లక్నో: ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రోడ్డు భద్రతా నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే వాహనదారులకు రూ.10 వేలు జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భారీగా జరిమానాలు విధిస్తేనే పౌరుల్లో బాధ్యత పెరుగుతుందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం గత ఏడాదిగా మద్యం మత్తులో డ్రైవ్ చేసినా, అంబులెన్స్‌లకు దారి ఇవ్వకపోయినా చోదకుల నుంచి 10 వేల రూపాయల వరకు జరిమానా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు మొబైల్ మాట్లాడటం కూడా అందులో చేరింది.
Comments
Please login to add a commentAdd a comment