Christian woman
-
రాజ్యాంగాన్ని మోసగించడమే
న్యూఢిల్లీ: కేవలం రిజర్వేషన్ ఫలాలు దోచేయాలనే దుర్భుద్దితో మతం మారిన విషయాన్ని దాచిపెట్టిన అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాంటి చర్యలు రాజ్యాంగాన్ని మోసగించడంతో సమానమని అభివర్ణించింది. క్రైస్తవమతంలోకి మారిన తర్వాత కూడా ఒక మహిళ షెడ్యూల్ కులం సర్టిఫికేట్ కోసం తాను ఇంకా హిందువునేనని వాదించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ అంశంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఆర్ మహదేవన్ల సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది. హిందువు అయిన సి.సెల్వరాణి క్రైస్తవమతం పుచ్చుకుంది. అయితే రిజర్వేషన్ లబ్ది పొందేందుకు, ఉద్యోగి సంబంధిత ప్రయోజనాలు పొందేందుకు తాను ఇంకా హిందువునేనని నమ్మించే ప్రయత్నంచేశారు. అయితే ఆమె నిజంగా క్రైస్తవ మతంలోకి మారిందని, తరచూ చర్చికి వెళ్తూ, క్రైస్తవ మత కార్యక్రమాల్లో పాల్గొంటూ, పూర్తి విశ్వాసంతో క్రైస్తవమతాన్ని ఆచరిస్తోందని సాక్ష్యాధారాలతో నిరూపితమైంది. దీంతో రిజర్వేషన్ కోసం ఆ మహిళ తన మతాన్ని దాచిపెట్టడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘బాప్టిజం పూర్తయ్యాక ఇంకా తాను హిందువును అని మహిళ చెప్పుకోవడంలో అర్థంలేదు. మతం మారాక కూడా రిజర్వేషన్ ప్రయోజనాలే పరమావధిగా ఇలా వ్యవహరించడం రిజర్వేషన్ లక్ష్యాలకే విఘాతం. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అమలుచేస్తున్న రిజర్వేషన్ల విధానం ఇలాంటి వారితో ప్రమాదంలో పడుతుంది’’అని కోర్టు వ్యాఖ్యానించింది. సెల్వరాణి తండ్రి హిందువుకాగా తల్లి క్రైస్తవురాలు. అయితే సెల్వరాణి చిన్నతనంలోనే బాప్టిజం తర్వాత క్రైస్తవురాలిగా మారారు. అయితే 2015లో పుదుచ్చెరిలో అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగం పొందేందుకు ఆమె ఎస్సీ సర్టిఫికేట్ సంపాదించారు. సెల్వరాణి తండ్రి వల్లువాన్ కులానికి చెందిన వ్యక్తి. స్థానికంగా ఈ కులం వారికి ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ సెల్వరాణి తండ్రి సైతం దశాబ్దాలక్రితమే క్రైస్తవమతం స్వీకరించారు. దీంతో తల్లిదండ్రులు క్రైస్తవులుకాగా తాను మాత్రం హిందువును అని ఈమె చేసిన వాదనల్లో నిజం లేదని కోర్టు అభిప్రాయపడింది. -
‘చంపేస్తాం.. ఆమె పాక్ విడిచి వెళ్లిపోయింది’
ఇస్లామాబాద్ : దైవ దూషణ చేసిందన్న ఆరోపణలతో అరెస్టై..మరణ శిక్ష నుంచి బయటపడ్డ క్రిస్టియన్ మహిళ ఆసియా బీబీ పాకిస్తాన్ విడిచి వెళ్లిపోయినట్లు ఆమె లాయర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఆసియా బీబీ కెనడాకు వెళ్లినట్లు తనకు సమాచారం అందిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆసియా బీబీ మరణశిక్షను రద్దు చేసిన ఆర్నెళ్ల తర్వాత ఆమె దేశాన్ని విడిచి వెళ్లారు. అయితే ఈ వార్తలపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఇంతవరకు స్పందించలేదు. కాగా ఇరుగుపొరుగు వాళ్లతో జరిగిన గొడవలో భాగంగా ఇస్లాం మతాన్ని దూషించిందంటూ ఆసియా బీబీ గురించి వార్తలు ప్రచురితం కాగా పాకిస్తాన్ వ్యాప్తంగా నిరసన జ్వాలలు చెలరేగాయి. ఇస్లాంను దూషించిన అసియాకు బతికే అర్హత లేదనీ.. ఆమెకు కఠిన శిక్ష విధించాలని కొంతమంది 2009లో కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో లాహోర్ హైకోర్టు 2010లో ఆమెకు మరణశిక్ష విధించింది. ఇక ఈ తీర్పును వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ వ్యాప్తంగా కొందరు ఆమెకు మద్దతుగా నిలవగా.. మరికొందరు స్వాగతించారు. ఆసియా పాపం పండినందు వల్లే ఆమెకు మరణశిక్ష పడిందని హర్షం వ్యక్తం చేశారు. అయితే హైకోర్టు తీర్పుపై అసియా సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. గత ఎనిమిది సంవత్సరాలుగా ‘ఏకాంతవాస’శిక్షను అనుభవిస్తుండడంతో కోర్టు ఆమెకు విధించిన మరణశిక్షను రద్దు చేసింది. గతేడాది అక్టోబరులో వెలువడిన సుప్రీంకోర్టు తీర్పుతో పాకిస్తాన్లో మరోసారి ఆగ్రహజ్వాలలు పెల్లుబుకాయి. ఆసియాను కచ్చితంగా చంపేస్తామని..ఆమెను దేశం విడిచి వెళ్లకుండా చూడాలంటూ నిరసనకారులు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో బీబీ కెనడాలో ఆశ్రయం పొందాలని భావించడంతో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో పాకిస్తాన్ ప్రభుత్వంలో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఆమె పాక్ విడిచివెళ్లినట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది.. ఆసియా బీబీ తన నలుగురు పిల్లలతో కలిసి పాకిస్తాన్లో నివసిస్తూ ఉండేది. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. ఈ క్రమంలో ఓరోజు పొలంలో పనిచేస్తున్న సమయంలో పక్క పొలం వాళ్లని మంచినీళ్లు కావాలని అడిగింది. అయితే ఆసియా క్రిస్టియన్ అనే కారణంతో ఆమెకు నీళ్లు ఇవ్వడానికి నిరాకరించడంతో.. ఇస్లాం మతం గురించి ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ విషయం దేశవ్యాప్తంగా ప్రముఖంగా ప్రచారం కావడంతో నిరసనలు చెలరేగాయి. బాడీగార్డే చంపేశాడు.. ఆసియా వ్యాఖ్యలతో సహనం కోల్పోయిన ఇస్లాం మతస్తులు ఆమెతో పాటు.. ఆమెకు మద్దతుగా నిలిచిన వారినీ చంపేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్ సల్మాన్ తసీర్ను ఆయన బాడీగార్డే కాల్చి చంపేశాడు. ఆయనతో ఆసియాకు మద్దతు తెలిపిన మరో ఇద్దరు రాజకీయ నాయకులను దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. ఇక పాక్ మాజీ ప్రధాని జియావుల్ హక్ 1980లో దైవ దూషణ నేరంగా పరిగణించే చట్టాలు తెచ్చారు. అయితే, వ్యక్తిగత కక్ష్యసాధింపు చర్యలకు ఈ చట్టాలు అవకాశం కల్పిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
క్రిస్టియన్ మహిళ కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు
ఇస్లామాబాద్ : దైవ దూషణ చేసిన క్రిస్టియన్ మహిళపై పాకిస్తాన్ సుప్రీం కోర్టు కనికరం చూపింది. కింది కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేస్తూ చీఫ్ జస్టిస్ సాఖిబ్ నిసార్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. వివరాలు.. క్రిస్టియన్ మతానికి చెందిన అసియా బీబీ ఇస్లాం మతాన్ని దూషిస్తూ తరచూ ఇరుగుపొరుగు వారితో గొడవకు దిగేది. తమ మతంపై అసియా అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇస్లాంను దూషించిన అసియాకు బతికే అర్హత లేదనీ.. ఆమెకు కఠిన శిక్ష విధించాలని 2009లో కోర్టును ఆశ్రయించారు. అసియాకు ఉరిశిక్ష పవిత్ర ఇస్లాం మతాన్ని దూషించి ప్రజల మనోభావాల్ని దెబ్బతీశావంటూ లాహోర్ హైకోర్టు 2010లో అసియాకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై పాకిస్తాన్ వ్యాప్తంగా కొందరు ఆమెకు మద్దతుగా నిలవగా.. మరికొందరు ఆమెకు పాపం పండిందని ఆనందం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుపై అసియా సుప్రీం కోర్టును ఆశ్రయించిగా.. నిందితురాలు గత ఎనిమిది సంవత్సరాలుగా ‘ఏకాంతవాస’శిక్షను అనుభవిస్తుండడంతో కోర్టు ఆమెకు విధించిన మరణశిక్షను రద్దు చేసింది. ఇదిలాఉండగా.. ఈ కేసుపై మూడు వారాల క్రితమే కోర్టు నిర్ణయం తీసుకుందనీ, అయితే నిరసనలను అదుపు చేసేందుకు తీర్పును రిజర్వులో ఉంచారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఆయన మరణంతో అలజడి.. అసియాకు ఉరిశిక్ష విధించిన లాహోర్ హైకోర్టు వ్యవహారాన్ని ఖండించి, ఆమెకు మద్దతుగా నిలిచిన పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్ 2011లో హత్యకు గురికావడంతో పాకిస్తాన్లో అలజడి రేగింది. ఈ నేపథ్యంలోనే అసియా కేసులో కోర్టు జాగ్రత్తలు చేపట్టింది. నిరసనలు చెలరేగకుండా పోలీసులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఏదేమైనా ఇస్లాం నిరసనకారుల వల్ల అసియాకు ఇబ్బందులు తప్పక పోవచ్చుననీ, జైలు నుంచి విడుదలైన అనంతరం ఆమె రక్షణ ప్రమాదంలో పడొచ్చననే భయాలు నెలకొన్నాయయి. ఉగ్రవాదులు ఆమెపై దాడికి పాల్పడవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా.. అప్పటి ప్రధాని జియావుల్ హక్ 1980లో దైవ దూషణ నేరంగా పరిగణించే చట్టాలు తెచ్చారు. అయితే, వ్యక్తిగత కక్ష్యసాధింపు చర్యలకు ఈ చట్టాలు అవకాశం కల్పిస్తాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. -
పాకిస్థాన్లో క్రైస్తవ మహిళపై దారుణం
లాహోర్: పాకిస్థాన్లో ఓ క్రైస్తవ మహిళ పట్ల దారుణం జరిగింది. ఆమె సోదరుడు ఓ ముస్లిం వివాహిత స్త్రీతో పారిపోవడంతో సదరు మహిళ బంధువులు ఆమెపై దాడి చేశారు. నలుగురు వ్యక్తులు ఆమె ఇంట్లోకి చొరబడి దుస్తులు ఊడదీసి.. ఆమె అత్యాచారం చేయబోయారు. ఆ దుండగుల నుంచి అతి కష్టం మీదుగా తప్పించుకున్న బాధితురాలు పొరుగింట్లోకి వెళ్లి తలదాచుకుంది. లాహోర్ నగరంలో నిత్యం రద్దీగా ఉండే హజి పార్క్ తాజ్పుర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. బాధితురాలా సమ్రా సోదరుడు బాదల్ ఇటీవల ఓ ముస్లిం వివాహిత మహిళతో ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో ఆమె భర్త, మరో ముగ్గురు వ్యక్తులు ఆయుధాలతో వచ్చి సమ్రా ఇంటిపై దాడి చేశాడు. ఆమె ఇంట్లోకి చొరబడి నీ తమ్ముడు బాదల్ ఎక్కడున్నాడో చెప్పాలని అడిగాడు. తెలియదని ఆమె చెప్పడంతో ఆమెపై దాడిచేసి.. బట్టలూడదీసి సామూహిక అత్యాచారయత్నం చేయబోయారు. దీంతో ఆమె వారి బారినుంచి తప్పించుకొని పక్కవాళ్ల ఇంట్లో తలదాచుకుంది. నగ్నంగా ఉన్న తనకు పొరుగింటి వారు దుస్తులు ఇచ్చారని ఆమె పోలీసులకు తెలిపింది. ఈ ఘటనలో నిందితుడు వసీఫ్ నసీర్ పై పోలీసులు కేసు పెట్టారు. అయితే, తాను ఫిర్యాదు చేసినా నిందితుడిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అతను యథేచ్ఛగా తిరుగుతూ తమను బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.