comments on pakistan
-
రమ్య 'ప్రేమ'పై దుమారం
-
'నా కుక్కలను వదిలి ఎక్కడికీ వెళ్లను'
-
పాక్ నరకం కాదు
నటి, మాజీ ఎంపీ రమ్య వివాదాస్పద వ్యాఖ్యలు - దేశద్రోహం కేసు పెట్టాలంటూ కర్ణాటక కోర్టులో పిటిషన్ - నా మాటకు కట్టుబడి ఉన్నా, క్షమాపణ చెప్పను: రమ్య సాక్షి, బెంగళూరు : పాకిస్తాన్‌ను, ఆ దేశ ప్రజల్ని పొగుడుతూ కన్నడ నటి, కాంగ్రెస్ మాజీ ఎంపీ రమ్య(33) చేసిన వ్యాఖ్యలు మంగళవారం తీవ్ర దుమారాన్ని లేపాయి. ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలంటూ కర్ణాటక కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదంటూ రమ్య తేల్చి చెప్పడంతో వివాదం మరింత ముదిరింది. రమ్య వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా దేశ వ్యాప్తంగా బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సార్క్ దేశాల యువ చట్టసభ్యుల బృందం ఇటీవల ఇస్లామాబాద్‌లో పర్యటించింది. ఆ బృందంలో సభ్యురాలిగా ఉన్న రమ్య భారత్‌కు తిరిగొచ్చాక కర్ణాటకలోని మాండ్యాలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పాకిస్తాన్ నరకం కాదు. అక్కడి ప్రజలు మనలాంటి వారే. వారు మమ్మల్ని బాగా చూసుకున్నారు’ అనడం వివాదానికి కేంద్ర బిందువైంది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఆమె వ్యాఖ్యల్ని తప్పుపడుతూ కర్నాటకలోని సోమవార్‌పేట్ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలైంది. భారతీయ దేశభక్తుల్ని అవమానించినందుకు దేశద్రోహం, ఇతర ఆరోపణలపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది విట్టల గౌడ కోరారు. పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు విచారణను ఆగస్టు 27కు వాయిదా వేసింది. పాకిస్తాన్నే కాదు సార్క్ దేశాల్ని ప్రేమిస్తా: రమ్య ‘పాక్‌నే కాదు.. బంగ్లా, శ్రీలంకతో పాటు సార్క్ దేశాలన్నింటినీ ప్రేమిస్తా. అవకాశమొస్తే ప్రపంచం చుట్టొచ్చేందుకు సిద్ధం. వ్యతిరేకతలు, శాంతిపై మాట్లాడడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగం. స్వేచ్ఛను అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో తప్పు. ఒక వ్యక్తిగా నా ఆలోచనలు, అభిప్రాయాలు, దృక్పథాల్ని చెప్పేందుకు అనుమతి ఉందని అనుకుంటున్నా, బీజేపీ ప్రభుత్వం దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది.’ అన్నారు. ముందు మోదీపై కేసు పెట్టండి: కాంగ్రెస్ పాకిస్తాన్‌తో మంచి సంబంధాల్ని కోరుకోవడం దేశద్రోహమైతే ముందు ప్రధాని మోదీపై కేసు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. -
నా కుక్కలను వదిలి ఎక్కడికీ వెళ్లను: రమ్య
పాకిస్థాన్ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య సమర్థించుకున్నారు. అదే సమయంలో తాను భారతదేశాన్ని మాత్రం విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్లబోనని స్పష్టం చేశారు. తాను తన ఇంటిని.. తాను పెంచుకునే కుక్కలను కూడా వదిలి ఎటూ వెళ్లనని తెలిపారు. పాక్ విషయంలో తాను చెప్పిన అంశాలపై కేసు దాఖలు కావడం నిజంగా బాధాకరమని.. అయితే దేశంలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉంటుందని, బలవంతంగా మీ సిద్ధాంతాలను ఒకరిమీద రుద్దాలనుకోవడం సరికాదని తెలిపారు. పాకిస్థాన్ అంటే నరకం కాదని.. అక్కడి ప్రజలు కూడా మనలాంటి వాళ్లేనని రమ్య పునరుద్ఘాటించారు. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం విద్వేషాలను రెచ్చగొడుతుంటారని.. కేవలం సరిహద్దులు మనల్ని విడగొడుతున్నాయి కాబట్టి ఇతరులను ద్వేషించడం సరికాదని ఆమె చెప్పారు. వాక్ స్వాతంత్ర్యంలో భాగంగా మనం శాంతి, సమైక్యతలను గురించి కూడా మాట్లాడాలని.. స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యంలో తప్పని రమ్య తెలిపారు. -
పాకిస్థాన్‌ను ఏకి పారేస్తున్నారు!
సాక్షాత్తు ప్రధానమంత్రే తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పాకిస్థాన్‌ను ఎడాపెడా ఏకి పారేయడంతో మంత్రులు కూడా తమ మాటల యుద్ధాన్ని మరింత పదునెక్కించారు. పాకిస్థాన్‌కు వెళ్లడం అంటే నరకానికి వెళ్లడంతో సమానమని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యానించారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా.. పాకిస్థాన్‌లో జరగనున్న సార్క్ ఆర్థికమంత్రుల సమావేశానికి తాను వెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఆయనకు బదులుగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ఆ సమావేశానికి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ''మన సైనికులు నిన్ననే ఐదుగురు ఉగ్రవాదులను వెనక్కి పంపారు. పాకిస్థాన్‌కు వెళ్లడం అంటే నరకానికి వెళ్లడంతో సమానం'' అని పారికర్ అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, ఇప్పుడు వాళ్లు ఆ విధానం అవలంబించడం వల్ల తలెత్తుతున్న పరిణామాలను భరించాల్సి వస్తోందని ఆయన చెప్పారు. మొత్తమ్మీద ప్రధానమంత్రి నేతృత్వంలో ఎన్డీయే మంత్రివర్గం మాత్రం పాకిస్థాన్ మీద ఎదురుదాడి వ్యూహాన్ని పకడ్బందీగా అమలుచేస్తున్నట్లే కనిపిస్తోంది. ఇన్నాళ్లూ పాక్ విషయంలోను, పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో కూడా భారత్ ఆచితూచి వ్యవహరించింది. కానీ ఇక మీదట అలా ఊరుకునేది లేదని, కశ్మీర్ సహా భారత భూభాగంలో అంగుళం కూడా ఎవరికీ వదిలేది లేదని స్పష్టం చేయడం ఇటీవలి కాలంలోనే చోటుచేసుకున్న పరిణామం. ప్రధానమంత్రి ఇచ్చిన ప్రోత్సాహంతో మంత్రులందరూ కూడా పాకిస్థాన్ మీద తమ వ్యాఖ్యల వేడిని పెంచారు. అయితే ఇది మాటల వరకే పరిమితం అవుతుందా, అంతర్జాతీయ వేదికల మీద చేతల వరకు కూడా వెళ్తుందా అన్నది వేచి చూడాలి.