
సాక్షి, హైదరాబాద్: సమీప భవిష్యత్తులో కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ శ్రీధర్ సింగరేణీయులకు పిలుపునిచ్చారు. దేశంలో ఉన్న 80 బొగ్గు బ్లాకులు మంచి లాభదాయకత కలిగి ఉన్నాయని, త్వరలో వీటి నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కానున్నదని పేర్కొన్నారు. ఈ బొగ్గు ధర తక్కువగా ఉండనుందని, దీంతో దేశీయంగా సింగరేణి వంటి సంస్థలు వీటితో గట్టి పోటీని ఎదుర్కోక తప్పదన్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి గురువారం ఆయన సంస్థ డెరైక్టర్లు, జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.