Chennur Assembly Constituency
-
TS: మంత్రి పదవి కోసం అన్నదమ్ముల మధ్య పోటీ?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్ర మంత్రి వర్గంలో మన ఎమ్మెల్యేల్లో ఎవరికి చోటు దక్కుతుందనే ఉత్కంఠ వీడడం లేదు. రాష్ట్రంలో తొలి మంత్రివర్గ కూర్పులో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు. తాజాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతారని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరికి కేబినెట్లో బెర్త్ దక్కుతుందనే ఆసక్తి అధికార పార్టీతో పాటు ప్రజల్లోనూ ఉంది. ఉమ్మడి జిల్లాలో 10 స్థానాల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఖానాపూర్, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. పార్టీలో సీనియర్ నాయకుడు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు మొదటి కూర్పులోనే కేబినెట్లో చోటు దక్కుతుందనే ప్రచారం జరిగినా అవకాశం రాలేదు. ఇక గడ్డం సోదరులైన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ కూడా అమాత్య పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వీరి ముగ్గురి మధ్య పోటీ నెలకొంది. అన్నదమ్ముల్లోనే పోటీ మాజీ మంత్రి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఇద్దరూ అన్నదమ్ములు. వీరిరువురూ మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. 2004నుంచి 2009 మధ్య చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశానని, తనకే మళ్లీ అవకాశం ఇవ్వాలని వినోద్ కోరుతున్నారు. ఇందుకోసం రెండునెలల క్రితమే ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని కలిసి విన్నవించారు. ఇక్కడ సీఎం రేవంత్‌రెడ్డిని తరచూ కలుస్తున్నారు. గడ్డం వివేక్ కూడా మంత్రి పదవిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇద్దరూ పదవిపై పోటీ పడుతూ ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. వంశీ ఎంపీ టికెట్‌తో లింకు? లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగాలని వివేక్ తనయుడు వంశీకృష్ణ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్లు, ఒకరికి ఎంపీ టికెట్, మళ్లీ అదే కుటుంబం నుంచి మంత్రి పదవి కూడా ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే కోణంలో పరిశీలన చేస్తున్నట్లు నాయకులు చెప్పుకొంటున్నారు. ఇక వంశీకి లోక్‌సభ టికెట్ కావాలని అడుగుతున్న క్ర మంలో టికెట్ ఇస్తే, మంత్రి పదవి వదులుకుంటా రా? లేక టికెట్‌తో పాటు కేబినెట్లో చోటు కోసం పట్టుబడుతారా? అనేది తేలాల్సి ఉంది. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికలయ్యే దాకా ఈ సమస్య తేల్చ కుడా, మంత్రివర్గ విస్తరణ వాయిదా వేసే అవకాశం ఉందని కొందరు నాయకులు భావిస్తున్నారు. ఉమ్మ డి జిల్లాలో పాలన పరంగా ఇబ్బంది లేకుండా, స్థా నికంగా మంత్రి ఎవరూ లేకపోవడంతో ఆ స్థానంలో మంత్రి సీతక్కను ఇన్చార్జిగా నియమించారు. దీంతో ఆమెతోనే పాలన కొనసాగిస్తారా? లేక ఇక్క డి ఎమ్మెల్యేల్లో ఎవరికై నా అవకాశం కల్పిస్తారా?.. అనే విషయం తేలేవరకూ వేచిచూడాల్సిందే. ‘పీఎస్సార్’కు పెద్దల హామీ! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేకున్నా పార్టీని బలోపేతం చేశార నే మంచి పేరు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు ఉంది. కష్టకాలంలో పార్టీలో కేడర్‌ను కాపాడినట్లు చెప్పుకొంటారు. ఆ సమయంలో గడ్డం సోదరులు ఇంకా కాంగ్రెస్‌లో చేరలేదు. రెండేళ్ల క్రితం బీఎస్పీ నుంచి వినోద్, ఇటీవల అ సెంబ్లీ ఎన్నికల ముందు వివేక్ కాంగ్రెస్‌లో చేర డం తెలిసిందే. వీళ్లిద్దరి కంటే పార్టీలో సీనియర్‌గా ఉండి, పార్టీ కోసం కష్టపడ్డారని, పీఎస్సార్‌కే మంత్రి పదవి ఇవ్వాలని ఆయన వర్గీయులు పట్టుబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘దళిత గిరిజన దండోరా’ బహిరంగ సభ సక్సెస్ చేసి పార్టీలో ఉత్తేజం నింపారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’ను సక్సెస్ చేశారు. మంచిర్యాలలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గేతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభ వేదికపైనే పీఎస్సార్ వచ్చే ప్రభుత్వంలో మంచిహోదాలో ఉంటారని హామీ ఇచ్చారు. తర్వాత పార్టీ ఎన్నికల వ్యూహ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. ఈ క్రమంలో ఆయన కూడా గట్టిగానే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. -
TS Elections Result: చెన్నూర్‌లో నువ్వా? నేనా?
సాక్షి, మంచిర్యాల: హీటెక్కించిన విమర్శలు.. హోరెత్తించేలా ప్రచారాలు.. ఎవరికి వారే ఓటర్లను ప్రసన్నం తంటాలు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమా. అభివృద్ధి తామే చేశామని.. మరో అవకాశం ఇస్తే ఇంకా చేస్తామని, చేసిందేమీలేదని.. తమకు అధికారం ఇస్తే సిసలైన అభివృద్ధి చూపిస్తామని.. ఇలా హామీల మీద హామీలతో ‘సై’ అంటూ ఎన్నికల సమరంలో దూకారు. మరి చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో.. ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారో.. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మంచిర్యాల జిల్లా పరిధిలోని నియోజకవర్గం. బీఆర్ఎస్ నుంచి యువనేతగా గుర్తింపు ఉన్న బాల్క సుమన్ మరోసారి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత గడ్డం వివేక్ వెంకటస్వామి బరిలో నిలవడం ఇక్కడ తీవ్ర చర్చకు దారి తీసింది. పెద్దపల్లి మాజీ ఎంపీలుగా.. స్థానికతను చూపిస్తూ ప్రచారం చేసుకున్నారు ఇద్దరూ. ఇక బీజేపీ తరఫున దుర్గం అశోక్ పోటీలో నిలిచారు. చెన్నూరులో పురుష ఓటర్లు 91,969.. మహిళా ఓటర్లు 92,141.. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఏడు.. సర్వీస్ ఎలక్టోర్లు 133.. మొత్తంగా మొత్తం ఓటర్ల సంఖ్య 1,84,250. చెన్నూర్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 82.57 శాతం ఓటింగ్ రికార్డ్ కాగా.. ఈసారి ఎన్నికల్లో 79.97 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో కోల్‌బెల్ట్ ఏరియా ఓట్లు ఇక్కడ కీలకం కానున్నాయి. -
చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో సోదాలపై ఈడీ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ, కాంగ్రెస్ చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థి వివేక్ ఇంట్లో సోదాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. మొత్తం రూ. 200 కోట్ల అక్రమ లావాదేవీలను జరిపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. యాశ్వంత్ రియాలిటీతో పాటు గడ్డం వివేక్ భార్య పేరిట కూడా భారీగా అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు ఫెమా చట్టం కింద మాజీ ఎంపీ వివేక్‌పై కేసు నమోదు చేశారు. విజిలెన్స్ సెక్యూరిటీ ద్వారా ఎలాంటి వ్యాపారం లేకపోయినా పెద్దఎత్తున లావాదేవీలు జరిగినట్లు అధికారులు తెలిపారు. నకిలీ పత్రాలతో ఆస్తులను కొనుగోలు.. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో ఇప్పటి వరకూ 20 లక్షల ఆదాయపు పన్ను మాత్రమే చెల్లించినట్లు పేర్కొన్నారు. కాగా డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ తెలంగాణలోని నాలుగు ప్రదేశాలలో ఫారిన్ ఎక్స్ఛెంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) నిబంధనల ప్రకారం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని డాక్టర్ గడ్డం వివేకానంద నివాసంతోపాటు హైదరాబాద్‌లోని విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్, విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరిగాయి. రామగుండంలో లిమిటెడ్. హైటెక్ సిటీ, మంచిర్యాలలో ఆయన నివాసం ఉంటున్న తాత్కాలిక స్థలంలో కూడా సోదాలు నిర్వహించారు. తెలంగాణ పోలీసుల సూచన మేరకు ఈడీ దర్యాప్తు ప్రారంభించి రూ. 8 కోట్లు డాక్టర్ జి. వివేక్ బ్యాంక్ ఖాతా నుండి M/s విజిలెన్స్ సెక్యూరిటీకి RTGS చేశారు ఈడీ దర్యాప్తులో విజిలెన్స్ సెక్యూరిటీ బ్యాంక్ ఖాతా నుంచి హేతుబద్ధత లేకుండా డబ్బును సర్క్యుటస్‌గా బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. వివేక్, అతని భార్య వారి సంస్థ విశాఖ ఇండస్ట్రీస్‌లో విజిలెన్స్ సెక్యూరిటీతో 100 కోట్లు పెట్టబడి పెట్టినట్లు, విజిలెన్స్ సెక్యూరిటీపై వివేక్‌కు పరోక్ష నియంత్రణ ఉన్నట్లు వెల్లడైంది. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా FEMA ఉల్లంఘనలు, పన్ను ఎగవేతలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. లెక్కలోని అనేక కోట్ల లావాదేవీలు గుర్తించారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెప్పారు. -
సింగరేణి తెలంగాణ కంపెనీనే, కానీ..: సీఎం కేసీఆర్
సాక్షి, మంచిర్యాల: బీఆర్ఎస్కు బాస్‌లు ఢిల్లీలో ఉండరని.. తెలంగాణ ప్రజలే దీనికి బాస్‌లు అని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం మధ్యాహ్నాం మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రసంగించారు. మందమర్రి బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు కేసీఆర్. ‘‘కాంగ్రెస్ నాయకుల చేతిలో ఏమీలేదు. ఢిల్లీలో కట్క వేస్తే ఇక్కడ ఆ పార్టీకి వెలుగు వస్తుంది. అంబేద్కర్‌ను పార్లమెంటు ఎన్నికలలో ఓడగొట్టింది ఈ కాంగ్రెస్ పార్టీనే. కానీ, బీఆర్ఎస్కు ప్రజలే బాస్‌లు. తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ పుట్టిందని అన్నారాయన. ప్రధాని మోదీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకుంది. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓడలు, విమానాలు, రైళ్లు అన్ని ప్రైవేటైజేషన్ చేస్తోంది. పేకాట క్లబ్ డబ్బులు సంపాదించినోడు మంచిర్యాలలో పోటీ చేస్తున్నారు. వాళ్లకు బుద్ది చెప్పాలి అని ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ‘‘ఈ సింగరేణి అచ్చం తెలంగాణాదే. సింగరేణి మన తెలంగాణ కంపెనీ. కానీ, కేంద్రం వద్ద అప్పులు తెచ్చి అది కట్టలేక నలభై తోమ్మిది శాతం వాటాల్ని కేంద్రానికి అమ్మింది కాంగ్రెస్ పార్టీనే. ప్రాజెక్టులు కట్టలేక ముంచింది కాంగ్రెస్. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలు ఊడగోట్టింది కాంగ్రెస్, కమ్యూనిస్టు లే’’ అని మండిపడ్డారాయన. ‘‘సూట్ కేసులతో వచ్చే వాళ్లు కావాలనా.. జేబులో పైసలు లేని సుమన్ కావాలనా? మీరే నిర్ణయం తీసుకోని ఓట్లు వేయండి’’ అని ప్రజలను కోరారాయన. ‘సుమన్ రాకముందు, సుమన్ వచ్చిన తర్వాత. చెన్నూరు ఏలా మారిందో చూసి ఓట్లు వేయాలి. సుమన్ మా ఇంట్లో ఉంటాడు.. నాతో ఉంటాడు. చైతన్యంతో ఆలోచించి బీఆర్ఎస్కు ఓటు వేయాలి’ అని ప్రజలను కోరారాయన. మహబూబ్‌నగర్, నల్లగొండ,మెదక్ జిల్లాలో సగం ప్రజలు వలసపోయేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారాయన. ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు. ఓటును అమ్ముకోవద్దు. వాళ్లెవరో చెప్పారని ఓటు వేయొద్దు. ఓటు మీ తలరాతను మారుస్తుంది. ఓటు వేసేటప్పుడు విజ్ఞతతో వ్యవహరించండి. పార్టీ అభ్యర్థి నడవడికను విచారించి ఓటేయాలి అని ఆయన ప్రజలకు పిలుపు ఇచ్చారు. -
దసరా తర్వాతే కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. సీపీఐకి ఎదురుదెబ్బ!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే బస్సు యాత్రలో హస్తం నేతలు బిజీగా ఉన్నారు. మరోవైపు.. కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాపై ఉత్కంఠ నెలకొంది. కాగా, దసరా తర్వాతే రెండో జాబితా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటికే 55 మందితో తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. మరో 64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా, దసరా తర్వాతనే తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఈనెల 25 లేదా 26 తేదీలలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఇక, ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మెజారిటీ కసరత్తు పూర్తి చేసింది. అవసరాన్ని బట్టి అభ్యర్ధులతో కాంగ్రెస్ నాయకత్వం మాట్లాడనున్నట్టు సమాచారం. మరోవైపు, సీట్ల కేటాయింపులో భాగంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు చెరో రెండు స్థానాలు ఇచ్చేందకు అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. చెన్నూరు నుంచి సీపీఐ అభ్యర్థి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. చెన్నూరులో అభ్యర్థిని ప్రకటించక ముందే సీపీఐకి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా సీపీఐ అనుబందం సంఘం ఎఐటీయూసీ.. చెన్నూరులో సీపీఐ పోటీ చేయడంపై వ్యతిరేకత చూపించింది. సీపీఐ అక్కడ పోటీ చేయవద్దంటూ ఏకంగా తీర్మానం చేసింది. బలం లేని చోట పోటీ వద్దంటూ తీర్మానంలో పేర్కొంది. వెంటనే చెన్నూర్ టిక్కెట్ తీసుకునే ప్రతిపాదనను విరమించుకోవాలని మందమర్రి కార్మిక సంఘం విభాగం కోరింది. దీంతో, ఆదిలోనే సీపీఐకి ఊహించని షాక్ తగిలినట్టు అయ్యింది. -
చెన్నూరు (SC) రాజకీయ చరిత్ర.. ఎవరెవరు.. ఎప్పుడు.. ఎలా గెలిచారంటే..?
చెన్నూరు రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ నేత బల్క సుమన్ విజయం సాదించారు. 2014లో ఆయన పెద్దపల్లి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన 2018లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు.ఆయన తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్ ఐ కు చెందిన బొర్లకుంట వెంకటేష్ నేతపై 28126 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నల్లాల ఓదేలు కు టిఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వలేదు. అది కొంత గొడవ అయినా, ఆ తర్వాత సర్దుకుని బల్క సుమన్ గెలుపొందారు. నల్లాల ఓదేలు మూడోసారి.. ఆ తర్వాత రోజులలో వెంకటేష్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి టిఆర్ఎస్లో చేరి పెద్దపల్లి నుంచి లోక్‌సభకు పోటీచేసి గెలుపొందారు. ఇక్కడ మూడోస్థానం ఆర్పిఐ కి చెందిన సంజీవ్ కు వచ్చింది. ఆయనకు 5274 ఓట్లు వచ్చాయి. 2014లో టిఆర్ఎస్ నేత నల్లాల ఓదేలు మూడోసారి గెలిచారు. 2014 ఎన్నికలలో ఆయన తన సమీప కాంగ్రెస్ఐ ప్రత్యర్ది మాజీ మంత్రి వినోద్‌ను ఓడిరచారు. పెద్దపల్లి ఎమ్.పి వివేక్ సోదరుడు అయిన ఈయన కొంతకాలం క్రితం వరకు టిఆర్ఎస్ లోకి వెళ్లి తిరిగి కాంగ్రెస్‌ఐలో చేరారు. ఆ తర్వాత వినోద్ బిఎస్పి తరపున బెల్లంపల్లిలో 2018లో పోటీచేసి ఓడిపోతే, వివేక్ బిజెపి పక్షాన పెద్దపల్లి నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓటమి చెందారు. ఓదేలు రెండువేల తొమ్మిదిలో గెలుపొంది, తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలో గెలుపొందారు. తెలంగాణ ఏర్పాటు అయిన నేపద్యంలో తిరిగి 26164 ఓట్ల తేడాతో మూడోసారి ఘన విజయం సాధించారు. 2018లో ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. 1962లో నుంచి ఏర్పడిన చెన్నూరు అప్పటి నుంచి ఇప్పటి వరకు రిజర్వుడు నియోజకవర్గంగానే కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఐదుసార్లు గెలుపొందితే, తెలుగుదేశం పార్టీ ఐదుసార్లు గెలవగా మూడుసార్లు టిఆర్ఎస్ విజయం సాధించింది. 1983 తరువాత ఒక్కసారే కాంగ్రెస్ ఐ గెలవగలిగింది. సాధారణ ఎన్నికలలో ఒంటరిగా విజయం.. : మహాకూటమిలో భాగంగా టిఆర్ఎస్ 2009లో పోటీచేసి గెలవగా, ఆ తర్వాత సాధారణ ఎన్నికలలో ఒంటరిగా విజయం సాదించింది. ప్రముఖ కాంగ్రెస్ నేత కోదాటి రాజమల్లు ఇక్కడ మూడుసార్లు గెలిస్తే, అంతకుముందు సిర్పూరులో ఒకసారి, లక్సెట్టిపేటలో మరోసారి గెలిచారు. టిడిపి నేత బోడ జనార్దన్ నాలుగుసార్లు విజయం సాధించగా, ప్రముఖ కార్మికనేత ఏడుసార్లు ఎమ్‌పిగా నెగ్గిన జి. వెంకటస్వామి కుమారుడు వినోద్ 2004లో ఇక్కడ గెలిచి, రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడు కాగలిగారు. కోదాటి రాజమల్లు జలగం క్యాబినెట్లో ఉండగా, జనార్థన్ 1989లో ఎన్టిఆర్ క్యాబినెట్లో ఉన్నారు. చెన్నూరు(ఎస్సీ)లో ఎవరెవరు.. ఎప్పుడు.. ఎలా గెలిచారంటే.. : -
చెన్నూరు (ఎస్సీ) రాజకీయ చరిత్ర.. ఎవరెవరు.. ఎప్పుడు.. ఎలా గెలిచారంటే..?
చెన్నూరు రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ నేత బల్క సుమన్ విజయం సాదించారు. 2014లో ఆయన పెద్దపల్లి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన 2018లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు.ఆయన తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్ ఐ కు చెందిన బొర్లకుంట వెంకటేష్ నేతపై 28126 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నల్లాల ఓదేలు కు టిఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వలేదు. అది కొంత గొడవ అయినా, ఆ తర్వాత సర్దుకుని బల్క సుమన్ గెలుపొందారు. నల్లాల ఓదేలు మూడోసారి.. ఆ తర్వాత రోజులలో వెంకటేష్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి టిఆర్ఎస్లో చేరి పెద్దపల్లి నుంచి లోక్‌సభకు పోటీచేసి గెలుపొందారు. ఇక్కడ మూడోస్థానం ఆర్పిఐ కి చెందిన సంజీవ్ కు వచ్చింది. ఆయనకు 5274 ఓట్లు వచ్చాయి. 2014లో టిఆర్ఎస్ నేత నల్లాల ఓదేలు మూడోసారి గెలిచారు. 2014 ఎన్నికలలో ఆయన తన సమీప కాంగ్రెస్ఐ ప్రత్యర్ది మాజీ మంత్రి వినోద్‌ను ఓడిరచారు. పెద్దపల్లి ఎమ్.పి వివేక్ సోదరుడు అయిన ఈయన కొంతకాలం క్రితం వరకు టిఆర్ఎస్ లోకి వెళ్లి తిరిగి కాంగ్రెస్‌ఐలో చేరారు. ఆ తర్వాత వినోద్ బిఎస్పి తరపున బెల్లంపల్లిలో 2018లో పోటీచేసి ఓడిపోతే, వివేక్ బిజెపి పక్షాన పెద్దపల్లి నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓటమి చెందారు. ఓదేలు రెండువేల తొమ్మిదిలో గెలుపొంది, తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలో గెలుపొందారు. తెలంగాణ ఏర్పాటు అయిన నేపద్యంలో తిరిగి 26164 ఓట్ల తేడాతో మూడోసారి ఘన విజయం సాధించారు. 2018లో ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. 1962లో నుంచి ఏర్పడిన చెన్నూరు అప్పటి నుంచి ఇప్పటి వరకు రిజర్వుడు నియోజకవర్గంగానే కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఐదుసార్లు గెలుపొందితే, తెలుగుదేశం పార్టీ ఐదుసార్లు గెలవగా మూడుసార్లు టిఆర్ఎస్ విజయం సాధించింది. 1983 తరువాత ఒక్కసారే కాంగ్రెస్ ఐ గెలవగలిగింది. సాధారణ ఎన్నికలలో ఒంటరిగా విజయం.. : మహాకూటమిలో భాగంగా టిఆర్ఎస్ 2009లో పోటీచేసి గెలవగా, ఆ తర్వాత సాధారణ ఎన్నికలలో ఒంటరిగా విజయం సాదించింది. ప్రముఖ కాంగ్రెస్ నేత కోదాటి రాజమల్లు ఇక్కడ మూడుసార్లు గెలిస్తే, అంతకుముందు సిర్పూరులో ఒకసారి, లక్సెట్టిపేటలో మరోసారి గెలిచారు. టిడిపి నేత బోడ జనార్దన్ నాలుగుసార్లు విజయం సాధించగా, ప్రముఖ కార్మికనేత ఏడుసార్లు ఎమ్‌పిగా నెగ్గిన జి. వెంకటస్వామి కుమారుడు వినోద్ 2004లో ఇక్కడ గెలిచి, రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడు కాగలిగారు. కోదాటి రాజమల్లు జలగం క్యాబినెట్లో ఉండగా, జనార్థన్ 1989లో ఎన్టిఆర్ క్యాబినెట్లో ఉన్నారు. చెన్నూరు(ఎస్సీ)లో ఎవరెవరు.. ఎప్పుడు.. ఎలా గెలిచారంటే.. :