Coach Gopichand
-
నాపై బాధ్యత మరింత పెరిగింది!
ఇంకా శ్రమించాల్సి ఉంది బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ముంబై: ఒలింపిక్స్‌లో పతకం సాధించడంతో తనపై అంచనాలు ఎక్కువయ్యాయని, ఇక ముందు మరింతా బాగా ఆడాల్సి ఉంటుందని స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వ్యాఖ్యానించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలిసారి పతకం సాధించినప్పుడు ప్రపంచం తనను గుర్తించిందని, ఇప్పుడు ఒలింపిక్స్‌తో అందరికీ చేరువయ్యానని ఆమె చెప్పింది. సింధుకు గత ఆరేళ్లుగా అండగా నిలిచిన ఎన్జీఓ ఒలింపిక్ గోల్డ్‌క్వెస్ట్ (ఓజీక్యూ) బుధవారం ఆమెను ఘనంగా సన్మానించింది. ‘భవిష్యత్తులో అందరి దృష్టి నాపైన ఉంటుంది. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. నా ఘనతల పట్ల సంతోషంగా ఉన్నాను. ప్రపంచ చాంపియన్‌షిప్‌తో పోలిస్తే ఈ పతకం విలువ చాలా ఎక్కువ. ఓజీక్యూ ఇచ్చిన సహకారంతోనే నా తొలి టైటిల్ మాల్దీవ్‌స ఇంటర్నేషనల్ గెలవగలిగా‘ అని సింధు చెప్పింది. ఈ కార్యక్రమంలో కోచ్ గోపీచంద్‌తో పాటు సింధు తల్లిదండ్రులు రమణ, విజయలను కూడా సత్కరించారు. -
సింధు,కోచ్ గోపితో శేఖర్ గుప్త స్పెషల్ ఇంటర్వ్యూ
-
మరిన్ని విజయాలు సాధిస్తా: సింధు
బ్యాడ్మింటన్ స్టార్ సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సన్మానం * కోచ్ పుల్లెల గోపీచంద్‌కు కూడా * నగదు ప్రోత్సాహకాలు అందజేత విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు గ్రూప్-1 ఉద్యోగం ప్రకటించినప్పటికీ... ఇప్పట్లో తనకు ఉద్యోగం చేసే ఉద్దేశం లేదని... భవిష్యత్‌లో దేశానికి మరిన్ని విజయాలు, పతకాలు అందించాలనే లక్ష్యంపైనే దృష్టి సారించినట్లు బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు తెలిపింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన 21 ఏళ్ల ఈ తెలుగు తేజం... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పౌర సన్మానం కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం తన కోచ్ పుల్లెల గోపీచంద్, తల్లిదండ్రులు పీవీ రమణ, విజయలతో కలిసి విజయవాడకు వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘అందరికీ నమస్కారం, ఇంత మంది నాకోసం వస్తారని ఎన్నడూ ఊహించలేదు. మా తాతగారిది ఈ ఊరే. చిన్నప్పుడు వచ్చిన ప్రతిసారీ అప్పట్లో గోపీచంద్ బ్యాడ్మింటన్ ఆడుతుంటే చూశాను. ఆయన ఆటతో స్ఫూర్తి పొందాను. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధిస్తా. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి మీ ప్రార్థనలు, కోచ్ గోపీచంద్, నా తల్లిదండ్రులే ప్రధాన కారణం’ అని సింధు వ్యాఖ్యానించింది. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సింధు కలిసి కాసేపు సరదాగా బ్యాడ్మింటన్ ఆడారు. అనంతరం సింధుతోపాటు గోపీచంద్, శ్రీకాంత్, చెస్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, ధ్యాన్‌చంద్ అవార్డుకు ఎంపికైన మాజీ అథ్లెట్ సత్తి గీతను సన్మానించారు. అనంతరం రాత్రి కృష్ణా పుష్కరాల ముగింపు ఉత్సవంలో పాల్గొన్న సింధు, గోపీచంద్‌లతోపాటు మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్‌లకు చంద్రబాబు చెక్‌లు అందజేశారు. సింధుకు రూ. 3 కోట్లు... వెయ్యి గజాల స్థలం పత్రాలు... గోపీచంద్‌కు రూ. 50 లక్షలు... శ్రీకాంత్‌కు రూ. 25 లక్షలు అందజేశారు. ఏసీఏ నజరానా రూ. 25 లక్షలు... రజత పతక విజేత సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్‌కు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) నజరానా ప్రకటించింది. సింధు కు రూ.25 లక్షలు... కోచ్ గోపీచంద్‌కు రూ. 10 లక్షలు నజరానా ప్రకటించింది. ఏసీఏ తరఫున వీరిద్దరికీ బీసీసీఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు చెక్‌లు అందజేశారు. అంతకుముందు సింధును, ఆమె తల్లిదండ్రులు రమణ, విజయలను ఆంధ్రప్రదేశ్ క్రీడా సంఘాలు భారీ గజమాలతో సన్మానించాయి. సింధును ఆదర్శంగా తీసుకోవాలి.... క్రమశిక్షణతోనే ఉన్నత స్థాయికి చేరుకుంటార నడానికి సింధునే ఆదర్శమని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. స్థానిక విజయవాడ క్లబ్లో క్లబ్ ఆధ్వర్యంలో సింధును మంగళవారం ఘనంగా సన్మానించారు. సింధు దేశానికే గర్వకారణమన్నారు. సింధుతోపాటు ఆమె కోచ్ గోపీచంద్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి కేసీహెచ్ పున్నయ్య చౌదరి, క్లబ్ ప్రతినిధులు, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ వై.రాజారావు తదితరులు పాల్గొన్నారు. రూ. 50 లక్షల విలువ చేసే స్థలం...: ఫ్యూచరాల్ హోమ్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ సింధుకు రూ. 50 లక్షలు విలువచేసే స్థలాన్ని బహూకరించింది. విజయవాడ క్లబ్లో మంగళవారం జరిగిన సన్మాన కార్యక్రమంలో సంస్థ ఎండీ చింతా రవికుమార్ స్థల రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. మల్లీశ్వరి సన్మానంతో స్ఫూర్తి పొందా: కోచ్ గోపీచంద్ సిడ్నీ ఒలింపిక్స్‌లో (2000లో) ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించినప్పుడు ఆనాడు ప్రభుత్వం చేసిన సన్మానంతోనే తాను స్ఫూర్తి పొందినట్లు కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. సింధు విజయోత్సవ సభలో గోపీచంద్ చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ.... ఆనాడు కరణం మల్లీశ్వరికి ఎల్బీ స్టేడియంలో చేసిన సన్మాన కార్యక్రమంలో గ్యాలరీలో ఒకరిగా కూర్చొన్నానని తెలిపాడు. తాను కూడా ఎప్పటికైనా ఇలాంటి సన్మానం చేయించుకోవాలని కలలు కన్నట్లు తెలిపాడు. ఆ కలను సాకారం చేసుకొని ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్‌లో చాంపియన్‌గా నిలిచాక సీఎం చంద్రబాబుతో సన్మానం చేయించుకున్నాను. అలాగే ఈ సన్మాన కార్యక్రమం ఎందరికో స్ఫూర్తిగా నిలవాలన్నాడు. సింధు ఒలింపిక్స్‌లో పతకం సాధించడంతో ఆమెతోపాటు తనకు కూడా సన్మానం చేయడం గర్వంగా అనిపిస్తోందన్నాడు. -
అత్యుత్తమ దశలో ఉన్నాను: కశ్యప్
న్యూఢిల్లీ : తన కెరీర్లోనే ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉన్నానని... ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్ నుంచి పతకంతో తిరిగి వస్తానని భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం నెల రోజులపాటు తీవ్రంగా శ్రమించాను. నా కష్టానికి తగ్గ ఫలితం ఈసారి వస్తుందని భావిస్తున్నాను. నా ఆటతీరుతో కోచ్ గోపీచంద్ సంతృప్తిగా ఉన్నారు. నా కెరీర్లోనే ఇపుడు నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తున్నాను’ అని ఈ హైదరాబాద్ ప్లేయర్ వ్యాఖ్యానించాడు. ‘ప్రపంచ చాంపియన్‌షిప్‌లాంటి మెగా ఈవెంట్లో అందరూ గట్టి ప్రత్యర్థులే ఉంటారు. మూడో రౌండ్లో నాకు కెంటో మొమోటా ఎదురయ్యే అవకాశముంది. సింగపూర్, ఇండోనేసియా ఓపెన్ టైటిల్స్ సాధించిన అతను ప్రస్తుతం గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. నావరకైతే కఠినమైన ‘డ్రా’నే ఎదురైంది’ అని కశ్యప్ అన్నాడు. -
జ్వాల హద్దులు దాటుతోంది!
- స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆగ్రహం - గోపీపై విమర్శలు అర్థరహితమన్న ‘సాయ్’ డెరైక్టర్ బెంగళూరు: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఇటీవల తరచుగా కోచ్ గోపీచంద్‌తో పాటు క్రీడా శాఖ అధికారులపై చేస్తున్న విమర్శలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు ఆగ్రహం తెప్పించాయి. తాము అందరు అథ్లెట్లను సమానంగానే చూస్తామని, జ్వాల వ్యాఖ్యలు క్రమశిక్షణా రాహిత్యమని ‘సాయ్’ డెరైక్టర్ జనరల్ ఇంజేటి శ్రీనివాస్ అన్నారు. ‘అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్లను టోర్నీలకు పంపించడంలో గానీ శిక్షణ ఇవ్వడంలో గానీ మేం ఎలాంటి వివక్షా చూపించలేదు. అందరు అథ్లెట్లను ఒకేలా చూశాం’ అని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. గోపీచంద్ మద్దతిచ్చారు భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌పై జ్వాల చేస్తున్న విమర్శలను కూడా ‘సాయ్’ డెరైక్టర్ తిప్పికొట్టారు. ఇది డబుల్స్ విభాగాన్ని ప్రోత్సహించడంలో గోపీచంద్ చేసిన కృషిని విస్మరించడమేనని ఆయన అన్నారు. ‘గోపీకి అన్ని విధాలా మేం మద్దతు పలుకుతున్నాం. ఆటగాడిగా, కోచ్‌గా, అడ్మినిస్ట్రేటర్‌గా అతని సమర్థతను ఎవరూ ప్రశ్నించలేరు. ఒక ప్లేయర్ అర్థరహిత విమర్శల వల్ల అతను ఆటకు చేసిన సేవల విలువ తగ్గిపోదు. గోపీపై జ్వాల చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూరితం’ అని శ్రీనివాస్ ఘాటుగా వ్యాఖ్యానించారు. టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్)లో జ్వాల, అశ్వినిలను చేర్చకపోవడానికి గోపీచందే కారణమని చేసిన విమర్శలను కూడా ఆయన తప్పు పట్టారు. ‘ఇవన్నీ నిరాధార ఆరోపణలు. నిజానికి ‘టాప్’లో డబుల్స్ ఆటగాళ్లను కూడా చేర్చాలంటూ ప్రత్యేకంగా వీరిద్దరి పేర్లను గోపీచంద్ స్వయంగా గత సమావేశంలో ప్రతిపాదించారు. డబుల్స్ కోసం విదేశీ కోచ్‌ను తీసుకు రావడంలో కూడా అతనిదే కీలక పాత్ర. గోపీలాంటి వ్యక్తిని ఎలాంటి ఆధారాలు లేకుండా విమర్శించడం తప్పు. ఈ విషయంలో ఆమె లక్ష్మణ రేఖ దాటకూడదు’ అని శ్రీనివాస్ హెచ్చరించారు. ‘టాప్’ కమిటీలో తనను చేర్చమని గానీ తన అకాడమీని జాతీయ శిక్షణా కేంద్రంగా చేయమని గానీ గోపీచంద్ ఎప్పుడూ సిఫారసు చేసుకోలేదని, అతనిపై నమ్మకంతోనే ఈ బాధ్యత ఇచ్చామని, దానిని ఆయన నిలబెట్టుకున్నారని ‘సాయ్’ డెరైక్టర్ తమ కోచ్‌కు మద్దతు ప్రకటించారు.