లేడీ కానిస్టేబుల్‌పై నాయకుడి ప్రతాపం! | shiv sena leader attacks lady cop for objecting cellphone driving | Sakshi
Sakshi News home page

లేడీ కానిస్టేబుల్‌పై నాయకుడి ప్రతాపం!

Published Sat, Feb 27 2016 9:38 AM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM

లేడీ కానిస్టేబుల్‌పై నాయకుడి ప్రతాపం!

లేడీ కానిస్టేబుల్‌పై నాయకుడి ప్రతాపం!

సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని చెప్పినందుకు డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్‌పై ఓ రాజకీయ నేత దాడి చేశాడు. ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. విధి నిర్వహణలో పక్కాగా ఉన్నందుకు ఆమెకు దక్కిన బహుమానమిది. ముంబై నగరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

డ్రైవింగ్‌ చేస్తూ, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నందుకు మహిళా కానిస్టేబుల్‌ అతని కారును ఆపారు. దీంతో ఆవేశంతో ఊగిపోతూ సదరు వ్యక్తి కారు దిగుతూనే కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నాడు. మహిళ అని కూడా చూడకుండా దారుణంగా కొట్టాడు. ముంబైలో జరిగిన ఈ దాడి దృశ్యాలు సీసీటీవీ కెమేరాకు చిక్కాయి. బాధిత కానిస్టేబుల్‌ ఈ ఘటనపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దాడికి పాల్పడ్డ వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తిని శివసేన పార్టీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే తమ పార్టీకి.. ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదంటూ శివసేన చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement