ఆంక్షల్లేని తెలంగాణ కావాలి
హన్మకొండ, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లు ఇచ్చినట్టే ఇచ్చి నిబంధనలు ఆంక్షలు విధిస్తోందని, తాము మాత్రం ఆంక్షల్లేని తెలంగాణనే కోరుకుంటున్నామని విప్లవ రచరుుతల సంఘం (విరసం) రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మీ అన్నారు. సంఘం 24 రాష్ర్ట మహాసభలు శనివారం వరంగల్ జిల్లా హన్మకొండలో ప్రారంభమయ్యాయి. పువ్వర్తి ఎన్కౌంటర్లో అమరుడైన మర్రి సుధాకర్ తల్లిదండ్రులు అయిలమ్మ, వెంకటయ్య చేతుల మీదుగా విరసం పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి అధ్యక్షతన జరిగిన ప్రతినిధుల సభలో వరలక్ష్మీ మాట్లాడుతూ.. భౌగోళికంగా విడిపోయిన ప్రజలను మానసికంగా ఏకం చేసి సామ్రాజ్యవాద శక్తులు, హిందుత్వ శక్తులకు వ్యతిరేకంగా విరసం పోరాడుతుందని తెలిపారు. ప్రముఖకవి నందిని సిధారెడ్డి, ప్రజాకళామండలి గాయకుడు జాన్‌రావు, పౌరహక్కుల నేత ఎంటీ ఖాన్ కూడా మాట్లాడారు. విరసం రాష్ట్ర కార్యవర్గసభ్యులు, కవులు వరవరరావు, హేమలత, కళ్యాణ్‌రావు, కాకరాల, మాభూమి సంధ్య తదితరులు సభల్లో పాల్గొన్నారు. అనంతరం సుబేదారిలోని ఆర్ట్స్ కళాశాలలో బహిరంగసభ జరిగింది.