ఒత్తిడిలో పద్యరచన
చిత్తడిలో పరుగులాగ చీదరబుట్టన్
హత్తెరి నీ తస్సదియ్యు
అత్తరి ఓ వైనుతేయు! ఆసవమదిగో!
హరివిల్లులో సప్తవర్ణాలు ఉంటారుు. సంగీతంలో సప్తస్వరాలు ఉంటారుు. అలాగే, ఆసవాలలోనూ ఏడు జాతులు ఉంటాయని ప్రాచీన శాస్త్రాల ఉవాచ. ద్రాక్షాది పక్వఫలాల నుంచి తయూరయ్యేవి కొన్ని, ఖర్జూరాది శుష్కఫలాల నుంచి తయారయ్యేవి కొన్ని, జొన్నలు, బార్లీ వంటి తృణధాన్యాలతో తయూరయ్యేవి కొన్ని, చెరకు నుంచి తయారయ్యేవి కొన్ని, తాటి, ఈత, కొబ్బరి వంటి చెట్ల నుంచి స్రవించే రసాన్ని సేకరించి తయూరు చేసేవి కొన్ని. వీటిలోనూ ప్రధానంగా రెండు భేదాలు ఉన్నారుు.
నేరుగా కిణ్వనానంతరం సేవించేవి కొన్ని, కిణ్వనం తర్వాత స్వేదనక్రియు ద్వారా పలువూర్లు ‘స్కాచి’వడబోసి, ఏళ్లతరబడి నిల్వచేసి సేవించేవి కొన్ని. తయూరీ ప్రక్రియులో సంక్లిష్టత, ప్రాచీనత, వుుడి పదార్థాల లభ్యత, రుచి, నాణ్యత ఆధారంగా వీటి విలువ నిర్ధారితవువుతుంది. ఏదేమైనా ఆయుుర్వేదం ఆసవాన్ని ఔషధంగానే పరిగణిస్తుంది. ఆరోగ్య స్పృహ కలిగిన ‘బుడ్డి’వుంతుల కోసం ఈ వారం..
‘మధు’రోక్తి
మంచినీళ్లు మాత్రమే తాగేవాళ్లు రాసిన కవితలు దీర్ఘకాలం వునలేవు
-హోరేస్, ప్రాచీన రోమన్
కవి
ఎలిగెంట్ ఎలిక్సర్
బర్బన్ : 45 మి.లీ.
బ్రాందీ : 15 మి.లీ.
దాల్చిన సిరప్ : 40 మి.లీ.
కోకాకోలా : 100 మి.లీ.
గార్నిష్ : చెర్రీ పొడి, జాజికాయ
- వైన్‌తేయుడు