at collecterate
-
కార్మిక గర్జన
ఏలూరు (సెంట్రల్,అర్బన్) : జిల్లా కేంద్రం ఏలూరులో శుక్రవారం కార్మికులు గర్జించారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు చేశారు. ఆశ్రం ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది తమకు జీవో 68 ప్రకారం రూ.9వేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరులో భారీ ర్యాలీ చేశారు. స్థానిక పాతబస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన చేశారు. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.రాజారామ్మోహనరాయ్ మాట్లాడుతూ 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్న సిబ్బంది పది రోజుల నుంచి తమ హక్కుల కోసం ఆందోళన చేస్తుంటే యాజమాన్యం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. వెంటనే జీవో నంబర్ 68 ప్రకారం రూ. 9 వేలు వేతనం ఇవ్వాలని, ఏఎంఆర్లుగా పదోన్నతులు ఇచ్చి కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు సంస్థలో కార్మిక చట్టాలను అమలు చేయకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. అనంతరం కాంట్రాక్టు సిబ్బంది కలెక్టర్ కాటంనేని భాస్కర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. నాయకులను అదుపులోకి తీసుకుని త్రీటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ప్రసాదు, బి.సోమయ్య, పి.కిషోర్, బి.జగన్నాథరావు, గుడిపాటి నర్సింహరావు, వి.సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. త్రీటౌన్ పోలీసుస్టేషన్ వద్ద ఉద్రిక్తత కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న కార్మిక నాయకులను పోలీసులు అరెస్టు చేసి త్రీటౌన్ స్టేషన్‌కు తరలించారు. దీంతో నిరసనకారులు త్రీ టౌన్ పోలీసుస్టేషన్‌ను చుట్టుముట్టారు. నాయకులను తక్షణమే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. స్టేషన వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో ఇన్చార్జ్ టౌన్ సీఐ ఆడపా నాగమురళి త్రీ టౌన్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. అరెస్ట్ చేసిన వారిని సొంత పూచీకత్తులపై విడిచిపెడతామని నచ్చచెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఇదిలా ఉంటే సీఐటీయూ నాయకుల అరెస్ట్ దారుణమని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతకాయల బాబురావు ఒక ప్రకటనలో ఖండించారు. -
నూతన పెన్షన్ విధానం రద్దుకు డిమాండ్
ఏలూరు అర్బన్ : నూతన పెన్షన్ విధానంతో ఉపాధ్యాయులకు రక్షణ కరువైందని, దీనిని వెంటనే రద్దుచేయాలని ఏపీ పీఆర్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట బుధవారం జిల్లాస్థాయి ధర్నా నిర్వహించారు. జిల్లా యూనియన్ గౌరవాధ్యక్షుడు ఏవీ కాంతారావు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ.. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు. జిల్లా యూనియన్ ప్రధాన కార్యదర్శి కేవీవీ సుబ్బారావు మాట్లాడుతూ.. పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, టీచర్లకు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎం.రాధ మాట్లాడుతూ.. అంతర్గత మూల్యాంకనంలో మార్పులు తీసుకోవాలని కోరారు. జేఏసీ నాయకులు హరినాథ్, శ్రీనివాస్, శ్రీధర్‌రాజు సంఘీభావం తెలిపారు. పీఆర్టీయూ రాష్ట్ర బాధ్యులు పి.బాబ్జీ, డి.దావీదు, బి.రాము, బి.త్రినాథ్ పాల్గొన్నారు. అనంతరం జేసీ పి.కోటేశ్వరరావుకు వినతిపత్రం అందించారు. -
సాగు నీరందించాలని కౌలు రైతుల ధర్నా
ఏలూరు (మెట్రో) : సాగు నీరందించి పంటలు ఎండిపోకుండా కాపాడాలంటూ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో వరి దుబ్బలతో కలెక్టరేట్లో సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా, గోదావరి జిల్లాల్లో వేలాది ఎకరాలకు సాగు నీరందక వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.10 వేలకుపైగా పెట్టుబడి పెట్టారన్నారు. ప్రస్తుతం సాగునీరందకపోతే అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమ నీళ్లు ఇచ్చామంటూ అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. నీరు ఇస్తే రైతుల పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయని ప్రశ్నించారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా నీరు తరలిస్తామని హడావిడి చేసి రైతులను పంటలను వేసుకోమన్నారని చుక్కనీరు రాక రైతులు పొలాల గట్ల మీద పడిగాపులు పడుతున్నారని చెప్పారు. గోదావరిలో నీరున్నా వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నా డెల్టా శివారు ప్రాంత ఆయకట్టు సాగునీరు అందటం లేదన్నారు. రైతులకు సాగునీరందించి పంటలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో రైతు నాయకులు మంతెన రామారావు, తిరుపతి రంగారావు, మావూరి శ్రీనివాసరావు, గొర్రెల సాంబశివరావు, బైరెడ్డి లక్ష్మణరావు పాల్గొన్నారు. -

నాట్లు వేశాం.. పంట రుణాలు ఇవ్వండి
ఏలూరు (సెంట్రల్): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం కలెక్టరేట్ వద్ద కౌలు రైతులు ధర్నా చేశారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. జిల్లాలో 3 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, చట్టప్రకారం భూ యజమానితో సంబంధం లేకుండా అందరికీ రుణార్హత గుర్తింపు కార్డులు ఇవ్వాల్సి ఉందని జిల్లా కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు జుత్తిగ నరసింహమూర్తి అన్నారు. అధికారులు చెబుతున్న లెక్కలు వాస్తవ పరిస్థితికి దూరంగా ఉన్నాయని, కార్డుల జారీలో కొందరు సొమ్ములు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6,200 కోట్లు రుణ లక్ష్యం ప్రకటించినా కౌలు రైతులకు ఒక శాతం కూడా రుణాలు ఇవ్వలేదని విమర్శించారు. జీవో ప్రకారం ప్రతి కౌలు రైతుకు రూ.లక్ష వడ్డీలేని రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ సంఘాల నాయకులు డి.అశోక్‌కుమార్, డీఎన్‌వీడీ ప్రసాద్, జక్కంశెట్టి సత్యనారాయణ, పీవీ రామకృష్ణ ధర్నాకు సంఘీభావం తెలిపారు. అనంతరం కలెక్టర్ కె.భాస్కర్‌కు వినతిపత్రం అందించారు. కౌలు రైతులు కలెక్టరేట్ నుంచి ర్యాలీగా వెళ్లి వ్యవసాయశాఖ జేడీ కార్యాలయాన్ని ముట్టడించారు. వ్యవసాయశాఖ డీడీ, ఆంధ్రా బ్యాంకు ఏజీఎం కార్యాలయాల్లో వినతి పత్రాలు అందించారు.