comfortable
-
సమ్మర్లో కంఫర్టబుల్‌గా... కలర్ఫుల్గా! (ఫోటోలు)
-
నాతో తప్పుగా ప్రవర్తించలేదు
‘మీటూ’ ఉద్యమం సమయంలో బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. తమ పట్ల సాజిద్ అభ్యంతరకరంగా ప్రవర్తించారంటూ పలువురు కథానాయికలు ఆరోపించిన విషయం తెలిసిందే. దాంతో ‘హౌస్‌ఫుల్ 4’ చిత్ర దర్శకత్వ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారాయన. సాజిద్ ఖాన్ తనతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని, అతనితో పని చేయడం కంఫర్ట్‌బుల్‌గానే అనిపించిందని పేర్కొన్నారు తమన్నా. సాజిద్ ఖాన్ దర్శకత్వంలో ‘హిమ్మత్వాలా, హమ్‌షకల్స్’ చిత్రాల్లో హీరోయిన్గా నటించారు తమన్నా. సాజిద్ ఖాన్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను తమన్నా పంచుకుంటూ – ‘‘నేనెలాంటి సినిమా చేయబోతున్నా, ఆ సినిమా స్క్రిప్ట్ ఏంటి? అన్నదే నాకు ముఖ్యం. నేను, సాజిద్ ఖాన్ కలసి చేసిన రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. తనెప్పుడూ నాతో తప్పుగా ప్రవర్తించలేదు. తనతో పని చేయడం కంఫర్ట్‌బుల్‌గా ఫీల్ అవుతాను’’ అని పేర్కొన్నారామె. ఇటీవల విద్యాబాలన్ ‘మళ్లీ సాజిద్‌తో కలసి సినిమా చేయబోనని పేర్కొన్నారు’ కదా అని అడగ్గా –‘‘అందరి అనుభవాలు ఒకలా ఉండవు. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. ఒకవేళ విద్యకు బ్యాడ్ఎక్స్పీరియన్స్ ఎదురై ఉంటే ఆమె అలా రియాక్ట్ అయ్యుండొచ్చు’’ అని చెప్పారు తమన్నా. -
బైక్ కాదు సైకిలే
చక్రాలు చూస్తే బైక్ ... ఆకారం పరిశీలిస్తే సైకిల్...ఇది చైనా తయారీ. చైనా దేశానికి చెందిన షినానో కంపెనీ తయారు చేసిన ఈ బైక్ లాంటి సైకిల్ పలువుర్ని ఆకట్టుకుంటోంది. యానాంలోని మావుళ్లమ్మ గిఫ్ట్స్ షాప్ అధినేత మహేష్ ఈ సైకిల్‌ను సుంకరపాలెం వేసుకురాగా ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. సుమారు రూ.20 వేలు ఖరీదు చేసే ఈ సైకిల్‌ను రాజమహేంద్రవరానికి చెందినఓ స్నేహితుడు చైనా నుంచి రప్పించాడని సైకిల్ యజమాని మహేష్ తెలిపారు. మోటారు సైకిల్ మాదిరిగానే దీనికి కూడా ఐదు గేర్లు ఉన్నాయని, చూసేందుకు భారీగా కనిపిస్తున్నా రన్నింగ్‌లో ఎంతో సౌకర్యవంతంగా ఉందని ఆయన తెలిపారు. – తాళ్లరేవు -
'నా డ్రెస్సింగ్‌తో సంతృప్తిగానే ఉన్నా'
లండన్: బ్రిటన్ సింగర్, నటి రీటా ఓరా డ్రెస్సింగ్ ఎప్పుడూ సంచలనమే. డ్రెస్సింగ్ విషయంలో ఆమెకు ఆమే సాటి. రీటా వాడే డిజైన్లు కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తూ అభిమానులను చూపు తీప్పుకోకుండా చేస్తాయి. అయితే కొన్నిసార్లు రీటా అనుకోకుండానే అభిమానులకు తన అందాలతో కనువిందు చేస్తుంటారు. అదెలాగంటే చాలా కార్యక్రమాల్లో ఆమె ధరించిన వస్త్రాలు.. యాక్సిడెంటల్‌గా ఊడిపోయి ఆమెకు హ్యాండ్ ఇచ్చాయి. రీటా డ్రెస్సింగ్ చాలా రిస్క్‌తో కూడుకున్నదని డిజైనర్లు చెబుతుంటారు. దీనిపై రీటా మాట్లాడుతూ ' ఇది చాలా సరదాగా ఉంటుంది. నేను ధరించే వస్త్రాల పట్ల సంతృప్తిగానే ఉన్నాను. అనుకోకుండా చాలాసార్లు అలా జరిగినంత మాత్రాన నేను ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. నలుగురిలో నేను చాలా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటాను. ఫ్యాషన్‌లో రిస్క్ తీసుకోవడం అవసరం కూడా' అని చెబుతోంది. పైగా అలా రిస్క్ తీసుకున్నందుకు గర్వంగా ఫీలవుతుంటానని తెలిపింది. అయితే మరోసారి అందాల తార అందాలను చూసే అవకాశం ఉంటుందేమోనని అభిమానులు కూడా రీటా ప్రకటనపై లోలోపల సంతోషంగానే ఉన్నారు. -
ఆ హీరోల వల్ల నరకం చూశా!
‘హీరోలతో మంచిగా ఉంటేనే కెరీర్ సుదీర్ఘ కాలం కొనసాగుతుంది’ అనుకునే హీరోయిన్లున్న నేటి రోజుల్లో... అందుకు భిన్నంగా హీరోపై సూటిగా విమర్శలు గుప్పించే హీరోయిన్లూ ఉన్నారు. కత్రినాకైఫ్ ఇటీవల బాలీవుడ్ హీరోలను మీడియా సాక్షిగా చెడుగుడు ఆడేశారు. ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన కత్రినాను... ‘బాలీవుడ్లో ఏ హీరో పక్కన మీరు కంఫర్ట్‌గా ఫీలయ్యారు?’ అని ఓ విలేకరి అడిగేసరికి, కత్రినా తాచుపాములా అంతెత్తు లేచారు. ‘‘కంఫర్ట్ సంగతి దేవుడెరుగు. కొంతమంది హీరోల పుణ్యమా అని నరకం చూసిన రోజులున్నాయి. కనీసం స్నానం చేసి సెట్‌కి రావాలనే కామన్ సెన్స్ లేని హీరోలున్నారు ఇక్కడ. రాత్రంతా తాగడం, పొద్దున్నే అలాగే సెట్‌కి వచ్చేయడం. వాళ్ల పేర్లు నేను చెప్పలేను కానీ... వారితో రొమాంటిక్ సీన్స్‌లో చేయాల్సొచ్చినప్పుడు వాంతి వచ్చినంత పనయ్యేది. ఎంత ఓర్చుకునేదాన్నో ఆ దేవుడికి తెలుసు. ఈ సందర్భంలో సౌత్ హీరోల గురించి కచ్చితంగా ప్రస్తావించాలి. సెట్లో వాళ్లెంత హుందాగా ఉంటారో మాటల్లో చెప్పలేను. నీట్‌గా వస్తారు. పక్కన ఆర్టిస్ట్‌లను అస్సలు ఇబ్బందికి గురి చేయరు. వారి నుంచి బాలీవుడ్ హీరోలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కనీసం డియోడరెంట్ కొట్టుకొని రావాలనే ఇంగితం లేని వాళ్లు హీరోలు ఎలా అయ్యారో’’ అంటూ బాలీవుడ్ హీరోలను దుయ్యబట్టారు కత్రినా. ఇంతకీ కత్రినాని అంతగా ఇబ్బందులకు గురి చేసిన ఆ హీరోలు ఎవరో మరి! -
నెట్వినియోగంలో టాప్ స్ధానంలో ల్యాప్‌టాప్‌లు
-
‘స్మార్ట్’గా ప్రయాణం
సాక్షి, ముంబై: మరికొన్ని రోజుల్లో పట్టాలు ఎక్కబోయే మెట్రో రైలులో ప్రయాణించేవారి కోసం స్మార్ట్‌కార్డు, టోకెన్ సదుపాయాన్ని కల్పించనున్నారు. ఈ మెట్రో స్టేషన్లలో ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాల వద్ద ఆటోమెటిక్ ఫేర్ కలెక్షన్ గేట్లను అమర్చనున్నారు. దీంతో స్మార్ట్ కార్డు, టోకెన్ కలిగిన ప్రయాణికులు ఈ ద్వారాల మీదుగా వెళ్లాల్సి ఉంటుందని ముంబై మెట్రోవన్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ ద్వారాల వద్ద ప్యానెల్లను అమర్చడంతో ఇవి ప్రయాణికుడి వద్ద ఉన్న కార్డులను రీడ్ చేస్తాయని, తర్వాత ద్వారాలు వాటంతటవే తెరుచుకుంటాయని అన్నారు. దీంతో ప్రయాణికుడు లోపలికి వెళ్లే వీలుంటుందని తెలిపారు. గమ్యస్థానం చేరుకున్నా ప్రయాణికుడు ఎంత దూరం వరకు ప్రయాణించాడో నిష్ర్కమణ ద్వారం వద్ద ఉన్న ప్యానెల్ గుర్తించి ఆ మేరకు చార్జీని కార్డు నుంచి తీసుకుంటుందన్నారు. నిష్ర్కమణ ద్వారం వద్ద అమర్చిన స్లాట్‌లో టోకెన్ ఇన్సర్ట్ చేయడంవల్ల ఈ ద్వారం తెరుచుకుంటుందన్నారు. దీంతో టోకెన్ కలిగినవారు ఇక్కడి నుంచి నిష్ర్కమించే వీలుంటుందని చెప్పారు. ‘ఈ కార్డులో రూ. 10,000 వరకు బ్యాలెన్స్ కలిగి ఉండాలి. ఒకవేళ ప్రయాణికుడు ఈ కార్డును కోల్పోతే ఎవ్వరూ దుర్వినియోగం చేసే వీలులేకుండా దీనిని బ్లాక్ చేయడానికి వీలుంటుంది. కొత్తది పొందిన తర్వాత పాత కార్డు ద్వారా కోల్పోయిన బ్యాలెన్స్‌ను తిరిగి పొందే వెసులుబాటు ఉంద’ని పేర్కొన్నారు. ఈ కార్డులో వ్యక్తి పేరు, చిరునామా, ఫొటో, గుర్తింపు నంబర్లు పొందుపర్చబడి ఉంటాయన్నారు. ఐదు లక్షల కాంట్రాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డులు (సీఎస్సీ), నాలుగు లక్షల కాంట్రాక్ట్‌లెస్ స్మార్ట్ టోకెన్(ఎస్టీ)లను జారీ చేస్తామని తెలిపారు. నాన్ పర్సనలైజ్డ్ స్మార్ట్ కార్డులను కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. అయితే ఈ కార్డులను బ్లాక్ చేయడానికి, మళ్లీ దానిస్థానంలో కొత్తది తీసుకోవడానికి వీలుండదని తెలిపారు. ఈ కార్డు కరెన్సీ నోట్ మాదిరిగా ఉంటుందన్నారు. దీనిని ఎవ్వరైనా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శనం చేసిన వివరాల ప్రకారం.. సీఎస్సీ కార్డులో రూ.10,000 బ్యాలెన్స్‌ను కలిగి ఉండాలి. అయితే ఈ కార్డును ఆటోమెటిక్ ఫేర్ కలెక్షన్ (ఏఎఫ్సీ) సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న రవాణా సేవలలో కూడా ఉపయోగించుకునే వీలుంటుందన్నారు. ఏఎఫ్సీ ద్వారాలు సదరు వ్యక్తి వద్ద ఉన్న కార్డులో ఉన్న సమాచారాన్ని రీడ్ చేసి ప్రయాణికుడిని లోపలికి అనుమతిస్తాయని తెలిపారు. నిమిషానికి 45 మంది ప్రయాణికులను అనుమతిచ్చే సామర్థ్యం ఉందన్నారు. ప్రీ పేయిడ్ కార్డులైన సీఎస్సీ, సీఎస్టీ అందుబాటులోకి రావడంతో టికెట్ విండో వద్ద ప్రయాణికులు క్యూలో నిలబడాల్సిన అవసరం లేదన్నారు. చిల్లర విషయంలో సిబ్బందికి, ప్రయాణికుల మధ్య వాగ్వాదం ఉండదని వెల్లడించారు.