Clerk Post
-
రాజ్యాంగాన్ని మోసగించడమే
న్యూఢిల్లీ: కేవలం రిజర్వేషన్ ఫలాలు దోచేయాలనే దుర్భుద్దితో మతం మారిన విషయాన్ని దాచిపెట్టిన అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాంటి చర్యలు రాజ్యాంగాన్ని మోసగించడంతో సమానమని అభివర్ణించింది. క్రైస్తవమతంలోకి మారిన తర్వాత కూడా ఒక మహిళ షెడ్యూల్ కులం సర్టిఫికేట్ కోసం తాను ఇంకా హిందువునేనని వాదించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ అంశంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఆర్ మహదేవన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది. హిందువు అయిన సి.సెల్వరాణి క్రైస్తవమతం పుచ్చుకుంది. అయితే రిజర్వేషన్ లబ్ది పొందేందుకు, ఉద్యోగి సంబంధిత ప్రయోజనాలు పొందేందుకు తాను ఇంకా హిందువునేనని నమ్మించే ప్రయత్నంచేశారు. అయితే ఆమె నిజంగా క్రైస్తవ మతంలోకి మారిందని, తరచూ చర్చికి వెళ్తూ, క్రైస్తవ మత కార్యక్రమాల్లో పాల్గొంటూ, పూర్తి విశ్వాసంతో క్రైస్తవమతాన్ని ఆచరిస్తోందని సాక్ష్యాధారాలతో నిరూపితమైంది. దీంతో రిజర్వేషన్ కోసం ఆ మహిళ తన మతాన్ని దాచిపెట్టడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘బాప్టిజం పూర్తయ్యాక ఇంకా తాను హిందువును అని మహిళ చెప్పుకోవడంలో అర్థంలేదు. మతం మారాక కూడా రిజర్వేషన్ ప్రయోజనాలే పరమావధిగా ఇలా వ్యవహరించడం రిజర్వేషన్ లక్ష్యాలకే విఘాతం. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అమలుచేస్తున్న రిజర్వేషన్ల విధానం ఇలాంటి వారితో ప్రమాదంలో పడుతుంది’’అని కోర్టు వ్యాఖ్యానించింది. సెల్వరాణి తండ్రి హిందువుకాగా తల్లి క్రైస్తవురాలు. అయితే సెల్వరాణి చిన్నతనంలోనే బాప్టిజం తర్వాత క్రైస్తవురాలిగా మారారు. అయితే 2015లో పుదుచ్చెరిలో అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగం పొందేందుకు ఆమె ఎస్సీ సర్టిఫికేట్ సంపాదించారు. సెల్వరాణి తండ్రి వల్లువాన్ కులానికి చెందిన వ్యక్తి. స్థానికంగా ఈ కులం వారికి ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ సెల్వరాణి తండ్రి సైతం దశాబ్దాలక్రితమే క్రైస్తవమతం స్వీకరించారు. దీంతో తల్లిదండ్రులు క్రైస్తవులుకాగా తాను మాత్రం హిందువును అని ఈమె చేసిన వాదనల్లో నిజం లేదని కోర్టు అభిప్రాయపడింది. -
జైలులో నవజోత్‌సింగ్ సిద్ధూకు వర్క్ అలాట్.. పని ఏంటంటే..?
కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్, మాజీ క్రికెటర్ నవజోత్‌సింగ్ సిద్ధూ పాటియాలలోని సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. 1998లో జరిగిన ఓ దాడికి సంబంధించిన ఓ కేసులో సుప్రీంకోర్టు సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధించింది. ఇదిలా ఉండగా.. తాజాగా సిద్ధూకు జైలు అధికారులు క్లర్క్ పనిని అప్పగించినట్టు జైలు అధికారులు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. క్లర్క్‌గా ఆయన ఏ పని చేయాలో మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. శిక్షణ అనంతరం సిద్ధూ పూర్తి స్థాయిలో ఆ పనులు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా జైలు రికార్డులను పరిశీలించడం, సుదీర్ఘంగా ఉండే కోర్టు తీర్పులను పర్యవేక్షించడం వంటివి చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. శిక్షణ ఇచ్చిన తర్వాత జైలు రూల్స్ ప్రకారం.. మూడు నెలల పాటు వేతనం చెల్లించరు. శిక్షణ ముగిసిన తర్వాత స్కిల్‌ను బట్టి రోజుకు రూ. 40-90 వరకు వేతనం అందిస్తారు. ఇక, సిద్ధూ.. హై ప్రొఫైల్ ఖైదీ కావడంతో బరాక్ నుంచే క్లర్క్ పనులను నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెల్ నుంచి బయటకు రాకుండా ఆయన దగ్గరకే రికార్డులు పంపించనున్నారు. సిద్ధూ ఉండే సెల్ సమీపంలో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు.. సిద్ధూకు ఖైదీ నంబర్ 241383, బ్యారక్ నంబర్ 7గా కేటాయించబడిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: అసెంబ్లీలో అఖిలేష్ నోట అసభ్యకరమైన పదాలు.. సీఎం యోగి రియాక్షన్ ఇది -
ఏపీలో డీసీసీబీ ఉద్యోగాలు.. జిల్లాల వారీగా వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లోని ది డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్(డీసీసీబీ) పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేయనుంది. డీసీసీబీ బ్యాంక్, కడపలో 75 క్లర్క్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లాలో ది కడప డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్.. క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 75 ► అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్‌పై అవగాహనతోపాటు స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ► వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: ఆన్లైన్ విధానంలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్షా సమయం 60 నిమిషాలు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.12.2021 ► వెబ్సైట్: www.kadapadccb.in డీసీసీబీ బ్యాంక్, కర్నూలులో 17 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాలో ది డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్(డీసీసీబీ).. క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 17 ► పోస్టుల వివరాలు: స్టాఫ్ అసిస్టెంట్లు/క్లర్క్‌లు–09, అసిస్టెంట్ మేనేజర్లు–08. ► స్టాఫ్ అసిస్టెంట్లు/క్లర్క్‌లు: అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్ నాలెడ్జ్ తోపాటు స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ► అసిస్టెంట్ మేనేజర్లు: అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/కామర్స్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఎకనమిక్స్/స్టాటిస్టిక్స్/తత్సమాన సబ్జెక్టుల్లో పీజీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు: 01.10.2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: ఆన్లైన్ విధానంలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది.నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్షా సమయం 60 నిమిషాలు ఉంటుంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.12.2021 ► వెబ్సైట్: kurnooldccb. com డీసీసీబీ బ్యాంక్, నెల్లూరులో 65 పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లాలో ది నెల్లూరు డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్(ఏడీసీసీబీ).. ఉద్యోగాల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 65 ► పోస్టుల వివరాలు: స్టాఫ్ అసిస్టెంట్లు/క్లర్క్‌లు–42, అసిస్టెంట్ మేనేజర్లు–23. ► స్టాఫ్ అసిస్టెంట్లు/క్లర్క్‌లు: అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్ నాలెడ్జ్‌తో పాటు స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ► అసిస్టెంట్ మేనేజర్లు: అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/కామర్స్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఎకనమిక్స్/స్టాటిస్టిక్స్/తత్సమాన సబ్జెక్టుల్లో పీజీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు: 01.10.2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: ఆన్లైన్ విధానంలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్షా సమయం 60 నిమిషాలు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.12.2021 ► వెబ్సైట్: nelloredccb. com -
గుమస్తా జీవుల అనర్థ బతుకులు... అల్పజీవి
మన నవలలు: ఫలానా డిగ్రీ చదువు అన్నారు. చదివాడు. ఫలానా గుమస్తా ఉద్యోగం చెయ్ అన్నారు. చేస్తున్నాడు. ఉద్యోగం కోసం చదువు. చదివేదంతా ఉద్యోగం కోసమే. కాళ్లు తీసేసి కుర్చీలో కూచోబెట్టడం ఇది. జీవితాంతం పరాన్నభుక్కును చేసేయడం. ఉద్యోగం పోతే ఇంతే సంగతులు. ఈ భయం.... భయం... భయం... నరాల్లోకి ఎక్కడిదాకా పాకిందంటే ఆఖరుకు నచ్చిన ఆడది పిలిస్తే భయపడ్తూ భయపడ్తూ వెళ్లి ఎవరైనా చూస్తారేమోనని భీతిల్లి తీరా ఆమె చేరువ అయితే బిక్కముఖం వేసి నీరుగారిపోయి.... సుబ్బయ్య కొంచెం పిరికివాడు. గుమస్తా కావడం వల్ల పిరికివాడయ్యాడా పిరికివాడు కావడం వల్లే గుమస్తా అయ్యాడా చెప్పలేం కాని మొత్తం మీద పిరికివాడు. భయపడతాడు. పెళ్లాన్ని అసేయ్ ఒసేయ్ అనడానికి భయపడతాడు. ఆఫీసులో తనని ఏడిపించిన హెడ్ క్లర్క్‌ని- ఏరా ఒళ్లు కొవ్వెక్కిందా అని ఎదిరించడానికి భయపడతాడు. కుదర్దు... ఇంతే ఇస్తా అని కూరగాయలవాడితో దెబ్బలాడ్డానికి భయపడతాడు. పిల్లల మీద చేయెత్తడానికి భయపడతాడు. లోకం మీద నోరెత్తడానికీ భయపడతాడు. అధికారం అంటే భయం. పోలీసులంటే భయం. కోర్టులంటే భయం. హాస్పిటల్స్ అన్నా భయమే. చక్కగా ఒక గుల్ల కావాలి సుబ్బయ్యకి. పొద్దున తొమ్మిదింటికి ఆఫీసుకు వెళ్లడం. గొడ్డులా చాకిరీ చేయడం. సాయంత్రం ఇంటికి తిరిగి రావడం. నిద్ర పోవడం. మళ్లీ తిరిగి ఆఫీసుకు వెళ్లడం. నెల తిరిగే సరికల్లా వచ్చిన నాలుగు డబ్బుల్తో వెచ్చాలు తెచ్చుకోవడం. గుట్టుగా సంసారం నెట్టుకురావడం. చిన్న చిన్న అవస్థలు వస్తే ఇబ్బంది పడటం. పెద్ద పెద్ద అవస్థలే దాపురిస్తే గుటుక్కుమనడం. ఒక సేఫ్ రొటీన్ జీవితం. ఇది కావాలి సుబ్బయ్యకి. దీనికి భిన్నంగా ఏది జరిగినా భయపడతాడు. హడలెత్తి పోతాడు. ఆఫీసులో బిల్స్ క్లియర్ చేసే పని అతనిది. బావమరిది ఇది గమనించాడు. ఎవరి బిల్సు క్లియర్ చేయాలో వాడి దగ్గర ఐదు వందలు అడిగి తనకు ఇమ్మన్నాడు. ఇలా చేయొచ్చా? కూడదు. కాని సుబ్బయ్యకు వేరే దారి లేదు. అడుగుతున్నది బావమరిది. అడగమన్నది కట్టుకున్న భార్య. చెప్పిన పని చేయకపోతే చేతగానివాడంటారు. సుబ్బయ్య ఐదువందలు కాంట్రాక్టర్‌ని అడిగేశాడు. చేబదులు అన్నట్టుగా అడిగాడు. కాని అది లంచం. అతడు చేబదులే అన్నట్టుగా ఇచ్చాడు. కాని అది దక్షిణ. ఇచ్చిన ఐదు వందలు బావమరిదికి అందింది. కాని, ఆ వెంటనే సెక్షన్ కూడా మారిపోయింది. మరి? తను కాకుండా వేరెవరైనా తింటుంటే హెడ్ క్లర్క్ ఊరుకుంటాడా? మార్చాడు. దక్షిణ అని ముట్టజెప్పినవాడు ఇప్పుడు కాబూలీవాలా అయ్యాడు. తన బిల్స్ క్లియర్ చేయకుండా అప్పనంగా ఐదు వందలు తీసుకుంటే ఎవరు ఊరుకుంటారు? కాని ఐదు వందలు! జీతం వందో నూటేభయ్యో ఉన్నప్పుడు ఇంటి అద్దె ఐదూ పదీ రూపాయలు ఉన్నప్పుడు పావలాకి బేడకి కావలసిన వస్తువులు దొరుకుతున్నప్పుడు ఐదువందలంటే ఎంత పెద్ద మొత్తం. ఇప్పుడు ఏం చేయాలి? సుబ్బయ్య భయపడిపోయాడు. ఇచ్చిన కాంట్రాక్టర్ దుర్మార్గుడు. పుచ్చుకున్న బావమరిది అవకాశవాది. తానేమో పిరికివాడు. ఎలా... ఎలా... ఎలా. సుబ్బయ్య వెర్రెత్తిపోయాడు. పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని ఎక్కడికని పారిపోగలడు? ఒక ఐదు వందల మొత్తం! అతడి జీవితంలోని ప్రశాంతతను అంతా సర్వనాశనం చేసేసింది. కాదు... అతడిలోని పిరికితనమే అతణ్ణి సర్వనాశనం చేసేసింది. ధైర్యంగా ఎప్పుడైనా ఉన్నాడా తను. ధైర్యంగా దేన్నయినా ఎదిరించాడా తను. ధైర్యంగా ఇది తప్పు అని వాదించాడా తను. ధైర్యం చేసి దీనిని సరి చేయాలి అని రంగంలో దిగాడా తను? లేదే. ఫలానా డిగ్రీ చదువు అన్నారు. చదివాడు. ఫలానా గుమస్తా ఉద్యోగం చెయ్ అన్నారు. చేస్తున్నాడు. ఉద్యోగం కోసం చదువు. చదివేదంతా ఉద్యోగం కోసమే. కాళ్లు తీసేసి కుర్చీలో కూచోబెట్టడం ఇది. జీవితాంతం పరాన్నభుక్కును చేసేయడం. ఉద్యోగం పోతే ఇంతే సంగతులు. గుమస్తా కాకపోతే ఇంతే సంగతులు. ఈ భయం.... భయం... భయం... నరాల్లోకి ఎక్కడిదాకా పాకిందంటే ఆఖరుకు నచ్చిన ఆడది పిలిస్తే భయపడ్తూ భయపడ్తూ వెళ్లి ఎవరైనా చూస్తారేమోనని భీతిల్లి తీరా ఆమె చేరువ అయితే బిక్కముఖం వేసి నీరుగారిపోయి.... మగాడిగా బతకడం అంటే స్త్రీ దగ్గర మగతనం ప్రదర్శించడం కాదు. అన్ని సందర్భాల్లోనూ మగాడిగా బతకడమే. సుబ్బయ్య గుమస్తా బతుకు అతణ్ణుంచి ఆ మగతనాన్ని హరించేసింది. ఇక మిగిలిందల్లా పిరికి పిప్పి. అతడేనా? దేశమంతా ఈ పిరికి పిప్పే. పెద్ద గుమాస్తాలు... చిన్న గుమస్తాలు.... కార్లూ టైలూ ఉన్న బడా గుమస్తాలు.... టెన్ టు ఫైవ్ బందీలు.... నోరెత్తకుండా పని చేసుకుపోయే కూలీలు... నవల: అల్పజీవి; రచన: రాచకొండ విశ్వనాథ శాస్త్రి తొలి ముద్రణ: 1955; రావిశాస్త్రికి విశేషమైన పేరు తెచ్చిన ఆయన తొలి నవల. జేమ్స్ జాయిస్, శ్రీశ్రీ ‘కోనేటి రావు’ పాత్రల ప్రభావంతో తాను ఈ నవల రాశానని రావిశాస్త్రి చెప్పుకున్నారు. రచనలో విశేషమైన వేగం ఆ రోజుల్లో కొత్త కావడం వల్ల కూడా దీనికి ఆదరణ లభించింది. కథ కంటే కథనమే ముఖ్యం. రాజు- మహిషి, రత్తాలు - రాంబాబు... ఆయన ఇతర నవలలు. మనసు ఫౌండేషన్ ప్రచురించిన రావి శాస్త్రి రచనలులో ఈ నవల లభ్యం. ఆ ప్రతులు దొరకని వారు జిరాక్స్ కాపీ కోసం పుస్తకాభిమాని అనిల్ బత్తులను సంప్రదించవచ్చు. ఆయన నం.9059134111 అందుకే ఒక పది మందో ఇరవై మందో కలసి ఆట ఆడిస్తుంటారు. ఓట్లు వేయకపోయావో చస్తావ్ అంటారు. చెప్పినట్టు వినకపోయావో చంపుతాన్ అంటారు. రెంటు పెంచినా, కరెంటు పెంచినా, సిలిండర్ పెంచినా, పార్కింగ్ ఫీజు పెంచినా, సినిమాహాళ్లలో నోటికొచ్చిన రేటును పెంచినా, ప్లాట్ పెంచినా, ఫ్లాట్ పెంచినా నోర్మూసుకొని ఉండాలి. రైళ్లు లేవు ఫో అంటే సణుక్కుంటూ పోవాలి. బస్సులు చంపితే ఛావ్ అంటే జీ హుజూర్ అనుకుంటూ చావాలి. అందరూ అంతే. భరించడం తప్ప మార్చడం తెలియనివారు. మార్చాలంటే లంపటంలో దిగాలి. లంపటంలో దిగితే అమ్మో.... అవతల ఆఫీసుకు వెళ్లాలి.... గుమస్తాలు! సుబ్బయ్య కూడా అలాంటి గుమాస్తానే. ఒరే కాంట్రాక్టర్ వెధవా... నీ డబ్బు నీకు తిరిగి ఇవ్వనురా అని చెప్పడం చేతగాని గుమాస్తా. చచ్చు మనిషి. చచ్చిన మనిషి. అయితే అప్పుడప్పుడు కొంత వెలుతురు వస్తుంది. కొంత మార్చ ప్రయత్నిస్తుంది. సుబ్బయ్య జీవితంలో కూడా అలాంటి వెలుతురు వచ్చింది. ఒక స్నేహితురాలు పరిచయమైంది. ఆమె అతణ్ణి ఆదరించింది. ఊరడించింది. పవిటతో నుదుటి చెమట తుడిచి కొంచెం ధైర్యంగా ఉండమని ధైర్యం చెప్పింది. కాని ధైర్యంగా ఉండటానికి సుబ్బయ్యకు ధైర్యం కావాల్సి వచ్చింది. అతడు ఆలోచిస్తూ ఉన్నాడు. అతడే కాదు దేశంలోని గుమస్తాలందరూ ఆ ధైర్యాన్ని ఇంకా అందుకోవలసి ఉంది. రావిశాస్త్రి 1953లో రాసిన నవల ‘అల్పజీవి’. పిరికితనంతో బతుకులీడ్చే మధ్యతరగతి వర్గం మీద, గుమస్తా మనస్తత్వాలతో కునారిల్లుతున్న మధ్యతరగతిలోని ప్రధాన వర్గం మీద ఆయన కొట్టిన కొరడా దెబ్బ ఇది. ఆయన బాధ ఏమిటంటే చదువుకోని వారు ఎలాగూ చస్తున్నారు. బాగా చదువుకున్నవారు లొసుగులు లోపాలను ఉపయోగించి ఎక్కడికో చేరుతున్నారు. కాని ఈ గుమస్తాలే- ఈ అపసవ్యతను తొలగించాల్సిన బాధ్యత ఉన్న ఈ గుమస్తాలే ఆ బాధ్యత నుంచి దూరంగా తొలగిపోతున్నారు. మనిషి పిరికితనం దాటాలని రావిశాస్త్రి కోరిక. ధైర్యలక్ష్మి ఉంటేనే తక్కిన లక్ష్ములన్నీ ఉంటాయని ఆయన ఈ నవలలో చెప్పదల్చుకున్నారు. లక్ష్ములు కావలసింది వ్యక్తిగతానికి కాదు. సమాజానికి. దేశానికి. ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్ అని గురజాడ అనింది అందుకే. చెహోవ్ వంటి మహా రచయిత ‘గుమస్తా మరణం’ వంటి కథలు రాసిందీ అందుకే. పిరికిగుణం ఉన్న సమాజం పైకి రాదు. పిరికి గుణం వల్లే మధ్యతరగతి పైకి రావడం లేదు. ఈ మాటను పదే పదే చెప్పడానికి ఇష్టపడ్డారు రావిశాస్త్రి. అందుకే ‘అల్పజీవి’ రాసినా అదేకథాంశాన్ని ‘వర్షం’ కథలో రిపీట్ చేశారు. చలిచీమలే కాదు గుమస్తాలు కూడా మహా సర్పాలను చంపగలవు అని ఆమ్ ఆద్మీ వంటి ఉదంతాలు ఒకటీ అరా కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి. అన్నివైపులా రాబందులను తరిమే పావురాల గుంపులు కమ్ముకోవాలి. అప్పుడే ‘అల్పజీవి’కి ధన్యత. రావి శాస్త్రి రచనకు సార్థకత. -
ఉద్యోగాలు
అభ్యుదయ సహకార బ్యాంక్‌లో క్లర్క్ పోస్టులు అభ్యుదయ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(ఏసీబీఎల్).. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు.. క్లర్క్: 125 అర్హతలు: ఏదైనా డిగ్రీతోపాటు ఆంగ్ల భాషా పరిజ్ఞానం ఉండాలి. వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్ల మధ్య.. ఎంపిక: ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా... చివరి తేది: అక్టోబర్ 19 వెబ్సైట్: www.abhyudayabank.co.in ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయం రాయ్‌పూర్‌లోని ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయం(ఐజీకేవీ).. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. పోస్టుల వివరాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్/సైంటిస్ట్: 76 అసిస్టెంట్ లైబ్రేరియన్: 9 టెక్నికల్ అసిస్టెంట్: 6 నోటిఫికేషన్లో నిర్దేశించిన విద్యార్హతలు, అనుభవం, వయోపరిమితి ఉండాలి. దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి. చివరి తేది: నవంబర్ 15 వెబ్సైట్: http://www.igau.edu.in ప్రవేశాలు ఎల్బీఎస్ఐఎంలో పీజీ డిప్లొమా న్యూఢిల్లీలోని లాల్‌బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఎల్‌బీఎస్‌ఐఎం).. కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (జనరల్/ఫైనాన్స్) అర్హత: ఏదైనా డిగ్రీ. క్యాట్-2013లో అర్హత. ఎంపిక: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా.. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా.. చివరి తేది: డిసెంబర్ 14 వెబ్సైట్: www.lbsim.ac.in