35 పాయింట్ల లోపున్న యువకుల్లో 17 నుంచి 25 శాతం వరకు డ్రైవర్లు మిస్సేజ్‌లు చూడడమో, సోషల్ మీడియాలు చెక్ చేసుకోవడమో చేస్తున్నారు. ఫోన్ మాట్లాడితే అద్దాల గుండా కనిపిస్తోంది. ఫోన్‌ను ముట్టుకుంటే ఎలా తెలియాలి! అందుకని అన్ని వీధుల్లో హెచ్డీ సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేయాలని బ్రిటన్ అధికారులు నిర్ణయించారు. -
సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే జైలుశిక్షా?
సాక్షి, హైదరాబాద్: సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపిన ఓ యువకుడికి 4 రోజుల జైలుశిక్ష విధిస్తూ సైబరాబాద్ నాలుగో స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులు ‘కఠిన’మైనవిగా హైకోర్టు అభివర్ణించింది. ఇటువంటి చిన్న నేరాలకు జైలుశిక్ష విధించడం సబబుకాదని అభిప్రాయపడింది. వివరాలు.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపారని పోలీసులు భరద్వాజ్ అనే యువకుడిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు సైబరాబాద్ నాలుగో స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అతడికి నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ భరద్వాజ్ మేనమామ, కొండాపూర్‌కు చెందిన పంతంగి రమాకాంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం లంచ్‌మోషన్ రూపంలో అత్యవసరంగా విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పి.శశికిరణ్ వాదనలు వినిపించారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం నేరమే అయినప్పటికీ, ముందు జరిమానా విధించి ఓ హెచ్చరిక జారీ చేసి ఉంటే బాగుండేదని ధర్మాసనం అభిప్రాయపడింది. చిన్న తప్పుకు జైలుశిక్ష అనుభవిస్తే, సమాజం ఆ యువకుడిని దోషిగా చూస్తుందని, దీని వల్ల అతని కుటుంబం వేదన అనుభవించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. న్యాయాధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని, 4 రోజులు జైలులో ఉండొస్తే, ఆ కళంకం ఎలా ఉంటుందో వారికి అర్థమవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. జైలుశిక్షను రద్దు చేసి అతనికి రూ.500 జరిమానా విధించింది. అతన్ని తక్షణమే విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. -
సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు షాక్..
రూ. 1035 జరిమానా విధింపు సీసీ కెమేరాల ఆధారంగా గుర్తింపు వాహనదారుడి ఇంటికి వస్తున్న రశీదు తణుకు అర్బన్ : నిబంధనలు పాటించకుండా వాహనాలతో రోడ్డెక్కితే.. జరిమానాల రూపంలో గుండెజల్లు మనిపిస్తున్నారు. వాహనం డ్రైవ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడితే మరీ నేరంగా పరిగణిస్తున్నారు. పోలీసులు విధించే జరిమానాతో నిజంగా మూర్చపోతారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనదారులు నిబంధనలు పాటించాలనే ఉద్దేశంతో ఇటీవల పోలీసు అధికారులు ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నారు. సాంకేతికతను వినియోగించుకుంటూ ఇప్పటికే తణుకు పట్టణంలోని పలు సెంటర్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిబంధనలు అతిక్రమించిన వారి వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు. నంబరు బోర్డు ప్రకారం వారికి విధించిన జరిమానాలు ఇంటి అడ్రసుకు రశీదు రూపంలో పంపిస్తున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ కానిస్టేబుళ్ల వద్ద ఉన్న కెమేరాల్లో చిక్కిన వాహనాలకు కూడా రశీదు ఇంటికి వెళ్తుంది. ముఖ్యంగా అత్యధిక జరిమాన సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు విధిస్తున్నారు. జరిమానాలు ఇలా.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపే వారికి ఇటీవల కాలంలో రూ.1035 జరిమానా విధించిన బిల్లు ఇంటికి చేరుతోంది. అందులో వారు సెల్‌ఫోన్ మాట్లాడుతున్నట్టుగా వారి ఫొటోను సైతం పొందుపరుస్తున్నారు. దీంతో ఆ వాహనదారుడు గుండె గుభిల్లుమనడమే కాకుండా ఫోన్ వచ్చిన సందర్భంలో రోడ్డు పక్కన ఆగి మాట్లాడాల్సిందే అనే పశ్చాత్తాపం కూడా కలుగుతోంది. దీంతో పాటు నంబరు ప్లేటుపై రిజిస్ట్రేషన్ లేని బళ్లకు రూ.1000, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన వాహనాలకు రూ.500, నిబంధనలకు విరుద్దంగా వాహనాన్ని పార్కింగ్ చేస్తే రూ.335, నంబరు ప్లేటులో నిబంధనలు పాటించకపోతే రూ.100, హెల్మెట్ పెట్టుకోకపోతే రూ.100 జరిమానాలు మన ఇంటి గుమ్మంలోకి పోస్టుమాన్ ద్వారా తలుపు తడుతున్నాయ్. దీంతో వాహనదారులు తమ వాహనాలను ఇతరులకు ఇవ్వాలన్నా సంశాయించాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. పై జరిమానాలన్నీ ఈ సేవా కేంద్రాల్లో చెల్లించే విధంగా నియమావళిని ఏర్పాటు చేశారు. నిబంధనలు మీరితే క్షమించం రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రకమైన జరిమానాలు విధిస్తున్నాం. ముఖ్యంగా వాహనం డ్రైవ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడడం క్షమించలేని పొరపాటు. వాహనచోదకుడితో పాటు రోడ్డుపై ప్రయాణించే వారిని ప్రమాదంలోకి నెట్టే పరిస్థితి సెల్‌ఫోన్ డ్రైవింగ్ వల్ల ఉంది. ఈ జరిమానాలు విధింపు మొదలయ్యాక కొంతమేర మార్పు వచ్చింది. -జీజే ప్రసాద్, తణుకు ట్రాఫిక్ ఎస్సై -
లేడీ కానిస్టేబుల్‌పై నాయకుడి ప్రతాపం!
సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని చెప్పినందుకు డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్‌పై ఓ రాజకీయ నేత దాడి చేశాడు. ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. విధి నిర్వహణలో పక్కాగా ఉన్నందుకు ఆమెకు దక్కిన బహుమానమిది. ముంబై నగరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్రైవింగ్ చేస్తూ, సెల్ఫోన్లో మాట్లాడుతున్నందుకు మహిళా కానిస్టేబుల్ అతని కారును ఆపారు. దీంతో ఆవేశంతో ఊగిపోతూ సదరు వ్యక్తి కారు దిగుతూనే కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నాడు. మహిళ అని కూడా చూడకుండా దారుణంగా కొట్టాడు. ముంబైలో జరిగిన ఈ దాడి దృశ్యాలు సీసీటీవీ కెమేరాకు చిక్కాయి. బాధిత కానిస్టేబుల్ ఈ ఘటనపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడ్డ వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తిని శివసేన పార్టీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే తమ పార్టీకి.. ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదంటూ శివసేన చెబుతోంది. -
సెల్ఫోన్లో మాట్లాడితే లైసెన్స్ రద్దు
దేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నియమ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. నిర్దిష్ట వేగాన్ని మించి వాహనాన్ని నడిపినా, సిగ్నల్ జంప్ చేసినా, డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్లో మాట్లాడినా, మద్యం మత్తులో వాహనం నడిపినా, గూడ్స్ వాహనంలో ఎక్కువ లోడ్ ఉన్నా, గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకున్నా భారీ జరిమానాతో పాటు మూడు నెలల పాటు లైసెన్స్ లను రద్దు చేయాలని నిర్ణయించింది. అలాగే అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో టూ వీలర్ డ్రైవర్లు, వారి వెనకాల కూర్చున్నవాళ్లకు కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధనలను సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కచ్చితంగా అమలు చేయాలంటూ అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది. ప్రతి మూడు నెలలకోసారి తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని కూడా అందులో ఆదేశించింది. మద్యం మత్తులో గానీ, మాదక ద్రవ్యాల మత్తులో గానీ వాహనాలను నడిపితే డ్రైవర్లను మోటారు వాహన చట్టంలోని 185వ సెక్షన్ కింద ప్రాసిక్యూట్ చేయాలని, జైలుశిక్ష విధించాలని, మొదటిసారి నేరం చేసినా సరే జైలుశిక్ష విధించాల్సిందేనంటూ సుప్రీం ప్యానెల్ నిర్దేశించింది. హెల్మెట్లు ధరించకుండా టూ వీలర్లు నడిపితే డ్రైవర్లతో పాటు వారి వెనక కూర్చున్న వారికి కూడా జరిమానా విధించాలని.. దానికి ముందు రెండు గంటలు తగ్గకుండా కౌన్సెలింగ్ ఇప్పించాలని సూచించింది. అలాగే నాలుగు చక్రాల వాహనాల్లో సీటు బెల్టులు ధరించని వారికి జరిమానాతో పాటు రెండు గంటలు తగ్గకుండా కౌన్సెలింగ్ ఇప్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. -
దగ్గర దారే మృత్యుమార్గం అయ్యింది!!
చిన్నారుల ప్రాణాలను కర్కశంగా తీసుకెళ్లిపోయిన ప్రమాదం జరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. దగ్గర దారి అనుకుని కాపలా లేని రైల్వే క్రాసింగ్ మీదుగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం సంభవించింది. బస్సుకు రోజూ వచ్చే డ్రైవర్ రాకపోవడంతో.. మరో డ్రైవర్‌ను పిలిపించారు. మాసాయిపేట వద్ద మొత్తం మూడు రైల్వే లెవెల్ క్రాసింగులు ఉన్నాయి. వాటిలో రెండింటికి గేట్లు, కాపలా కూడా ఉన్నాయి. ఈ రెండింటినీ కాదని, గేటు ఉండదన్న ఉద్దేశంతోనే మూడో క్రాసింగ్ మీదుగా వెళ్లాడని, అందుకే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. మొత్తం మూడు క్రాసింగులకు మధ్య దూరం కూడా కేవలం ఒకటిన్నర కిలోమీటర్లు మాత్రమేనని దక్షిణమధ్య రైల్వే సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కాపలా ఉన్న గేట్లు అయితే ఆగాల్సి వస్తుందని, గేటు లేనిచోట అయితే నేరుగా వెళ్లిపోవచ్చని డ్రైవర్ భావించడమే ఈ పెను ప్రమాదానికి కారణమైంది. 14 మంది చిన్నారులను కర్కశంగా చిదిమేసింది. సెల్‌ఫోనులో మాట్లాడుతూ.. బస్సు డ్రైవర్ సెల్‌ఫోనులో మాట్లాడుతుండటం వల్లే అతడు రైలు వస్తున్న విషయాన్ని గుర్తించలేదని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చిట్టచివరి నిమిషంలో వెనుక నుంచి పిల్లలంతా రైలు.. రైలు అని అరవడంతో ఒక్కసారి కంగారుపడి ఆలస్యంగా బ్రేకులు వేశాడని, కానీ.. దానివల్ల బస్సు ఆగకపోగా రైలు పట్టాల మీదుగా జారిపోవడంతో వేగంగా వస్తున్న రైలు ఢీకొందని అంటున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
సెల్‌ఫోన్ సంభాషణ.. ప్రాణం తీసింది!
వాహనాలు నడిపేటప్పుడు సెల్ఫోన్లలో మాట్లాడొద్దని ఎన్ని రకాలుగా హెచ్చరించినా.. చాలామంది పట్టించుకోరు. సరిగ్గా ఇదే ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. అనంతపురం జిల్లా బత్తలపల్లి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పవన్ కుమార్ (19) అనే యువకుడు మరణించాడు. ఇతడు తాడిమర్రి మండలం ఏకపాదంపల్లికి చెందిన దంపతుల ఏకూక కుమారుడు. అనంతపురం నగరం పీవీకేకే కాలేజిలో డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తిచేశాడు. సోమవారం అనంతపురానికి వెళ్లి స్వగ్రామానికి తిరిగొచ్చాడు. తర్వాత పనుందని గొట్లూరుకు మోటారు సైకిల్‌పై బయలుదేరాడు. మార్గమధ్యంలో ధర్మవరం-బత్తలపల్లి రహదారిలోని పోట్లమర్రి సమీపంలోకి రాగానే సెల్ మోగింది. సెల్లో మాట్లాడుతూనే బైకు నడుపుతున్నాడు. ఆ సమయంలో వెనుక వైపు నుంచి వేగంగా వస్తున్న బొలెరో వాహనం అతడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పవన్‌కుమార్‌ను బొలెరోలోనే బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే మృతి చెందాడు. వెనకనుంచి వచ్చే వాహనాలు హారన్ కొట్టినా వినిపించుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. -
ట్రాఫిక్ నిబంధనలు పై భారిగా జరిమానా
-
ట్రాఫిక్ సిగ్నల్ ‘జంపింగ్’తో జేబు గుల్లే!
సాక్షి, హైదరాబాద్: ఏం కాదులే అని సిగ్నల్ జంపింగ్ చేసేస్తున్నారా? బైక్ నడుపుతూ ఫోన్లు మాట్లాడేస్తున్నారా? రోడ్డు పక్కన ఎక్కడపడితే అక్కడ బండి పార్కింగ్ చేసేస్తున్నారా? ఇకపై అలా చేస్తే.. జేబుకు భారీగానే చిల్లు పడుతుంది. ఈ నెల 12 నుంచి సిగ్నల్ జంపింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఓవర్లోడింగ్, అక్రమ పార్కింగ్‌కు పాల్పడే వారిపై 2011 జీవో ఆధారంగా రూ.1,000 చొప్పున భారీ జరిమానాలు విధించనున్నట్లు హైదరాబాద్ అదనపు పోలీసు కమిషనర్(ట్రాఫిక్) అమిత్ గార్గ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ట్రాఫిక్ పోలీసుల కోణంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు ముఖ్యంగా మూడు రకాలు... వాహన చోదకుడికి ప్రమాదకరమైనవి, ఎదుటి వ్యక్తికి ప్రమాదకరంగా మారేవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ప్రాణాంతకమైనవి. వీటిలో అన్నింటికంటే చివరి అంశానికి సంబంధించినవి నిరోధించడానికి అధికారులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నాలుగు రకాల ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించినట్లు అమిత్ గార్గ్ తెలిపారు. సైబరాబాద్ పోలీసులు గత నెల నుంచే ఈ విధానాన్ని అమల్లో పెట్టారు. ఇతర ఉల్లంఘనల కంటే మద్యం తాగి వాహనాలు నడపడం, సిగ్నల్ జంపింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, అక్రమ పార్కింగ్ అత్యంత ప్రమాదకరమైనవని ట్రాఫిక్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు. వీటికి పాల్పడేది ఎక్కువగా యువత కావడంతో వారు ప్రమాదాలబారిన పడి.. బంగ రు భవిష్యత్తును పాడుచేసుకోవడంతోపాటు తల్లిదండ్రులకూ గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు. ఇప్పటికే మద్యం తాగి వాహనాలు నడుపుతున్నవారి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడంతోపాటు కోర్టులో హాజరుపరిచి, జైలు శిక్షలు సైతం పడేలా చేస్తున్నారు. ఇప్పుడు పైవాటిపై దృష్టి పెట్టారు. ఏమిటా జీవో? తక్కువస్థాయిలో ఉన్న జరిమానా మొత్తాలకు ఉల్లంఘనులు భయపడట్లేదని, ఈ మొత్తాలను భారీగా పెంచాల్సిన అవసరం ఉందని గతంలో అనేక సందర్భాల్లో న్యాయస్థానాలు అభిప్రాయపడ్డాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టానికి సవరణ చేస్తూ 2011లో ఉత్తర్వులు జారీ చేసింది. దాని ఆధారంగా 18 అంశాలకు సంబంధించిన ఉల్లంఘనల జరిమానాలు పెంచుతూ అదే ఏడాది ఆగస్టు 18న రాష్ట్ర ప్రభుత్వం జీవో నం. 108ను విడుదల చేసింది. దీనిపై విమర్శలు రావడంతో అమలును అనధికారికంగా నిలిపివేశారు. ఇప్పుడా జీవో దుమ్ము దులిపిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పై నాలుగు అంశాల విషయంలో అమలుకు నిర్ణయించారు.