Co-branded credit card
-
అదానీ వారి క్రెడిట్ కార్డు.. అదిరిపోయే బెనిఫిట్స్!
అదానీ గ్రూప్‌కు చెందిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ అదానీ వన్ (Adani One).. ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి ఎయిర్పోర్ట్ -లింక్డ్ ప్రయోజనాలతో దేశీయ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టింది. అదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్, అదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ అనే రెండు ఆప్షన్లలో ఈ క్రెడిట్ కార్డు అందుబాటులో ఉంది.ఫీజు వివరాలుఅదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు వార్షిక ఛార్జీ రూ .5,000. దీనికి జాయినింగ్ బెనిఫిట్స్ రూ .9,000 ఉంటాయి. అలాగే అదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డు వార్షిక ధర రూ .750 కాగా జాయినింగ్ బెనిఫిట్స్ రూ .5,000.ప్రయోజనాలు (అపరిమిత అదానీ రివార్డు పాయింట్లు)అదానీ వన్, విమానాశ్రయాలు, గ్యాస్, విద్యుత్, ట్రైన్‌మ్యాన్ సహా అదానీ సంస్థలలో 7 శాతం వరకు తగ్గింపు.ఇతర స్థానిక, విదేశీ ఖర్చులపై 2 శాతం వరకు తగ్గింపుఎయిర్పోర్ట్ బెనిఫిట్స్ ప్రీమియం లాంజ్ లతో సహా దేశీయ లాంజ్ లకు సంవత్సరానికి 16 వరకు యాక్సెస్లుసంవత్సరానికి రెండు వరకు ఇంటర్నేషనల్ లాంజ్ విజిట్లు8 వరకు వాలెట్, ప్రీమియం ఆటోమొబైల్ పార్కింగ్ స్థలాలకు యాక్సెస్లుఇతర ప్రయోజనాలువిమానాలు, హోటళ్లు, విహార యాత్రలకు కూపన్లతో సహా రూ.9,000 వరకు వెల్మమ్ బెనిఫిట్.సినిమా టిక్కెట్లు ఒకటి కొంటే ఒకటి ఉచితం1 శాతం ఇంధన సర్ ఛార్జీ రద్దుఅదానీ వన్ రివార్డ్స్ అల్ట్రా లాయల్టీ స్కీమ్ కు ఎక్స్‌క్లూజివ్ యాక్సెస్ -
రిలయన్స్-ఎస్బీఐ క్రెడిట్ కార్డు.. రివార్డు పాయింట్లు, డిస్కౌంట్లు!
ముంబై: రిటైల్ దిగ్గజం రిలయన్స్ రిటైల్, ఎస్బీఐ కార్డు చేతులు కలిపాయి. తాజాగా రిలయన్స్ ఎస్బీఐ కార్డు పేరిట కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఆవిష్కరించాయి. దీనితో రిలయన్స్ రిటైల్ స్టోర్స్‌లో జరిపే కొనుగోళ్లపై రివార్డు పాయింట్లు, డిస్కౌంట్లు వంటి ప్రయోజనాలు పొందవచ్చని సంస్థ డైరెక్టర్ వి. సుబ్రమణియం తెలిపారు. అటు ఎస్బీఐ కార్డు అందించే ప్రత్యేక ఆఫర్లను కూడా అందుకోవచ్చు. వినియోగాన్ని బట్టి రెన్యువల్ ఫీజు నుంచి మినహాయింపు, రిలయన్స్ రిటైల్ వోచర్లు మొదలైనవి ఈ ప్రయోజనాల్లో ఉంటాయి. ఈ కార్డు రెండు వేరియంట్లలో (రిలయన్స్ ఎస్బీఐ కార్డు, రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్) లభిస్తుంది. వార్షిక రెన్యువల్ ఫీజు విషయానికొస్తే ప్రైమ్ కార్డుకి రూ. 2,999 గాను, రిలయన్స్ ఎస్బీఐ కార్డుకి రూ. 499 (పన్నులు అదనం) వర్తిస్తాయి. ప్రైమ్ కార్డుపై ఏటా రూ. 3,00,000 పైగా, రిలయన్స్ ఎస్బీఐ కార్డుపై రూ. 1,00,000 పైగా ఖర్చు చేస్తే రెన్యువల్ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. -
హెచ్డీఎఫ్సీ ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ క్రెడిట్ కార్డ్: ఈ ఆఫర్లు తెలుసా మీకు?
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఫ్లిప్ కార్ట్ హోల్‌సేల్ కలసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ను విడుదల చేశాయి. ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఈ కార్డ్‌ను తీసుకొచ్చాయి. డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నెట్‌వర్క్‌పై ఈ కార్డు పనిచేస్తుంది. 200కు పైగా దేశాల్లో ఈ కార్డ్ పనిచేస్తుందని ఇరు సంస్థలు తెలిపాయి. ఫ్లిప్ కార్ట్ హోల్‌సేల్ సభ్యులు (కిరాణా వర్తకులు).. ఈ క్రో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌తో ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ ప్లాట్‌ఫామ్‌పై చేసే వ్యయంలో 5 శాతం క్యాష్ బ్యాంక్‌గా పొందొచ్చు. యాక్టివేషన్ క్యాష్ బ్యాక్ కింద రూ.1,500ను ఆఫర్ చేస్తున్నాయి. జాయినింగ్ ఫీజు లేదు. యుటిలిటీ బిల్లులు, ఇతర వ్యయాలపై అదనపు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇవీ చదవండి: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బంపర్ ఆఫర్: నథింగ్(1) ఫోన్‌పై రూ. 30వేలు తగ్గింపు ‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా! -
వాల్‌మార్ట్‌తో కలిసి... హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెచ్డీఎఫ్సీ భాగస్వామ్యంతో వాల్మార్డ్ ఇండియా తన కస్టమర్ల కోసం కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను విడుదల చేసింది. వాల్‌మార్ట్ తాలూకు బెస్ట్‌ప్రైస్ హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ స్టోర్ల సభ్యుల కోసం ఈ కార్డులను విడుదల చేస్తున్నట్లు వాల్‌మార్ట్ ఇండియా సీఈఓ క్రిష్ అయ్యర్ చెప్పారు. వీటితో కస్టమర్లకు 18– 50 రోజుల ఫ్రీ క్రెడిట్ లభిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా బెస్ట్‌ప్రైస్‌లో రిజిస్టరైన సభ్యులు ఈ కార్డులకు అర్హులని తెలియజేశారు. రెండు రకాల క్రెడిట్ కార్డులు (బెస్ట్‌ప్రైస్ సేవ్స్మార్ట్, బెస్ట్‌ప్రైస్ సేవ్ మాక్స్) అందుబాటులో ఉంటాయని, బీ2బీ కస్టమర్లు తమ కొనుగోళ్లకు అనుగుణమైన కార్డును ఎంచుకోవచ్చునని చెప్పారాయన. ఈ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపితే క్యాష్‌బ్యాక్, రివార్డు పాయింట్ల లాంటి పలు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలుంటాయన్నారు. త్వరలో కర్నూలు, తిరుపతిల్లో బెస్ట్‌ప్రైస్ దుకాణాలు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా క్రిష్ అయ్యర్ చెప్పారు. ఎకానమీలో మందగమనం త్వరలో సమసిపోతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని బెస్ట్‌ప్రైస్ స్టోర్లలో ఈ కార్డులను అందుబాటులోకి తెస్తామన్నారు. సిబిల్ స్కోరుతో సంబంధం లేకుండా బెస్ట్‌ప్రైస్‌లో కస్టమర్లు జరిపిన లావాదేవీలను మదింపు చేసి కార్డులు జారీ చేస్తామని కార్యక్రమంలో పాల్గొన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు పేమెంట్స్ బిజినెస్ విభాగం కంట్రీ హెడ్ పరాగ్ రావ్ చెప్పారు. ఈ కార్డుల వార్షిక ఫీజు రూ. 500– 1000 మధ్యలో ఉంటుందన్నారు. ‘‘సేవ్స్మార్ట్ కార్డుతో దాదాపు ఏటా రూ.14,250 మేర, మాక్స్ కార్డుతో ఏటా దాదాపు రూ.40,247 మేర సభ్యులు ఆదా చేసుకోవచ్చు. ఎస్ఎంఈ విభాగం దేశీయ ఎకానమీకి వెన్నెముక. ఈ విభాగానికి చేయూతనిచ్చే దిశగా ఈ కార్డులను తీసుకొచ్చాం’’ అని వివరించారు. ఎకానమీలో మందగమనం పూర్తిగా పోతుందనే సంకేతాలున్నాయని, ఇకపై రికవరీ చూడవచ్చని అంచనా వేశారు. కార్యక్రమంలో డైనర్స్ క్లబ్ ప్రతినిధి యానీ జాంగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫెడరల్, ఎస్బీఐ కార్డ్‌ల కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్‌లు సంయుక్తంగా కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ఆవిష్కరించాయి. ఫెడరల్ బ్యాంక్ ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డు పరిమితి రూ.5 లక్షలు. ఈ కార్డు ప్రత్యేకంగా ఇంధన, భోజన పేమెంట్స్‌పై పలు రాయితీలను వినియోగదారులకు అందిస్తుందని ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాస్ అన్నారు. గోల్డ్ క్రెడిట్ కార్డు పరిమితి రూ.1.75 ల క్షలు.