Commission danda
-
అది సీఎం ‘కమీషన్ల నిధి’
సాక్షి, అమరావతి : ఆపన్నుల వైద్యానికి ఆదరువుగా నిలవాల్సిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల యాజమానులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. నిస్సహాయులైన పేదల వైద్య సహాయానికి అండగా ఉండాల్సిన సీఎంఆర్ఎఫ్లో అక్రమాలు మూడు బిల్లులు ఆరు చెక్కులు చందంగా సాగుతోంది. ‘వైద్యం చేయండి.. నిధులిస్తాం’ అంటూ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) జారీ చేసే లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ)ల జారీతోనే వాటాల పర్వం ఆరంభమవుతోంది. కొందరు అధికార పార్టీ నేతలతో కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు ‘మీకింత.. మాకింత’ తరహా మౌఖిక ఒప్పందాలు చేసుకున్నాయి. ఆ ఆస్పత్రులకు వైద్యం కోసం వచ్చే వారికి అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల ద్వారా కార్పొరేట్ ఆస్పత్రులు ఎల్ఓసీలు ఇప్పించుకుంటున్నాయి. ఇందులో 30 శాతానికి పైగా వాటా ఆ ప్రజాప్రతినిధులకు ఆస్పత్రులు నగదు రూపంలో ముట్టజెబుతున్నాయి. మంత్రులు, అధికారపార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వ్యక్తిగత సహాయకులు (పీఏలు) నేరుగా సిఫార్సు లేఖలను సీఎంవోకు తీసుకెళ్లి ఎల్ఓసీలు ఇప్పిస్తున్నారు. ఎక్కువ మొత్తానికి ఎల్ఓసీలు, నిధులు మంజూరు చేయిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల ఏజెంట్లు కూడా సీఎంఓలో నేరుగా బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారు. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు సీఎంఆర్ఎఫ్ నుంచి అధిక నిధులు పొందుతున్నాయని తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ముఖ్యమైన ప్రజాప్రతినిధులతో ఒప్పందాలే ఇందుకు కారణమని కార్పొరేట్ ఆస్పత్రుల వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ, గుంటూరు, ఒంగోలులోని ఒక వర్గానికి చెందిన ఐదు ఆస్పత్రులకు సీఎంఆర్ఎఫ్ నుంచి అత్యధిక నిధులు మంజూరు అవుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యమంత్రి పేషీలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు బయట బేరాలు చేసుకుని నిధుల మంజూరులో కీలక భూమిక పోషిస్తున్నారు. ఆస్పత్రులకు ఎల్ఓసీల మంజూరులోనూ బిల్లుల విడుదలలోనూ వారు చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుప్పం నేతల దందా.. ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంలో సీఎంఆర్ఎఫ్ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో తీవ్ర రచ్చకు దారితీసింది. కుప్పం నియోజకవర్గంలోని కంచనపల్లికి చెందిన సుజాత కుమారుడు అజయ్‌కుమార్‌కు కిడ్నీ దెబ్బతింది. అతనికి వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి గత ఏడాది ఏప్రిల్ 22న రూ.7 లక్షలు మంజూరైంది. ఈ నిధులు తానే మంజూరు చేయించానంటూ అక్కడి తెలుగుదేశం నాయకుడు నారాయణాచారి రూ.3 లక్షలు తీసుకున్నారని సుజాత వాపోతున్నారు. ఆ డబ్బు గురించి అడుగుతుంటే ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారని సుజాత కంటతడి పెట్టుకుంటోంది. మరోపక్క విజయవాడ నగరంలోని వన్‌టౌన్‌కు చెందిన ఒక కోటీశ్వరుడి వైద్యానికి ఓ ప్రజాప్రతినిధి సిఫార్సు చేసి రూ.10 లక్షలు సీఎంఆర్ఎఫ్ నుంచి విడుదల చేయించారు. ‘ఫిఫ్టీ.. ఫిఫ్టీ’ ఒప్పందం మేరకే ఈ నిధులు మంజూరు చేయించారని ఆరోపణలు ఉన్నాయి. సీఎంఆర్ఎఫ్ కింద నిధుల విడుదలకు ఇస్తున్న జీవోల్లో ఏవైద్యానికి ఎంత నిధులు ఇచ్చారనే వివరాలు ఉండవు. ఒకే తరహా వైద్యానికి ఒక ఆస్పత్రికి ఒకలా మరో ఆస్పత్రికి మరోలా వ్యత్యాసం చూపుతున్నారని కొన్ని ఆస్పత్రుల వారు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీకి ఒకలా.. సీఎంఆర్ఎఫ్కు మరోలా.. హైదరాబాద్‌లో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించదని జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద బెంగళూరు, చెన్నైల్లో వైద్యం చేయించుకున్న వారికి ఎలా నిధులు ఇస్తోందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. వైద్యానికి ప్రభుత్వ నిధుల మంజూరులో పేదలకు ఒక రూలు, ధనికులకు మరో రూలా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక మరోపక్క విజయవాడలోని కొన్ని ఆస్పత్రులు సీఎంఆర్ఎఫ్ నిధులను ఇప్పిస్తామని చెప్పి పేషెంట్లను ఆకర్షిస్తున్నాయి. ఇక జిల్లాల వారీగా బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర వివక్ష కొనసాగుతోంది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని అధికార పార్టీ నేతలకు సన్నిహితులైన కొన్ని ఆస్పత్రులకు మోకీలు ఆపరేషన్‌కు సీఎంఆర్ఎఫ్ నుంచి రూ. 1,08,610 మంజూరు చేశారు. కర్నూలు, అనంతపురం నగరాల్లో ఇదే శస్త్రచికిత్సలు చేసిన ఆస్పత్రులకు కేవలం రూ. 81 వేలు మాత్రమే మంజూరు చేశారని ఒక ప్రైవేటు ఆస్పత్రి యజమాని పేర్కొన్నారు. ఇలా వివక్ష చూపడం అన్యాయమని ఆస్పత్రుల యజమానులు అంటున్నారు. -
స్వైపింగ్ దందా...
కోహెడరూరల్(హుస్నాబాద్) : కోహెడ మండలానికి చెందిన బోలుమల్ల రామయ్య ఒక సాధారణ రైతు. అయన బ్యాంకు ఖాతాలో రూ. 19000 వేలు ఉన్నాయి. ఇటీవల పంట కోత కోసం డబ్బులు కావాలని మండల కేంద్రలోని రెండు ఏటీఎం తిరిగాడు. ఏటీఎంలో డబ్బులు లేకపోవడంతో పని కాలేదు. రామయ్యకు తెలిసిన వ్యక్తి ఒకరు ఒక షాపు అడ్రస్ చెప్పాడు. అయన వద్దకు వెళ్లిన రామయ్య ఏటీఎం ఇచ్చి 14వేలు కావాలని చెప్పాడు. దీంతో సదరు యజమాని తన ఖాతాలోని 14వేలు తీసి 13,600 రామయ్యకు ఇచ్చాడు. డబ్బులు లెక్కపెట్టిన రామయ్య 400 తక్కువగా ఉన్నాయని ఆడగగా మీకు పుణ్యానికి డబ్బులు ఇవ్వడానికి ఎమైనా ధర్మసత్రం నడుపుతున్నానా మీకు డబ్బులు ఇచ్చినందుకు మాకు ట్యాక్సులు పడుతాయి. మా ఆకౌంట్లో డబ్బులు వాడినందుకు రేపు లేనిపోని తలనొప్పులు వస్తాయని కోపగించకున్నాడు. ఇలాంటి రామయ్యలు రోజుకు వందల సంఖ్యలో ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో నగదు సమస్య పీడిస్తుంది. డబ్బుల కోసం సామాన్యులు నానా పాట్లు పడతున్నారు. వారి అవసరాలను కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. నగదు రహిత లావాదేవీల కోసం తీసుకున్న స్వైపింగ్ మిషన్ల ద్వారా కమీషన్‌పై డబ్బులు ఇస్తూ దందా చేస్తున్నారు. నగదు రహత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వ్యాపార సముదాయలలో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కొందరు వ్యాపారులు ఈ స్వైపింగ్ మిషన్లు వ్యాపారానికే కాకుండా కమీషన్‌కు డబ్బులు ఇచ్చేందుకు ఉపయోగిస్తున్నారు. వ్యాపార సంస్థలే కాకుండా పెట్రోల్ బంకులు, వైన్‌షాపులు తదితర కమీషన్ వ్యాపారం జోరుగా సాగుతుంది. స్వైపింగ్ ద్వారా లావాదేవీలు జరిపితే ఎలాంటి కమీషన్ తీసుకోవద్దని బ్యాంకర్లు సూచిస్తున్నా పలువురు వ్యాపారులు ఇలా విని అలా వదిలేస్తున్నారు. డబ్బులు దొరక్కపోవడంతో... పంట కోతలున్నాయి. చేతిల డబ్బులు లేవు. ఏటీఎంలో సరిపడా డబ్బులు రాకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నాం.స్వైపింగ్ ద్వారా అయితే 5 నిమిషాల్లొ డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు పోతే పోయినాయి. కానీ అవసరాలు గట్టేకుతున్నాయి. –బోలమల్ల మహేందర్, స్థానికుడు కమీషన్ తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి స్వైపింగ్ ద్వారా కమీషన్ తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకోని వ్యాపారుల వద్దకు వెళ్తే స్వైపింగ్ మిషన్ ద్వారా కమీషన్ వసూలు చేస్తున్నారు. మా డబ్బులు తీసుకోవడానికి కూడా కమీషన్ ఇవ్వాల్సి వస్తోంది. –బి.శ్రీనివాస్, వరికోలు -
పాతనోట్ల మార్పిడికి సినీ దర్శకుడి యత్నం
-
పాతనోట్ల మార్పిడికి సినీ దర్శకుడి యత్నం
∙రూ.1.20 కోట్ల పాత కరెన్సీ పట్టివేత ∙పరారీలో సూత్రధారి రామకృష్ణ బంజారాహిల్స్: పాత కరెన్సీ మార్పిడి చేస్తున్న ముఠాను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.20 కోట్ల పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్ల మార్పిడి తతంగంలో ఓ సినీదర్శకుడు సూత్రధారిగా ఉన్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని కమలాపురి కాలనీలో సినీ దర్శకుడు కిట్టు అలియాస్ రామకృష్ణ (కేటుగాడు సినిమా దర్శకుడు) కార్యాలయం ఉంది. ఈ నెల 31తో పాత కరెన్సీ మార్చుకునేందుకు గడువు ముగియనుండటంతో అతను తెలిసిన వారిని సంప్రదించి కరెన్సీ మార్పిడి చేస్తానని పిలిపించాడు. దీంతో ఆదివారం వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు పెద్దమొత్తంలో పాత కరెన్సీ నోట్లు తీసుకుని కిట్టు సినీ కార్యాలయానికి వచ్చారు. దాదాపు 30 మంది రూ.13 కోట్లు తీసుకువచ్చినట్లు సమాచారం. ఇందులో పాత బస్తీకి చెందిన వ్యాపారి వసీం రూ. 20 లక్షలు, అమీర్‌పేట్‌కు చెందిన ప్రసాద్ రూ. 18 లక్షలు, మరో వ్యాపారి దిలీప్ రూ. 20 లక్షలు తేగా, మిగతా వారు కూడా పెద్దమొత్తంలో నగదు తీసుకువచ్చి కిట్టు కోసం వేచి చూస్తున్నారు. అయితే అదే సమయంలో ముంబయికి చెందిన బిలాల్ షుక్రు అనే వ్య రివాల్వర్‌తో అక్కడికి రావడంతో వారులో కొందరు అక్కడినుంచి జారుకున్నారు. ఇలోగా దీనిపై సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి ప్రసాద్, దిలీప్, వసీంతోపాటు మరో 9 మందిని అదుపులోకి తీసుకుని పెద్ద మొత్తంలో పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వీరిని స్టేషన్‌కు తరలించి షుక్రూ నుంచి రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. కాగా వారిని భయపెట్టి పాత కరెన్సీతో ఉడాయించాలన్నది కిట్టూ గ్యాంగ్ పథకం పన్నినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో దర్శకుడు కిట్టు పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గత వారం రోజులుగా పెద్ద సంఖ్యలో వ్యాపారులు వస్తున్నట్లు తెలిసింది. పరారీలో ఉన్న ప్రధాన సూత్రదారి కిట్టు కోసం గాలింపు చేపట్టారు. అతనితోపాటు రాజేష్, మనోజ్, బిలాల్, పాషా, వసీం, దిలీప్‌జైన్, ప్రసాద్, తులసీదాస్లపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్ రూ.100 కోట్లు పాత నోట్ల మార్పిడి పేరుతో గత కొద్ది నెలలుగా కొన్ని ముఠాలు జోరుగా కమీషన్ దందా నడిపిస్తున్నాయి.. ఈ వ్యవహారంలో సినీపరిశ్రమలోని కొందరు పెద్దల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ఒక ప్రముఖ నిర్మాత కుమారుడు గడువు ముగిసేలోగా రూ.100 కోట్లు మార్చాలని ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.. బంజారాహిల్స్ కేంద్రంగా గత మూడు నెలలుగా 60–40 పేరుతో జోరుగా దందా నడుపుతున్నారు. పాతనోట్ల రద్దుతో చాలా మంది తమ వద్ద ఆదాయానికి మించి ఉన్న కరెన్సీని మార్చుకొనేందుకు అడ్డదారులు తొక్కారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది 40 శాతం కటింగ్‌తో కొత్త నోట్లను తీసుకున్నారు. ఈ వ్యవహారం నోట్ల జమ నిర్ణీత గడువు వరకు కొనసాగింది. ఒకానొకదశలో 10 శాతం కమీషన్‌పై కూడా నోట్లను మార్పిడి చేశారు. నేడు 60–40 బ్యాంకులు పాతనోట్లను స్వీకరించే గడువు ముగియడంతో పలువురు మిగిలిపోయిన డబ్బును ఇప్పుడు తమకు తెలిసిన వారి ద్వారా మార్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు 60–40, 80–20 శాతానికి మార్చుకుంటున్నారు. ఇందుకు బంజారాహిల్స్ ప్రాంతం ముఖ్య కేంద్రంగా మారింది. ‘పెద్దల’ ఇలాకాలో.. నోట్ల మార్పిడి వ్యవహారం ఇప్పుడు క్లిష్టంగా మారడంతో పెద్దలు రంగంలోకి దిగారు. తమ పరిచయాల ద్వారా డబ్బును మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు తమకు ఆర్బీఐలో పెద్ద పరిచయాలు ఉన్నాయంటూ కమీషన్‌పై మార్పిడి చేస్తున్నారు. దీనికితోడు సినీపరిశ్రమకు చెందిన కొందరు జోరుగా దందా కొనసాగిస్తున్నారు.. బంజారాహిల్స్ కేసులో సినీ దర్శకుడు కిట్టు ప్రమేయం ఉన్నట్లు తేలడంతో, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరికొందరు ఆందోళన చెందుతున్నారు. -
భారీగా నోట్లను మార్చుతూ బుక్కయ్యారు