cfo resign
-
సీఎఫ్‌వో రాజీనామాపై ఇన్పీ మూర్తి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ నుంచి టాప్ ఎగ్జిక్యూటివ్ వైదొలగడంపై సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి స్పందించారు. సిఎఫ్ఓ ఎండి రంగనాథ్ కంపెనీని వీడడంపై ఆయన విచారాన్ని వెలిబులిచ్చారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఇన్ఫీకి ఆయన నిష్క్రమణ పూరించలేని లోటని శనివారం వ్యాఖ్యానించారు. భారతదేశంలో అత్యుత్తమ సీఎఫ్‌వోగా, అరుదైన వ్యక్తిగా రంగనాథ్‌ను అభివర్ణించిన మూర్తి, చట్టం, గవర్నెర్న్, ముఖ్యమైన ఖాతాదారులు, వాటాదారులు, పెట్టుబడిదారులు, డెలివరీ టీమ్స్, ఉద్యోగి ఆకాంక్షలు, ఫైనాన్స్ లాంటి అన్నింటిని అవగాహన చేసుకున్నారని ఒక ప్రకటనలో తెలిపారు. రంగాతో తాను15సంవత్సారాలు కలిసి పనిచేశానని గుర్తు చేసుకున్నారు. గత ఐదేళ్లకాలంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఛాలెంజింగ్ పరిస్థితులలో కఠినమైన నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం, ధృఢమైన ఆర్థిక నైపుణ్యం, బలమైన విలువ వ్యవస్థ, మర్యాద, మన్ననతో గొప్ప లీడర్‌గా గుర్తింపు పొందిన రంగ కంపెనీకి చాలా కీలకమని మూర్తి పేర్కొన్నారు. కాగా దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థకు సిఎఫ్ఓ రంగనాధ్ రాజీనామా చేశారని, నవంబర్ 16, 2018 వరకు ప్రస్తుత స్థానంలో కొనసాగుతున్నారని ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో శనివారం వెల్లడించింది. రాజీవ్ బన్సల్ నిష్క్రమణ అనంతరం 2015లో రంగనాథ్ సీఎఫ్‌వోగా బాధ్యతలు స్వీకరించారు. రాజీవ్ బన్సల్ వంటి మాజీ ఎగ్జిక్యూటివ్‌లకు అందజేసిన ప్యాకేజీలు, కార్పొరేట్ పాలనలాంటి అంశాల్లో గత ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్తో విభేదించిన నారాయణ మూర్తి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
ఇన్ఫీ ఫలితాలు భేష్, షేర్ బేర్
ముంబై: ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వరుస లాభాలతో దూసుకుపోతోంది. ఇన్ఫీ రెండో త్రైమాసికంలో మార్కెట్ అంచనాలకు మించి ఆర్థిక ఫలితాలను సోమవారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో 7.5 శాతం వృద్ధిని సాధించి తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకుంది. రూ. 3,398 కోట్ల నికరలాభాన్ని ఆర్జించి తన హవా కొనసాగించింది. రెండో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ ఆదాయం మొత్తం రూ.29,989 కోట్లుగా నమోదైంది. గత జూన్, 2015తో ముగిసిన మొదటి త్రైమాసిక లాభాలతో పోలిస్తే ఇంకా మెరుగ్గా కనిపించింది. కాగా సాప్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో, (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బన్సాల్ తన పదవికి రాజీనామా చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన స్థానంలో ఎండీ రంగనాథ్ సీఎఫ్‌వోగా బాధ్యతలు చేపట్టనున్నారు. మూడేళ్లపాటు సంస్థకు సేవలందించిన ఆయన సోమవారం రాజీనామా చేయనున్నారని ఆయన స్థానంలో ఎండీ రంగనాథ్ కొనసాగుతారని తెలిపింది. దీంతో మార్కెట్లో ఈ షేరు ఫలితాలకు భిన్నంగా స్పందిస్తోంది. నష్టాల్లో ట్రేడవుతోంది. అటు షేరుకు 10 రూపాయల చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇవ్వనున్నట్టు ఇన్ఫీ ప్రకటించింది. రెండు మూడేళ్ల కిత్రం వరకు దేశీయ ఐటీ రంగంలో దిగ్గజంగా వెలుగొందిన ఇన్ఫోసిస్ పలు పరిణామాల కారణంగా ఓ దశలో ప్రత్యర్ధుల తాకిడికి నిలబడలేని పరిస్థితికి చేరింది. టీసీఎస్, హెచ్‌సీఎల్ లాంటి సంస్థల ధాటికి ఎదురొడ్డి నిలబడ్డంలో తడబడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏడాది క్రితం విశాల్ సిక్కా సీఈఓగా రంగంలోకి వచ్చారు. 2020 నాటికి 2000 కోట్ల డాలర్ల రెవెన్యూ సాధిస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. సిక్కా సీఈఓ అయినప్పటి నుంచి ఆయన నాయకత్వంలో మంచి టీమ్ ఏర్పడిందని. కంపెనీని ఆయన సరైన దిశలో నడిపించాని ఎనలిస్టులు వ్యాఖ్యానించారు. అంచనాలకు అనుగుణంగానే గత కొంతకాలంగా నష్టాలను చవిచూస్తున్న సంస్థ గత రెండు త్రైమాసికాల్లో భారీ లాభాలను ఆర్జించింది. అయితే సీఎఫ్ఓ రాజీనామాతో ఎనలిస్టులు కూడా పెదవి విరుస్తున్నారు.