Chief Minister Akhilesh Yadav
-
ప్రధానిగా అయ్యే అర్హతలున్నాయ్ కానీ..
బారాబంకి : నిత్యం వివాదస్పద వ్యాఖ్యలు చేసే నేతగా పేరున్న సమాజ్ వాది పార్టీ లీడర్ అజమ్ ఖాన్ మరో సంచలన కామెంట్లు చేశారు. తనకు ప్రధానిగా అయ్యే లక్షణాలన్నీ ఉన్నాయట. కానీ తాను ముస్లిం కావడమే ప్రధాన సమస్యని వ్యాఖ్యానించారు. తనను ప్రధానిగా చేస్తే దేశాన్ని ఎలా పరిపాలించాలో చూపిస్తానన్నారు. ప్రధానిగా అయ్యే లక్షణాలు విద్యా, అనుభవం, నిజాయితీ, నిర్వహాణలో నైపుణ్యం, అన్నీ తనకున్నాయని పేర్కొన్నారు. తాను ముస్లిం కావడమే లోపం తప్ప మరే ఇతర కారణాలు లేవని హాస్యస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లోని యూరీలో ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అజమ్‌ఖాన్ అభివర్ణించారు. యూరీ ఉగ్రఘాతుకంపై కేంద్రం తీసుకున్న విధానాలేమిటని ప్రశ్నించారు. తనను ప్రధానిగా చేసిన ఏడాదిలోపే కశ్మీర్ సమస్యను ఓ కొలిక్కి తీసుకొస్తానని.. అఖండ భారత్‌గా దేశాన్ని తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ప్రత్యర్థులు తనపై చేసే విమర్శలను మొరిగే కుక్కలుగా ఖాన్ అభివర్ణించారు. ఆ విమర్శలు తన పనితీరుపై ఎలాంటి ప్రభావాన్ని చూపవని కొట్టిపారేశారు. సమాజ్‌వాదీ పార్టీ ముక్కలు చెక్కలు అవుతుందంటూ బయటవారు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ.. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పిన మాదిరిగా సమాజ్ వాదీ కుటుంబం ఎల్లప్పుడూ సమైక్యంగా ఉంటుందని పునరుద్ఘాటించారు. కుటుంబం సమైక్యంగా, ధృడంగా ఉన్నప్పుడు, బయట శక్తులు ఏమీ చేయలేవని చెప్పారు. కొడుకు అఖిలేష్ యాదవ్ అభ్యంతరాలను పక్కన పెట్టి మరీ 2010లో పార్టీ నుంచి బహిష్కృతుడైన అమర్‌సింగ్‌ను సమాజ్ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ నియమించారు. ఈ నిర్ణయంతో మరోసారి అఖిలేష్‌కు తండ్రి ములాయం చెక్ పెట్టినట్టైంది. -
'అఖిలేశన్నే నడిపిస్తాడు.. ఆయనకే ఇవ్వాలి'
లక్నో: సమస్య మొత్తం సర్దుమణిగిందని, పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలు రాబోయే ఎన్నికల్లో పార్టీకి సంపూర్ణ విజయానికి కృషిచేయాలని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆదేశించగా శనివారం మళ్లీ సమస్య మొదటికొచ్చింది. రాష్ట్ర పార్టీ పగ్గాలు ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చేతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ వందల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు లక్నోలోని పార్టీ కార్యాలయం ముందుకు వచ్చి నినాదాలు చేశారు. నెత్తిన ఎర్ర టోపీలు ధరించి చేతిలో అఖిలేశ్, ఆయన భార్య డింపుల్ ఉన్న పోస్టర్లను పట్టుకొని నినాదాలు చేస్తూ బారులు తీరారు. 'అఖిలేశ్ ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేయాలి, అఖిలేశన్న పార్టీని నడిపించగల సమర్థుడు' అంటూ గట్టిగా అరుస్తూ పార్టీ కార్యాలయం వద్ద సందడి చేశారు. సమాజ్‌వాది పార్టీకి చెందిన నాలుగు ఇతర సంస్థలు ఈ డిమాండ్ తో పార్టీ అధినేత ములాయం సింగ్ కు లేఖ కూడా రాశారు. అందులో తాము అఖిలేశ్ నాయకత్వాన్ని తప్ప ఏ ఒక్కరి నాయకత్వాన్ని అంగీకరించబోమని కుండబద్ధలు కొట్టారు. అఖిలేశ్ ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించడం యువత జీర్ణించుకోలేకపోతుందని, అవసరం అయితే, ఆయన కోసం తమను తాము దహించుకొని ప్రాణత్యాగం చేసేందుకు యువత సిద్ధంగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాఉండగా, ఉత్తరప్రదేశ్ సమాజ్ వాది పార్టీ పగ్గాలు శివ్ పాల్ యాదవ్ చేతుల్లోనే ఉంటాయని స్పష్టం చేస్తూ ఆ పార్టీ తరుపున ప్రకటన వెలువడింది. -
6 రోజుల్లో మళ్లీ మంత్రి అయ్యారు..
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కేబినెట్‌ను విస్తరించారు. అఖిలేష్ కొత్తగా ఐదుగురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు కేబినెట్ మంత్రులు, ఇద్దరు సహాయ మంత్రులు ఉన్నారు. గత మంగళవారం మంత్రి పదవి నుంచి తొలగించిన బలరామ్ యాదవ్‌ను మళ్లీ కేబినెట్లోకి తీసుకున్నారు. సోమవారం ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. బలరామ్ యాదవ్‌తో పాటు నరడ్ రాయ్, జియాఉద్దీన్ రిజ్వీలకు కేబినెట్ హోదా లభించింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అఖిలేష్ మంత్రి వర్గాన్ని విస్తరించారు. చివరి నిమిషంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మనోజ్ పాండేను మంత్రివర్గం నుంచి తొలగించారు. రాజకీయ నాయకుడిగా మారిన గ్యాంగ్‌స్టర్ ముఖ్తర్ అన్సారీ పార్టీ (క్యూఈడీ)ని సమాజ్‌వాదీ పార్టీలో విలీనం చేసుకునే ప్రతిపాదనను ఉపసంహరించుకున్నందుకు అసంతృప్తిగా ఉన్న అఖిలేష్ బాబాయ్, సీనియర్ మంత్రి శివపాల్ యాదవ్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. -
ప్రాణాలు పోయిన 10 రోజులకు తాపీగా..
మథుర: కబ్జాదారులకు, పోలీసులకు మధ్య మథురలో జరిగిన యుద్ధంలో 24 మంది ప్రాణాలు కోల్పోయిన 10 రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సోమవారం మధ్యాహ్నం మథుర పట్టణంలోని జవహర్ బాగ్ పార్క్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి.. నాడు(జూన్ 2న) చోటుచేసుకున్న భీకర పోరు ఆనవాళ్లను పరిశీలించారు. (చదవండి: రగిలిన మథుర) మథుర ఘటనపై సీబీఐ విచారణకు నిరాకరించిన అఖిలేశ్ సర్కారు.. రాష్ట్ర పోలీసులతోనే దర్యాప్తు చేయిస్తోంది. కబ్జాదారులకు ప్రభుత్వ పెద్దల మద్దతు ఉన్నదన్న ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు స్వతంత్రంగా సాగలనే డిమాండ్ అన్నివైపుల నుంచి వినిపిస్తోంది. (చదవండి: మథుర అల్లర్ల సూత్రధారి ఖతం అయ్యాడు!) జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు ఆదివారం అలహాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరోసారి మథుర ఘటనపై మాట్లాడారు. అఖిలేశ్ వైఫల్యం వల్లే ఈ పరిస్థితులు దాపురించాయని, కయిరానా పట్టణంలో హిందూ కుటుంబాల గెంటివేత దారుణమని, వీటిని కూడా సీఎం పట్టించుకోవట్లేదని అన్నారు. (చదవండి: చనిపోయిన ఎస్పీ భార్యకు హోంశాఖలో జాబ్)ప్రభుత్వానికి చెందిన పార్కు స్థలాన్ని ఖాళీచేయించేందుకు వచ్చిన పోలీసులు, ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి కార్యకర్తలు పరస్పరం జరుపుకొన్న దాడుల్లో పోలీసు ఉన్నతాధికారి సహా 24 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. (చదవండి: సొంత రాజ్యం... సొంత చట్టాలు)