చారుశీల ఏం చేసింది?
రష్మీ గౌతమ్, రాజీవ్ కనకాల, జశ్వంత్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘చారుశీల’. శ్రీనివాస్ ఉయ్యూరు దర్శకుడు. కొండపల్లి సమర్పణలో జోత్స్న ఫిలింస్ పతాకంపై ప్రముఖ దర్శకులు వి.సాగర్, సిద్ధిరెడ్డి, జయశ్రీ అప్పారావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెలాఖరున విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. చూస్తున్నంత సేపూ తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠకు లోనవుతారు. చారుశీలగా రష్మీ నటనకు అవార్డులు రావడం ఖాయం.
కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మంచి చాయిస్ ఈ చిత్రం. బ్రహ్మానందం, మెల్కోటి, జబర్దస్త్ టీం మధ్య సన్నివేశాలు నవ్విస్తాయి. మాటలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: కుమార్ మల్లారపు, సంగీతం: సుమన్ జూపూడి, కథ-కథనం- ఛాయాగ్రహణం- దర్శకత్వం: శ్రీనివాస్ ఉయ్యూరు.