chaitanya padam
-
సాక్షి చైతన్యపథం - కర్నూలు
-
సాక్షి చైతన్యపథం - గుంటూరు
-
"ఎవరెటు...?" - కర్నూలు
-
"ఎవరెటు...?" - అనంతపురం
-
త్యాగాల ఫలితం ఇదేనా!
సాక్షి, కడప: ‘ఎందుకు విభజిస్తున్నారో చెప్పకుండా ప్రకటన చేశారు. సీమాంధ్రులు ఉద్యమిస్తే ఆంటోని కమిటీ వేస్తామన్నారు. కమిటీ ఏం చేస్తుంది? విశాలాంధ్ర కోసం బళ్లారిని కోల్పోయాం. కర్నూలు నుంచి రాజధాని కేంద్రాన్ని కోల్పోయాం..తద్వారా రాయలసీమలో 50ఏళ్ల అభివృద్ధి ఆగిపోయింది. ఇవన్నీ వెనక్కి తెచ్చివ్వగలరా? ఇవన్నీ త్యాగం చేసినందుకు రాయలసీమకు ఇచ్చే బహుమతి ఇదేనా?’ అని కడప వాసులు ముక్తకంఠంతో నినదించారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో మంగళవారం హరిత ఫంక్షన్‌హాలులో జరిగిన‘ఎవరెటు’ చర్చా కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. రాయలసీమ సుభిక్షంగా ఉండాలంటే రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని నినదించారు. సీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ‘మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడు కృష్ణాబ్యారేజ్, తుంగభద్ర డ్యాం నిర్మించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాగార్జున సాగర్ నిర్మించారు. వర్షపు నీటి వనరులు ఉన్న ప్రాంతాలకే సాగునీటి వనరులు కల్పించారు. తక్కువ వర్షపాతం నమోదయ్యే సీమ ప్రాంతాలకు నీరివ్వలేకపోయారు. పైగా భాషా ప్రయుక్త రాష్ట్రాలన్నీ కలిసి ఉండాలనే ఏకైక కాంక్షతో తుంగభద్ర డ్యాంను కోల్పోయాం. ఇప్పుడు విడిపోతే కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులు అంతర్రాష్ట్ర ప్రాజెక్టులవుతాయి. ఇదే జరిగితే మిగులుజలాలపై ఆధారపడి నిర్మించిన గాలేరునగరి, హంద్రీనీవాతో పాటు తెలుగుగంగ, వెలిగొండకు చుక్కనీరు అందదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి. విభజన తప్పదంటే కృష్ణా పరివాహక ప్రాంతాలైన నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మంలను కలిపి 16జిల్లాలను ఒక రాష్ట్రంగా.. తక్కిన ఏడుజిల్లాలను మరో రాష్ట్రంగా విభజించాలి’ అని అన్నారు. న్యాయవాది కె.శ్రీనివాసరాజు మాట్లాడుతూ తెలంగాణ అంశంపై గతంలోనే వైఎస్ ఓ లేఖను ఇచ్చారని, అందులో ఓ సమస్యను పరిష్కరిస్తే మరో సమస్య ఉత్పన్నం కాకూడదని చెప్పారన్నారు. చిత్తశుద్ధితో సమైక్యం కోసం ఉద్యమించి ఏ పార్టీకైనా అండగా ఉంటామన్నారు. ఇంటాక్ కన్వీనర్ ఇలియాస్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయపార్టీల నేతలు ప్రజలతో చర్చించకుండా పార్టీల తరఫున లేఖలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కడపలో ఏడేళ్లుగా కలెక్టరేట్ నిర్మించలేదని, రాజధానిని 30ఏళ్లయినా నిర్మించలేరని జయరామయ్య అన్నారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తే తప్ప దీనికి పరిష్కారం లేదని మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. డైట్ అధ్యాపకులు కృష్ణ, న్యాయవాది విజయలక్ష్మి తదితరులు ప్రసంగించారు. సుదీర్ఘంగా సాగిన చర్చలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే సమైక్యాంధ్రనే కొనసాగించాలని ముక్తాయింపు ఇచ్చారు. -
"ఎవరెటు...?" - కడప
-
"ఎవరెటు...?" - తిరుపతి
-
విభజన పాపం వారిదే
సాక్షి, నెల్లూరు: విభజన పాపం కాంగ్రెస్, టీడీపీలదేనని సింహపురి వాసులు ధ్వజమెత్తారు. ఓట్లు, సీట్లు ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తోందన్నారు. విభజన ప్రకటన ఉపసంహరించుకునే వరకు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘ఎవరెటు’ చైతన్యపథం చర్చావేదికకు ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యార్థులు హాజరయ్యారు. విభజన జరిగితే అన్నివర్గాల వారు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని పార్టీలు రెండు కళ్ల ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు. సీమాంధ్ర నేతల రాజీనామాల విషయమై చిత్తశుద్ధి కరువైందని ధ్వజమెత్తారు. సోనియా వద్ద మోకాళ్లపై కూర్చుని తమ పదవులు కాపాడుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామో, నిరంకుశ పాలనలో బతుకుతున్నామో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. సీమాంధ్రులు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే, ఇప్పుడు ఆ మహానగరాన్ని తెలంగాణకు ధారాదత్తం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ రవీంద్రరెడ్డి మాట్లాడుతూ బలమైన రాష్ట్రాన్ని బలహీనంగా మార్చి ఆటాడించాలని కేంద్రం చూస్తోందని దుయ్యబట్టారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపల్ ఎం.శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ విభజన జరిగితే నిధుల విడుదల గగనమైపోతుందన్నారు. బొల్లినేని ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ఏవీ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లోనే పూర్తిస్థాయి వైద్యం అందుబాటులో ఉందని చెప్పారు. విభజనే జరిగితే సీమాంధ్రుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. -
ఎవరెటు - నెల్లూరు
-
విభజనకు బాబే బాధ్యుడు
సాక్షి, ఒంగోలు : ‘‘రాష్ట్ర విభజనకు టీడీపీ అధినేత చంద్రబాబే బాధ్యుడు.. ఆయన రెండు కళ్ల సిద్ధాంతం వల్లే రాష్ట్ర విభజన జరిగింది. బాబును రాష్ట్ర ప్రజలెవరూ నమ్మరు’’ అని ఒంగోలు వాసులు చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో సాక్షి దినపత్రిక, టీవీ ఆధ్వర్యంలో శనివారం ‘ఎవరెటు? చర్చావేదిక జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. విభజనలో భాగస్వాములై సీమాంధ్ర నేతలు భాగస్వాములు కావద్దని సూచించారు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ రవికుమార్ మాట్లాడుతూ, విద్య, ఉపాధి, జల, రాజధాని సమస్యల్ని ప్రస్తావించకుండా నిరంకుశంగా రాష్ట్ర విభజన ప్రకటన చేయడం వల్లే సీమాంధ్రలో ఉద్యమ జ్వాలలు ఎగసిపడుతున్నాయని చెప్పారు. ఉద్యోగ జేఏసీ చైర్మన్ బషీర్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతల తరహాలో మిగిలిన పార్టీల ప్రజాప్రతినిధులు కూడా స్పీకర్ ఫార్మెట్లో తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వెంకయ్య మాట్లాడుతూ అశాస్త్రీయమైన విభజన ప్రకియ ద్వారా అన్ని వర్గాలు, రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. సీఎం మారినప్పుడల్లా 300 నుంచి 500 మెడికల్ సీట్లు తెలంగాణకు ఇచ్చేసి ఇక్కడ కోటా తగ్గిస్తున్నారని మండిపడ్డారు. ఏపీఎన్జీవో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డిల చేతగానితనం వల్లే రాష్ట్ర విభజన జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసోసియేషన్ కోశాధికారి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ వైఎస్ విజయమ్మ సమైక్యత కోసం దీక్ష చేయడం మంచి పరిణామమనీ, ఉద్యమం కోసం ముందుండి దీక్షలు, త్యాగాలు చేసే వారిని తాము నెత్తిన పెట్టుకుంటామన్నారు. విద్యావేత్త డాక్టర్ పీహెచ్‌జీ కృష్ణంరాజు మాట్లాడుతూ ఐఐటీ, ఐఐఎం, ఇక్రిశాట్ తదితర సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయనీ, రాష్ట్ర విభజనతో యువత భవితను అంధకారంలోకి నెడతామంటే ఊరుకోబోమని స్పష్టంచేశారు. -
సాక్షి చైతన్యపథం-గుంటూరు
-
మనోళ్లకే అండగా ఉందాం: సమైక్యవాదులు
సాక్షి, విజయవాడ: మనకోసం, రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం నిలిచిన వారికిఅండగా నిలబడాల్సిన అవసరం ఉందని, పార్లమెంట్లో తెలంగాణ కోసం బిల్లు పెట్టిన వారిని, సహకరించిన వారిని ఓడిద్దామని సమైక్యవాదులు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు పార్లమెంట్‌ను వదిలి వస్తే ఢిల్లీ పీఠం కదులుతుందన్నారు. ముఖ్యమంత్రి కూడా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని ఏఎస్ రామారావు హాలులో సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన చైతన్యపథం ‘ఎవరెటు’ చర్చావేదిక కార్యక్రమానికి సమైక్యవాదులు పెద్దఎత్తున తరలివచ్చారు. ‘వైఎస్ కుటుంబం మొత్తం ప్రజల కోసం పాటుపడుతోంది. ఈ వయసులో కూడా రాష్ట్ర సమైక్యం కోసం విజయమ్మ దీక్ష చేస్తున్నారు. వారికి కోటి వందనాలు’ అని చెప్పారు. మునిసిపల్ ఎంప్లాయీస్ జేఏసీ కన్వీనర్ డి.ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరగడానికి కారణం వైఎస్ రాజశేఖరరెడ్డి అని దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. ఆనాడు వైఎస్ అసెంబ్లీ సాక్షిగా ఒక సమస్య పరిష్కరించేటప్పుడు మరో కొత్త సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలని చెప్పారని, దీన్ని ప్రభుత్వం ఎందుకు గమనంలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. సోనియాగాంధీ.. రాహుల్‌ను ప్రధానమంత్రిని చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. హెల్త్ యూనివర్శిటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.నరసింహరావు మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులన్నీ రాజధానిలోనే ఉన్నందున రాష్ట్రం విడిపోతే ఆరోగ్యశ్రీ కార్డులు చెత్తబుట్టలో వేయడానికి తప్ప ఎందుకూ పనికిరావన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు పి.వి.లక్ష్మణరావు మాట్లాడుతూ ఒకప్పుడు మనలో భాగంగా ఉండి, పాలనా సౌలభ్యం కోసం ఖమ్మంలో కలిసి, ఏ మాత్రం ఆదాయం రాని వెనుకబడిన భద్రాచలం ప్రాంతాన్నే వదులుకోవడానికి తెలంగాణవాదులు సిద్దంగా లేరని, అటువంటిది లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన హైదరాబాద్‌ను ఎలా వదులుకుంటామని ప్రశ్నించారు. ప్రముఖ న్యాయవాది జగదీశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ నిర్ణయాన్ని కేంద్రం ద్వారా ప్రజలపై రుద్దితే సహించబోమని హెచ్చరించారు. కృష్ణాజిల్లా రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శి కోటంరాజు మాట్లాడుతూ వ్యవసాయం చేసేది ఇక్కడైతే ఎన్జీ రంగా యూనివర్శిటీ హైదరాబాద్‌లో ఉందని, కోస్తా తీరం ఇక్కడ ఉంటే వాతావరణ కేంద్రం హైదరాబాద్‌లో ఉందని చెప్పారు. 240 ప్రభుత్వరంగ సంస్థలు, 21 యూనివర్శిటీలు రాజధానిలో ఉన్నాయని చెప్పారు. విభజనపై సోనియా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. -
సాక్షి చైతన్యపథం - విజయవాడ.
-
పదవుల్ని వదిలి ప్రజల్లోకి రండి
సాక్షి, ఏలూరు : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమానికి మద్దతు పలకని ఏ రాజకీయ పార్టీకైనా వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవని పశ్చిమగోదావరి జిల్లా సమైక్యవాదులు హెచ్చరించారు. ఏలూరు నగరంలోని ఐఏడీపీ హాల్లో ‘సాక్షి’ దినపత్రిక, ‘సాక్షి’ టీవీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన చైతన్యపథం ‘ఎవరెటు’ చర్చా వేదిక కార్యక్రమానికి సమైక్యవాదులు పెద్దఎత్తున తరలివచ్చారు. సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేసినట్టుగానే మిగిలిన పార్టీల నేతలూ వ్యవహరించాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్ల వయసులో ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరుతూ వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను చూసైనా పదవులు పట్టుకుని వేలాడుతున్న మంత్రులు, ఎంపీలు సిగ్గుపడాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా విజయమ్మలా పదవుల్ని వదిలిప్రజల్లోకి రాని నేతలను క్షమించేదిలేదని హెచ్చరించారు. రాష్ట్ర రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే కృష్ణా నది ఎండిపోతుందన్నారు. కృష్ణా నదికి నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణ అడ్డు తగులుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు ఎల్. విద్యాసాగర్ మాట్లాడుతూ తెలంగాణలో సకల జనుల సమ్మెను రాజకీయ నాయకులు నడిపించారని, విభజన ప్రకటన వెలువడిన వెంటనే సీమాంధ్రలో ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమం ప్రారంభించారన్నారు. న్యాయవాది పి. విజయలక్ష్మి మాట్లాడుతూ, తెలంగాణ ప్రక్రియ రాజకీయ నాయకులు అడుతున్న రాక్షస క్రీడ అని ధ్వజమెత్తారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు గోడమీద పిల్లిలా వ్యవహరిస్తూ ప్రజలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడంలేదని ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్వీఎస్ ప్రసాదరావు ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్టీసీకి సంబంధించిన 60శాతం ఆస్తులు తెలంగాణలోనే ఉన్నాయని వివరించారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలోని 123 ఆర్టీసీ డిపోలనూ మూసుకోవాల్సి వస్తుందన్నారు. ఏలూరు మర్చంట్స్ చాంబర్ అధ్యక్షుడు నేరెళ్ల రాజేంద్ర మాట్లాడుతూ.. అపరాలు, కొన్నిరకాల కూరగాయలు తెలంగాణ ప్రాంతం నుంచే ఇక్కడకు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రం ముక్కలైతే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతాయని వివరించారు. జాతీయ విద్యాసంస్థలు, ఐటీ పరిశ్రమలు హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమయ్యాయని, సీమాంధ్రులే వాటిని అభివృద్ధి చేశారని జిల్లా ప్రైవేటు విద్యాసంస్థల అధ్యక్షుడు ఎంబీఎస్ శర్మ చెప్పారు. ఇప్పుడు వాటిని వదులుకోమంటే విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్ ఏమిటని ప్రశ్నించారు. ఆందోళనను విరమించే ప్రసక్తే లేదు రాష్ట్ర విభజన ప్రకటనను వెనక్కి తీసుకునే వరకు ఆందోళనను విరమించేది లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం మరో స్వాతంత్య్ర ఉద్యమాన్ని తలపిస్తోంది. ‘విభజించు-పాలించు’ అనే బ్రిటిష్ పాలకుల సిద్ధాంతం తరహాలోనే కేంద్రం రాష్ట్ర విభజనకు పూనుకుంటోంది. సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కోరటం సిగ్గుచేటు. - శైలజ, ఉపాధ్యారుుని విద్యుత్ ఉత్పత్తి భారం అవుతుంది రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ భారం అవుతుంది. జల విద్యుత్, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు మన దగ్గర ఉన్నా ఇంధన వనరు లు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. దానివల్ల ఇక్క డి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఇంధన కొరతతో మూతపడే ప్రమాదముంది. ఇది ఇరు ప్రాంతాలకు ఇబ్బం దికరమే. గ్యాస్‌తో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని కేసీఆర్, దిగ్విజయ్ మనకు సూచిస్తున్నారు. ప్రస్తుతం యూనిట్ విద్యుత్ ఉత్పత్తి వ్యయం రూపాయి ఉంటే గ్యాస్ వినియోగం వలన రూ.6 అవుతుంది. ఇది తీరని భారం. - తురగా రామకృష్ణ, జిల్లా కన్వీనర్, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ -
"సాక్షి" చైతన్యపథం - కాకినాడ
-
సాక్షి చైతన్యపథం - విశాఖపట్నం
-
చైతన్యపథం - విజయనగరం
-
సాక్షి చైతన్యపథం - పాలకొల్లు
-
సాక్షి చైతన్యపథం - ఏలూరు
-
సాక్షి చైతన్యపథం - తణుకు
-
"సాక్షి" చైతన్యపథం - భీమవరం
-
"సాక్షి" చైతన్యపథం - నూజివీడు
-
"సాక్షి" చైతన్యపథం - జగయ్యపేట
-
"సాక్షి" చైతన్యపథం - గుడివాడ
-
"సాక్షి" చైతన్యపథం - మచిలీపట్నం
-
"సాక్షి" చైతన్యపథం - విజయవాడ
-
"సాక్షి" చైతన్యపథం - పిడుగురాళ్ల
-
"సాక్షి" చైతన్యపథం -సత్తెనపల్లి
-
"సాక్షి" చైతన్యపథం - మంగళగిరి
-
"సాక్షి" చైతన్యపథం - చిలకలూరిపేట
-
"సాక్షి" చైతన్యపథం - నరసరావుపేట
-
"సాక్షి" చైతన్యపథం - తెనాలి
-
"సాక్షి" చైతన్యపథం - చీరాల
-
"సాక్షి" చైతన్యపథం - కందుకూరు
-
"సాక్షి" చైతన్యపథం - ఒంగోలు
-
"సాక్షి" చైతన్యపథం - మార్కాపురం
-
సాక్షి చైతన్యపథం - ఎమ్మిగనూరు
-
"సాక్షి" చైతన్యపథం - ఆళ్లగడ్డ