CMD Sridhar
-
సింగరేణి లాభాలు రూ.993 కోట్లు!
గోదావరిఖని: అసలే కరోనా వైరస్.. మార్చి నెల వేతనంలో 50 శాతం కోత.. పెరిగిన ఖర్చులు.. పెండింగ్ బకాయిల నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం లాభాలను సింగరేణి యాజమాన్యం ప్రకటిస్తుందా లేదా అన్న ఉత్కఠకు తెరపడింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన వాస్తవ లాభాలు ఆరు నెలల తర్వాత యాజమాన్యం తేల్చినట్లు సమాచారం. రూ.993 కోట్లు సంస్థకు లాభాలు వచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో శనివారం జరిగిన బోర్ట్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో లాభాలు తేల్చినట్లు కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. అయితే యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి సంస్థలో ఇరవై ఏళ్ల క్రితం లాభాల్లో కార్మికులకు వాటా చెల్లింపు ప్రారంభమైంది. సంస్థ నష్టాల్లో ఉన్న కాలంలో గుర్తింపు యూనియన్‌గా ఉన్న ఏఐటీయూసీ వ్యూహాత్మకంగా ముందుకెళ్లి సంస్థ సాధించిన లాభాల్లో కార్మికులకు వాటా చెల్లించేలా అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ఒప్పించింది. ఇలా 1999లో మొదలైన కార్మికుల లాభాల వాటా పంపిణీ నేటికీ కొనసాగుతోంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన వాస్తవ రూ.1,766 కోట్ల లాభాలను యాజమాన్యం ప్రకటించింది. అందులో కార్మికుల వాటా 28 శాతం వాటా చెల్లించింది. ఒక్కో కార్మికునికి సగటున రూ.లక్ష వరకు లాభాల బోనస్ అందింది. ఈసారి భారీగా తగ్గిన లాభాలు సింగరేణిలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో లాభాలు భారీగా తగ్గాయి. ఈసారి రూ.993 కోట్లుగా చెబుతున్నారు. గతేడాది ఇదే లాభాల వాటా రూ.1766 కోట్లు వచ్చాయి. దీంతో పోల్చితే సగానికి తగ్గినట్లుగా తెలుస్తోంది. కార్మికులకు చెల్లించే బోనస్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. 35 శాతం వాటాకు డిమాండ్ గతేడాది సింగరేణి సాధించిన లాభాల్లో 28 శాతం కార్మికుల వాటా యాజమాన్యం చెల్లించగా, ఈసారి 35 శాతం చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈసారి లాభాలు ఎక్కువగా వస్తాయని ఆశించారు. లాభాల వాటా ప్రకటన ముఖ్యమంత్రి పరిధిలో ఉండటంతో గుర్తింపు పొందిన యూనియన్ టీబీజీకేఎస్ నేతలు కోల్‌బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో కలసి సీఎంను కలవాలని చూస్తున్నారు. 23న లాభాల వాటా ఇప్పిస్తాం కార్మికులకు లాభాల వాటా ఈ నెల 23న ఇప్పిస్తాం. మార్చిలో నిలిపివేసిన సగం వేతనం కూడా ఇదే రోజున చెల్లించేందుకు యాజమాన్యం ఒప్పుకుంది. కోవిడ్‌తో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.15 లక్షలు ఇప్పిస్తాం. దీనికి యాజమాన్యం అంగీకరించింది. త్వరలో కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి లాభాల వాటాపై చర్చిస్తాం. – బి.వెంకట్రావ్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మార్చి వేతనంతో లాభాల వాటా చెల్లించాలి సింగరేణి లాభాల్లో ఈసారి కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలి. కోవిడ్ నేపథ్యంలో గత మార్చిలో కార్మికుల వేతనంలో కోత విధించిన 50 శాతం కూడా ఈ నెలలో చెల్లించాలి. దసరా ఆదివారం వస్తున్నందున కార్మికులు నష్టపోకుండా పండుగకు ముందే లాభాల వాటా చెల్లించేలా చూడాలి. – కెంగర్ల మల్లయ్య, బీఎంఎస్ అధ్యక్షుడు లాభాల్లో 35 శాతం వాటా చెల్లించాలి సంస్థ లాభాలు రూ.993 కోట్లుగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తేల్చిన నేపథ్యంలో అందులో కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలి. మార్చిలో కోత విధించిన 50 శాతం వేతనం కూడా లాభాల వాటాతో కలిపి ఇవ్వాలి. ఇప్పటికే లాభాల ప్రకటన ఆలస్యమైంది. కార్మికులకు ఇబ్బంది కలుగకుండా యాజమాన్యం వెంటనే చెల్లించేలా చూడాలి. -
ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భారీ నీటి జలాశయాలపై తేలియాడే (ఫ్లోటింగ్) సో లార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం చేట్టాలని యోచిస్తున్నామని సింగరేణి సంస్థ చైర్మ న్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ తెలిపారు. సింగరేణి ప్రాంతాల్లోనే కాక రాష్ట్రంలోని ఇతర భారీ జలాశయాల్లో కనీసం 500 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలా ర్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి రాష్ట్ర రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ (టీఎ స్ఆర్ఈడీ) శాఖ సహాయంతో అధ్యయనం చేసినట్లు చెప్పారు. ఇందుకు సం బంధించిన నివేదికను టీఎస్‌ఆర్‌ఈడీ అధికారులు సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో శ్రీధర్‌కు పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా వివరించారు. ఈ ప్లాంట్ నిర్మాణంతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూడాలని, నిబంధనలకు లోబడి నిర్మిం చేలా ప్రతిపాదలను సమర్పించాలని టీఎస్‌ఆర్‌ఈడీ అధికారులను సీఎండీ కోరారు. బయటి ప్రాంతాల్లో వీటి నిర్మాణం కో సం యోచిస్తున్నామని, ప్రతిపాదనలు పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి సమర్పించి, విద్యుత్ కొనుగోలు అనుమతు లు పొందిన తర్వాతనే నిర్మాణం ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. -
రిటైర్మెంట్ రోజే బెనిఫిట్స్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో రిటైౖరైన ఉద్యోగికి ఎటువంటి జాప్యం లేకుండా చివరి రోజే టర్మినల్ బెనిఫిట్స్ అందజేయాల్సి ఉందని, ఈ విషయంలో ఇంకా స్పష్టమైన ఆదేశాలిస్తామని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. సంస్థ పరిధిలోని ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడంతో పాటు 30 మంది స్పెషలిస్టు వైద్యులను ఇటీవల నియమించామని చెప్పారు. హైదరాబాద్‌లోని సింగరేణిభవన్‌లో బుధవారం గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు, అధికారుల సంఘంతో జరిగిన 36వ జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు, అధికారుల సంఘాల సూచనలపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఖాళీల భర్తీలో అర్హులైన సింగరేణి ఉద్యోగులకు 60 శాతం అవకాశం కల్పించడం, కొత్త బూట్లు, ఆర్వో మంచినీటి ప్లాంట్ల ఏర్పాటు వంటి అనేక సమస్యలపై వారంలోగా డైరెక్టర్ల స్థాయిలో చర్చించి సానుకూలంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో అద్భుత ప్రగతి ఈ ఏడాది లాభాల బోనస్ చెల్లింపుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఐదేళ్లుగా లాభాల బోనస్ ప్రకటించిన మాదిరిగానే ఈ సారి కూడా మెరుగైన స్థాయిలో ప్రకటించబడుతుందని శ్రీధర్ స్పష్టం చేశారు. దేశంలో మరే ఇతర ప్రభుత్వ సంస్థల్లో కూడా సింగరేణి స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగడం లేదని, ఇవి ఇలాగే కొనసాగించాలంటే సంస్థను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా భూగర్భ గనుల్లో నష్టాలు భారీగా తగ్గించాలని, ఓసీ గనుల్లో యంత్రాల వినియోగం, పనిగంటలు పెరగాలని సూచించారు. దీనికి కార్మిక సంఘాలు కూడా తమ వంతు బాధ్యతగా కార్మికులకు అవగాహన కలిగించాలని కోరారు. సంస్థ గత ఐదేళ్లలో అద్భుత ప్రగతిని సాధించిందనీ, రానున్న కాలంలో కూడా లక్ష్యాల మేర కంపెనీని అభివృద్ధి చేస్తే రెట్టింపు సంక్షేమ ఫలాలు అందుకోగలమని, దీనికి కార్మిక సంఘాలు, అధికారులు, సిబ్బంది సమష్టిగా కృషిచేస్తూ, సహకరించాలని కోరారు. సింగరేణి భవిష్యత్తు ప్రణాళికలను ఈ సందర్భంగా ఆయన కార్మిక నేతలకు వివరించారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకులు చేపట్టి లాభదాయక మైనింగ్ ద్వారా లాభాలను ఆర్జించడానికి పథకాలు రూపొందిస్తున్నామని చెప్పారు. రూ.50 వేల కోట్ల టర్నోవర్.. 5 వేల కోట్ల లాభాలు రానున్న ఐదారేళ్ల కాలంలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించడానికి, తద్వారా 50 వేల కోట్ల టర్నోవర్, 5 వేల కోట్ల లాభాలను ఆర్జించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, తద్వారా మహారత్న హోదా కూడా లభించి మరిన్ని మెరుగైన అభివృద్ధి అవకాశాలు పొందనున్నామని శ్రీధర్ వివరించారు. గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ప్రాతినిధ్య సంఘం అధ్యక్షుడు వై.గట్టయ్య, కార్యదర్శి ఎం.రంగయ్య, అధికారుల సంఘం అధ్యక్షుడు రమేశ్, కార్యదర్శి ఎన్.వి.రాజశేఖర్‌లు పలు అంశాలను సీఎండీ దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని హామీనిచ్చారు. సమావేశంలో సంస్థ డైరెక్టర్లు ఎస్.శంకర్, ఎస్.చంద్రశేఖర్, భాస్కర్‌రావు, బలరాం తదితరులు పాల్గొన్నారు. -
‘సింగరేణి ముందు కొత్త సవాళ్లు’
సాక్షి, హైదరాబాద్: సమీప భవిష్యత్తులో కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ శ్రీధర్ సింగరేణీయులకు పిలుపునిచ్చారు. దేశంలో ఉన్న 80 బొగ్గు బ్లాకులు మంచి లాభదాయకత కలిగి ఉన్నాయని, త్వరలో వీటి నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కానున్నదని పేర్కొన్నారు. ఈ బొగ్గు ధర తక్కువగా ఉండనుందని, దీంతో దేశీయంగా సింగరేణి వంటి సంస్థలు వీటితో గట్టి పోటీని ఎదుర్కోక తప్పదన్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి గురువారం ఆయన సంస్థ డెరైక్టర్లు, జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. -
సింగరేణికి ఏడాదికి రూ.35 వేల కోట్లు
సూపర్‌బజార్ (కొత్తగూడెం): రాబోయే ఐదు సంవత్సరాల్లో సింగరేణి సంస్థ సంవత్సరానికి రూ.35 వేల కోట్ల నికర ఆదాయం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోందని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ పేర్కొ న్నారు. ఆదివారం కొత్తగూడెం జిల్లా కేంద్రం లోని ప్రకాశం స్టేడియంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ఆయన శ్రీధర్ విలేకరులతో మాట్లాడారు. 2013 నుంచి సింగరేణి సంస్థ నికరలాభాలు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్ల లాభాలను ఆర్జించిందని చెప్పారు. 2013 – 14 ఆర్థిక సంవత్సరం నుంచి 50 మిలియన్ టన్నుల ఉత్పత్తి మైలురాయిని అధిగమిస్తూ వస్తోందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 68 మిలియన్ టన్నుల వార్షిక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. గతంలో సింగరేణి రూ.400 కోట్లకు మించి లాభాలను సాధించలేకపోయిందని, ఇప్పుడు కార్మికులు, ఉద్యోగుల సమైక్య కృషి, ప్రభుత్వ సహకారంతో రూ.1,200 కోట్ల లాభాలను ఆర్జించే స్థితికి చేరుకుందని వివరించారు. రాబోయే ఐదేళ్లలో మరో 12 గనులను కొత్తగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా 6 గనులను ప్రారంభించడానికి ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా విద్యుత్ ఉత్పత్తిలో కూడా దేశంలోనే 5వ స్థానంలో సింగరేణి సంస్థ నిలవడం తమకు గర్వంగా ఉందని చెప్పారు. -
పెద్దపల్లి: రికార్డుల ‘గని’!
సాక్షి, గోదావరిఖని(రామగుండం) : సింగరేణి సంస్థ ఒకే రోజు 2,43,731 టన్నుల బొగ్గును రవాణా చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. చరిత్రలోనే అత్యధికంగా 46 రేక్‌ల ద్వారా బొగ్గు రవాణా చేయడంతో సింగరేణి మరో ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది. ఈ నెల 27న అత్యదిక బొగ్గు రవాణాతో రికార్డు సాధించింది. విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా సంస్థ భారీగా పెంచుకుంది. సంస్థ సీఎండీ శ్రీధర్ ప్రతీవారం అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో నిర్వహిస్తున్న ఉత్పత్తి, రవాణా సమీక్షలు ఫలితాలిస్తున్నాయి. రైల్వేశాఖ వారితో నిర్వహిస్తున్న సమన్వయం ఫలితంగా తగినన్ని రేక్‌లు బొగ్గు రవాణా కోసం అందుబాటులోకి రావడంతో విద్యుత్ సంస్థలకు బొగ్గు సమకూర్చే వీలు కలిగింది. సాధారణంగా రోజుకు 30–33 రేక్‌ల బొగ్గును రవాణా చేసే కంపెనీ ఈ నెల 12న 41 రేక్‌లు, 10, 20న 42 రేక్‌లు, 22న 43 రేక్‌లు, 24న 44 రేక్‌లు, 27న అత్యధికంగా 46 రేక్‌ల బొగ్గు రవాణా చేయడం విశేషం. సింగరేణిలోని అన్ని ఏరియాల్లోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ద్వారా 27న పెద్దఎత్తున బొగ్గు రవాణా జరిగింది. అత్యధికంగా 10 రేక్‌లను కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ సీహెచ్‌పీ నుంచి రవాణా చేశారు. మణుగూర్ కొండాపురం సీహెచ్‌పీ నుంచి ఆరు రేక్‌లు, రామగుండం–2 నుంచి ఆరు రేక్‌లు, ఇల్లందు నుంచి ఆరు రేక్‌లు, బెల్లంపల్లి నుంచి ఆరు రేక్‌లు, రామగుండం–1 నుంచి నాలుగు రేక్‌లు, శ్రీరాంపూర్ నుంచి నాలుగు రేక్‌లు, మందమర్రి నుంచి నాలుగు రేక్‌లతో బొగ్గు రవాణా చేశారు. 27న రవాణా అయిన రేక్‌లలో తెలంగాణ జెన్కోకు చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అత్యధికంగా 12 రేక్‌లు, ఏపీ జెన్కో విద్యుత్ కేంద్రాలైన ఆర్టీపీఎం, వీటీపీఎస్‌లకు ఆరు రేక్‌లు, కర్నాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన మూడు విద్యుత్ కేంద్రాలకు ఐదు రేక్‌లు, మహారాష్ట్ర జెన్కోకు అనుబంధంగా ఉన్న పర్లి, కొరాడి, పరాస్, భూసాలి, చాపూర్ విద్యుత్ కేంద్రాలకు ఎనిమిది రేక్‌లు, ఎన్టీపీసీ రామగుండం, కుడ్గి, శోలాపూర్, మౌదా, సింహాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఆరు రేక్‌లు, ఎన్టీపీసీ (జేవీసీ)కి చెందిన మూడు కేంద్రాలకు ఒక రేక్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (జైపూర్)కు రెండు రేక్‌లు, సిమెంట్ తదితర పరిశ్రమలకు కలిపి ఆరు రేక్‌ల బొగ్గును ఒక్క రోజునే సరఫరా చేసింది కంపెనీ. విద్యుత్ కేంద్రాల్లో తగితనంత నిల్వలు.. సింగరేణితో ఇంధన సరఫరా ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని విద్యుత్ కేంద్రాలకు సింగరేణి సంస్థ క్రమం తప్పకుండా బొగ్గు సరఫరా చేస్తోంది. విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి అందుకు తగినంత బొగ్గును ఉత్పత్తి చేసి రవాణా చేస్తోంది. ఈ నేపథ్యంలో గరిష్ట విద్యుత్ వినియోగం ఉంటున్న తెలంగాణ విద్యుత్ కేంద్రాల్లో తగినంత బొగ్గు నిల్వలు ఉండేలా బొగ్గు రవాణా జరుపుతోంది. కనుక బొగ్గు కొతర లేకుండా విద్యుత్ ఉత్పత్తి సజావుగా కొనసాగుతోంది. మహారాష్ట్ర అభ్యర్థనపై... ఇటీవల మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి స్వయంగా సింగరేణి యాజమాన్యంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పెరిగిన విద్యుత్ వాడకం రిత్యా అదనంగా నాలుగు రేక్‌ల బొగ్గు సరఫరా చేయాలని కోరగా, సింగరేణి తక్షణమే స్పందించి ఈనెల 27న ఎనిమిది రేక్‌ల బొగ్గు సరఫరా చేసింది. సీఎండీ అభినందనలు.. రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా చేసిన అన్ని ఏరియాల ఉద్యోగులు, అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బందికి సీఎండీ శ్రీధర్ అభినందనలు తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాల రీత్యా బొగ్గు ఉత్పత్తి రవాణాను మరింతగా పెంచాలని, ఇదే ఒరవడితో పనిచేస్తూ లక్ష్యాలు దాటి ముందుకు పోవాలని కోరారు. -
సింగరేణి లాభాలు రూ.1,212 కోట్లు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ 2017–18లో రూ.1,212 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. అన్ని రకాల పన్నుల చెల్లింపుల తర్వాత ఈ మేరకు లాభాలు మిగిలాయన్నారు. 2016–17లో ఆర్జించిన రూ.395 కోట్ల లాభాలతో పోల్చితే గతేడాది 207 శాతం అధిక లాభాలను సంస్థ ఆర్జించిందని చెప్పారు. సింగరేణి భవన్లో బుధవారం నిర్వహించిన సంస్థ బోర్డు సమావేశంలో రూ.1,212 కోట్ల లాభాలను ఆమోదించామన్నారు. లాభాల్లో కార్మికుల వాటాను త్వరలో బోనస్‌గా చెల్లిస్తామని వెల్లడించారు. దీని గురించి సీఎం కేసీఆర్‌ను సంప్రదించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు. కార్మికులు, అధికారులు, సూపర్వైజరీ సిబ్బంది సమష్టి కృషి ఫలితంగా సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా లాభాలు సాధించగలిగామన్నారు. ఇదే ఒరవడిని ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగించాలని కోరారు. కార్మికులకు లాభాల్లో మంచి వాటాతో పాటు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు రూ.60 కోట్ల నిధులతో సింగరేణి వ్యాప్తంగా కార్మిక కాలనీల్లోని నివాస గృహాలన్నింటికీ ఏసీ కనెక్షన్లు జారీ చేయాలనే ప్రతిపాదనలను ఆమోదించినట్లు తెలిపారు. వివిధ ఓపెన్ కాస్ట్, భూగర్భ గనులకు సంబంధించిన పనులు, కొనుగోలు తదితర అంశాలకు అనుమతులకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా ఈ సమావేశంలో ఆమోదించారు. -
సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు ‘గ్లోబల్’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా సింగరేణి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎండీ శ్రీధర్‌కు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ ‘ఔట్ స్టాండింగ్ గ్లోబల్ లీడర్షిప్’ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఎకనామిక్ సమ్మిట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంగీతాసింగ్ శ్రీధర్‌కు లేఖ రాశారు. 28న దుబాయిలో జరగనున్న గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్‌లో అవార్డు, సింగరేణి సంస్థకు గోల్డ్ మెడల్ అందించనున్నారు. అవార్డు ప్రకటించడం పట్ల శ్రీధర్ సంతోషం వ్యక్తం చేశారు. -
కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం
► సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ఆదేశించిన పీయుష్ గోయల్ న్యూఢిల్లీ: సింగరేణి క్వారీల్లో పనిచేస్తున్న సుమారు 25 వేలమంది కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం, బోనస్, కుటుంబానికి వైద్య సదుపాయాలు అందేలా చూడాలని సంస్థ సీఎండీ శ్రీధర్‌ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఆదేశించారు. కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర నేతలు గోవర్ధన్‌రెడ్డి, బాలరాజ్, కీర్తిరెడ్డి తదితరులు బుధవారం కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్టు కార్మికులు ఏళ్లుగా పనిచేస్తున్నా వారికి కనీస వేతనం అమలు చేయడం లేదని, బోనస్ అందడం లేదని, వైద్య సదుపాయంకూడా కార్మికులకు మాత్రమే అమలు చేస్తున్నారని, వారి కుటుంబ సభ్యులకు అమలు చేయడం లేదని కేంద్ర మంత్రికి వివరించారు. దీంతో వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి సింగరేణి సీఎండీ శ్రీధర్‌తో ఫోన్లో మాట్లాడి కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు కనీస వేతనాలు అమలు చేయాలని, బోనస్, ఇతర వైద్య సదుపాయాలను కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రి తీసుకున్న చొరవపై రాష్ట్ర బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టడం లేదు.. రాష్ట్రంలో కనీస వేతనాలు అందక కార్మికులు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని విలేకరులతో మాట్లాడుతూ లక్ష్మణ్ మండిపడ్డారు. కనీస వేతనం అమలు చేయాలన్న హైపవర్ కమిటీ సిఫార్సులను ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌కు వ్యతిరేకం అని చెప్పిన టీఆర్ఎస్.. ఇప్పుడు భూపాలపల్లిలో జనావాసాల మధ్య ఓపెన్‌కాస్ట్ మైనింగ్ చేపట్టేందుకు పూనుకుందని మండిపడ్డారు. కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్కు తగిన సమయంలో కార్మిక లోకం బుద్ధి చెబుతుందని ఆయన హెచ్చరించారు. -
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన సింగరేణి
గోదావరిఖని : సింగరేణి సంస్థ 2014-15 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన అంతర్గత 52.50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించింది. కేంద్ర ప్రభుత్వం 55 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా, దానిని సాధించే అవకాశాలు లేకపోవడంతో సింగరేణి సంస్థ 52.50 మిలియన్ టన్నుల అంతర్గత ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని అధిగమించింది. మార్చి 31వ తేదీ నాటికి 52.53 మిలియన్ టన్నులను వెలికితీసి లక్ష్యాన్ని దాటింది. సింగరేణి గనుల్లో భాగంగా వున్న 11 డివిజన్లలో కొత్తగూడెం 134 శాతం, మణుగూర్ 122 శాతం, రామగుండం-3 118 శాతం, శ్రీరాంపూర్ 104 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించాయి. రామగుండం-1 డివిజన్ 96 శాతం, రామగుండం-2 డివిజన్ 84 శాతం, భూపాలపల్లి 89 శాతం, బెల్లంపల్లి 69 శాతం, మందమర్రి 78 శాతం, ఇల్లెందు 94 శాతం, అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు 30 శాతం బొగ్గును వెలికితీశాయి. 2015-16లో 60.03 మిలియన్ టన్నుల లక్ష్యం సింగరేణి సంస్థ ఏటా 10 శాతం బొగ్గు ఉత్పత్తిని పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా 2015-16 ఆర్థిక సంవత్సరంలో 60.03 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఏప్రిల్ నుంచే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించే దిశగా అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సీఎండీ శ్రీధర్ ఆదేశించినట్లు సమాచారం. -
సింగరేణి ఉత్తములు వీరే
కొత్తగూడెం(ఖమ్మం): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణిలో పనిచేస్తున్న అధికారులు, కార్మికుల్లో ఉత్తములను ఎంపిక చేశారు. ఈ మేరకు ఎంపికైన ఉత్తములను ఈనెల 26న కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరిగే గణతంత్ర వేడుకల్లో సీఎండీ శ్రీధర్ ఘనంగా సన్మానించనున్నారు. కాగా, పర్యావరణ అవగాహన వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో పర్యావరణ హిత చర్యలు చేపడుతున్న ఓపెన్‌కాస్టులను, కోల్ హాండ్లింగ్ ప్లాంట్లను ఎంపిక చేశారు. ఇందులో ఓపెన్‌కాస్టుల విభాగంలో మొదటి బహుమతి రామగుండం ఓపెన్‌కాస్ట్-1కు, రెండో బహుమతి జేవీఆర్ ఓసీ వచ్చింది. కోల్ హాండ్లింగ్ ప్లాంట్ల విభాగంలో ఆర్జీ-1 కోల్ హాండ్లింగ్ ప్లాంట్ బహుమతులు గెలుచుకున్నాయి. ఉత్తమ అధికారులు.. 1. కె.నాగయ్య, డీవైజీఎం (సేఫ్టీ), భూపాలపల్లి 2. కె.సోమశేఖరరావు, ఎస్ఈ (ఈఅండ్ఎం), అడ్రియాల ప్రాజెక్ట్, రామగుండం-3 3. ఏవీ.రాంరెడ్డి, డీవైఎస్ఈ (ఈఅండ్ఎం), ఏరియా వర్క్‌షాప్, రామగుండం-2 4. ఎస్.నారాయణమూర్తి, ఎస్ఈ (ఈఅండ్ఎం), గోదావరిఖని 11 ఇన్‌క్లైన్, ఆర్జీ-1 5. మదార్‌సాహెబ్, సేఫ్టీ ఆఫీసర్, ఖైరగూడ ఓపెన్‌కాస్టు, బెల్లంపల్లి 6. గొట్టిముక్కల శంకర్, డిప్యూటీ మేనేజర్, కేకే-5 ఇన్‌క్లైన్, మందమర్రి 7. ఎ.నెహ్రూ, డిప్యూటీ మేనేజర్, ఆర్కే న్యూటేక్ మైన్, శ్రీరాంపూర్ 8. కె.సుదర్శన్‌రెడ్డి, డిప్యూటీ ఎస్ఈ (ఈఅండ్ఎం), పీకే ఓసీ-2, మణుగూరు 9. ఎం.కోటేశ్వర్రావు, ఎస్ఈ (ఎస్‌ఎంఎంసీ), కోయగూడెం ఓసీ, ఇల్లందు 10. ఏఎల్ఎస్వీ. సునీల్‌వర్మ, డిప్యూటీ మేనేజర్, వీకే-7 ఇన్‌క్లైన్, కొత్తగూడెం 11. ఎన్.చిట్టిబాబు, డిప్యూటీ జనరల్ మనేజర్, రిక్రూట్‌మెంట్‌సెల్, కార్పొరేట్ ఉత్తమ సింగరేణియన్లు... 1. గందె శ్రీధర్, ఫిట్టర్, కేటీకేలాంగ్వాల్, భూపాలపల్లి ఏరియా 2. ఎం.కొండల్రావు, ఈపి ఆపరేటర్, ఓపెన్‌కాస్టు-2, ఆర్జీ-3 3. కందుల లచ్చులు, సీనియర్ రూఫ్ బోల్టర్, వకీల్‌పల్లి మైన్, ఆర్జీ-2 4. కె.దేవల్రెడ్డి, సపోర్ట్‌మెన్, జీడీకే-11 ఇన్‌క్లైన్, ఆర్జీ-1 5. తండూరి మొండయ్య, ఎస్డీఎల్ ఆపరేటర్, గోలేటి-1 ఇన్‌క్లైన్, బెల్లంపల్లి 6. ఎండీ.మొగల్సాబ్, కోల్‌కట్టర్, ఆర్కె.-1 ఇన్‌క్లైన్, మందమర్రి 7. తుండ్ల వైకుంఠం, షేరర్ ఆపరేటర్, ఆర్కే న్యూటెక్ ఇన్‌క్లైన్, శ్రీరాంపూర్ 8. హరీంద్రపాల్సింగ్, ఈపీ.ఆపరేటర్, పీకేఓసీ సెక్టార్-2, మణుగూరు 9. లింగాల ఆదాం, ఈపీ ఆపరేటర్, జేకే ఓసీ-5, ఇల్లందు 10. రాంజీవన్ పస్సీ, ఎస్డీఎల్/ఎల్‌హెచ్‌డీ ఆపరేటర్, జీకే ఓసీ, కొత్తగూడెం 11. ఎల్.బాలకోటిరెడ్డి, జనరల్ మేనేజర్ (ఈఅండ్ఎం), ఓసీ అండ్ సీహెచ్‌పీ, కార్పొరేట్