Challenge vote
-
ఓటు హైజాక్ అయ్యిందా? సవాలు చేయండి..
మీ ఓటును వేరేవాళ్లు వేసేశారా? ఏం ఫర్వాలేదు. నేనే అసలైన ఓటరును అని సవాలు చేయండి. టెండర్ ఓటేయవచ్చు!ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లే సరికి మీ ఓటు వేరేవారు వేసేశారా? అయితే దిగులుపడాల్సిన అవసరం లేదు. మీకు టెండర్ ఓటు వేసే హక్కును ఎన్నికల సంఘం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తారు. టెండర్ బ్యాలెట్ ఓటర్ల వివరాలను ప్రిసైడింగ్ అధికారులు ఫారం–17బీలో రికార్డు చేస్తారు.ఈ ఫారంలోని 5వ కాలమ్‌లో ఓటరు సంతకం/వేలి ముద్రను తీసుకున్న తర్వాత వారికి బ్యాలెట్ పత్రం అందజేస్తారు. ప్రత్యేక ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ఓటరు బ్యాలెట్ పత్రాన్ని తీసుకెళ్లి తాము ఓటెయదలచిన అభ్యర్థికి చెందిన ఎన్నికల గుర్తుపై స్వస్తిక్ ముద్రను వేయాల్సి ఉంటుంది. ఓటేవరికి వేశారో బయటకు కనబడని విధంగా బ్యాలెట్ పత్రాన్ని మడిచి కంపార్ట్మెంట్ బయటకి వచ్చి ప్రిసైడింగ్ అధికారికి అందజేయాలి. ఆ బ్యాలెట్ పత్రాన్ని టెండర్ ఓటుగా ప్రిసైడింగ్ అధికారి మార్క్ చేసి ప్రత్యేక ఎన్వలప్లో వేరుగా ఉంచుతారు. చాలెంజ్ ఓటు అంటే ..? ఓటేసేందుకు వచ్చిన వ్యక్తి గుర్తింపును అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు రెండు రూపాయలు చెల్లించి సవాలు చేయవచ్చు. ఓటరు గుర్తింపును నిర్ధారించడానికి ప్రిసైడింగ్ అధికారి విచారణ జరుపుతారు. ఓటరు గుర్తింపు నిర్ధారణ జరిగితే ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు. దొంగ ఓటరు అని నిర్ధారణ అయితే సదరు వ్యక్తిని ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు అప్పగించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అనుచితంగా ప్రవర్తిస్తే గెంటివేతే...పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రంలో అనుచితంగా ప్రవర్తించిన లేదా చట్టపర ఆజ్ఞలను పాటించడంలో విఫలమైన వ్యక్తులను ప్రిసైడింగ్ అధికారి బయటకు పంపించవచ్చు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132 కింద ఈ మేరకు అధికారాలు ప్రిసైడింగ్ అధికారికి ఉన్నాయి. మద్యం లేదా మాదక ద్రవ్యాల మత్తులో ఉన్న వారు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు కానీ... విచక్షణ కోల్పోయి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించే వ్యక్తులను మాత్రం పోలీసుల సహాయంతో బయటకు పంపించేందుకు నిబంధనలు అనుమతిస్తాయి. -
మీ ఓటును వేరేవాళ్లు వేసేశారా? అయితే.. టెండర్ ఓటేయవచ్చు!
ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లే సరికి మీ ఓటు వేరేవారు వేసేశారా? అయితే దిగులుపడాల్సిన అవసరం లేదు. మీకు టెండర్ ఓటు వేసే హక్కును ఎన్నికల సంఘం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం) ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తారు. టెండర్ బ్యాలెట్ ఓటర్ల వివరాలను ప్రిసైడింగ్ అధికారులు ఫారం–17బీలో రికార్డు చేస్తారు. ఈ ఫారంలోని 5వ కాలమ్‌లో ఓటరు సంతకం/వేలి ముద్రను తీసుకున్న తర్వాత వారికి బ్యాలెట్ పత్రం అందజేస్తారు. ప్రత్యేక ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ఓటరు బ్యాలెట్ పత్రాన్ని తీసుకెళ్లి తాము ఓటెయదలచిన అభ్యరి్థకి చెందిన ఎన్నికల గుర్తుపై స్వస్తిక్ ముద్రను వేయాల్సి ఉంటుంది. ఓటేవరికి వేశారో బయటకు కనబడని విధంగా బ్యాలెట్ పత్రాన్ని మడిచి కంపార్ట్మెంట్ బయటకి వచ్చి ప్రిసైడింగ్ అధికారికి అందజేయాలి. ఆ బ్యాలెట్ పత్రాన్ని టెండర్ ఓటుగా ప్రిసైడింగ్ అధికారి మార్క్ చేసి ప్రత్యేక ఎన్వలప్లో వేరుగా ఉంచుతారు. చాలెంజ్ ఓటు అంటే ..? ఓటేసేందుకు వచ్చిన వ్యక్తి గుర్తింపును అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు రూ.2 చెల్లించి సవాలు చేయవచ్చు. ఓటరు గుర్తింపును నిర్ధారించడానికి ప్రిసైడింగ్ అధికారి విచారణ జరుపుతారు. ఓటరు గుర్తింపు నిర్ధారణ జరిగితే ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు. దొంగ ఓటరు అని నిర్ధారణ అయితే సదరు వ్యక్తిని ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు అప్పగించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. -
ఛాలెంజ్ ఓటు, టెండర్డ్ ఓటు గురించి తెలుసుకోండి!
సాక్షి, కరీంనగర్: ఈ నెల 30న(శనివారం) జరిగే హజూరాబాద్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేయించారు. ఈ క్రమంలోనే ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ రోజు ఉదయం ఓటింగ్ ప్రక్రియ మొదలుకాక ముందు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల్లోపు మాక్ పోలింగ్ పూర్తవుతుంది. తర్వాత సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కోవిడ్ కారణంగా ఈసారి రెండు గంటలు అదనంగా సమయం ఇచ్చారు. గతంలో పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసేది. ఈ నేపథ్యంలో మాక్ పోలింగ్ ఎలా నిర్వహిస్తారో తెలుసుకుందాం. చదవండి: ఓటరు ఎటువైపు?.. కీలకంగా చివరి 24 గంటలు ► ముందుగా పోలింగ్ జరిగే తేదీన సిబ్బంది ఉదయం 5.30 కల్లా రెడీగా ఉంటారు. పోలింగ్ ఏజెంట్లు కూడా హాజరవుతారు. ►పోలింగ్ ఏజెంట్ల దగ్గర నుంచి ఫాం–10ని సిబ్బంది తీసుకుంటారు. వాటిపై ఏజెంట్ల సంతకాలు తీసుకొని, అడ్మిషన్ పాసులు ఇస్తారు. ఒక్కో అభ్యర్థి తరఫున ఒక్కరు మాత్రమే పోలింగ్ కేంద్రంలో ఉంటారు. ►పోలింగ్ ఏజెంట్ల వద్ద సెల్ఫోన్లు ఉండకూడదు. నిబంధనల ప్రకారం పోలింగ్ సమయంలో ఫొటోలు తీయకూడదు. ►పోలింగ్ ఏజెంట్ల పేరు ఆ ఓటరు లిస్టులో నమోదై ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి. తర్వాత పోలింగ్ యంత్రాన్ని సిద్ధం చేసుకొని, ఉదయం 7గంటల్లోపు మాక్ పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ►మాక్ పోలింగ్ అనేది ఏజెంట్ల సమక్షంలోనే జరుగుతుంది. ఒకవేళ వారు లేకపోతే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల సమక్షంలో కనీసం 50 ఓట్లకు తగ్గకుండా నిర్వహిస్తారు. ►మాక్ పోలింగ్ నిర్వహించేటప్పుడు ముందుగా కంట్రోల్ యూనిట్‌లోని క్లియర్ బటన్ని ప్రెస్ చేయాలి. అక్కడ డిస్ప్లే సెక్షన్ “0’ని చూపిస్తుంది. అలాగే వీవీ ప్యాట్లోని డ్రాప్ బాక్స్ కూడా క్లియర్‌గా ఉండేలా చూసుకోవాలి. ఏజెంట్లకు కూడా చూపించాలి. అనంతరం పోలింగ్ ఏజెంట్లను పిలిచి, వాళ్లకు ఇష్టమైన గుర్తును నొక్కమని చెప్పి, ఇలా సుమారుగా 50 ఓట్లకు పైగా వేయిస్తారు. చదవండి: అసలీ పోలింగ్ కేంద్రమేంటి? ఎవరెవరి పాత్ర ఎంత? ఓటు వేయడమెలా? ►ఈ క్రమంలో ఆ ఏజెంట్ పేరు, వేసిన గుర్తు, ఎన్ని ఓట్లు వేశాడు? అనే విషయాన్ని ఒక పేపరు మీద రాసుకోవాలి. ఏజెంట్లు అందరూ ఓటింగ్ చేసిన తర్వాత కంట్రోల్ యూనిట్లో క్లోజ్ బటన్ నొక్కాలి. ఒకసారి క్లోజ్ బటన్ నొక్కాక బ్యాలెట్ యూనిట్లో ఏ గుర్తుకు ఓటు వేసినా మనకు ఇన్వ్యాలిడ్ అని చూపిస్తుంది. అనంతరం టోటల్ బటన్ మీద ప్రెస్ చేస్తే మనకు ఎన్ని ఓట్లు నమోదయ్యాయో చూపిస్తుంది. తర్వాత రిజల్ట్ బటన్ ప్రెస్ చేస్తే అభ్యర్థి వారీగా ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో చూపిస్తుంది. అనంతరం వీవీ ప్యాట్లోని స్లిప్పులను ప్రింట్ తీసి, అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్లకు చూపిస్తారు. ►ఏజెంట్లు వేసిన ఓట్లు, వీవీ ప్యాట్లోని స్లిప్పుల్లో వచ్చిన ఫలితం లెక్క సరిపోయిందో లేదో సరిచూసుకుంటారు. తర్వాత కంట్రోల్ యూనిట్లో క్లియర్ బటన్‌ను ప్రెస్ చేయాలి. దీంతో అప్పటివరకు నమోదైన ఓట్లన్నీ క్లియర్ అయిపోతాయి. మళ్లీ “0’ నుంచి మొదలవుతుంది. ►అనంతరం స్లిప్పుల వెనకాల మాక్‌పోల్ అనే ముద్ర వేసి, ఒక కవర్లో వేసి, సీల్ చేస్తారు. ప్రిసైడింగ్ అధికారి సంతకం చేశాక అక్కడ ఉన్న ఏజెంట్ల సంతకాలు కూడా తీసుకుంటారు. తర్వాత వాటిని ఒక ప్లాస్టిక్ బాక్స్‌లో ఉంచి, పింక్ కలర్ ట్యాగ్‌తో సీల్ చేస్తారు. ఆ ట్యాగ్ మీద కూడా పీఓ (ప్రిసైడింగ్ అధికారి) సంతకంతోపాటు పోలింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ►ప్లాస్టిక్ బాక్స్ మీద నియోజకవర్గం పేరు, నంబర్, పోలింగ్ స్టేషన్ పేరు, నంబర్ స్పష్టంగా రాయాలి. తర్వాత పీఓ అనుబంధం–14 ఫాంను నింపాలి. ఈ మాక్ పోల్ అయిపోయాక కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్లకు పటిష్ఠంగా సీలు వేయాలి. ఈ విధంగా మాక్ పోలింగ్‌ను ఉందయం 6 గం. నుంచి 7గంటల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఛాలెంజ్ ఓటు ఓటు వేయడానికి వెళ్లిన వ్యక్తిని అతను నిజమైన ఓటరు కాదని బూత్‌లో ఉన్న ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఎన్నికల అధికారి అక్కడికక్కడే నిలిపివేస్తారు. ఆ సమయంలో ఛాలెంజ్ ఓటు అనుమతిస్తుంది. ప్రిసైడింగ్ అధికారి ఓటరుతోపాటు ఏజెంటు అభ్యంతరాలను విన్న తర్వాత అక్కడ క్యూలో ఉన్న ఓటర్లతో విచారణ చేపడతారు. అతను నిజమైన ఓటరు అని తేలితే ఓటు వేయడానికి అనుమతిస్తారు. కాదని తేలితే నిబంధనల ప్రకారం చర్యలుంటాయి. ఛాలెంజ్ ఓటరు వివరాలను అక్కడికక్కడే నమోదు చేస్తారు. టెస్టింగ్ ఓటు ఓటు వేశాక ఓటరు తన ఓటు వివరాలు సక్రమంగా రాకపోతే వెంటనే అధికారికి ఫిర్యాదు చేయాలి. ఈ విషయంలో అక్కడికక్కడే పోలింగ్‌ను నిలిపివేయడానికి అవకాశముంది. తన ఓటు తాను కోరుకున్న అభ్యర్థికి కాకుండా మరో అభ్యర్థికి నమోదైనట్లుగా స్లిప్పులో వివరాలు వస్తే వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై ఏజెంట్ సమక్షంలో విచారణ చేపడతారు. ఓటరు చేసిన ఆరోపణ నిజమైతే పోలింగ్‌ను నిలిపివేస్తారు. తప్పని తేలితే అతనిపై ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటారు. టెండర్డ్ ఓటు ఓటరు తాను ఓటు వేయడాని కంటే ముందుగానే మరో వ్యక్తి అతని ఓటు వేసిన నేపథ్యంలో బాధితుడి టెండర్డ్ పద్ధతిలో ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. వచ్చిన వ్యక్తి నిజమైన ఓటరు అని ఏజెంట్లతో విచారణ చేసినపుడు నిర్ధారణ అయితే అతడికి బ్యాలెట్ పత్రాన్ని అందజేసి, ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఆ విధంగా వేసిన ఓటును భద్రపరుస్తారు. అభ్యర్థుల మధ్య ఓట్లు సమానంగా వచ్చినపుడు టెండర్డ్ ఓటును పరిగణనలోకి తీసుకుంటారు. -
గిద్దలూరులో చాలెంజ్ ఓటు
సాక్షి, గిద్దలూరు (ప్రకాశం): సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో భాగంగా గిద్దలూరులో ఓ యువతి గురువారం చాలెంజ్ ఓటు వేసింది. పట్టణంలోని నల్లబండ బజారుకు చెందిన అనిత తన మొదటి ఓటునే చాలెంజ్ ఓటుగా వేయాల్సి వచ్చింది. స్థానిక యాదవ బజారులోని 202 పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు పొందిన అనిత.. ఓటు వేసేందుకు అక్కడికి వెళ్లింది. అప్పటికే ఆమె ఓటును గుర్తు తెలియని వారు వేయడంతో అనిత ఓటు వేసేందుకు పోలింగ్ అధికారులు నిరాకరించారు. అయితే, తాను ఓటు హక్కును వినియోగించుకోలేదని అనిత గట్టిగా చెప్పడంతో పాటు మీడియా, సోషల్ మీడియా ద్వారా చాలెంజ్ ఓటు గురించి తెలుసుకుని ఉన్న ఆమె.. తనకు చాలెంజ్ ఓటు ఇవ్వాలని కోరింది. దీంతో పోలింగ్ అధికారి ఆమెకు చాలెంజ్ ఓటు ఇచ్చారు. చాలెంజ్ ఓటు వినియోగించుకున్న అనితను పలువురు అభినందించారు. -
కోదాడలో దొంగ ఓటు..!
సాక్షి, కోదాడఅర్బన్ : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గురువారం జరిగిన పోలింగ్‌లో పట్టణంలో బా లుర ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేసిన ఓ బూత్‌లో దొంగ ఓటు పోలైంది. పట్టణంలోని 1వ వా ర్డుకు చెందిన షేక్ సైదులు అనంతగిరి రోడ్డులోని శ్రీరామ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. తనకు చెందిన ఓటు బాలుర ఉన్నతపాఠశాలలోని 170/ 90 పోలింగ్ బూత్‌లో 436 సిరియల్ నంబర్లో ఉంది. అతను వేరే ఊరుకు కూలి నిమిత్తం వెళ్లి ఓటు వేసేందుకు ఉదయం 9గంటలకు కోదాడకు చేరుకున్నాడు. తన తమ్మడు మైకు నాగులు వద్ద ఉన్న పోల్ చిట్టీని తీసుకుని పోలింగ్ బూత్ ఓటు వేసేందుకు వెళ్లాడు. తాను క్యూలైన్లో వెళ్లి పోలింగ్ అధికారికి తన ఓటరు చిట్టి ఇవ్వగా సీరియల్ నంబర్‌ను పరిశీలించిన పోలింగ్ సిబ్బంది అప్పటికే ఈ ఓటు వేశారని తెలపడంతో ఆవాక్కయ్యా డు. ఈ నేపథ్యంలో తన వెంట ఉన్న తన తమ్ముడు మైకు నాగులు తన అన్న ఓటు వేసేందుకు ఇప్పుడే వస్తే ఇప్పటికే మరెవరో ఓటు వేయడం ఏమిటని పోలింగ్ సిబ్బందిని నిలదీశాడు. వారు ఇంతకు ముందు వచ్చిన వ్యక్తిన ఏజెంట్లు షేక్ సైదులేనని నిర్ధారించడంతో తాము ఆయనతో ఓటు వేయించడం జరిగిందని వారు సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఓటరు షేక్ సైదులు తన ఓటు వేరే వారు వేస్తే ఎలా అని, తనకు చాలెంజ్ ఓటు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయడంతో పోలింగ్ అధికారులు తమకు కొంత సమయం ఇవ్వాలని కోరాడు. పోలింగ్ అథికారులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమస్యను వివరించి ఆయన అనుమతితో సైదులకు చాలెంజ్ ఓటు ఇవ్వడంతో అతను తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. చాలెంజింగ్ ఓటు తుంగతుర్తి : అధికారుల తప్పిదంతో డిగ్రీ చదువుతున్న విద్యార్థి ఓటు వేయకుండా వినియోగించుకున్నట్లు ఓటరు లిస్ట్‌లో ఉంది. వివరాల్లోకి వెళితే... మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన కలెంచర్ల సతీష్ గురువారం ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. అక్కడ తన ఓటరు స్లిప్‌ను అధికారులకు చూపగా అప్పటికే ఆ విద్యార్థి ఓటు ఈడీసీలో (పోస్టల్ బ్యాలెట్) ద్వారా ఉపయోగించుకున్నట్లు ఓటరు లిస్టు ఉందని చెప్పారు. దీంతో ఓటే వేసే అవకాశం లేకపోవడంతో విద్యార్థి ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశాడు. దీంతో తహసీల్దార్ పాండు నాయక్ స్పందించి పోలిం గ్ కేంద్రానికి వెళ్లి ఆ విద్యార్థితో రాతపూర్వకంగా లేఖ రాయించుకుని ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. -
యంత్రంలో ఓటు మంత్రం
సాక్షి, నరసరావుపేట : ఎన్నికల సమరంలో పోలింగ్ ప్రక్రియ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అందులోనూ గతంలో మాదిరి బ్యాలెట్ ఓటింగ్ కాకుండా.. ఈవీఎం, వీవీప్యాట్ల ద్వారా ఓటు వేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనిలో ఓటు ఏలా వేయాలో తెలుసుకుందాం. పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశం మీరు పోలింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్లేసరికి ప్రిసైడింగ్ అధికారి మీ బ్యాలెట్‌ను సిద్ధంగా ఉంచుతారు. ఓటు వేయడం ఇలా బ్యాలెట్ యూనిట్(ఈవీఎం)పైన మీకు నచ్చిన అభ్యర్థి పేరు, ఫొటో, గుర్తుకు ఎదురుగా ఉన్న నీలిరంగు(బ్లూ) బటన్‌ను గట్టిగా నొక్కాలి. సిగ్నల్ : ఓటు వేసినప్పుడు మీరు ఎంచుకున్న అభ్యర్థి పేరు, గుర్తుకు ఎదురుగా ఎర్రలైట్ వెలుగుతుంది. ప్రింట్‌ను చూడండి ప్రింటర్– మీరు ఎన్నుకున్న అభ్యర్థి సీరియల్ నంబర్, పేరు, ఫొటో, గుర్తుతో ఓ బ్యాలెట్ స్లిప్ ప్రింట్‌ను వీవీప్యాట్‌లో చూడవచ్చు. గమనించాల్సిన విషయం ఒక వేళ మీకు బ్యాలెట్ స్లిప్ కనిపించకపోయినా, బీప్ శద్ధం గట్టిగా వినిపించకపోయినా ప్రిసైడింగ్ అధికారిని సంప్రదించవచ్చు. ఓటు గుర్తింపు కార్డు లేకపోయినా ఓటేయొచ్చు! ఓటర్ జాబితా సవరణతో కొత్తగా ఓటర్‌గా నమోదైన వారికి సైతం ఇటీవల గుర్తింపు కార్డులు వచ్చాయి. అయితే ప్రస్తుత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండీ గుర్తింపు కార్డు లేదని బాధపడుతున్నారా! ఇప్పుడు ఆ చింత అవసరం లేదు. ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఇవి ఉంటే సరి.. డ్రైవింగ్ లైసెన్సు, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఆధార్‌కార్డు, ఫొటోతో ఉన్న బ్యాంక్ పాస్‌పుస్తకం, పోస్టాఫీసులు జారీ చేసిన ఫొటోతో ఉన్న పాస్‌బుక్, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు, పింఛన్‌కార్డు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు .. ఇలా వీటిల్లో ఏదో ఒక దానిని చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. చాలెంజ్ ఓటు.. ఏప్రిల్ 11 2019ఓటరు గుర్తింపు విషయంలో అధికారులకు సందేహం కలిగినా, ఏజెంట్లు అభ్యంతరం చెప్పినా సదరు ఓటర్ తన గుర్తింపును చాలెంజ్ చేసి రుజువు చేసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు అతని పేరు తప్పు చెబుతున్నాడని ఏజెంట్ అభ్యంతరం చెబితే ఓటర్ను.. ఏజెంట్‌ను ప్రిసైడింగ్ అధికారి వద్దకు పంపుతారు. అభ్యంతరం చెప్పిన ఏజెంట్ నుంచి రూ. 2 చాలెంజ్ ఫీజుగా తీసుకుంటారు. అప్పుడు ఓటర్ వద్ద ఉన్న ఇతర గుర్తింపు వివరాలు అధికారులు పరిశీలిస్తారు. అప్పటికీ సంతృప్తి చెందకపోతే బీఎల్ఓను పిలిచి అతడు స్థానిక ఓటరా కాదా అనే విషయం.. పేరు, తండ్రి పేరు లాంటి వివరాలు తెలుసుకుంటారు. అతడు స్థానిక ఓటరై, జాబితాలో ఉన్న పేరు వాస్తవం అయితే వయన్సు, తండ్రి పేరు, చిరునామా లాంటి విషయాల్లో తేడా ఉన్నా పెద్దగా పట్టించుకోరు. అప్పుడు ఏజెంట్, ఓటరు ఇద్దరిలో ఎవరి వాదన సరైందని తేలితే వారిని వదిలి మిగతా వారికి ప్రిసైడింగ్ అధికారి మొదటిసారి హెచ్చరిక జారీ చేస్తారు. లేదా ఏజెంట్‌ను, ఓటరును పోలీసులకు అప్పగించవచ్చు. -
మార్పు..తీర్పు మీ చేతుల్లోనే
సాక్షి, అమరావతి : ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నాను, ఓటరు గుర్తింపు కార్డు కూడా ఉంది. ఈసారి కూడా జాబితాలో పేరుంటుందిలే అని ఉదాసీనంగా ఉన్నారా.. అయితే ఒక్కసారి మేల్కొండి.. తక్షణం ఓటు ఉందో లేదో సరిచూసుకోండి.. చివరి నిముషంలో ఓటు కనిపించకపోతే విలువైన అవకాశాన్ని చేజార్చుకున్న వారు అవుతారు. ఒక్క సంక్షిప్త సందేశం, ఫోన్ కాల్ ద్వారా ఓటరు జాబితాలో పేరుందో లేదో తెలుసుకోవచ్చు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రజలు తమ ఓటు పరిస్థితి తెలుసుకోవటానికి ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా యాప్‌లు, టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసింది. వాటి గురించి తెలుసుకుందాం.. టోల్‌ఫ్రీ నంబరు 1950: ఎన్నికల సంఘం 1950 కాల్‌సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఈ నంబరుకు సంక్షిప్త సందేశం (ఎస్ఎంఎస్) పంపించటం లేదా ఫోన్ కాల్ చేయటం ద్వారా ఓటరు జాబితాలో పేరుందో? లేదో తెలుసుకోవచ్చు. సంక్షిప్త సందేశం ఎలా పంపాలంటే: ఆంగ్లంలో ఈసీఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను టైప్ చేసి 1950 నంబరుకు పంపించాలి. వెంటనే జాబితాలో పేరుందా? లేదా అనేది ఓటరు ఫోన్ నంబరకు సందేశం వస్తుంది. ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు ఉందో తెలుసుకునేందుకు ఆంగ్లంలో ఈసీఐపీఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేసి 1950కు సంక్షిప్త సందేశం పంపిస్తే సమాధానం వస్తుంది. వెబ్సైట్లలో ఎలా సరిచూసుకోవాలి? 1. www. ceoandhra. nic. in వెబ్సైట్లోకి వెళ్లిపై భాగంలో ఉన్న ‘సెర్చ్ యువర్ నేమ్’ దగ్గర క్లిక్ చేయాలి. అందులో అసెంబ్లీ నియోజకవర్గంలోకి వెళితే నేరుగా నేషనల్ ఓటరు సర్వీసు పోర్టల్‌కు తీసుకెళ్తుంది. అక్కడ వివరాలు నమోదు చేస్తే ఓటరు జాబితాలో పేరుందో లేదో సులభంగా తెలుస్తుంది. 2. www. nvsp. in వెబ్సైట్లోకి వెళితే పేజీకి ఓ పక్కన ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, మీ పేరు, ఊరు వివరాలు నమోదు చేస్తే వివరాలు వస్తాయి. యాప్ ద్వారా.. గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి ‘ఓటర్ హెల్ప్‌లైన్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అనంతరం యాప్‌లో పేరు, నియోజకవర్గ వివరాలు టైప్‌చేయగానే ఓటు వివరాలు తెలుస్తాయి. ఓటు నమోదుతోపాటు తప్పులు సరిదిద్దుకోవడం ఓటు బదిలీ లాంటివి కూడా ఇంటివద్దనే చేసుకునేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదులు కూడా చేయవచ్చు. ఈ ఎన్నికల్లో ఈవీఎంతోపాటు వీవీప్యాట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఎలా వినియోగించుకోవాలో కూడా యాప్‌ద్వారా తెలుసుకోవచ్చు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన దగ్గర నుంచి ఓటు వేసి తిరిగి వచ్చే వరకు ఎలా వ్యవహరించాలన్న దానికి సంబంధించిన లఘుచిత్రాలు యాప్‌లో అందుబాటులో ఉంచారు. ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు చేసే ప్రకటనలు, ప్రజలకు అందించే సందేశాలు కూడా యాప్‌ద్వారా తెలుసుకునే వీలుంది. ఎన్నికల్లో పోటీచేసే ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల వివరాలతోపాటు అన్ని అంశాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి.. వాటి షెడ్యూల్స్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. ఎన్నికల ఫలితాలను కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకునేందుకు వీలుంది. మీసేవా కేంద్రాల్లో ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. మీ ఓటు పోయిందా.. అయితే టెండర్ ఓటు వేయండి కొన్ని సమయాల్లో ఓటరు ఓటు వేయడానికి వచ్చే సరికి ఓటును ఇంకెవరో వేసి వెళ్లడం చూస్తాం. అలాంటి సందర్భంలో సదరు ఓటరు వివరాలను ప్రిసైడింగ్ అధికారి పరిశీలిస్తారు. అతడు వాస్తవంగా ఓటు వేయలేదని నిర్ధారణకు వస్తే అతనికి ఈవీఎం ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. దీన్నే టెండర్ ఓటు అంటారు. ఇందుకోసం ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 20 చొప్పున బ్యాలెట్ పేపర్లు అందుబాటులో ఉంటాయి. ఈ బ్యాలెట్‌ను తీసుకుని ఓటర్ కంపార్ట్మెంట్లోకి వెళ్లి ఓటు వేసి ఆ పత్రాలను కవర్లో పెట్టి ప్రిసైడింగ్ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. పత్రం వెనుక ఇంకుతో టెండర్ బ్యాలెట్ అని రాస్తారు. చాలెంజ్ ఓటు.. ఓటరు గుర్తింపు విషయంలో అధికారులకు సందేహం కలిగినా, ఏజెంట్లు అభ్యంతరం చెప్పినా సదరు ఓటర్ తన గుర్తింపును చాలెంజ్ చేసి రుజువు చేసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు అతని పేరు తప్పు చెబుతున్నాడని ఏజెంట్ అభ్యంతరం చెబితే ఓటర్ను.. ఏజెంట్‌ను ప్రిసైడింగ్ అధికారి వద్దకు పంపుతారు. అభ్యంతరం చెప్పిన ఏజెంట్ నుంచి రూ. 2 చాలెంజ్ ఫీజుగా తీసుకుంటారు. అప్పుడు ఓటర్ వద్ద ఉన్న ఇతర గుర్తింపు వివరాలు అధికారులు పరిశీలిస్తారు. అప్పటికీ సంతృప్తి చెందకపోతే బీఎల్ఓను పిలిచి అతడు స్థానిక ఓటరా కాదా అనే విషయం.. పేరు, తండ్రి పేరు లాంటి వివరాలు తెలుసుకుంటారు. అతడు స్థానిక ఓటరై, జాబితాలో ఉన్న పేరు వాస్తవం అయితే వయన్సు, తండ్రి పేరు, చిరునామా లాంటి విషయాల్లో తేడా ఉన్నా పెద్దగా పట్టించుకోరు. అప్పుడు ఏజెంట్, ఓటరు ఇద్దరిలో ఎవరి వాదన సరైందని తేలితే వారిని వదిలి మిగతా వారికి ప్రిసైడింగ్ అధికారి మొదటిసారి హెచ్చరిక జారీ చేస్తారు. లేదా ఏజెంట్‌ను, ఓటరును పోలీసులకు అప్పగించవచ్చు. -
ఓట్లు.. పలు రకాలు..
పోల్ చిట్టీ తీసుకెళ్లడం.. అక్కడి అధికారులు దాన్ని పరిశీలించి అన్నీ సరిగ్గా ఉంటే అనుమతించడం.. ఆ తర్వాత ఓటు వేసి ఇంటికి రావడం. ఇదే చాలా మందికి తెలిసిన విషయం. కానీ.. ఓట్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రత్యేక పరిస్థితులు, వ్యక్తులకు మాత్రమే ఈ ఓట్లు వేసే అవకాశముంది. అలాంటి వాటిపై ప్రత్యేక కథనం. - న్యూస్‌లైన్, కలెక్టరేట్ ఫ్రాక్సీ ఓటింగ్ కొన్ని రకాల సర్వీసు ఓటర్లనే ఫ్రాక్సీ ఓటర్లు అని అంటారు. భద్రతా బలగాలు, రక్షణ రంగాల్లో పనిచేసే వారికి ఫ్రాక్సీ విధానం ద్వారా ఓటు వేసే అవకాశముంటుంది. వారు స్థానికంగా లేనందున ఓటు వేసేందుకు ఒక ప్రతినిధిని అధికారులు అనుమతిస్తారు. వీరిని క్లాసిఫైడ్ సర్వీసు ఓటరుగా గుర్తిస్తారు. నియోజకవర్గం, పోలింగ్ బూత్ పరిధిలోని ఫ్రాక్సీఓటరు వివరాలపై ఆర్ఓ ద్వారా ప్రిసైడింగ్ అధికారికి ముందే సమాచారం అందుతుంది. సర్వీసు ఓటరు తరఫున వచ్చే ఫ్రాక్సీ ఓటరు ఆ పోలింగ్ బూత్ పరిధిలోని మిగతా ఓటర్ల మాదిరిగానే ఓటు వేస్తారు. అయితే సాధారణ ఓటరుకు కుడి చేతికి సిరాచుక్క పెడితే.. ఫ్రాక్సీ ఓటరుకు మధ్య వేలికి చుక్క పెడతారు. ఏమంటే.. ఆయన తన సొంత ఓటు వేసినప్పుడు చూపుడు వేలికి సిరాచుక్క పెట్టాల్సి ఉంటుంది. కాగా, ఫ్రాక్సీ ఓటరు తన ఓటు కాక ఒకరికి మాత్రమే ఫ్రాక్సీగా ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. టెండర్ ఓటు కొన్ని సందర్భాల్లో ఓటరు ఓటు వేయడానికి వచ్చేసరికి అతడి ఓటు ఇంకెవరో వేసి వెళ్లిన సందర్భాలు ఎదురవుతాయి. అలాంటి సందర్భంలో సదరు ఓటరు వివరాలను ప్రిసైడింగ్ అధికారి పరిశీలించి.. అతను, ఆమె వాస్తవంగా ఓటు వేయలేదని నిర్ధారణకు వస్తే.. ఈవీఎం ద్వారా కాకుండా బ్యాలెట్ పేపరు ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. దీనినే టెండర్డ్ ఓటు అంటారు. ఇందుకోసం ప్రతి పోలింగ్ బూత్‌కు పార్లమెంట్, శాసనసభకు సంబంధించి 20 చొప్పున బ్యాలెట్ పేపర్లు అందుబాటులో ఉంచుతారు. ఇవి బీయూపై అమర్చే వాటిలాగే ఉంటాయి. ఆ బ్యాలెట్‌ను తీసుకుని ఓటరు కంపార్ట్మెంట్లోకి వెళ్లి ఓటు వేశాక కవర్లో పెట్టి ప్రిసైడింగ్ అధికారికి అందజేస్తే.. దాని వెనుక టెండర్ బ్యాలెట్ అని రాస్తారు. చాలెంజ్ ఓటు ఓటరు గుర్తింపు విషయంలో అధికారులకు సందేహం కలిగినా, ఏజెంట్లు అభ్యంతరం చెప్పినా సదరు ఓటరు తన గుర్తింపును చాలెంజ్ చేసి రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు అతడి పేరు తప్పు చెబుతున్నాడని ఏజెంట్ అభ్యంతరం చెబితే ఓటరు, ఏజెంట్‌ను ప్రిసైడింగ్ అధికారి వద్దకు పంపుతారు. అభ్యంతరం చెప్పి ఏజెంట్ నుంచి రూ.2 చాలెంజ్ ఫీజు తీసుకుని ఓటరు వద్ద ఉన్న ఇతర గుర్తింపు వివరాలు అధికారులు పరిశీలిస్తారు. అప్పటికీ సంతృప్తి చెందకపోతే స్థానిక బీఎల్ఓను పిలిచి ఆరా తీస్తారు. అయితే అతడు, ఆమె స్థానిక ఓటరై జాబితాలో ఉన్న పేరు సరైందే అయితే.. వయసు, తండ్రి పేరు, చిరునామా లాంటి విషయాల్లో తేడా ఉన్నా పెద్దగా పట్టించుకోరు. అప్పుడు ఏజెంట్, ఓటరు ఇద్దరిలో ఎవరి వాదన సరైందని తేలితే వారిని వదిలి మిగతా వారికి ప్రిసైడింగ్ అధికారి మొదటిసారి హెచ్చరిక జారీ చేస్తారు. లేదా ఏజెంట్, ఓటరును అక్కడే ఉండే పోలీసులకు అప్పగించొచ్చు. ఇక ఏజెంట్ పదేపదే చాలెంజ్ చేస్తే అతడిని బయటకు పంపించే అధికారం ప్రిసైడింగ్ అధికారికి ఉంటుంది.