Central Power Distribution
-
ఏపీసీపీడీసీఎల్‌లో ఎనర్జీ అసిస్టెంట్ కొలువులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొ రేషన్ లిమిటెడ్(ఏపీసీపీ డీసీఎల్) గ్రామ/వార్డు సెక్రటేరియట్స్‌లో ఎనర్జీ అసిస్టెంట్ (జేఎల్ఎం గ్రేడ్–2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 86 ► అర్హతలు: పదోతరగతితోపాటు ఐటీఐ(ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్‌మెన్ ట్రేడ్ ) ఉత్తీర్ణత ఉండాలి. లేదా ఇంటర్మీడియెట్ వొకేషనల్(ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లియెన్సెస్ అండ్ రివైండింగ్/ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్/ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. ► వయసు: 31.01.2021 నాటికి 18–35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల వయోసడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: వంద మార్కులకు రాత పరీక్షతోపాటు పోల్క్లైంబింగ్ టెస్ట్, మీటర్ రీడింగ్ తదితరాల ద్వారా ఎంపిక జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.05.2021 ► వెబ్సైట్: https://recruitment.apcpdcl.in/ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు -
‘ప్రైవేటు’లో కొనడం కోసమే..
సాక్షి, అమరావతి: ముడుపుల కోసం టీడీపీ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందనేందుకు అతి తక్కువకు లభించే కేంద్ర విద్యుత్‌ను వదిలేసి.. ‘ప్రైవేటు’ సంస్థలనుంచి అధిక రేటుకు కొనుగోలు చేయడానికి సమాయత్తమవ్వడమే నిదర్శనంగా నిలుస్తోంది. తమకు బకాయిపడ్డ రూ.3,768 కోట్లు చెల్లించిన తర్వాతే విద్యుత్ సరఫరాపై మాట్లాడాలని కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) ఆంధ్రప్రదేశ్‌కు నోటీసులు పంపినా.. ప్రభుత్వం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బకాయిలు చెల్లించేవరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు నోటీసుల్లో పేర్కొంది. ఈ విషయాన్ని గతంలోనే తెలియజేసినా పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకోవడం అనివార్యమైందని తెలిపింది. కాగా, ఇంత సీరియస్‌గా హెచ్చరించినా ఏమాత్రం స్పందించకపోవడం విద్యుత్ వర్గాలనే విస్మయ పరుస్తోంది. ఎన్టీపీసీ విద్యుత్ ఆగిపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తెలిసింది. కేంద్ర విద్యుత్ నిలిపివేస్తే బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఉన్నతాధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీపీపీసీ విద్యుత్ కేంద్రాలైన సింహాద్రి, రామగుండం, కొరిసి, తాల్చేరు, వల్లూరుతో పాటు పలు కేంద్రాల నుంచి రోజుకు 51 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుతోంది. దీని ధర యూనిట్‌కు రూ.4 మాత్రమే ఉంటుంది. ఇంత చౌకగా లభించే విద్యుత్‌ను వదులుకుని మార్కెట్లో యూనిట్ రూ.6 కన్నా తక్కువకు ఇవ్వబోమంటున్న ప్రైవేటు విద్యుత్‌ను కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి విపరీతమైన భారమవుతుందని అధికారులు చెప్పినా ఏమాత్రం విన్పించుకోవడం లేదు. ప్రభుత్వ పెద్దలకు అనుకూలమైన విద్యుత్ ఉత్పత్తిదారులు అధిక రేటుకు విద్యుత్ అమ్మేందుకు సిద్ధంగా ఉన్నారు. వీళ్లంతా ముఖ్యమంత్రిని కలిసి మంతనాలు జరిపినట్టు తెలిసింది. ఎన్నికల ఖర్చుల కోసం కొంత ముట్టజెబుతామని చెప్పినట్టు సమాచారం. ఈ కారణంగానే తక్కువగా వచ్చే కేంద్ర విద్యుత్‌కు పరోక్షంగా అడ్డుపడుతున్నారని తెలిసింది. రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా రోజుకు 190 మిలియన్ యూనిట్లకు విద్యుత్ డిమాండ్ చేరింది. ఇందులో 51 మిలియన్ యూనిట్ల కేంద్ర విద్యుత్ ఆగిపోతే రోజుకు కనీసం నాలుగు గంటల పాటు రాష్ట్రంలో విద్యుత్ కోత విధించాల్సి వస్తుంది. తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు అందలేదని, ఇతర మార్గాల్లో అప్పులు తెచ్చే వరకూ ఎన్టీపీసీకి బకాయిలు చెల్లించలేమని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులకు ఎలా చెల్లిస్తారని విద్యుత్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. భయపడుతున్న అధికారులు.. చౌకగా లభించే కేంద్ర విద్యుత్‌ను కాదని, ప్రైవేటు విద్యుత్ కొనుగోలును ప్రభుత్వం ప్రోత్సహించడాన్ని కొంతమంది విద్యుత్ ఉన్నతాధికారులు వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల తామెక్కడ ఇబ్బందుల్లో పడతామోననే భయం వాళ్లను వెంటాడుతోంది. ఇంధనశాఖ ముఖ్య అధికారి ఒకరు ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లపై లోతుగా అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. కొనుగోలు దిశగా అధికారులు నిర్ణయం తీసుకోలేరని, ప్రభుత్వమే దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన లేఖ రాయడంపై ముఖ్యమంత్రి కార్యాలయం కాస్తా గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే విద్యుత్ సమన్వయ కమిటీ చేత తీర్మానం చేయించి పంపాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. ఎన్టీపీసీకి బకాయిలు చెల్లించపోవడానికి సరైన కారణాలు చూపించాల్సి ఉంటుందని, ప్రభుత్వం చెప్పినట్టు వింటే చిక్కుల్లో పడతామని అధికారులు భయపడిపోతున్నారు. -
రాబోయే మూడు నెలలు అత్యంత కీలకం
నల్లగొండ అర్బన్ :విద్యుత్‌శాఖకు రాబోయే మూడు నెలల కాలం అత్యంత కీలకమైందని తెలంగాణ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ జె. రఘుమారెడ్డి అన్నారు. స్థానిక హైదరాబాద్ రోడ్డులోని విద్యుత్‌శాఖ అతిథిగృహంలో సోమవారం నిర్వహించిన నెలవారీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఈలు స్థానికంగా ఉండి కరెంట్ సరఫరాలో అవాంతరాలు, ఇతర సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. రైతులకు పరిస్థితిని వివరించి అవగాహన కల్పించాలని కోరారు. ఖరీఫ్ సీజన్ ముగింపు దశలో ప్రస్తుతం పంట చేతికందుతున్నందున పాత బకాయిలను వసూలు చేయాలన్నారు. వాహనాలకు మైకులు బిగించి గ్రామాల్లో విద్యుత్ బకాయిలపై ప్రచారం చేయాలన్నారు. వచ్చేది వేసవి కాబట్టి కరెంట్ సమస్యలుంటాయి, పెండింగ్ బిల్లుల వసూళ్లకు ఇబ్బంది అవుతుందన్నారు. అందువల్ల బిల్లుల వసూలుకు చర్యలు తీసుకోవాలన్నారు. తక్కువ కలెక్షన్ చేసిన అధికారులను మందలించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో రావాల్సిన బిల్లులను వసూలు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టళ్లు, నీటి సరఫరా పథకాలు మినహాయించి ఇతర అన్ని శాఖలకు బకాయిలపై నోటీసులిచ్చి వారం రోజుల అనంతరం విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ చౌర్యంపై నిఘా పెంచాలని, కేసులు నమోదు చేయాలన్నారు. కొక్యాలు (కొండ్లు) తగించి 24 గంటలు విద్యుత్ వృథా చేస్తున్న వారికి పరిస్థితులను వివరించి డీడీలు తీసుకోవాలన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్, వివిధ పథకాలను సమీక్షించారు. మండలాల వారీగా విద్యుత్‌శాఖ పనితీరును అడిగి తెలుసుకున్నారు. నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట, మిర్యాలగూడ పట్టణాల్లో ఆర్ఏపీఆర్డీఆర్పీ పథకం ద్వారా చేపడుతున్న ఆధునిక విద్యుదీకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. విద్యుత్‌శాఖ అధికారులు అవినీతికి ఆస్కారం ఇవ్వకూడదన్నారు. గత నెలలో ఏసీబీ దాడుల్లో పట్టుబడిన అధికారి ఉదంతాన్ని గుర్తు చేశారు. సమీక్ష సమావేశం జరుగుతుండగానే ధర్మారెడ్డి కాల్వ పరిధిలోని వలిగొండ, రామన్నపేట ప్రాంతాలకు చెందిన రైతులు రెండు లారీల్లో తరలివచ్చారు. కాల్వ వెంట మోటార్లు పెట్టడం వల్ల దిగువకు నీరందించడం లేదని సాగునీరే కాకుండా, తాగునీటికి ఇబ్బంది ఎదురవుతోందని వారు సీఎండీకి ఫిర్యాదు చేశారు. అక్రమ విద్యుత్ వాడకాన్ని నియంత్రిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సంస్థ డెరైక్టర్ శ్రీనివాస్‌రావు, సీజెఎం పాండ్యా, శ్రీనివాస్‌రెడ్డి, నాగేంద్ర, ఎస్ఈ బాలస్వామి, విజిలెన్స్ సీఐ సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.