అవార్డులంటే ఇష్టమే..
తన పాటలకు ప్రేక్షకులు ఉర్రూతలూగినప్పుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదని, అయితే, తనకు అవార్డులు కూడా ఇష్టమేనని విలక్షణ గాయని ఉషా ఉతుప్ చెబుతోంది.
అవార్డులు ప్రతిభకు గుర్తింపు అని, కళాకారులెవరైనా వాటిని ఇష్టపడతారని, చాలామంది ఆ సంగతిని బయటకు చెప్పేందుకు మొహమాటపడతారని అంటోంది. అయితే, పాటల్లోని సాహిత్యంపై మాట్లాడేంత శక్తి తనకు లేదని వ్యాఖ్యానిస్తోంది.