కడుపుకోత
Published Fri, Sep 9 2016 1:23 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
లింగపాలెం : కె.గోకవరం శివారు అన్నపనేనివారిగూడెం గ్రామానికి చెందిన స్నేహలత(3)S బుధవారం రాత్రి నీటిగుంతలో పడి మృతి చెందింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బూరుగు జాన్, సువార్తల కుమార్తె స్నేహలత ఆడుకునేందుకు పక్క ఇంటికి వెళ్లింది. అక్కడ మంచినీటి కోసం భూమికి సమానంగా తవ్విన గుంతలో పడింది. నీటిలో మునిగి మరణించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలిక మృతితో గ్రామం లో విషాదఛాయలు అలుముకున్నాయి.
జ్వరంతో చిన్నారి మృతి
లింగపాలెం మండలంలోని శింగగూడెం గ్రామానికి చెందిన వి.పూజత (4) జ్వరంతో గురువారం మరణించింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన విజయరాతి శేఘ, లావణ్యల కుమార్తె పూజతకు మూడు రోజుల క్రితం జ్వరం వచ్చింది. దీంతో లావణ్య తన పుట్టిలె్లౖన∙జంగారెడ్డిగూడెం తీసుకెళ్లి అక్కడ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. పూజత ఆరోగ్యం విషమించటంతో డాక్టర్ ఏలూరు ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచిం చారు. అక్కడకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోని బాలిక మరణించింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఒక్క కుమార్తె జ్వరంతో మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని, వైద్యాధికారులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. మండలంలో ఉన్న కొన్ని పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని, దీనివల్ల రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement