Chandana Khan
-
పెయింటింగ్స్‌తో పదేళ్లు..
చిత్రకారిణిగా తన ప్రయాణం మొదలుపెట్టి పదేళ్లు కావస్తోందని ఐఏఎస్ అధికారి చందనాఖన్ గుర్తు చేసుకున్నారు. బంజారాహిల్స్ గ్యాలరీ స్పేస్‌లో ఆమె వేసిన చిత్రాల ఎగ్జిబిషన్ ‘ఎ రెట్రోస్పెక్ట్ ఆఫ్ సెలెక్టెడ్ పెయింటింగ్స్ బై చందనాఖన్’ ఆకట్టుకుంటోంది. పదేళ్లుగా తన కళ్లలో పడిన ఎన్నో దృశ్యాలు... తన మనసు నుంచి కాన్వాస్‌లోకి ప్రవహించాయని చందనాఖన్ చెప్పారు. ఇందులో 30 పెయింటింగ్స్ ఉన్నాయని, అనంతరం ముంబైలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 20 వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. సిటీ ప్లస్ -
చందనాఖాన్కు చేదు అనుభవం
-
ఏపీ ఐఏఎస్ అధికారిణి చందనా ఖన్‌కు పరాభవం
హైదరాబాద్ : రాష్ట్రాలు విడిపోయినా విభజన సెగ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆ వివాదం అధికారులకు తాకింది. వివరాల్లోకి వెళితే సీనియర్ ఐఏఎస్ అధికారిణి చందనా ఖన్‌కు పరాభవం ఎదురైంది. జాతీయ టూరిజం సంస్థ బోర్డు సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమెను సోమవారం తెలంగాణ ఐఏఎస్ అధికారులు అడ్డుకున్నారు. దాంతో ఖంగుతిన్న చందనా ఖన్ ....తెలంగాణ అధికారుల వైఖరిని నిరరిస్తూ టూరిజం కార్యాలయం ఎదుట బైఠాయించారు. కాగా చందనా ఖన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
కొండపల్లి ఖిల్లాకు కొత్త సొబగులు
రూ.1.25 కోట్లతో అభివృద్ధి పర్యాటక శాఖ కసరత్తు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు సాక్షి, విజయవాడ : కృష్ణా- గుంటూరు జిల్లాల మధ్య రాష్ట్ర రాజధాని ఏర్పడే అవకాశాలు ఉండడంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఆ శాఖ అధికారులు నడుం బిగించారు. ఇందులో భాగంగా కొండపల్లి ఖిల్లాకు కొంత హంగులు సమకూర్చనున్నారు. ఇటీవల పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చందనాఖాన్ నగరానికి వచ్చినప్పుడు ఖిల్లాను సందర్శించి అక్కడి సమస్యలను పర్యాటకుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో పర్యాటకులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 13వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ.1.25 కోట్లు విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రూ. కోటితో లైటింగ్, సౌండ్ ఏర్పాట్లు కొండపల్లి ఖిల్లాపై పర్యాటకుల్ని ఆకట్టుకునే విధంగా చక్కటి లైటింగ్, పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే విధంగా సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి కోటి రూపాయలు కేటాయించారు. మౌలిక వసతులకు రూ.25 లక్షలు ఖిల్లా మార్గాలను అభివృద్ధి చేయడంతోపాటు కొండను కెమికల్ క్లీనింగ్ చేయించేందుకు రూ.15 లక్షలు మంజూరు చేశారు. మంచి నీటి సదుపాయం, పర్యాటకులకు మౌలిక సదుపాయాల కల్పనకు రూ.10 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వ నిధులు ఏమయ్యాయి? కొండపల్లి ఖిల్లాను అభివృద్ధి చేయడంతోపాటు ఇక్కడ హస్తకళాకారులకు సహాయం చేయడానికి యూపీఏ ప్రభుత్వం రూ. ఐదు కోట్లు మంజూరు చేసింది. కొండపల్లి సర్క్యూట్ పేరుతో జిల్లాలో పర్యాటక ప్రాంతాలన్నింటినీ కలుపుతూ టూర్ ప్యాకేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఆ నిధుల్ని ఇప్పటివరకు రాష్ట్ర పర్యాటక శాఖాధికారులు ఉపయోగించలేదు. 13 ఆర్థిక సంఘం నిధులతోపాటు కేంద్రం మంజూరు చేసిన రూ. ఐదు కోట్లనూ కలిపి అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. -
పర్యాటక కేంద్రంగా శ్రీపర్వతారామం
నాగార్జునసాగర్,న్యూస్‌లైన్ : నాగార్జునసాగర్‌లో శ్రీపర్వతారామాన్ని ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చందనాఖన్ తెలి పారు. బుద్ధపూర్ణిమ ఉత్సవాలను పురస్కరించుకుని నాగార్జునసాగర్‌లోని శ్రీపర్వతారామంలోని సమావేశ మంది రంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆమె మాట్లాడారు. అనంతరం వ్యాలీ ఆఫ్ స్థూపాస్, బుద్ధభూమి, బోధిసత్వ పార్కు జాతక ప్యానల్, శ్రీపర్వతారామం బ్రోచర్, మహోన్నత భారతీయుడు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాగార్జునసాగర్ జలాశయం తీరంలో నిర్మించిన శ్రీపర్వతారామం, ప్రవేశద్వారం, బుద్ధచరిత వనం, స్థూపవనం, శ్రీలంక ప్రభుత్వం బహూకరించిన బుద్ధవిగ్రహాలను శ్రీపర్వతారామానికి అంకితం చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం గొప్ప బౌద్ధ పర్యాటక స్థావర ంగా దేశ,విదేశీయులను ఆకర్షిస్తుందన్నారు. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ఒక భాగం కూడా పూరి ్తకాలేదని రూ. 22 కోట్లు మంజూరు కాగా కేవలం రూ.10 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయని తెలిపారు. ఇదిపూర్తయితే పర్యాటక అభివృది ్ధసంస్థకు ఆదాయాన్ని, స్థానికులకు ఉద్యోగాలను కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక సంస్థ ఎండీ కే.ఎస్‌రెడ్డి, ఈడీ మధుసూదన్, ఏడీసీ.శ్రీనివాస్, రాష్ట్ర ఆర్ట్‌గ్యాలరీ డెరైక్టర్ శివనాగిరెడ్డి, ఈశ్వరీయ బ్రహ్మకుమారి శకుంతల ,బొర్ర గోవర్దన్, సాగర్ డీవీఎమ్ వెంకటేశ్వర్రావు, డీటీఓ మహీధర్ పాల్గొన్నారు. అలరించిన చండాలిక నృత్యనాటిక బుద్ధజయంతి ఉత్సవాల భాగంగా పర్యాటక శాఖ నిర్వహించిన చండాలిక నృత్యనాటిక ఆహుతులను అలరించింది. అంటరానితనాన్ని పారదోలిన బుద్ధుని శిష్యుడు ఆనందునికి దప్పిక తీర్చడానికి ప్రకృతి అనే చండాలిక నీరు పోసిన దృశ్యం ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. పద్మశ్రీ అవారు ్డ గ్రహిత శోభానాయుడు, శిష్యురాలు శ్రీదేవి బృందం ప్రదర్శనను, ఈ నాటకాన్ని పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆమెను ప్రశంసించారు. ప్రారంభమైన రైలు శ్రీపర్వతారామంలో పర్యాటకలను అ న్ని ప్రాంతాలకు తిప్పడానికి రైలును ప్రారంభించారు. పిల్లలు,పెద్దలు శ్రీపర్వతారామంలో రెలైక్కి సందడి చేశారు. సమావేశమందిరం చిన్నగా ఉండడంతో సందర్శకులంతా నిలబడే నాటక ప్రదర్శనను చూశారు. -
సాగర్‌లో అమెరికా బౌద్ధ అధ్యయన కేంద్రం
నాగార్జునసాగర్, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో అమెరికా బౌద్ధ అధ్యయన కేంద్ర నిర్మాణ పనులకు సోమవారం పర్యాటక చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చందనాఖాన్ భూమిపూజ చేశారు. అనంతరం ప్రజ్ఞోపాయ బుద్ధిస్ట్ చారిటబుల్కు చెందిన టెంజన్ ప్రియదర్శిని, రాష్ట్రపర్యాటక సంస్థ గౌరవ సలహాదారులు చెన్నూరి ఆంజనేయరెడ్డిలతో కలిసి బుద్ధుడి విగ్రహానికి బౌద్ధమత సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ బుద్ధవనంలో మెరుగైన ధ్యాన విశ్వవిద్యాలయానికి ఏర్పాటు చేసేందుకు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించామని తెలిపారు. నిర్మాణ పనులు రెండేళ్లలో పూర్తవుతాయని చెప్పారు. -
ప్రభుత్వోద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి, విశాఖపట్నం : సందర్శకులను ఆకట్టుకునేందుకు ఏపీ టూరిజం శాఖ విశ్వప్రయత్నాలు చేస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంతో పాటు గతంలో ఆ శాఖ సిబ్బందే ఆందోళనలకు దిగడంతో పర్యాటకశాఖ విపరీతంగా నష్టపోయింది. ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు సమైక్యాంధ్ర సమ్మె కాలంలోనే గదుల అద్దెలో 30 శాతం రాయితీ ప్రకటించి టూరిస్టులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తాజాగా ఏపీటీడీసీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి చందనాఖాన్ మరో ఉత్తర్వు జారీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీటీడీసీ పరిధిలో రెస్టారెంట్లు, హోటళ్లలో బసకు దిగితే 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించారు. నిబంధనలు వర్తిస్తాయన్నారు. ఇలా ప్రకటించడం ఆ శాఖ చరిత్రలోనే మొదటిసారి అని సిబ్బంది చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబసభ్యులతో సంతోషంగా ఉండేందుకు వారాంతాల్లో 30 శాతం, మిగతా రోజుల్లో 50శాతం రాయితీపై సౌకర్యం పొందవచ్చని సిబ్బంది చెబుతున్నారు. ఏపీటీడీసీ పరిధిలో అరకు, రుషికొండ, యాత్రి నివాస్‌లలో త్రీస్టార్ స్థాయి సౌకర్యాలున్నాయి. ఉద్యోగులు తమ ప్రాజెక్టుల్ని సందర్శించే సమయంలో వారి గుర్తింపు కార్డుల్ని కచ్చితంగా చూపించాలన్నారు. వాస్తవానికి ఆగస్టు నుంచి టూరిస్టుల సీజన్ కొనసాగుతుంది. ఇటీవల సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో రెండు నెలల పాటు గదులన్నీ ఖాళీగానే ఉండిపోయాయి. ఇతర ప్రాంతాలనుంచి రావాల్సిన సందర్శకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వోద్యోగులకు రాయితీ ఇవ్వడం ద్వారా వ్యాపారాన్ని మరింత పెంచుకోవచ్చునని ఏపీటీడీసీ భావిస్తోంది. సిటీ టూర్లో థింసా : సందర్శకులకు సిటీ టూర్ ప్యాకేజీలో భాగంగా రుషికొండలోని నిత్యం మధ్యాహ్న భోజన సమయంలో థింసా నృత్యం ప్రదర్శించనున్నారు. గతంలో అరకు (ఆర్ఆర్ ప్యాకేజీ)తోపాటు రుషికొండ ప్రాజెక్టు వద్ద వారాంతాల్లో మాత్రమే ఈ ప్రదర్శన ఉండేది. దీనికి భారీగా స్పందన రావడంతో ఇక నుంచి సిటీ టూర్ ప్యాకేజీలో కూడా థింసా నృత్యం ప్రదర్శించనున్నట్టు ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ భీమశంకరరావు తెలిపారు. ఇందుకు ఎలాంటి అదనపు రుసుం వసూలు చేయడం లేదన్నారు. సీజన్లోనూ ఈ తరహా ఆఫర్ ఏపీటీడీసీ ప్రకటించడం గమనార్హం.