committy
-
22న మరో రామాలయంలోనూ ప్రాణప్రతిష్ఠ
ఈ నెల 22న అయోధ్యలోని రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అయితే అదేసమయంలో మధ్యప్రదేశ్‌లోని సౌసర్ నగర్లో గల 200 ఏళ్ల పురాతన రామాలయంలోనూ శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ నేపధ్యంలోనే ఆలయ కమిటీ జనవరి 16 నుంచి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో భారీ ఆలయాన్ని నిర్మించి, అందులో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారని, అదే సమయంలో తాము కూడా ఈ ఆలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠాపనకు నిర్ణయం తీసుకున్నప్పుడు, తాము కూడా అదే రోజున ఈ ఆలయంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించామన్నారు. కమిటీ మేనేజర్ నరేష్ బగానీ మాట్లాడుతూ దాదాపు 200 ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి తమ కుటుంబసభ్యులు శ్రీరామ మందిరాన్ని నిర్మించినప్పుడు ఇక్కడికి వచ్చారని చెప్పారు. ఆలయాన్ని పునరుద్ధరించాలని తమ కుటుంబీకులు నిర్ణయించారని, గత రెండేళ్లుగా ఆలయ నిర్మాణ పనులు కొనసాగాయన్నారు. ఎట్టకేలకు నిర్మాణ పనులు పూర్తయ్యాయని, 22 నుంచి ఆలయం భక్తులకు అందుబాటులోకి రానున్నదని అన్నారు. -
తెలుగు అకాడమీ నిధుల స్కాంలో ముగ్గురు అరెస్ట్
-
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసు: ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్: తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్మాల్ కేసులో సీసీఎస్ పోలీసులు శుక్రవారం ముగ్గురిని అరెస్టు చేశారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ, అగ్రసేన్ బ్యాంక్ మేనేజర్ పద్మావతి, ఏపీ మర్కంటైల్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఉద్యోగి మొహినుద్దిన్‌లను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, వీరు కోట్ల రూపాయల డిపాజిట్లను దారి మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. 330 కోట్ల రూపాయలను తెలుగు అకాడమీ 11 బ్యాంకుల్లోని 34 ఖాతాల్లో డిపాజిట్ చేసింది. ప్రధానంగా యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మాయం బ్యాంకు అధికారుల పాత్రపై తెలుగు అకాడమీ ఫిర్యాదు చేసింది. కాగా, దీనిపై సరైన పత్రాలు చూశాకే డిపాజిట్లు క్లోజ్ చేశామని బ్యాంకు ప్రతినిధులు పోలీసులకు తెలిపారు. ఏపీ వర్తక సహకార సంఘం ఏర్పాటు చేసినట్లు లేఖ సృష్టించి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. డిపాజిట్లు రద్దు చేయాలని అధికారుల పేర్లతో బ్యాంకులకు లేఖరాశారు. కాగా, డిపాజిట్ల రద్దు వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో సీసీఎస్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిధుల గోల్‌మాల్‌పై ఇప్పటికే త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. శుక్రవారం రాత్రి వరకు మరి కొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అకాడమీ ఉద్యోగులను సైతం సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: Telugu Academy Money Fraud: తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్.. విచారణ వేగవంతం చేసిన సీసీఎస్ -
రైతుల వాదనకే మద్దతు
న్యూఢిల్లీ/ముంబై: వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో రైతుల వాదనకే మద్దతిస్తున్నానని ప్రఖ్యాత జర్నలిస్ట్ పి.సాయినాథ్ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసే ఏ కమిటీలోనూ సభ్యుడిగా ఉండాలనుకోవడం లేదని శుక్రవారం స్పష్టం చేశారు. కొత్త సాగు చట్టాలపై రైతుల అభ్యంతరాలను అధ్యయనం చేయడంతో పాటు, వారిని ఆందోళనల నుంచి విరమింపచేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఆ కమిటీలో ఉండే సభ్యుల పేర్లలో తన పేరును సుప్రీంకోర్టు ప్రస్తావించడంపై సాయినాథ్ స్పందించారు. కమిటీ సభ్యుడిగా తన పేరు రావడంపై ఆశ్చర్యానికి లోనయ్యానన్నారు. ‘ఒకవేళ ప్రభుత్వం సంప్రదిస్తే.. కమిటీ ఏర్పాటు హేతుబద్ధతపై ప్రభుత్వ ఉద్దేశమేంటో తెలుసుకుంటాను. కమిటీ ఉద్దేశం, లక్ష్యాలేమిటో కనుక్కుంటాను. కమిటీ ప్రాతినిధ్యం వివరాలు, ఆ కమిటీ నివేదికను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేసేదీ లేనిదీ కనుక్కుంటాను’ అని వివరించారు. రైతులు వెలిబుచ్చిన 14, 15 అభ్యంతరాల్లో 12 అభ్యంతరాలపై సవరణలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందంటేనే, చట్టాల్లో తీవ్ర లోపాలున్నాయని అర్థమవుతోందన్నారు. రైతులకు ఆల్ ఇండియా కిసాన్ సభ మద్దతు సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతిస్తున్నట్లు ఆల్ ఇండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) ప్రకటించింది. ఏఐకేఎస్ నాయకులు అజిత్ నవాలే, అశోక్ ధవాలే, సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ నేతలు డీఎం దరార్, సునీల్ మాలుసరె మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ ప్రకటన చేశారు. ‘రైతుల కష్టంతో కార్పొరేట్లు లాభాలు ఆర్జించేందుకే ఈ చట్టాలు ఉపయోగపడ్తాయి. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాలో పాల్గొనేందుకు వేలాది మంది రైతులతో కలిసి డిసెంబర్ 21న ఢిల్లీకి బయల్దేరుతాం’ అని వెల్లడించారు. -
జంతు హింస నివారణ సంఘ కమిటీ రద్దు
కాకినాడ ఆర్డీవో చైర్మన్‌గా సబ్ కమిటీ 13 మందిపై కేసు నమోదు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ కాకినాడ సిటీ: జంతుహింస నివారణ కేంద్రం ప్ర„ýక్షాళనకు కలెక్టర్ కార్తికేయ మిశ్రా చర్యలు చేపట్టారు. ఇటీవల కేంద్రంలో సుమారు 30కి పైగా పశువులు మరణించిన విషయం తెలిసిందే. పిఠాపురం మహారాజా మెమోరియల్ జంతు హింస నివారణ సంస్థ నిర్వహణ బాగోలేదని నిర్ణయించి ఈ మేరకు ఇప్పటి వరకు ఉన్న సంఘ కమిటీని రద్దు చేస్తూ శుక్రవారం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ ఆర్డీఓను చైర్మన్‌గా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కమిటీలో జిల్లా పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్‌తో పాటు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లను కన్వీనర్లుగా, జిల్లా ఎస్పీ నిర్ణయించిన వారిలో ఒకరిని, రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులను సభ్యులుగా నియమించారు. కాకినాడ ఆర్డీవో పర్యవేక్షణ, జంతుహింస నివారణ కేంద్రం పరిసరాలు శుభ్రత విషయంలో చర్యలకు మున్సిపల్ కమిషనర్‌నూ, పశువుల మేత, ఆరోగ్య రక్షణతోపాటు అనారోగ్యం బారిన పడిన పశువులు కోలుకునేందుకు అవసరమైన వైద్య ఏర్పాట్లు చేయాలని పశుసంవర్థకశాఖ జేడీని ఆదేశించారు. కేంద్రంలో పరిస్థితి చక్కబడే వరకు కొత్త పశువులను అనుమతించకూడదని, ప్రస్తుతం ఉన్న వాటిలో ఆరోగ్యంగా ఉన్న సుమారు 150 పశువులను పోషణకు గాను రంపచోడవరం ఐటీడీఏకు అందజేసేలా ఆదేశాలు జారీ చేశారు. సబ్ కమిటీ వారానికి ఒకసారి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. . విరాళాలు అందజేయాలి... జంతుహింస నివారణా కేంద్రానికి విరాళాలు ఇవ్వదలచినవారు రెవెన్యూ డివిజనల్ అధికారి కాకినాడ పేరన ఉన్న బ్యాంకు అకౌంటుకు అందజేయవచ్చని ఆర్డీవో ఎల్.రఘుబాబు ఒక ప్రకటనలో కోరారు. మరిన్ని వివరాల కోసం కాకినాడ ఆర్డీవో కార్యాలయం 0884–2368100 ఫోన్ నెంబర్‌కు సంప్రదించవచ్చన్నారు. . 13 మంది కమిటీ సభ్యులపై కేసు నమోదు: పశువులు చనిపోవడానికి కారణంగా భావిస్తూ 13 మంది కమిటీ సభ్యులపై ఐపీసీ 428, 429 సెక్షన్ల కింద సర్పవరం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు స్టేషన్ సీఐ చైతన్యకృష్ణ వివరించారు.