CII Convention
-
ప్రమాణాలు నెలకొల్పడంలో సత్తా చాటాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పగలిగే సత్తా తమలోనూ ఉందని గుర్తించి, ముందుకెళ్లాలని దేశీ తయారీ సంస్థలకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే సూచించారు. విభిన్న ఆవిష్కరణలతో సంస్థలు మెరుగైన ప్రమాణాలు పాటించాలని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు.అంతర్జాతీయ ప్రమాణాలకు సంబంధించి టాప్ అయిదు దేశాల జాబితాలో యూరప్ ఆధిపత్యమే కొనసాగుతుండగా, ఆ లిస్టులో భారత్ లేకపోవడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. మన దేశ పరిస్థితులకు అనుగుణమైనవి కాకపోయినప్పటికీ మిగతా దేశాలు నెలకొల్పిన ప్రమాణాలను మనం పాటించాల్సిన అవసరం వస్తోందని నిధి వ్యాఖ్యానించారు. కృత్రిమ మేథ విషయంలో భారత్‌లో గణనీయంగా ప్రతిభావంతులు ఉన్నప్పటికీ అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పడంలో వెనకబడినట్లు చెప్పారు. అయితే, ఆ అంశంలో ముందుకెళ్లాలంటే కొన్ని అవరోధాలు ఉన్నాయని, వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఇదీ చదవండి: ఓఎన్జీసీ నుంచి పవన్ హన్స్‌కు భారీ ఆర్డర్గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ (జీఈఎం)తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)ను అనుసంధానం చేయడం సహా నాణ్యతా ప్రమాణాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రపంచ స్థాయి సర్వీసులు అందించేందుకు టెస్టింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించడం, ప్రైవేట్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయడం మొదలైన వాటిపై దృష్టి పెడుతోందని పేర్కొన్నారు. -
విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
సాక్షి, విశాఖపట్నం: విద్యార్థులు వినూత్నంగా ఆలోచించి జ్ఞానం, కొత్త ఆవిష్కరణలతో ముందుకు దూసుకెళ్లాలని, నైపుణ్య విలువలను పెంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నాలెడ్జ్ ఉన్న వారే ప్రపంచాన్ని శాసిస్తారని చెప్పారు. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించిన జ్ఞానభేరి సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. ప్రపంచస్థాయి యూనివర్సిటీల ఫ్యాకల్టీలతో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు అనుసంధానం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, తాను స్కాలర్‌గా ఉన్నప్పుడే ఎమ్మెల్యే కావాలనుకుని సాధించానని తెలిపారు. 34 లక్షల మందికి ఉద్యోగాలు విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సుల్లో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూలు) కుదిరాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో 34 లక్షల మందికి ఉద్యోగాలొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వాజ్‌పేయీ హయాంలో టెలికాం రంగంలో డీరెగ్యులేషన్ కోసం తాను పోరాడి సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చేందుకు కృషి చేశానన్నారు. ఇప్పుడు ఆ సెల్ఫోన్లకు, సోషల్ మీడియాకు యువత బానిసలవుతున్నారని చెప్పారు. విభజన సమయంలో రాష్ట్రానికిచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. ఒకప్పుడు ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలున్న వారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో అనర్హులను చేస్తూ చట్టం చేశామని, ఇప్పుడు అవసరమైతే ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కన్నవారికి ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. ‘‘ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ పాటించమన్నాను. జనాభా పెరుగుతోంది.. నీరు, భూమి పెరగడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పదేళ్లలో జనాభాను నియంత్రించాం. దీంతో జనాభా తగ్గిపోతోంది. కొందరు పెళ్లిళ్లు కూడా చేసుకోవడం లేదు. కొందరు చేసుకున్నా పిల్లలు వద్దనుకుంటున్నారు. మన తల్లిదండ్రులు వద్దనుకుంటే మనం పుట్టేవారమా? అందుకే మళ్లీ నేనే ప్రమోట్ చేస్తున్నా. పిల్లల్ని కనండి.. పరిమితులొద్దు’’ అంటూ సీఎం చంద్రబాబు విద్యార్థుకు ఉద్బోధించారు. జ్ఞానభేరి కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఏయూ వీసీ జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార సభలా సాగిన సదస్సు విశాఖలో ప్రభుత్వం నిర్వహించిన జ్ఞానభేరి సదస్సు ఎన్నికల ప్రచార సభను తలపించింది. విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించాలన్న లక్ష్యంతో అన్ని విశ్వవిద్యాలయాల్లో జ్ఞానభేరి పేరిట సదస్సులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి కార్యక్రమం తిరుపతిలో జరగ్గా, రెండో సదస్సును గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించారు. గంటన్నర ఆలస్యంగా సాయంత్రం 4 గంటలకు సభా ప్రాంగణం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగంలో తన రాజకీయ ప్రవేశం, సాధించిన విజయాల గురించి చెప్పుకోవడానికే మొగ్గు చూపారు. తాను స్కాలర్‌గా ఉన్నప్పుడే ఎమ్మెల్యే కావాలని లక్ష్యంగా నిర్దేశించుకుని సాధించానన్నారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీని ఏర్పాటు చేశానని, బిల్‌గేట్స్‌తో మాట్లాడి మైక్రోసాఫ్ట్ సంస్థను హైదరాబాద్‌కు తెచ్చానని, 9 ఏళ్ల పరిపాలనలో 300 ఇంజినీరింగ్ కాలేజీలు మంజూరు చేశానని, అనంతపురానికి కియా మోటార్స్ తెచ్చానని సుదీర్ఘంగా చెప్పుకొచ్చారు. ఇది రాజకీయ సభ కానప్పటికీ వాటి గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉందన్నారు. పట్టిసీమను పూర్తి చేశానని, పోలవరం కూడా పూర్తి చేస్తానన్నారు. నదుల అనుసంధానం తన స్వప్నమని పేర్కొన్నారు. ఎప్పటిలాగే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కొంతమంది సహకరిస్తున్నందు వల్లే కేంద్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విద్యార్థులతో ముఖాముఖి రద్దు జ్ఞానభేరిలో ముఖ్యమంత్రితో విద్యార్థులు ముఖాముఖి మాట్లాడతారని అధికారులు ప్రకటించారు. కానీ, సీఎం చంద్రబాబు గంటన్నర సేపు ప్రసంగించాక సదస్సును ముగించేశారు. సీఎంతో ఎన్నో విషయాలు పంచుకుందామని వచ్చిన విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో విద్యార్థులకు పనికొచ్చే అంశాలు కంటే తాను చేసిన అభివృద్ధి పనుల గురించే చెప్పుకోవడంతో విద్యార్థులు విస్తుపోయారు. సీఎం ప్రసంగం కొనసాగుతుండగానే విద్యార్థులు సదస్సు ప్రాంగణం నుంచి నిష్కృమించారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకుండా వెళ్లిపోయారు. దీంతో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. విశాఖ జ్ఞానభేరి సదస్సుకు 16 వేల మంది విద్యార్థులు వస్తారని అధికారులు ప్రచారం చేసినా, వాస్తవానికి అందులో సగం మంది కూడా హాజరు కాలేదు. సీఎం ఓట్ల బాణం వేసినట్టు ఉంది ‘‘జ్ఞానభేరి సదస్సు అంటే ఎంతో గొప్పగా ఊహించుకుని వచ్చాం. తీరా ఇక్కడ ముఖ్యమంత్రి ప్రసంగంలో రాజకీయాల గురించే ఎక్కువగా మాట్లాడారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో విద్యార్థుల ఓట్ల కోసం సీఎం బాణం వేసినట్టు ఉంది’’ – గౌతమ్, ప్రైవేట్ కళాశాల డిగ్రీ విద్యార్థి జ్ఞానభేరికి వస్తే పిల్లలను కనమంటారా? ‘‘జ్ఞానభేరి కార్యక్రమంలో జ్ఞానం కలిగిస్తారనుకుంటే ముఖ్యమంత్రి విసుగు తెప్పించారు. విద్య, ఉద్యోగం, ఉపాధి, విజ్ఞానం గురించి చెప్పాల్సిన ముఖ్యమంత్రి ఇద్దరు కాదు ఇంకా పిల్లలను కనండని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఎన్నికల్లో పోటీకి ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వ్యక్తులకు ప్రాధాన్యం ఇచ్చే రోజులు వస్తాయని చెప్పడమేనా ముఖ్యమంత్రి ఇచ్చే సందేశం’’ – పి.సందీప్‌కుమార్, బీటెక్ విద్యార్థి -
ముచ్చట ముగిసింది!
హంగూ ఆర్భాటాలతో సీఐఐ సదస్సు నిర్వహణ మూడు రోజులకు రూ.20 కోట్ల భారీ వ్యయం ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం వచ్చే ఏడాదీ ఇక్కడే.. విశాఖపట్నం: మూడు రోజుల ముచ్చట ముగిసింది. వందల సంఖ్యలో ఒప్పందాలు.. లక్షల కోట్ల పెట్టుబడుల నిర్ణయాలు జరిగాయి.. వీటిలో ఎన్ని ఆచరణరూపం దాలుస్తాయన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినా.. దేశ విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు, మంత్రులు, అధికారులతో, ఇతర ప్రతినిధులతో మూడు రోజులపాటు కళకళలాడిన సాగరతీరంలోని సదస్సు ప్రాంగణం సదస్సు ముగిసిన తర్వాత మంగళవారం సాయంత్రం బోసిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సీఐఐతో కలిసి ఆర్బాటంగా నిర్వహించిన అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు నిర్వహణలో గత కొన్ని రోజులుగా తలమునకలైన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యంగా విశాఖ జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. 41 దేశాల నుంచి 350 మంది, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 1200 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. కేంద్ర మంత్రులతో పాటు కొన్ని దేశాల మంత్రులు కూడా పాల్గొన్నారు. రెండు వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తొలిరోజు ముఖ్యమంత్రితో పాటు కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, నిర్మలాసీతారామన్, పీయూష్ గోయల్, రిలయన్స్ అధినేత అనీల్ అంబానీ, గోద్రేజ్ చైర్మన్ ఆది గోద్రేజ్, జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు, భారత్ ఫోర్జ్ సీఎండీ బాబా కల్యాణి, ఫోర్బ్స్ డెరైక్టర్ నౌషద్ ఫోర్బ్స్, సీఐఐ డీజీ చంద్రజీత్ బెనర్జీ వంటి ప్రముఖులు హాజరయ్యారు. రెండో రోజు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, జయంతి సిన్హా, సుజనాచౌదరి, బంగ్లాదేశ్ మంత్రి తోఫైల్ అహ్మద్, నేపాల్ మంత్రి దీపక్ బొహరా, మాలవి మంత్రి జోసెఫ్ మనమ్వెఖా, వాల్‌మార్ట్ ప్రెసిడెంట్ క్రిష్లేర్, ఫ్యూచర్ గ్రూప్ సీఈఓ కిషోర్ బియానీ, ఆదిత్య బిర్లా సీఈవో విశాక్ కుమార్, సీఐఐ రాష్ట్ర అధ్యక్షుడు సుమీత్ సురేష్‌రాయుడు చిట్టూరి తదితరులు పాల్గొన్నారు. మూడో రోజు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, కేంద్రమంత్రులు అశోక్‌గజపతిరాజు, అనంతకుమార్, ప్రకాష్ జవదేకర్, సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు, ఏంపీ గల్లా జయదేవ్, ఐటీసీ ఈడీ నకుల్ ఆనంద్, ఇండిగో అధ్యక్షుడు ఆదిత్య ఘోష్ తదితరులు హాజరయ్యారు. ఎనిమిది ప్లీనరీలు, పలు సెషన్లు నిర్వహించారు. మొత్తం మూడు రోజుల్లో 328 ఎంఓయూలు కుదుర్చుకోగా, రూ.4.67 లక్షల కోట్ల పెట్టుబడులు సమకూరుతాయని అంచనా వేస్తున్నారు. మంచినీళ్లలా ఖర్చు..: సాగ రతీరానికి చేరువలోని హార్బర్ పార్కు వద్ద ఉన్న ఏపీఐఐసీ స్థలంలో నిర్వహించిన ఈ సదస్సుకు ప్రభుత్వం మంచినీళ్ల ప్రాయంగా నిధులు ఖర్చు చేసింది. సదస్సు ప్రాంగణంలో ప్లీనరీలు, సెషన్ల నిర్వహణకు, ఎంఓయూలు కుదుర్చుకోవడానికి వీలుగా అత్యాధునిక షామియానాలు, స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్రతినిధులకు స్టార్‌హోటళ్లలో ఖరీదైన బస, విందు భోజనాలు ఏర్పాటు చేసింది. అత్యంత విలాసవంతమైన వందలాది కార్లను సమకూర్చింది. సుమారు రూ.20 కోట్లు వెచ్చించినట్టు అంచనా. ఈ మూడు రోజులూ విశాఖనే రాజధానిగా మలిచి ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల కార్యదర్శులు పాలన సాగించారు. ప్రాంగణంలో నాలుగు హాళ్లను ఏర్పాటు చేసి ఒకదాన్ని ముఖ్యమంత్రి సచివాలయంగా మార్చేశారు. సదస్సుకు వచ్చిన స్పందనను చూసి వచ్చే ఏడాది కూడా విశాఖలోనే సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. -
నాలెడ్జ్ హబ్‌గా ఏపీ
సీఐఐ సదస్సులో సీఎం సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: ‘‘రాష్ట్రాన్ని రెండేళ్లలో నాలెడ్జ్ హబ్‌గా మార్చాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అభివృద్ధికి దోహదపడే అంశాలను అందిపుచ్చుకోవాలి. యువ ఇంజనీర్లు, ఐటీ రంగంలోని అనుభవజ్ఞులు కొత్త అప్లికేషన్లతో ముందుకు రావాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. విజయవాడలో గురువారం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఐటీ రంగ సదస్సులో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో జరిగిన సీఐఐ సదస్సులో కూడా సీఎం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానంతోపాటు సృజనాత్మక ఆలోచనలు కూడా ఎంతో అవసరమని చెప్పారు. విదేశాల్లో నివసించే సాఫ్ట్వేర్ నిపుణులు కొద్దిపాటి సమయాన్ని స్వరాష్ట్రం కోసం కేటాయిం చాలని సూచించారు. ‘కోడ్ ఫర్ ఏపీ’ గ్రూప్‌లో చేరాలని పిలుపునిచ్చారు. మొబైల్ రివల్యూషన్, క్లౌడ్ టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్న ప్రస్తుత తరుణంలో యువ ఇంజనీర్లు సరికొత్త ఆలోచనలతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఈవ్‌టీజింగ్‌లపై ఆందోళన సరస్వతీ నిలయాలుగా భాసిల్లాల్సిన యూనివర్సిటీలు ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్‌లకు నిలయాలుగా మారుతున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ర్యాగింగ్ కారణంగా రిషితేశ్వరి అనే విద్యార్థిని చనిపోవడం ఎంతో బాధ కలిగించిందన్నారు. విశ్వవిద్యాలయాల్లో బయటి వ్యక్తులు తిష్టవేసి కుల సంఘాలను నడుపుతున్నట్లు తెలిసిందని, వారిని బయటకు పంపిస్తామని చెప్పారు. వారం తర్వాతే..: పట్టిసీమపై సీఎం * రాష్ట్ర విభజనపై విధానపత్రం విడుదల సాక్షి, విజయవాడ బ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రజలకు అంకితం చేస్తామని, నీటి విడుదల మాత్రం వారం, పదిరోజుల తర్వాతే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గురువారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 29న ఈ పథకానికి శంకుస్థాపన చేసి ఆగస్టు 15 తుదిగడువు విధించామని, కానీ అధికారులు వారం, పదిరోజులు సమయం అడిగారని తెలిపారు. వర్షాలు పడడం, రక్షణ, నాణ్యతలను దృష్టిలో పెట్టుకుని అధికారులపై తాను ఒత్తిడి చేయలేదన్నారు. ఈ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేయడం.. నదుల అనుసంధానం ద్వారా చరిత్ర సృష్టించనున్నట్లు తెలిపారు. తొలుత ‘రాష్ట్ర విభజన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల తీరు- టీడీపీ పాత్ర’పై ఒక విధాన పత్రాన్ని ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అనుసరించిన విధానం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, తదితర పరిణామాలను అందులో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కావాలని గట్టిగానే అడుగుతామని, కానీ దానివల్లే అంతా అయిపోదని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి టీఆర్ఎస్ అనేక రకాల సమస్యలు, వివాదాలు సృష్టిస్తూనే ఉందన్నారు. శుక్రవారం మరోపత్రం విడుదల చేస్తానని చెప్పారు.