
ముంబై: రిటైల్ దిగ్గజం రిలయన్స్ రిటైల్, ఎస్‌బీఐ కార్డు చేతులు కలిపాయి. తాజాగా రిలయన్స్ ఎస్‌బీఐ కార్డు పేరిట కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఆవిష్కరించాయి. దీనితో రిలయన్స్ రిటైల్ స్టోర్స్‌లో జరిపే కొనుగోళ్లపై రివార్డు పాయింట్లు, డిస్కౌంట్లు వంటి ప్రయోజనాలు పొందవచ్చని సంస్థ డైరెక్టర్ వి. సుబ్రమణియం తెలిపారు.
అటు ఎస్‌బీఐ కార్డు అందించే ప్రత్యేక ఆఫర్లను కూడా అందుకోవచ్చు. వినియోగాన్ని బట్టి రెన్యువల్ ఫీజు నుంచి మినహాయింపు, రిలయన్స్ రిటైల్ వోచర్లు మొదలైనవి ఈ ప్రయోజనాల్లో ఉంటాయి. ఈ కార్డు రెండు వేరియంట్లలో (రిలయన్స్ ఎస్‌బీఐ కార్డు, రిలయన్స్ ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్) లభిస్తుంది.
వార్షిక రెన్యువల్ ఫీజు విషయానికొస్తే ప్రైమ్ కార్డుకి రూ. 2,999 గాను, రిలయన్స్ ఎస్‌బీఐ కార్డుకి రూ. 499 (పన్నులు అదనం) వర్తిస్తాయి. ప్రైమ్ కార్డుపై ఏటా రూ. 3,00,000 పైగా, రిలయన్స్ ఎస్‌బీఐ కార్డుపై రూ. 1,00,000 పైగా ఖర్చు చేస్తే రెన్యువల్ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment