the central and state governments
-
ప్రభుత్వ విధానాలతోనే రైతు ఆత్మహత్యలు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హుజూరాబాద్: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలతోనే రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. హుజూరాబాద్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కరువు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, కరువు నివేదికకు తగ్గట్టు సాయం అందించలేదని పేర్కొన్నారు. తీవ్రకరువుతో తాగునీటి వనరులు ఎండిపోరుునా అన్నదాతలను ఆదుకోవడంలేదన్నారు. పంటల పరిహారం అం దించడంలేదని తెలిపారు.ప్రైవేట్ పెట్టుబడులు, యాంత్రీకరణలపై మాత్రమే ప్రభుత్వాలు దృష్టి సారిస్తూ రైతు సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. రాష్ట్రంలోని సన్న, చి న్నకారు రైతులకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దే శంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాలకు తెలిపేందుకు అఖిల భారత రైతుసంఘం ఆధ్వర్యం లో జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నామని, రైతులు ఎ దుర్కొంటున్న సమస్యలపై చర్చించి ప్రభుత్వం ఒత్తిడి తీ సుకొస్తామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాం గోపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భిక్షపతి పాల్గొన్నారు. -
కార్మిక చట్టాలకు ప్రభుత్వాల తూట్లు
నరసరావుపేట వెస్ట్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా వ్యవహరిస్తూ కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పీజే చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. స్థానిక ఏంజెల్ టాకీసు సెంటర్లో శనివారం రాత్రి ఏఐటీయూసీ జిల్లా 9వ మహాసభల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు, రక్త తర్పణం చేసి సాధించుకున్న చట్టాలను ప్రభుత్వాలు అమలు చేయకుండా కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాల పేరుతో పారిశ్రామిక కార్పొరేట్లకు లక్షల కోట్లు దోచిపెడుతున్నాయని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను రద్దుచేసి వారి గొంతునొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇన్సూరెన్స్, రైల్వే, డిఫెన్స్, ఆయిల్ వంటి కీలక పరిశ్రమలన్నింటిని ఆక్రమించేందుకు విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నాయని విమర్శించారు. ధరలు ఆకాశాన్నంటుతుండడంతో కార్మికుల బతుకులు దయనీయంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కార్మికులందరూ ఏకమై నిలదీయాలని చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామిక వర్గాలను మరింత దుర్భర స్థితిలోకి నెట్టేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. గుంటూరు జిల్లా రాజధానిగా ఏర్పడడం వల్ల ఈ ప్రాంతానికి ఎన్నో పరిశ్రమలు, కేంద్ర, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు వస్తాయని, రానున్న పదేళ్లలో జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోట మాల్యాద్రి సభకు అధ్యక్షత వహించగా.. జిల్లా ప్రదాన కార్యదర్సి వెలుగూరి రాధాకృష్ణమూర్తి, రాష్ట్ర నాయకులు జీవీ కృష్ణారావు, వర్కింగ్ అధ్యక్షుడు చల్లా చినఆంజనేయులు, నియోజకవర్గ గౌరవాధ్యక్షుడు సీహెచ్ఎల్కాంతారావు, షేక్ సైదా, ఉప్పలపాటి రంగయ్య, కాసా రాంబాబు, సీఆర్‌మోహన్, మారుతీవరప్రసాదు, జి.సురేష్, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. తొలుత ఏఐటీయూసీ మహాసభలు సందర్భంగా పట్టణంలో కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుటనున్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. మల్లమ్మ సెంటర్లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. -
బడా టౌన్షిప్
ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌కు ఉడా ప్రతిపాదన అటవీ భూముల్లో భారీ హౌసింగ్ వెంచర్ ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేత ఉడా చరిత్రలో ఇదే భారీ ప్రాజెక్టు సాక్షి, విజయవాడ : విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(వీజీటీఎం ఉడా) మరో భారీ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈసారి సుమారు 1,400 ఎకరాల్లో ఇంటిగ్రేటెట్ టౌన్షిప్ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. రూ.700 కోట్ల అంచనాతో ఈ మెగా హౌసింగ్ వెంచర్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును తమకు అనుకూలంగా ఉన్న అటవీ భూమిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే ఆ భూములను అటవీ శాఖ చట్టం 1980 సెక్షన్(2) కింద కన్వర్షన్ చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదనలు ఇవీ.. మొత్తం 1,400 ఎకరాల భూమిలో 700 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. 350 ఎకరాల విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం, మిగిలిన 350 ఎకరాల్లో పార్కు, బ్యాంకులు, పోలీసుస్టేషన్ తదితర అన్ని కార్యాలయాలకు అనువుగా భవనాలు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటివరకు ఉడా సిద్ధం చేసిన ప్రతిపాదనల్లో ఇదే అత్యంత పెద్దది కావడం విశేషం. రాజధానితో లింకు..! ఉడా అధికారులు ప్రతి ప్రతిపాదనకు రాష్ట్ర రాజధానితో ముడిపెడుతున్నారు. ఇప్పటికే విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించిన క్రమంలో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. శాశ్వత రాజధాని కూడా ఇక్కడే ఏర్పాటయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కూడా ఉడా ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని ఉడా అధికారులు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రాన్ని కూడా కోరుతున్నారు. ఏక కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపుతున్నారు. ఎక్కడి నుంచి నిధులు వచ్చినా తక్షణమే ప్రతిపాదనలను అచరణలోకి పెట్టాలని భావిస్తున్నారు. ల్యాండ్ బ్యాంక్ కొరత ఉడాకు మొదటి నుంచి ల్యాండ్ బ్యాంకు కొరత అధికంగా ఉంది. గతంలోనూ అనేక ప్రాజెక్టులు సిద్ధం చేయడంతోపాటు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా రూపొందించినా భూమి కొరత వల్ల ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ భూములు కేటాయించాలని ఉడా విస్తరించి ఉన్న రెండు జిల్లాల కలెక్టర్లకు అధికారులు విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. -
మన్యంలో ‘బాక్సైట్’పై యుద్ధమేఘాలు!
తవ్వకాలకు వ్యతిరేకంగా ‘మావో’ల కమిటీలు! మూడు వారాల నుంచి నియామకాలు? కమిటీల నిర్వహణలో యువతకు భాగస్వామ్యం పెదబయలు : మన్యంలో బాక్సైట్ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. పీసా చట్టం అమలుకు ప్రభుత్వం గ్రామసభల ద్వారా కమిటీలు ఏర్పాటు చేస్తుంటే, దానికి దీటుగా ప్రభుత్వ చర్యలను తిప్పికొట్టేందుకు మావోయిస్టులు మన్యంలోని 11 మండలాల్లోనూ బాక్సైట్ వ్యతిరేక కమిటీల ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. మూడు వారాల నుంచి కమిటీల ఏర్పాటు జరుగుతుండగా, గ్రామాల్లో ఉన్న మిలీషియా కమిటీలు, మండలాల్లో దళాలు నూతనంగా ఏర్పడిన బాక్సైట్ వ్యతిరేక కమిటీలకు సూచనలు, సలహాలిస్తూ పని చేస్తుందని సమాచారం. మన్యంలో ఉన్న బాక్సైట్ ఖనిజాన్ని వెలికి తీస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఢంకాపథంగా చెబుతుండంతో ఇప్పటికే గిరిజన సంఘాలు గిరిజనులను ఉద్యమాలకు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇక్కడ మావోయిస్టుల ఉనికి బలహీన పడిందని ప్రభుత్వం, పోలీసు నిఘావర్గాలు వెల్లడిస్తున్న ఈ తరుణంలో, వారు తమ ఉనికి కోల్పోకుండా గిరిజనులకు మరింతా చేరువయ్యేందుకు తమ వంతుగా బాక్సైట్ ఉద్యమానికి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నూతన కమిటీల ద్వారా గ్రామాల్లో బస చేసి బాక్సైట్ తవ్వకాల వల్ల జరిగే నష్టాలు, ప్రభుత్వ చర్యలను తిప్పికొట్టే వ్యూహంపై కార్యాచరణ ప్రారంభించినట్లు తెలిసింది. దీనికి కీలకంగా యువతపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు భోగట్టా. గ్రామాల్లో ఉన్న యువతను, ముఖ్యంగా మహిళలను ఎక్కువగా ఈ కమిటీల్లో చేర్పి ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లాలని యోచిస్తున్నట్లు వినికిడి. బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం మన్యంలో ఎక్కడ రోడ్లు వేసినా, ప్రత్యక్ష కార్యాచరణలో భాగంగా వాటిని అడ్డుకోవాలని కమిటీలకు సూచనలు చేస్తున్నట్లు తెలిసింది.