Commissioner Mahesh bhagwat
-
‘కల్తీ’ ఖరీదు రూ.కోటి
కల్తీ దినుసులు స్వాధీనం చేసుకున్న పోలీసులు హైదరాబాద్: కల్తీ దినుసుల ముఠా గుట్టురట్టు అయింది. కారం, ధాన్యాలు, పసుపు, ధనియాలు, లవంగాలు, మసాలా పొడులు తయారు చేస్తున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. ఎల్బీనగర్ లోని పోలీసు కమిషనర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొం డ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ ఉప్పుగూడ హను మాన్‌నగర్‌కు చెందిన ఈదులకంటి పాండుగౌడ్ (47) ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లి సాగర్ హైవే సమీపంలో శ్రీ భవాని ఏజెన్సీ పేరుతో గోదామును ఏర్పాటు చేశాడు. దీనిలో హయత్ నగర్ మండలం యంజాల్‌కు చెందిన తుమ్మిడి నర్సిరెడ్డి (38), బాలాపూర్ మండలం జిల్లెలగూ డకు చెందిన నిమ్మల నారాయణ సూపర్వైజర్లుగా పనిచేస్తున్నారు. ముగ్గురు కలసి పాడైపోయిన ఎండు మిర్చి, గడువు ముగిసిన వస్తువులతో కల్తీ కారం తయారు చేస్తున్నారు. కారంతోపాటు కల్తీ పసుపు, ఆవాలపొడి, యాలకులు, ధనియాల పొడి తయారు చేసి శ్రీఓం, చక్రం బ్రాండ్ల పేరిట ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేస్తున్నారు. వీటి తయారీలో తక్కువ ధర ఆయిల్‌ను ఉపయోగిస్తు న్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ గోదాంపై స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారి విజయ్‌కుమార్ దాడి చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. 4 టన్నుల మిర్చి, 3.5 టన్నుల పసుపు, 1,250 కిలోల దనియాలు, 300 కిలోల ఆవాల పొడులు, 2,500 కిలోల పొట్టు, 15 లీటర్ల నాసిరకమైన నూనె, మిర్యాల పొట్టు, లవంగా ఆకు వంటి రూ.కోటి విలువైన దినుసులను స్వాధీనం చేసుకున్నారు. -
ఆన్లైన్లో అందాలను వర్ణిస్తూ..
సాక్షి, సిటీబ్యూరో: టెక్నాలజీని అందిపుచ్చుకున్న వ్యభిచార దందా ముఠాలు హైటెక్ వ్యభిచారం మొదలుపెట్టాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు అందమైన అమ్మాయిల ఫొటోలను ఆయా వెబ్సైట్లలో అప్లోడ్ చేసి, వారి శరీరాకృతిని వర్ణిస్తూ పూర్తి వివరాలు నిక్షిప్తం చేయడంతో పాటు కాంటాక్ట్ నంబర్లు ఇస్తూ నిర్వాహకులు బిజినెస్ చేస్తున్నారు. ఈజీ పద్ధతిన డబ్బు సంపాదించే మార్గం కావడంతో నగరానికి చెందిన కొందరు నిర్వాహకులు ఆన్లైన్ వ్యభిచార దందాను భారీ స్థాయిలో ప్రారంభించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న సమాచారంతో కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు ఎస్ఓటీ అదనపు డీసీపీ రాంచంద్రారెడ్డి నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. ఫోన్‌కాల్స్ ఆధారంగా ఉప్పల్ ఠాణా పరిధిలో ముగ్గురు నగరవాసులతో కూడిన ఓ వ్యభిచార ముఠాను అరెస్టు చేశారు. ఇద్దరు బాధిత మహిళలకు విముక్తి కల్పించారు. తాజాగా మంగళవారం న్యూఢిల్లీకి చెందిన నిర్వాహకురాలిని రామంతాపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు బాధిత మహిళలను వ్యభిచార కూపం నుంచి విముక్తి కల్పించారు. నిందితుల వద్ద 11 సెల్ఫోన్లు, ఒక కారు. రూ.32 వేలు స్వాధీనం చేసుకున్నారు. లొకంటో.కామ్ వేదికగా.. న్యూఢిల్లీకి చెందిన ప్రచిశర్మ, కాజల్‌శర్మలు లొకంటో.కామ్‌లో అందమైన ఫొటోలు అప్లోడ్ చేస్తూ ఈ దందా చేశారు. వీరు తమ బాయ్‌ఫ్రెండ్ ఢిల్లీకే చెందిన జావేద్ అన్సారీ సహాకారంతో నగరంలోనూ వ్యభిచార దందా ప్రారంభించారు. న్యూఢిల్లీ నుంచి తనకున్న పరిచయాలతో ప్రాచీ శర్మ కాల్ గరల్స్‌ను హైదరాబాద్‌కు రప్పించి వివిధ హోటళ్లలో వసతి కల్పించి దందా చేసేది. గంటలను బట్టి రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేసింది. ఇందులో 50 శాతం నగదు ఆమె తీసుకొని, హోటల్ ఖర్చులు మినహాయించి మిగతావి కాల్ గరల్స్‌కు కాల్ గరల్స్‌కు ఇచ్చేది. ఇదే విధంగా నగరానికి చెందిన రంజిత్, నగేశ్, రవివర్మ సహాకారంతో మెహిదీపట్నంలోని రేతిబౌలికి చెందిన డి.ప్రభాకర్ హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు రాచకొండ ఎస్ఓటీ పోలీసులు రామాంతాపూర్‌లోని వ్యభిచార గృహంపై దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగానే ఢిల్లీకి చెందిన ప్రచిశర్మను మంగళవారం అరెస్టు చేశారు. ఢిల్లీ, హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు బాధిత మహిళలకు విముక్తి కల్పించారు. -
'మా పరిధిలో పబ్‌లకు అనుమతి లేదు'
నాగోలు: రాచకొండ కమిషనరేట్ పరిధిలో పబ్బులకు ఎలాంటి అనుమతులు లేవని, ఎవరైనా ఆ పేరుతో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ పేర్కొన్నారు. మంగళవారం సైబరాబాద్ సీపీ క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. ఎవరైనా మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించినట్లయితే 100 నెంబర్‌కు గాని, సైబరాబాద్ వాట్సాప్ నెంబర్-9490617111కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. స్పోర్ట్స్ బార్ల పేరుతో నిర్వహిస్తున్నవాటిపై విచారణ చేపడతామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే కొత్తపేట స్వాగత్‌గ్రాండ్ హోటల్‌పై సెక్షన్-21/70 కింద మేనేజర్ రఘుపై కేసు నమోదు చేశామని, ఇక ముందు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే స్పోర్ట్స్ బార్ యజమానిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. బార్లు, హోటళ్లలో చట్టవిరుద్ధంగా ఎవరైనా వ్యవహరించినట్లయితే చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయం ప్రకారమే బార్లు నడవాలన్నారు. సివిల్ తగాదాలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావొద్దని, కోర్టులోనే చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడినవారికి కౌన్సెలింగ్ నిర్వహించే కార్యక్రమంలో సీపీ పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. -
ప్రజలతో కమిషనర్ ముఖాముఖి
హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తానని సైబరాబాద్ ఈస్ట్ కమిషనర్ మహేష్ భాగవత్ అన్నారు. శనివారం ఆయన మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో ప్రజలతో ముఖాముఖిలో మాట్లాడారు. ప్రజలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కలుగుతోందని అన్నారు. ఇకపై ఏ సమస్య వచ్చినా తనను నేరుగా కలుసుకోవచ్చని భరోసా ఇచ్చారు. ఏదైనా కేసులకు సంబంధించి ముందుగా సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అక్కడ పరిష్కారం కాకుంటే ఏసీపీకి ఫిర్యాదు చేయాలని, అక్కడా పరిష్కారం కాకుంటే డీసీపీని కలవాలని కోరారు. సమస్య ఏదైనా డీసీపీ స్థాయి దాకా దాదాపు రావని, పోలీస్ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ విడిపోయిన తర్వాత మల్కాజిగిరిలో మొదటిసారిగా ఆయన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం మల్కాజిగిరిలో ప్రజలతో ముఖాముఖి ఉంటుందని చెప్పారు. సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్ దూరంగా ఉండటం వల్ల అక్కడికి ప్రజలు రావటంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మల్కాజిగిరిలో ఈ కార్యక్రమం ప్రారంభించామని అన్నారు. శనివారం సుమారు 20 మంది వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.