'వర్షాలతో ఏపీలో 81 మంది మృతి'
భారీ వర్షాల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటి వరకూ 81 మంది మృతి చెందారని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అకాల వర్షాల కారణంగా భారీగా పంట నష్టం సంభవించిందని వివరించారు. రూ.6,750 కోట్ల మేర పంట, ఆస్తి నష్టం ఉండవచ్చని ప్రాధమికంగా అంచనాకు వచ్చినట్లు తెలిపారు.
మరోవైపు చెన్నైలో ఉన్న తెలుగు వారి సమాచారం ఎప్పటి కప్పుడు తెలుసుకుంటున్నామని అన్నారు. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తమిళనాడుకు అవసరమైన సాయం అందిస్తామని తెలిపారు.