Coconet
-
బొండాంతో భలే ఐడియా!
కొబ్బరిబొండాం.. ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ తాగి పడేసే బొండాంలో నీరు చేరి దోమలు పెరుగుతున్నాయి. మొక్కల పెంపకం.. పర్యావరణానికి ఎంతో మేలు. కానీ వాటిని పెంచడానికి ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ సంచులతో అన్నీ సమస్యలే. ఈ రెండు సమస్యలకూ ఒకే ఒక్క చిన్న ఐడియాతో చెక్ పెట్టేశారు. తాగి పడేసిన కొబ్బరిబొండాల్లో మొక్కల పెంపకం ద్వారా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇదంతాఎక్కడో కాదు..మన తెలంగాణలోనే! దుగ్గొండి: సాధారణంగా ప్లాస్టిక్ సంచుల్లో మట్టి నింపి, అందులో విత్తనాలు వేసి మొక్కలు పెంచుతారు. ఇందుకోసం 250 నుంచి 300 గేజ్ ఉన్న ప్లాస్టిక్ సంచులను ఉపయోగిస్తారు. మొక్క పెరిగిన తర్వాత దానిని భూమిలో నాటినప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్ తీసి పారేస్తారు. అది భూమిలో కలసిపోదు. ఒకవేళ దానిని కాల్చివేస్తే, అప్పుడు వచ్చే పొగ వల్ల కేన్సర్‌తోపాటు అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధానికి భారీగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక తాగి పడేసే కొబ్బరిబొండాలతోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. బొండాం తాగిన తర్వాత దానిని అలాగే పడేస్తుండటంతో వాటిలోకి నీరు చేరి దోమలు పెరుగుతున్నాయి. ఫలితంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాస్తవానికి ముదిరిన కొబ్బరిబొండాల తొక్కల నుంచి కోకోఫిట్, తాళ్లు తయారు చేస్తారు. అయితే, లేత కొబ్బరిబొండాలు అందుకు పనికిరావు. దీంతో వాటిని అలాగే పడేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పరిష్కారమేంటి? తాగి పడేసే కొబ్బరిబొండాల్లో మట్టి నింపి అందులో మొక్కలు పెంచడం ద్వారా అటు ప్లాస్టిక్ వినియోగానికి అడ్డుకట్ట వేయడంతోపాటు ఇటు కొబ్బరిబొండాల ద్వారా తలెత్తుతున్న సమస్యల నుంచీ తప్పించుకోవచ్చు. పైగా మొక్కను బొండాంతో సహా భూమిలో నాటుకోవచ్చు. తద్వారా బొండాం భూమిలో కలిసిపోతుంది. ఎవరిదీ ఆలోచన? వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండల ఎంపీడీఓ గుంటి పల్లవికి ఈ వినూత్నమైన ఆలోచన వచ్చింది. ఓ వైపు ప్లాస్టిక్ భూతం.. మరోవైపు వాడి పడేసే బొండాలతో ఎదురవుతున్న సమస్యలు చూసిన ఆమె మొక్కల పెంపకానికి బొండాలను వినియోగించాలనే తలంపు వచ్చింది. దీనిని రాష్ట్రంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావించారు. కేరళలో కొబ్బరిబొండాల్లో మొక్కల పెంపకంపై అధ్యయనం చేసిన తర్వాత శుక్రవారం మండలంలోని నాచినపల్లి గ్రామ నర్సరీలో ఇందుకు శ్రీకారం చుట్టారు. వెయ్యి కొబ్బరి బొండాల్లో మట్టి నింపి చింత గింజలను నాటారు. తొగర్రాయి, గిర్నిబావి, శివాజినగర్, తిమ్మంపేట, దుగ్గొండి గ్రామ నర్సరీల్లో ఇలా దాదాపు 5వేల కొబ్బరిబొండాల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందుకు వరంగల్, హన్మకొండ పట్టణాల్లో వాడిపడేసిన బొండాలను సేకరించారు. ఎంతో పర్యవరణ హితం వాడిపడేసిన కొబ్బరి బొండాల్లో మొక్కలు పెంచడం పర్యావరణ హితంగా ఉంటాయి. కేరళలో బొండాల్లో మొక్కలు పెంచుతున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను. ఆ పద్ధతిలో మొక్కలు నాటి గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలనుకుంటున్నాం. కొబ్బరి బొండాల్లో పెరిగిన మొక్కను బొండాంతో సహా అలాగే భూమిలో పాతిపెట్టొచ్చు. ఆ బొండాం రెండు, మూడు నెలల్లోనే భూమిలో కరిగిపోతుంది. పైగా మొక్కకు ఎరువుగానూ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ విధానం ప్లాస్టిక్ నివారణకు కొంత మేరకు దోహదపడుతుంది. – గుంటి పల్లవి, ఎంపీడీవో ఎంపీడీఓ గుంటి పల్లవి -
కొబ్బరికాయ ఒకటే... కానీ లోపల చూస్తే...!
మిర్యాలగూడ టౌన్: కొబ్బరికాయ ఒక్కటే... దాన్ని కొట్టి చూస్తే లోపల రెండు భాగాలు కనిపించాయి. ఈ విశేషం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వాసవీనగర్‌లో చోటు చేసుకుంది. శ్రీరామనవమి పూజలో భాగంగా శనివారం కొండవీటి శేఖర్ ఇంట్లో కొబ్బరికాయ కొట్టగా అందులో రెండు కాయలుగా ఉండడాన్ని చూసి అక్కడున్న వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇదేదో మంచి పరిణామంగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు కూడా చూసేందుకు వారింటికి క్యూకట్టారు. -
ఒత్తిడిలో పద్యరచన
చిత్తడిలో పరుగులాగ చీదరబుట్టన్ హత్తెరి నీ తస్సదియ్యు అత్తరి ఓ వైనుతేయు! ఆసవమదిగో! హరివిల్లులో సప్తవర్ణాలు ఉంటారుు. సంగీతంలో సప్తస్వరాలు ఉంటారుు. అలాగే, ఆసవాలలోనూ ఏడు జాతులు ఉంటాయని ప్రాచీన శాస్త్రాల ఉవాచ. ద్రాక్షాది పక్వఫలాల నుంచి తయూరయ్యేవి కొన్ని, ఖర్జూరాది శుష్కఫలాల నుంచి తయారయ్యేవి కొన్ని, జొన్నలు, బార్లీ వంటి తృణధాన్యాలతో తయూరయ్యేవి కొన్ని, చెరకు నుంచి తయారయ్యేవి కొన్ని, తాటి, ఈత, కొబ్బరి వంటి చెట్ల నుంచి స్రవించే రసాన్ని సేకరించి తయూరు చేసేవి కొన్ని. వీటిలోనూ ప్రధానంగా రెండు భేదాలు ఉన్నారుు. నేరుగా కిణ్వనానంతరం సేవించేవి కొన్ని, కిణ్వనం తర్వాత స్వేదనక్రియు ద్వారా పలువూర్లు ‘స్కాచి’వడబోసి, ఏళ్లతరబడి నిల్వచేసి సేవించేవి కొన్ని. తయూరీ ప్రక్రియులో సంక్లిష్టత, ప్రాచీనత, వుుడి పదార్థాల లభ్యత, రుచి, నాణ్యత ఆధారంగా వీటి విలువ నిర్ధారితవువుతుంది. ఏదేమైనా ఆయుుర్వేదం ఆసవాన్ని ఔషధంగానే పరిగణిస్తుంది. ఆరోగ్య స్పృహ కలిగిన ‘బుడ్డి’వుంతుల కోసం ఈ వారం.. ‘మధు’రోక్తి మంచినీళ్లు మాత్రమే తాగేవాళ్లు రాసిన కవితలు దీర్ఘకాలం వునలేవు -హోరేస్, ప్రాచీన రోమన్ కవి ఎలిగెంట్ ఎలిక్సర్ బర్బన్ : 45 మి.లీ. బ్రాందీ : 15 మి.లీ. దాల్చిన సిరప్ : 40 మి.లీ. కోకాకోలా : 100 మి.లీ. గార్నిష్ : చెర్రీ పొడి, జాజికాయ - వైన్‌తేయుడు -
జుట్టూ... టెంక మీద పీచు... ఏమిటీ లంకె?
నవ్వింత: పొద్దున్నే మా బుజ్జిగాణ్ణి స్కూలుకు తయారు చేస్తూ వాడి తలకు కొబ్బరినూనె రాస్తుంటే వాడు నన్ను ఓ ప్రశ్న అడిగాడు. ‘‘నానా... తలకు కొబ్బరినూనే ఎందుకు రాస్తారు? మిగతా నూనెలు ఎందుకు రాయరు?’’ అని వాడి సందేహం. నేను జవాబిచ్చేలోపే మళ్లీ వాడే సమాధానం కూడా చెప్పాడు. ‘‘నానా... జాగ్రత్తగా చూడు. పీచు ఊడదీసిన కొబ్బరి టెంక అచ్చం గుండులాగే ఉంటుంది. అలాగే దాని మీద పీచు అచ్చం చిందరవందరగా ఉన్నప్పటి నా జుత్తులాగే ఉంటుంది. కాబట్టి కొబ్బరిలో పీచును పెంచే గుణమేదో ఉండొచ్చు. పీచులాగే మన జుట్టూ దట్టంగా గట్టిగా రావాలనే ఉద్దేశంతోనే కొబ్బరినూనే తలకు రాస్తారేమో నానా’’ అన్నాడు. కాస్తంత ఆలోచిస్తే వాడి లాజిక్ కూడా కరక్టేనేమో అనిపించింది. అయితే ఈలోపే మళ్లీ మరో ప్రశ్న వేశాడు వాడు. ‘‘అవునూ... పిసికి తినే రసాల మామిడి టెంక మీద కూడా పీచుంటుంది కదా. మరి మామిడికి సంబంధించినదేదీ తలకు రాయరెందుకు?’’ అంటూ మరో సంశయం వ్యక్తం చేశాడు వాడు. నేను బుర్రగోక్కుంటుండగానే మళ్లీ వాడే సమాధానం చెప్పాడు. ‘‘బహుశా... మామిడిలో రసాల రకాన్ని తిన్న తర్వాత కనిపించే పీచు ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశావా? అచ్చం బట్టతల మీద అక్కడక్కడా వేలాడే కాసిన్ని పోచల్లాగే ఉంటుంది. అందుకే మామిడి రసాలో లేదా అందులోంచి తీసిన ప్రోడక్టునో రాస్తే జుట్టు ఒత్తుగా రాదని కావచ్చు. ఒకవేళ అది బంగినపల్లి వెరైటీ మామిడి అయితే అసలు పీచే ఉండదు కదా. అందుకే కొబ్బరితోనూ, మామిడితోనూ... ఈ రెండింటితోనూ పచ్చడి చేసినా కొబ్బరినూనె తీసి ఎగస్ట్రాగా తలకు రాసుకుంటారన్నమాట’’ అంటూ వాడే వివరించాడు. ఏదేమైనా వాడి ఆలోచన ధోరణికీ, లాజిక్ పవర్‌కూ కాస్తంత ఆశ్చర్యపోయా. మహా రచయిత పతంజలి చెప్పినట్టు వాడి తలలో జ్ఞానమన్నది. కొబ్బరిబొండాంలో నీళ్లూరినట్టుగా ఊరుతోంది. కానీ అది కొబ్బరిబొచ్చెలో ఉన్నట్లు పదిలంగా ఉండాలన్నది నా కోరిక. కానీ అదే జ్ఞానం నూనెలో వేసిన పూరీలో ప్యాక్ చేసిన గ్యాస్‌లా ఉండొద్దన్నది నా అభిలాష. అదే విషయాన్ని తల దువ్వుతూ మావాడికి కాస్త తేలిక పదాలతో చెప్పా. ‘‘నానా... జ్ఞానమంటే కొబ్బరిబొండాంలో ఊరిన నీళ్లలాగో... నూనెలో వేసిన పూరీలో ఉబ్బిన గ్యాసులాగో పదిలంగా ఉండటం కాదు. నువ్వు అభిమానించే రచయిత చెప్పినట్టు అది అలా పదిలంగా ఉన్నా ప్రయోజనం లేదు నాన్నా’’ అన్నాడు. ‘‘మరేమిట్రా? వేలెడంత లేవు. నీకు జ్ఞానం, దాని ప్రయోజనం అన్నీ తెలుసా?’’ అంటూ మరోసారి ఆశ్చర్యపోతూ అడిగా. ‘‘ఎందుకు తెలియదూ... ఇప్పటి వరకూ నేనే కారణాలు ఆలోచించి, నేనే సమాధానాలూ వెతుక్కోలేదూ. అలాగే జ్ఞానం కొబ్బరిబొండాంలో నీళ్లలా ఒక ఊటలా ఊరుతుందని నువ్వు చెప్పగానే దాని ప్రయోజనం ఏమిటో నాకు అర్థమైపోయింది’’ అన్నాడు వాడు. ఇంతటి తాత్విక విషయాలపై నాకే ఒక అవగాహన రావడం లేదు. అలాంటిది పెద్ద పెద్ద విషయాలను చాలా తేలిగ్గా పరిష్కరిస్తున్న వాడి లాజిక్కు పట్ల నాకు అబ్బురం కలిగింది. కాస్తంత అహం అడ్డు వచ్చినా తెగించి అడిగా మరి జ్ఞాన ప్రయోజనం ఏమిట్రా అని. ‘‘నానా... జ్ఞానం కొబ్బరికాయలో నీళ్లలా ఊరితే దాన్ని స్ట్రాతో తాగేయాలి. పూరీలో గ్యాసులా ప్యాకయితే ఆ ఉబ్బు ఎప్పుడూ పదిలంగా ఉండాలని కోరుకోకూడదు. ఇలా జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ఖాళీ చేసేస్తూ ఉండాలి. వేలితో జ్ఞానం ప్యాక్‌ను పొడిచేసి అటు పూరీనీ, ఇటు కొబ్బరికాయలోని కొబ్బరితో పచ్చడి చేసేసుకుని ఆ పచ్చడినీ... ఈ రెండింటినీ కలుపుకుని తినడమే అసలైన జ్ఞానం. అదే ఇప్పుడు అమ్మ నాతో ప్రాక్టికల్‌గా చేయించబోయే పని’’ అంటూ కొబ్బరి చెట్నీతో పూరీ తినేసి బ్యాగు వీపున వేసుకుని స్కూల్‌కు బయల్దేరాడు. ఆ టైమ్‌లో వాణ్ని చూస్తే వాడి తల మీద జుట్టంతా కొబ్బరిమట్టల్లా, వాడి మాటలన్నీ మామిడిముక్కల్లా అనిపించాయి. వాడి ఆలోచనల పట్ల నాలో గర్వం నూనెలో వేసిన పూరీలోని గాలిలా పొంగింది. కానీ... నా దిష్టే తగులుతుందేమోనని సదరు పూరీని వేలితో పొడిచేసుకుని, పూరీల, కొబ్బరి పచ్చళ్ల ప్రయోజనాన్ని తెలుసుకుని, ఈ రెంటినీ కలుపుకుని గబుక్కున నోట్లో పెట్టుకున్నా. - యాసీన్