chidren
-
నిప్పంటుకుని ఇద్దరు చిన్నారుల మృతి
బొల్లాపల్లి (వినుకొండ): ప్రమాదవశాత్తూ మంటలంటుకుని ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు మరణించిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. బొల్లాపల్లి మండలం చక్రాయపాలెం గ్రామానికి చెందిన మూఢావతు బాలునాయక్‌కు ఉదయ్‌కుమార్ నాయక్, సాంబశివరావు నాయక్, రామారావు నాయక్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరు వివాహాలు చేసుకుని పక్కపక్క ఇళ్లల్లోనే నివసిస్తున్నారు. ప్రమాదం జరిగిందిలా.. ⇔ బుధవారం సాయంత్రం సాంబశివరావు నాయక్ 30 లీటర్ల పెట్రోలు క్యాను నుంచి ఐదు లీటర్లను మరో క్యానులోకి వంచుతుండగా సమీపంలో కట్టెల పొయ్యి నుంచి నిప్పులు రేగి పెట్రోలుకు అంటుకున్నాయి. ⇔ అక్కడే ఆడుకుంటున్న ఉదయ్‌కుమార్ కుమార్తె కృపాబాయి(3)కి మంటలు అంటుకునిఅక్కడికక్కడే మృతి చెందింది. ⇔ సాంబశివరావు నాయక్ కుమారుడు సియోన్ నాయక్ (ఏడాది)కు కూడా మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. ⇔ సియోన్ నాయక్‌ను పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి ఆస్పత్రిలో మృతిచెందాడు. గాయపడ్డ మరో ఇద్దరుప్రమాదం జరిగినప్పుడు సమీపంలోనే ఉన్న సాంబశివరావు నాయక్ భార్య లక్ష్మీబాయి, రామారావు నాయక్ భార్య మల్లేశ్వరి బాయి స్వల్పంగా గాయపడ్డారు. కళ్ల ముందే మంటలంటుకుని తమ బిడ్డలు కాలిపోతున్నా కాపాడుకోలేకపోయామని ఉదయ్ కుమార్, ఆయన భార్య ఇస్త్రీ బాయి బోరున విలపించారు. వినుకొండ రూరల్ సీఐ ఎం.వి.సుబ్బారావు, బండ్లమోటు ఎస్ఐ జి.అనిల్‌కుమార్ ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. -
పిల్లల్ని చెరబట్టందే చదువు చెప్పలేమా?
ఒకరు వీపు విమానం మోత మోగిస్తారు, ఒకరు ఒళ్లు హూనం అయ్యేలా బాదుతారు. ఒకరు బెత్తం విరిగేదాకా కొట్టి చేతులు విరగ్గొడ తారు, మరొకరు వెంటాడుతూ విద్యార్థి భవనం నుండి దూకి ప్రాణాలు కోల్పోయినా మా తప్పు కాదు తప్పంతా చచ్చిన విద్యార్థిదే అని నిస్సిగ్గుగా చెబుతారు. ఓ టీచ రమ్మ పిల్లల్ని తనకున్న పశువులను కట్టేసే అపార అను భవంతో స్కూల్లోనే పిల్లల్ని తాళ్లతో కట్టేస్తారు. ఇదేమంటే తాను పని చేసుకుంటుంటే పిల్లలు అల్లరి చేస్తున్నారని అంటారు. తన పని ఇంటిపని బడిలో చేసుకోవడం కాదని పాఠశాలకి వచ్చినప్పుడు పాఠాలు చెప్పాలనే జ్ఞానం లేకుండా మాట్లాడుతారు. మరోసారి వారు మా బడికి పోనీటైల్ వేసుకొస్తే శిగ తరుగుతామని అన్న ఆ పెద్ద సారువారు అన్నంత పనీ తన టీచర్లతో చేయించారు. నిత్యం ఎక్కడోచోట సారీ ఎన్నోచోట్ల పిల్లల్ని చెరబట్టందే పాఠాలు చెప్పలేమని సిద్ధాంతీకరించిన మన చండా మార్కుల వార సులైన కొందరు పంతుళ్లు, పంతులమ్మలకు పిల్లల్ని కొట్టి, తిట్టి నానా హింసలకు గురి చేయందే నిద్రపట్టదు. ఇలా పిల్లలకు బాల్యమన్నది లేకుండా ఆ మధుర స్మృతులు సైతం మదిలోకి రాకుండా చేస్తున్నారు. పిల్లల మీద జరుగుతున్న ఈ ఘోరాలను ఆపాలని ఎవరికీ మనసురాదు. అవి అసలు ఘోరాల కిందకే లెక్కకు రావ న్నట్టు అధికార గణం గణిస్తుంది. ఈ ఘోరాల్లో కొన్ని ఘట నలు మహారాజశ్రీ మన పోలీసు వారి దగ్గరికి వస్తే అటూ, ఇటూ పుస్తకాలు తిరగేసి న్యాయ సలహాదారుల అభి ప్రాయం సేకరించి చివరకు ఓ చిన్న కేసుతో సరిపెట్టి, ఫైలును పక్కనపెట్టేసి.. ఇదెక్కడి పిల్ల కాకుల గోల మా చిన్నప్పుడు మమ్మల్ని మాత్రం తన్నంది బుద్ధి వచ్చిందా అని సూత్రీకరిస్తున్నారు. పిల్లల్ని శారీరక, మానసిక హింసకు గురి చేయరాదని బాలల హక్కుల చట్టాలలో రాసి ఉన్నా.. అవి చదివే తీరిక, అమలు చేసే కోరికా ఏ అధికారికీ లేదన్నది నిజం. ఈ చట్టాలన్నీ తెలిసి వాటిని తు.చ. తప్పకుండా పాటించాల్సిన విద్యాశాఖ అధికార గణం తు.చ. ఇవేమీ పాడు చట్టాలు ‘దొరకొడుకునైననూ తొడ పాశములుబెట్టి, బుగ్గలు నలు పంది బుద్ధి రాదు’ అన్న పాత, పాడుబడిన పద్యాలు వల్లెవేసుకొని.. చదువు చెప్పినవాడు చావబాదడం నేరమా? ఛీ ఇవేం చట్టాలు అని ఆ చట్టాలను హేళన చేయడం తప్ప పిల్లలపై పంతుళ్ల, పంతులమ్మల దౌర్జన్యాలు జరిగినప్పుడు చర్యలు చేపట్టాలన్న ఇంగిత జ్ఞానాన్ని మరిచిపోతున్నారు. పిల్లల్ని చీల్చి చెండాడిన చండా మార్కులకే వంతపాడుతూ, వత్తాసు పలుకుతున్నారు. ఇటు పోలీసు, అటు విద్యా శాఖ అధికారుల తీరు ప్రైవేటు పాఠశాలలకూ, పిల్లల్ని హింసించే గురువర్యులకు కొంగు బంగారంగా మారుతోంది. పిల్లలు చచ్చిపోయినా సరే చదువు నేర్పి తీరాల్సిందే అనే వైఖరి పాటిస్తుంటేనే పాఠశాలలంటేనే పిల్లలకు పై ప్రాణాలు పైనే పోయి చదవడం కన్నా చాకిరీ చేసుకోవడమే మిన్న అని పిల్లలు బాల కార్మికులుగా మారిపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం వారింకా పిన్నవారే కదా.. వారికి ఓటు హక్కు వస్తేనే కదా మన అవసరం అని అనుకుంటున్నారు. కానీ అక్షరాస్యత పెరగాలంటే బాల కార్మిక వ్యవస్థ సమూ లంగా పోవాలంటే, బడి అంటే భయం కాదు ప్రేమ కలిగిం చాలి. చదువు అంటే కష్టం కాదు, ఇష్టం అనిపించాలని.. పిల్లల చదువు సాగి అక్షరాస్యత పెరగాలంటే కొందరు రాకాసి పంతుళ్లు, పంతులమ్మల కోరలు పీకాల్సిందేనని ఆలోచించడం లేదు. గురువులు ఎన్ని అకృత్యాలు చేసినా వారివద్ద ఓట్లున్నాయి, పిల్లలు ఎన్ని బాధలు పడుతున్నా ఓట్లు లేని వెధవలు అనే భావనతో కొందరు నాయకుల ప్రవర్తన వల్ల పిల్లల్ని పట్టించుకునే నాథుడే లేడు. పిల్లల్ని రాచిరంపాన పెట్టడంతో తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా అక్షరాస్యత శాతం పడిపోయింది. పిల్లలు బడుల్లో ఇష్టంగా చదవాలంటే వారిని కష్ట పెట్టకుండా చదివించే గురువులు కావాలి. కానీ, నేను గురువును నాకు మర్యాద, గౌరవం కావాలంటే, గురువులు గౌరవంగా, మర్యాదగా ప్రవర్తించంది వారికి ఆ రెండూ దొర కవు. వారు గౌరవంగా ప్రవర్తిస్తేనే ఎదుటివారి నుండి గౌరవం దొరుకు తుంది. ఇక మన విద్యా వ్యవస్థ బాగుప డాలంటే.. వాహనం నడిపే వారికి వాహనం నడుపగలరని లైసెన్స్ ఇస్తున్న మనం చదువు చెప్పేవారు చెప్పగలరని ఎలాంటి ధృవీకరణ పత్రం ఇవ్వడం లేదు, బతుకుదెరువు దొరకని వాడు బడి పంతులుగా మనగలుగుతున్నాడు. చదువు చెప్పే ప్రతి వారికి ప్రభుత్వం తరఫున పరీక్ష నిర్వ హించి సర్టిఫికెట్లు ఇవ్వాలి. పిల్లలకు ఎండాకాలం, సంక్రాంతి, దసరా సెల వులు ఇస్తే ఆ సమయాల్లో టీచర్లం దరికీ చదువు చెప్పే మెలకువలపై ఎప్పటికప్పుడు తర్ఫీదు ఇవ్వడంతోపాటు పిల్లల హక్కుల గురించి వివరించాలి. పిల్లల్ని ఎవరైనా గురువులు తిట్టినా, కొట్టినా నాన్‌బెయిల బుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి కస్టడీకి పంపించాలి. పిల్లలపై దౌర్జన్యాలు పంతుళ్లు చేసినప్పుడు వారిని శాశ్వ తంగా చదువుచెప్పే అర్హత కోల్పోయేలా చర్యలు చేపట్టాలి. పాఠశాలల్లో పిల్లలపై జరిగే హింసకు సంబంధించి ఫిర్యాదు వచ్చినప్పుడు పిల్లల్ని హింసించిన గురువుతో పాటు యాజమాన్యాన్ని బాధ్యులను చేయాలి. పిల్లల్ని తీవ్రంగా కొట్టినా, వారి చావుకు కారణమైనా, పిల్లల ప్రాణా లకు ముప్పు వాటిల్లేలా భద్రత లోపించినా ఆ పాఠ శాలల గుర్తింపు శాశ్వతంగా రద్దు చేయాలి. ప్రతి టీచర్ కచ్చితంగా మానసిక విశ్లేషణ పరీక్షలో, చదువు చెప్పడానికి అర్హత సాధించినప్పుడే ఉపాధ్యాయ వృత్తి చేపట్టేలా చర్యలు తీసు కోవాలి. ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యం ఇష్టాను సారంగా జీతాలు ఇవ్వడం కాకుండా ప్రభుత్వ పాఠశాలల అధ్యాపకులతో సరిసమానంగా ప్రైవేటు టీచర్ల వేతనాలు ఉండేలా చర్యలు చేపట్టాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ పిల్లల్ని మానసికంగా, శారీరకంగా హింసకు గురిచేసే వారిని ఉపే క్షించకూడదు. అలాగే ప్రతి పాఠశాలలో పిల్లలు ఫిర్యాదు చేయడానికి వీలుగా బాక్సులను ఏర్పాటుచేసి ఆ ఫిర్యాదు లను వారానికి ఒకసారి ఎంఈఓ స్థాయి అధికారి మాత్రమే తెరచి చూసి ఆ ఫిర్యాదులపై చర్యలు చేపట్టేలా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ చదువులు చెప్పే పాఠశాలల్లో మానసిక, శారీరక దండనలు సమూలంగా నిర్మూలించినప్పుడే మనం నాగరికులమని చెప్పుకోవచ్చు. లేదా అనాగరికులుగా మిగిలి పోక తప్పదు. అక్షరాస్యత ఏనాటికీ వంద శాతానికి చేరదు. వ్యాసకర్త: అచ్యుతరావు, గౌరవ అధ్యక్షులు, బాలల హక్కుల సంఘం మొబైల్ : 93910 24242 -
వామ్మో ‘జంకు’ ఫుడ్
సాక్షి, పెద్దపల్లికమాన్: చిన్నారులను జంకు ఫుడ్ అనారోగ్యంవైపు నడిపిస్తోంది. పాఠశాలల సమీపంలోని దుకాణాల్లో సురక్షితంకాని తినుబండారాలు విక్రయిస్తుండడం వాటికి ఆకర్శితులై అనారోగ్యాన్ని ‘కొని’ తెచ్చుకుంటున్నారు. చిన్నారులకు అనారోగ్యం.. పాఠశాలలకు సమీపంలో విక్రయించే తినుబండారాలు చిన్నారులకు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. చక్కెర, ఉప్పు, కొవ్వు అధిక మోతాదులో ఉండడంతో అవి తిన్న పిల్లలు ఆస్పత్రుల బాట పట్టాల్సి వస్తోంది. పాఠశాల ప్రాంగణ పరిసరాల్లో ఇలాంటివి విక్రయించరాదని గతంలో ఆహార నియంత్రణ సంస్థ, భారత ఆహారభద్రత, ప్రమాణాల నియంత్రణ సంస్థ కఠిన నిబంధనలు రూపొందించాయి. 50 మీటర్ల దూరంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. అయినా చాలాచోట్ల ఈ నిబంధనలు అమలు కావట్లేదు. దీనికితోడు పెద్దపల్లి జిల్లాకేంద్రంలో మూడు నాలుగు తినుబండారాల కంపెనీలు నాసిరకం నూనెతో, అపరిశుభ్ర వాతావరణంలో తినుబండారాలు తయారు చేసి జిల్లావ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. ఆహార భద్రతా మండలి సర్వే వాస్తవాలు ⇔ నాసిరకం ఆహార పదార్ధాల విక్రయాలు అరికట్టడంలో తెలంగాణలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చివరస్థానంలో ఉంది. ⇔ రాష్ట్రంలో పూర్తిస్ధాయిలో ఆహార భద్రతా నియంత్రణా«ధికారులు, సిబ్బంది లేరు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 10 మందే ఉన్నారు. ఆహార నమూనాలు ⇔ నియంత్రణాధికారులు లేకపోవడంతో పాఠశాలలకు సమీపంలో చిల్లర దుకాణాలు, రంగు రంగుల కొవ్వు ఆహార పదార్థాలు చిన్నారులు చూసి కొనుక్కుని రోగాలబారిన పడుతున్నారు. ⇔ నియంత్రణ, పర్యవేక్షణాధికారులు లేకపోవడంతో నాసిరకం నూనె,పిండితో తినుబండారాలు తయారు చేసే కేంద్రాలు జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకోస్తున్నాయి. సిబ్బంది కొరతతో కొరవడిన తనిఖీలు పర్యవేక్షించాలి్సన అధికారులు, సిబ్బంది కొరతతో జిల్లాలోని ఆయా దుకాలు, కార్ఖానాల నిర్వహణ యథేచ్ఛగా సాగుతోంది. ఆహార తనిఖీ అ«ధికారులు జిల్లాకు ముగ్గురు చొప్పున ఉండాలి. కానీ రాష్ట్రంలోనే 10 మంది ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో రెండేళ్లక్రితం ఆహార తనిఖీ అధికారి రిటైరైతే ఇప్పటి వరకూ ఆ స్థానం ఖాళీగానే ఉంది. దీంతో కరీంనగర్ అధికారి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. విధులకు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నారు. ఫలితంగా చిన్నారులు కొవ్వు పదార్థాలు తీసుకుంటూ అనారోగ్యంబారిన పడుతున్నారు. నిబంధనలు బేఖాతర్ పాఠశాల ప్రాంగణ పరిసరాల్లో తినుబండారాలు అమ్మకూడదనే నిబంధన ఎక్కడా అమలు కావడంలేదు. గతంలో ప్రచారాన్ని చేపట్టి ఆయా ప్రాంతాల్లో నిషేధించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ సంస్థ స్పష్టంగా కోరింది. అప్పట్లోనే కొవ్వు, ఉప్పు, చక్కెర కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడంతో కలిగే అనర్థాలపై కొన్ని కీలక ప్రతిపాదనలు కూడా చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్, రెగ్యులేషన్ 2019 ముసాయిదాలో ఆ పదార్ధాలను ప్రచారం చేయరాదని, వీటితో ఊబకాయం, డయాబెటీస్, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంది. అయినా ఈ నిబంధనలు పూర్తిస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. తల్లిదండ్రులు ఇంటి వద్ద నుంచే పంపాలి పాఠశాలలకు సమీపంలో ఉండే దుకాణాల్లో కొనుగోలు చేసి తినే అలవాటున్న పిల్లలకు తల్లిదండ్రులు ఇంటి వద్ద నుంచే తయారు చేసిన అల్పాహారాన్ని పంపాలి. ఇలా నిత్యం అలవాటు చేస్తే పిల్లలు వాటిజోలికి వెల్లరు. ఇందుకు తల్లిదండ్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. జంక్ ఫుడ్ తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు రంగు, రుచి కోసం, ఎక్కువకాలం నిల్వ ఉంచడానికి వివిధ రసాయనాలు వాడతారు. కొవ్వు సంబంధించిన ఆహార పదార్ధాలు తీసుకోవడంతో అనేక అనర్థాలు వస్తాయి. వాటిలో చక్కెర, ఉప్పు అధికంగా ఉంటుంది. దీంతో ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, అల్సర్, కడుపునొప్పి, నిద్రలేమి తదితర ఇబ్బందులు అధికంగా ఉంటాయి. పిల్లలు ఏ పని సరిగా చేయలేరు. చిరాకుతో నిరుత్సాహంగా ఉంటారు. పిల్లలు జంక్ ఫుఢ్ తీసుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ ప్రణీత్. పిల్లల వైద్య నిపుణులు పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు నాసిరకంగా తయారు చేసిన తిను బండారాలతో పిల్లల ఆరోగ్యం పాడవుతుంది. ఇంటివద్ద నుంచి పాఠశాలకు అల్పాహారం, పండ్లు పంపినా గానీ పిల్లలు అప్పుడప్పుడు షాపుల్లోని తినుబండారాలు తింటున్నారు. దాంతో అనారోగ్యానికి గురవుతున్నారు. నీరసంగా తయారవుతున్నారు. తినుబండారాలు తయారు చేసే ఫ్యాక్టరీలపై మున్సిపల్ అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు తరుచూ తనిఖీలు చేయాలి. పాఠశాలలకు సమీపంలోని దుకాణాలను పర్యవేక్షించాలి. – పుట్ట రవి, పెద్దపల్లి -
‘వారికి తండ్రంటే ఎంతో ప్రేమ.. బతకనివ్వండి’
వాషింగ్టన్ : గురువారం అమెరికా కోర్టులో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి అనే ప్రేమ.. పసి వాళ్లు అనే కనికరం ఏ మాత్రం లేకుండా ఐదుగురు బిడ్డలను పొట్టన పెట్టుకున్నాడో కసాయి తండ్రి. అయితే అతని మాజీ భార్య మాత్రం చనిపోయిన పిల్లలకు తండ్రంటే ఎంతో ప్రేమ.. అతన్ని క్షమించి వదిలేయండని కోరడం అక్కడ ఉన్న వారందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాలు.. తిమోథి జోన్స్(37) అనే వ్యక్తి కంప్యూటర్ ఇంజనీర్‌గా పని చేస్తుండేవాడు. ఈ క్రమంలో కొద్ది కాలం కిత్రం భార్య నుంచి విడిపోయాడు. వీరికి ఐదుగురు సంతానం. వీరంతా ఏడాది నుంచి ఎనిమిదేళ్ల లోపు వయసు వారే. అయితే తిమోథి భార్యకు సరైన ఉద్యోగం లేని కారణంగా కోర్టు పిల్లల బాధ్యతను అతనికే అప్పగించింది. భార్యతో విడిపోవడం.. పిల్లల పోషణ భారం తన మీద పడటంతో తిమోథి మానసికంగా కుంగిపోయాడు. ఈక్రమంలో తన ఆరేళ్ల కొడుకు.. తన మాజీ భార్యతో కలిసి తనను చంపడానికి కుట్ర పన్నుతున్నాడని భావించాడు. దాంతో ఆ చిన్నారి చేత చనిపోయేంత వరకూ ఎక్సర్సైజ్ చేపించాడు. మిగతా చిన్నారులను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం వారి మృతదేహాలను కొండ మీదకు తీసుకెళ్లి అక్కడ నుంచి కిందకు పడేశాడు. తిరిగి వస్తుండగా.. ట్రాఫిక్ పోలీసులకు అనుమానం వచ్చి ఆరా తీయగా ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసులు తిమోథిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు. ఈ క్రమంలో కోర్టులో విచారణ జరుగుతుండగా.. తిమోథి మాజీ భార్య అతన్ని వదిలేయమని కోరడం కోర్టు వారితో సహా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘నా పిల్లలకు వారి తండ్రంటే చాలా ఇష్టం. వారి ఆత్మ శాంతి కోసమైనా అతడిని విడిచిపెట్టండి.. బతకనివ్వండి. నా అభ్యర్థన మీకు తప్పుగా అనిపించవచ్చు. కానీ నా పిల్లల తరఫున ఈ విన్నపం చేస్తున్నాను’ అన్నది. కానీ కోర్టు ఆమె అభ్యర్థనను పట్టించుకోలేదు. తిమోథిని రాక్షసునిగా వర్ణిస్తూ.. అతనికి ఉరిశిక్ష విధించింది. -
అంతా మీరే చేస్తున్నారు!
ఒకప్పుడు ఒబేసిటీ బాధితులు చాలా తక్కువ. మరి ఇప్పుడు.. వయసుతో సంబంధం లేకుండా ప్రతి 100 మందిలో 30 మంది దీనిబారిన పడుతున్నారు. బాధితుల సంఖ్య ఇంతగా పెరగడానికి కారణమేంటి? ఇదేమైనా అంటువ్యాధా? ..ఎస్, అవుననే అంటున్నాయి పరిశోధనలు. అనారోగ్య సమస్య నేరుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిచెందకపోయినా.. అందుకు కారణమయ్యే అలవాట్లు మాత్రం ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నాయట. ఉదయాన్నే లేవడం, ఇంటి పని చకచకా చేసుకోవడం, ఇంట్లో తయారుచేసే టిఫిన్ తినేసి పనులకెళ్లడం, సాయంత్రం వచ్చాక కుటుంబసభ్యులతో కలసి సరదాగా గడపడం, పొద్దుగూకిన మరుక్షణమే పడుకోవడం.. ఇవన్నీ కనుమరుగై చాలారోజులే అయ్యింది. కాలచక్రం కాస్త.. కాదు కాదు.. బాగానే ముందుకు కదిలింది. రాత్రి ఒంటిగంట దాటిన తర్వాతే నిద్ర. పొద్దున 10 దాటిన తర్వాతే పక్కదిగడం. ఇక ఫోన్లో ఆర్డరిచ్చి, కార్లో తినేయడం, కదలకుండా గంటల తరబడి కుర్చీలో కూర్చొని పనిచేయడం, ఇంటికొచ్చాక సోఫాలో సాగిలబడి టీవీకి అతుక్కుపోవడం, వంటి అలవాట్లే మన కొంప ముంచుతున్నాయి. అలాగే రాబోయే తరాల ఆరోగ్యాన్నీ మనమే పాడుచేసేలా చేస్తున్నాయి. కారణం చిన్నపిల్లలు మనల్ని చూసి ఇలాంటి అలవాట్లు అనుకరిస్తుండడమే. అంటు వ్యాధిలా అలవాట్లు..: తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఎన్నో నేర్చుకుంటారు. వారి ఆహార్యాన్ని అనుకరించడమేకాదు.. అలవాట్లనూ పాటిస్తారు. పేరెంట్స్ ఒబెసిటీ మార్గంలో నడిస్తే.. పిల్లలూ అదేబాట అనుసరించి రేపటి ఒబెసిటీ పేషెంట్లవుతారు. అమెరికాలోని బఫెలో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దాదాపు 286 కాలేజీల విద్యార్థుల అలవాట్లను పరిశీలించి, కారణాలను విశ్లేషించి చెప్పిన సంగతిది. ఇలా అలవాట్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందడం వల్లే యువతరం ఒబేసిటీ బారిన పడుతున్నారని తేల్చారు. -
బుడిబుడి అడుగులు ఆగిపోయాయ్
దెందులూరు : ‘ఒరేయ్ డింపూ.. ఆడుకుంటానికెల్తన్నా..’ ‘అన్నియ్యా.. నేనూ వత్తా..’ ‘తొందరగా రారా..’ ‘ఎక్కడికెల్దాం..’ ‘అయిగో.. ఇసక దగ్గర్కి’ అనుకుంటూ ఆ చిట్టిపొట్టి అడుగులు ఇంటి సమీపంలోని ఇసుక గుట్టల వైపు నడిచాయి. కాసేపటి తరువాత అక్కడే ఉన్న చెరువు వైపు పరుగులు తీశాయి. రేవులోని మెట్లపై జారాయి. ఒకరినొకరు పట్టుకోబోతూ ఆ చిన్నారులిద్దరూ నీటిలో మునిగిపోయారు. కూతవేటు దూరంలో ఫిల్టర్ బెడ్ మరమ్మతులు చేస్తున్న కూలీలు ఆ దృశ్యాల్ని చూశారు. పరుగు పరుగున వచ్చి నీటమునిగిన చిన్నారులిద్దరినీ బయటకు తీశారు. అప్పటికే ఓ బుడతడి ప్రాణం గాలిలో కలిసిపోయింది. కొన ఊపిరితో ఉన్న మరో చిన్నారిని గ్రామంలోని వైద్యశాలకు తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యుడు నిర్థారించారు. దెందులూరులో సోమవారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటన అక్కా చెల్లెళ్లకు గర్భశోకం మిగల్చగా.. గ్రామస్తులను విషాదంలోకి నెట్టింది. దెందులూరులోని గౌడ వీధిలో ఆడుకునేందుకు వెళ్లిన మోర్ల గౌతమ్ (6), కొండేటి డింపు దుర్గాప్రసాద్ (4) సమీపంలోని మొటపర్తివారి కోనేరు చెరువులోకి జారి మృత్యువాత çపడిన ఘటన కలచివేసింది. ఇంటి నిర్మాణంలో నిమగ్నం కాగా.. గౌడ వీధిలో నివశిస్తున్న ఐనాల శివరామకృష్ణ, వెంకట మహాలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారి రెండో కుమార్తె మోర్ల సుజాత, అల్లుడు రాజు దెందులూరులోనే ఉంటున్నారు. వారికి గౌతమ్ (6), మరో పాప ఉన్నారు. మూడో కుమార్తె అరుణను ఏలూరుకు చెందిన కొండేటి కాసులుకు ఇచ్చి వివాహం చేయగా, వారికి డింపు దుర్గాప్రసాద్ (4), నాలుగు నెలల పాప ఉన్నారు. అరుణ ఐదు నెలల క్రితం కాన్పు కోసం పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. ఇదిలావుంటే.. శివరామకృష్ణ తన ఇంటికి సమీపంలోనే రెండో కుమార్తె సుజాత కోసం పెంకుటిల్లు నిర్మిస్తున్నారు. కుటుంబ సభ్యులంతా ఆ పనుల్లో నిమగ్నమై ఉండగా.. చిన్నారులిద్దరూ సమీపంలోని ఇసుక గుట్టలపై ఆటలాడుతూ పక్కనే ఉన్న చెరువు వద్దకు వెళ్లారు. రేవులో మెట్లు దిగుతూ నీటిలో జారిపడ్డారు. అక్కడకు కొంతదూరంలో ఫిల్టర్ బెడ్ మరమ్మతులు చేస్తున్న కూలీలు ఈ ఘటనను చూసి పరుగెత్తుకు వచ్చారు. నీటమునిగిన చిన్నారులిద్దరినీ బయటకు తీయగా అప్పటికే గౌతమ్ మృతిచెందాడు. డింపు దుర్గాప్రసాద్ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండటంతో గ్రామంలోని వైద్యశాలకు తరలించారు. అప్పటికే డింపు కూడా మృతిచెందినట్టు వైద్యులు నిర్థారించారు. ‘ఎంత పనిచేశావ్ దేవుడా..’ అక్కాచెల్లెళ్ల బిడ్డలైన గౌతమ్, దుర్గాప్రసాద్ మృతి వారిద్దరికీ గర్భశోకాన్ని మిగిలి్చంది. ఈ ఘటన గ్రామస్తులను కలచివేసింది. ఆడుకోవటానికి వెళ్లి విగత జీవులుగా మారిన చిన్నారులను చూసి గౌతమ్ తల్లి సుజాత, డింపు దుర్గాప్రసాద్ తల్లి అరుణ సొమ్మసిల్లి పడిపోయారు. తాత, అమ్మమ్మ శివరామకృష్ణ, వెంకట మహా లక్ష్మి, కుటుంబ సభ్యులు ‘ఎంత పనిచేశావ్’ దేవుడా అంటూ గుండెలవిసేలా రోదించారు. వారిని ఓదార్చటం ఎవరి తరం కాలేదు. నాలుగు రోజుల్లో అత్తింటికెళ్దామనుకుంటుండగా.. పురుటి కోసం బిడ్డ దుర్గాప్రసాద్‌తో కలిసి పుట్టింటికి వచ్చిన అరుణను బాలింత పత్యం పూర్తి కావడంతో మరో నాలుగు రోజుల్లో ఏలూరులోని అత్తింటికి పంపించాలని ఆమె తల్లిదండ్రులు శివరామకృష్ణ, వెంకట మహాలక్ష్మి నిర్ణయించారు. అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. చీర, సారెలతో బిడ్డ అరుణను, మనుమడు దుర్గాప్రసాద్, నాలుగు నెలల పసికందును ఘనంగా సాగనంపాలనుకున్నారు. ఈలోగానే మృత్యువు గౌతమ్, దుర్గాప్రసాద్ లను తీసుకెళ్లిపోయింది. కాన్పు సుఖంగా అయితే ద్వారకాతిరుమల వెళ్లి మొక్కు తీర్చుకోవాలని అరుణ, ఆమె భర్త కొండేటి కాసులు అనుకున్నారు. వారం రోజుల క్రితం తమ బిడ్డలిద్దరినీ తీసుకుని ఆ దంపతులు ద్వారకా తిరుమల వెళ్లి మొక్కు తీర్చుకున్నారు. త్వరలోనే ఏలూరులోని తమ ఇంటికి వెళదామనుకుంటుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. బాధిత కుటుంబాలను వైఎస్సార్ సీపీ నాయకులు కట్టా వెంకట సుబ్బారావు, యేసుబాబు, గౌడ సంఘం పెద్దలు పరామర్శించారు. తహసీల్దార్ ఎస్.సత్యనారాయణ, సర్పంచ్ ఎన్.అజయ్, సొసైటీ అ«ధ్యక్షుడు కొడాలి శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ టి.రాజు ఘటనా స్థలానికి చేరుకుని.. వివరాలు నమోదు చేసుకుని ఉన్నతాధికారులకు నివేదించారు. -
కడుపుకోత
లింగపాలెం :మండలంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. నీటి గుంతలో పడి ఒకరు దుర్మరణం పాలుకాగా, జ్వరంతో మరొకరు మరణించారు. వారి తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చారు. ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపారు. కె.గోకవరం శివారు అన్నపనేనివారిగూడెం గ్రామానికి చెందిన స్నేహలత(3)S బుధవారం రాత్రి నీటిగుంతలో పడి మృతి చెందింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బూరుగు జాన్, సువార్తల కుమార్తె స్నేహలత ఆడుకునేందుకు పక్క ఇంటికి వెళ్లింది. అక్కడ మంచినీటి కోసం భూమికి సమానంగా తవ్విన గుంతలో పడింది. నీటిలో మునిగి మరణించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలిక మృతితో గ్రామం లో విషాదఛాయలు అలుముకున్నాయి. జ్వరంతో చిన్నారి మృతి లింగపాలెం మండలంలోని శింగగూడెం గ్రామానికి చెందిన వి.పూజత (4) జ్వరంతో గురువారం మరణించింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన విజయరాతి శేఘ, లావణ్యల కుమార్తె పూజతకు మూడు రోజుల క్రితం జ్వరం వచ్చింది. దీంతో లావణ్య తన పుట్టిలె్లౖన∙జంగారెడ్డిగూడెం తీసుకెళ్లి అక్కడ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. పూజత ఆరోగ్యం విషమించటంతో డాక్టర్ ఏలూరు ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచిం చారు. అక్కడకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోని బాలిక మరణించింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఒక్క కుమార్తె జ్వరంతో మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని, వైద్యాధికారులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. మండలంలో ఉన్న కొన్ని పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని, దీనివల్ల రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కడుపుకోత
లింగపాలెం : కె.గోకవరం శివారు అన్నపనేనివారిగూడెం గ్రామానికి చెందిన స్నేహలత(3)S బుధవారం రాత్రి నీటిగుంతలో పడి మృతి చెందింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బూరుగు జాన్, సువార్తల కుమార్తె స్నేహలత ఆడుకునేందుకు పక్క ఇంటికి వెళ్లింది. అక్కడ మంచినీటి కోసం భూమికి సమానంగా తవ్విన గుంతలో పడింది. నీటిలో మునిగి మరణించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలిక మృతితో గ్రామం లో విషాదఛాయలు అలుముకున్నాయి. జ్వరంతో చిన్నారి మృతి లింగపాలెం మండలంలోని శింగగూడెం గ్రామానికి చెందిన వి.పూజత (4) జ్వరంతో గురువారం మరణించింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన విజయరాతి శేఘ, లావణ్యల కుమార్తె పూజతకు మూడు రోజుల క్రితం జ్వరం వచ్చింది. దీంతో లావణ్య తన పుట్టిలె్లౖన∙జంగారెడ్డిగూడెం తీసుకెళ్లి అక్కడ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. పూజత ఆరోగ్యం విషమించటంతో డాక్టర్ ఏలూరు ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచిం చారు. అక్కడకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోని బాలిక మరణించింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఒక్క కుమార్తె జ్వరంతో మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని, వైద్యాధికారులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. మండలంలో ఉన్న కొన్ని పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని, దీనివల్ల రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
జోరు.. హుషారు..
కొల్లూరు: పుష్కర సంబరాల్లో కుర్రాళ్ల సందడి అంతా ఇంతా కాదు.. ఉల్లాసంగా ఘాట్ల వద్ద గుమిగూడి పుష్కర స్నానాలు చేస్తున్నారు.. కేరింతలు కొడుతున్నారు.. నీళ్లు జల్లుకుంటున్నారు.. అంతేనా.. చిత్రంలో చూడండి.. కుర్రాళ్ల విన్యాసం ఎలా ఉందో ? గురువారం కొల్లూరు సమీపంలోని పుష్కర ఘాట్‌లో వీళ్లు సందడి చేయగా ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. -
పుచ్చకాయలకు ప్రత్యేకంగా..
మ్యూజియం అనగానే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎగిరి గంతేస్తారు. అక్కడికెళితే చరిత్రకు సంబంధించిన ఎన్నో విశేషాలు తెలుసుకోవచ్చు అని తెగ సంబరపడి పోతుంటారు. అయితే ఇప్పటివరకు ఎన్నో రకాల మ్యూజియాలు చూసి ఉంటారు. చైనాలోని బీజింగ్‌లో ఉన్న ఓ వినూత్నమైన మ్యూజియాన్ని మాత్రం చూసి ఉండరు. ఎందుకంటే అది అలాంటి ఇలాంటిది కాదు.. పుచ్చకాయల కోసమే ఏర్పాటు చేసిన ప్రపంచంలోని ఏకైక మ్యూజియం. దాదాపు 43 వేల చదరపు అడుగులు ఉండే ఈ మ్యూజియంలో పుచ్చకాయల పుట్టుపూర్వోత్తరాలు, పుస్తకాలు, ఫొటోలు, కామిక్స్ వంటివి అక్కడ ఉంటాయి. అంతేకాదు ప్రపంచంలోని అన్ని దేశాల్లో లభించే వివిధ ఆకారాల్లోని పుచ్చకాయలను చూడొచ్చు. అయితే అవన్నీ నిజమైనవి కావు.. మైనంతో తయారు చేసినవే ప్రదర్శనకు ఉంచారు. ఆఖరికి మ్యూజియంను కూడా పుచ్చకాయ ఆకారంలోనే నిర్మించారు. -
పిల్లలకూ బాధ ఎక్కువే!
లండన్: శిశువులకు మెదడు ఎదుగుదల సరిగా ఉండదు కాబట్టి నొప్పి కలిగినపుడు వారికి ఆ బాధ అంతగా ఉండదని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఏదైనా నొప్పి కలిగినపుడు శిశువులకు కూడా పెద్దవారిలాగే బాధ కలుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఒక్కటే తేడా... వారు ఆ బాధను పెద్దవారిలా వెలిబుచ్చలేరు. దీంతో వారు అంత బాధపడుతున్నట్లు అనిపించదు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పీడియాట్రిక్స్ నిపుణుడు రెబెక్కా స్లేటర్ నొప్పి సమయంలో పిల్లల్లో కలిగే బాధపై పరిశోధన చేశారు. మాగ్నినెన్స్ రెసోనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్ఐ) స్కానింగ్ ద్వారా పిల్లలకు నొప్పి కలిగినపుడు వారి మెదడు ఎలా స్పందిస్తుందనే అంశాన్ని పరిశీలించారు. నొప్పి కలిగినపుడు పెద్దల మెదడు ఎలా స్పందిస్తుందో శిశువుల మెదడు కూడా అలాగే స్పందించడాన్ని పరిశోధకులు గమనించారు. ఒకటి నుంచి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లల్ని, 23-36 సంవత్సరాల వయస్సున్న ఆరోగ్యవంతమైన యువకుల్ని వీరు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో పిల్లల్లో, పెద్దల్లో నొప్పి కలిగినపుడు మెదడులో ఒకే రకమైన మార్పులుండడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.