ckm hospital
-
వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో పసికందు మృతి
-
వరంగల్ ప్రసూతి ఆస్పత్రిలో ప్రసవ కష్టాలు
-
సీకేఎం ఆస్పత్రికి ఎస్బీహెచ్ రూ.3.35లక్షల వితరణ
ఎంజీఎం : వరంగల్ సీకేఎం ఆస్పత్రికి గురువారం ఎస్బీహెచ్ మేనేజింగ్ డైరెక్టర్ శంతన్ముఖర్జీ రూ.3లక్షల 3500 చెక్కును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా సీకేఎం సూపరింటెండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్బీహెచ్ అందించిన సాయంతో ఆస్పత్రికి కావాల్సిన సర్జికల్ ఆటోక్లేవ్ పరికరాన్ని కొనుగోలు చేసి గర్భిణులకు మెరుగైనా సేవలందిస్తామన్నారు. ఎస్బీహెచ్ జనరల్ మేనేజర్లు హరిహరరావు, మణికందన్, డీజీఎంలు నారాయణ, బహార, బర్దన్ పాల్గొన్నారు. -
కలెక్టర్ ఫోన్‌తో నిండు గర్భిణీకి వైద్యం
వరంగల్ : ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకోకుండా గేటు బయటకు గెంటేసిన సంఘటన వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఆస్పత్రి సిబ్బంది దాష్టీకం కారణంగా సుజాత అనే నిండు గర్భిణి చలికి వణుకుతూ తెల్లవారేవరకూ ఆస్పత్రి మెట్లపైనే కూర్చుంది. దాంతో ఆమె బాగా నీరసించింది. ఈ విషయంపై గర్భిణి బంధువులు జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి.. సదరు ఆసుపత్రి సిబ్బందికి ఫోన్ చేయడంతో మూడు గంటల తర్వాత ఆమెకు వైద్యం అందించారు. సిజేరియన్ చేసి బిడ్డను వెలికి తీశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు... ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గ్రామానికి చెందిన సుజాత అనే మహిళకు పురిటినొప్పులు ఎక్కువ కావడంతో ప్రసవం కోసం కుటుంబసభ్యులు బుధవారం వరంగల్ సీకేఎం ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే ఆస్పత్రి సిబ్బంది ఆమెను ఆస్పత్రిలో చేర్చుకోకుండా గేటు బయటకు గెంటేశారు. కుటుంబసభ్యులు ఎంత బతిమాలినా ఆస్పత్రి సిబ్బంది కనికరించలేదు. ఈ విషయంపై డీఎం అండ్ హెచ్ఓకు ఫోన్ చేస్తే ఆయన స్పందించలేదు. ఆ తర్వాత కలెక్టర్‌కు ఫోన్‌చేయడంతో కలెక్టర్ స్పందించి గర్భిణిని వెంటనే ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యం అందించాలని ఆదేశించారు. దాంతో గాబరాపడిన ఆస్పత్రి సిబ్బంది సుజాతను ఆస్పత్రి లోనికి తీసుకెళ్లి వైద్యం అందించారు. సిజేరియన్ చేసి కాన్పు చేశారు. ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. సుజాత కరీంనగర్ జిల్లా జగిత్యాలలో గతంలో చికిత్సపొందింది. ఆమెకు మలేరియా జ్వరంతో పాటు కామెర్లు సోకడంతో మెరుగైన చికిత్స కోసం పెద్దాస్పత్రి రెఫర్చేశారని వరంగల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అయితే ఆమె తెల్లవారుజామున ఇక్కడికి వచ్చిందని... ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో సీకేఎం ఆస్పత్రిలో వెంటిలేటర్ సదుపాయం లేకపోవడంతో తాము హైదరాబాద్ వెళ్లమని సూచించామని చెప్పారు. కాగా ఆమె హైదరాబాద్ వెళ్లకుండా ఆస్పత్రి మెట్లపైనే కూర్చుందని వారు చెబుతున్నారు. సుజాత పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో హైదరాబాద్ పోయేలోగా ఏదైనా ప్రమాదం సంభవించవచ్చన్న భయంతో ఇక్కడే చేర్చుకుని వైద్యం చేయమని తాము వేడుకున్నా సిబ్బంది కనికరించలేదని సుజాత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు తాము కలెక్టర్‌కు ఫోనే చేయాల్సి వచ్చిందని వారన్నారు. కలెక్టర్ జోక్యంతో సుజాత పండంటి మగబిడ్డకు జన్మఇచ్చిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. వరంగల్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది వ్యవహార తీరుపై చాలా విమర్శలు ఉన్నాయి. పదిరోజుల క్రితం కూడా కలెక్టర్ ఆస్పత్రిని సందర్శించి అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
సీకేఎంలో శిశుమార్పిడి వివాదం
- ఆస్పత్రిలో కలకలం - పోలీసుల రంగప్రవేశం - అధికారుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం ఎంజీఎం : వరంగల్‌లోని సీకేఎం ఆస్పత్రిలో ఓ గర్భిణీకి పుట్టిన శిశువు మరో గర్భిణీ బంధుమిత్రులు తీసుకోవడం ఆందోళనకు తెర తీసింది. దీంతో సదరు గర్భిణీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తమ బిడ్డకు పుట్టిన శిశువు ఏదీ.. పుట్టింది ఆడపిల్లనా.. మగపిల్లవాడా ఎలా తెలిసేది... డీఎన్ఎ పరీక్ష చేయించి నిర్ధారించాలంటూ పెద్డఎత్తున ఆందోళనకు దిగిన సంఘటన మంగళవారం జరిగింది. ఆత్మకూరు మండలం ల్యాదెళ్ల గ్రామానికి చెందిన తిరుపతి భార్య సరితకు నగరంలోని సీకేఎం ఆస్పత్రిలో అత్యవసర పరిస్థతుల్లో శస్త్రచికిత్స(సెక్షన్) చేసి ప్రసవం చేశారు. ప్రసవంలో మగశిశువు పుట్టాడని పేర్కొని సదరు కుటుంబ సభ్యులకు అప్పగించారు. శిశువు జన్మించిన క్రమంలో కొద్దిపాటి అస్వస్థతతో ఉండడంతో నవజాత శిశుసంరక్షణ కేంద్రంలో ఉంచాలని చెప్పారు. దీంతో శిశువును పిల్లల వైద్యుడికి అప్పగించి ఎస్‌ఎన్‌సీయూలో ఉంచారు. అనంతరం అరగంట తర్వాత పర్వతగిరి మండలం రోళ్లకల్లు గ్రామానికి చెందిన ఆనంద్ భార్య ఉమకు శస్త్రచికిత్స చేసి ప్రసవం చేశారు. ఆమె పుట్టిన శిశువును అప్పగించేందుకు ఉమకు సంబంధించిన ఆటెండెంట్లను పిలిచారు. ఈ క్రమంలో వేరే గర్భిణీకి చెందిన అటెండెంట్ వచ్చి తీసుకెళ్లి శిశువును పిల్లల వైద్యుడికి అప్పగించడంతో నవజాత శిశు సంరక్షణ కేంద్రం లోని వార్మర్ ద్వారా వైద్యచికిత్సలు అందిస్తున్నారు. అయితే ఆ సమయంలో ఉమకు సంబంధించిన బంధువులు ఆపరేషన్ థియేటర్ వద్ద అందుబాటులో లేరు. మరో 15 నిమిషాల తర్వాత ఉమను ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి తీసుకొచ్చే క్రమంలో బంధుమిత్రులు అక్కడికి చేరుకున్నారు. శిశువు ఎక్కడ అనిప్రశ్నించడంతో ఒక్కసారిగా అంద రు ఉలిక్కిపడ్డారు. శిశువును మీ బంధువులకే అప్పగించాం కదా అన్ని వైద్యులు పేర్కొనడం తో వివాదం మొదలైంది. తామెవరం ఇక్కడ లేమని, శిశువును తమకు అప్పగించలేదని ఆందోళనకు దిగారు. దీంతో వైద్యులు వెంటనే స్పందించి శిశువు ఎస్‌ఎన్‌సీయూలో ఉన్న విషయాన్ని గుర్తించి ఆడ పిల్ల పుట్టిందని ఉమ బంధువులకు తెలిపారు. అయితే తమకు ఆడపిల్ల పుట్టడమేమిటని, నమ్మకం లేదని బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. డీఎన్ఏ పరీక్ష చేరుుస్తే తప్ప అసలు విషయం వెలుగులోకి రాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ బంధువులు తమ శిశువు మాయం చేశారని పోలీసులను కూడా ఆశ్రయించారు. పోలీసులు రంగం ప్రవేశం చేసి వైద్యుల వద్ద వివరాలు సేకరించారు. అధికారుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం శిశువు మార్పిడి జరిగిందనే వివాదంపై వెంట నే సీకేఎం ఆస్పత్రి పరిపాలనాధికారులు స్పం దించడంతో వివాదం సద్దుమణిగింది. శిశువు జన్మించగానే కాళ్లకు ట్యాగ్లాంటి స్టకర్ వేస్తామని, బరువుతోపాటు కాళ్ల వేలిముద్రలను కేస్ షీట్‌పై తీసుకుంటామని సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయాలను ఉమ కుటుంబ సభ్యులకు వివరించి వారికి పుట్టిన పాపను ధృవీకరించడం జరిగిందన్నారు. ప్రస్తు తం ఇద్దరు గర్భిణీలు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు, శిశువులను కూడా నవజాతు శిశుసంరక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆర్ఎంఓ పుష్పెందర్నాథ్ పేర్కొన్నారు. -
సీకేఎంలో శిశుమార్పిడి వివాదం
- ఆస్పత్రిలో కలకలం - పోలీసుల రంగప్రవేశం - అధికారుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం ఎంజీఎం : వరంగల్‌లోని సీకేఎం ఆస్పత్రిలో ఓ గర్భిణీకి పుట్టిన శిశువు మరో గర్భిణీ బంధుమిత్రులు తీసుకోవడం ఆందోళనకు తెర తీసింది. దీంతో సదరు గర్భిణీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తమ బిడ్డకు పుట్టిన శిశువు ఏదీ.. పుట్టింది ఆడపిల్లనా.. మగపిల్లవాడా ఎలా తెలిసేది... డీఎన్ఎ పరీక్ష చేయించి నిర్ధారించాలంటూ పెద్డఎత్తున ఆందోళనకు దిగిన సంఘటన మంగళవారం జరిగింది. ఆత్మకూరు మండలం ల్యాదెళ్ల గ్రామానికి చెందిన తిరుపతి భార్య సరితకు నగరంలోని సీకేఎం ఆస్పత్రిలో అత్యవసర పరిస్థతుల్లో శస్త్రచికిత్స(సెక్షన్) చేసి ప్రసవం చేశారు. ప్రసవంలో మగశిశువు పుట్టాడని పేర్కొని సదరు కుటుంబ సభ్యులకు అప్పగించారు. శిశువు జన్మించిన క్రమంలో కొద్దిపాటి అస్వస్థతతో ఉండడంతో నవజాత శిశుసంరక్షణ కేంద్రంలో ఉంచాలని చెప్పారు. దీంతో శిశువును పిల్లల వైద్యుడికి అప్పగించి ఎస్‌ఎన్‌సీయూలో ఉంచారు. అనంతరం అరగంట తర్వాత పర్వతగిరి మండలం రోళ్లకల్లు గ్రామానికి చెందిన ఆనంద్ భార్య ఉమకు శస్త్రచికిత్స చేసి ప్రసవం చేశారు. ఆమె పుట్టిన శిశువును అప్పగించేందుకు ఉమకు సంబంధించిన ఆటెండెంట్లను పిలిచారు. ఈ క్రమంలో వేరే గర్భిణీకి చెందిన అటెండెంట్ వచ్చి తీసుకెళ్లి శిశువును పిల్లల వైద్యుడికి అప్పగించడంతో నవజాత శిశు సంరక్షణ కేంద్రం లోని వార్మర్ ద్వారా వైద్యచికిత్సలు అందిస్తున్నారు. అయితే ఆ సమయంలో ఉమకు సంబంధించిన బంధువులు ఆపరేషన్ థియేటర్ వద్ద అందుబాటులో లేరు. మరో 15 నిమిషాల తర్వాత ఉమను ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి తీసుకొచ్చే క్రమంలో బంధుమిత్రులు అక్కడికి చేరుకున్నారు. శిశువు ఎక్కడ అనిప్రశ్నించడంతో ఒక్కసారిగా అంద రు ఉలిక్కిపడ్డారు. శిశువును మీ బంధువులకే అప్పగించాం కదా అన్ని వైద్యులు పేర్కొనడం తో వివాదం మొదలైంది. తామెవరం ఇక్కడ లేమని, శిశువును తమకు అప్పగించలేదని ఆందోళనకు దిగారు. దీంతో వైద్యులు వెంటనే స్పందించి శిశువు ఎస్‌ఎన్‌సీయూలో ఉన్న విషయాన్ని గుర్తించి ఆడ పిల్ల పుట్టిందని ఉమ బంధువులకు తెలిపారు. అయితే తమకు ఆడపిల్ల పుట్టడమేమిటని, నమ్మకం లేదని బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. డీఎన్ఏ పరీక్ష చేరుుస్తే తప్ప అసలు విషయం వెలుగులోకి రాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ బంధువులు తమ శిశువు మాయం చేశారని పోలీసులను కూడా ఆశ్రయించారు. పోలీసులు రంగం ప్రవేశం చేసి వైద్యుల వద్ద వివరాలు సేకరించారు. అధికారుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం శిశువు మార్పిడి జరిగిందనే వివాదంపై వెంట నే సీకేఎం ఆస్పత్రి పరిపాలనాధికారులు స్పం దించడంతో వివాదం సద్దుమణిగింది. శిశువు జన్మించగానే కాళ్లకు ట్యాగ్లాంటి స్టకర్ వేస్తామని, బరువుతోపాటు కాళ్ల వేలిముద్రలను కేస్ షీట్‌పై తీసుకుంటామని సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయాలను ఉమ కుటుంబ సభ్యులకు వివరించి వారికి పుట్టిన పాపను ధృవీకరించడం జరిగిందన్నారు. ప్రస్తు తం ఇద్దరు గర్భిణీలు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు, శిశువులను కూడా నవజాతు శిశుసంరక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆర్ఎంఓ పుష్పెందర్నాథ్ పేర్కొన్నారు.