communication section
-
ఓటీటీలకూ భారీ షాక్.. ఇకపై అలా కుదరదండి!
న్యూఢిల్లీ: కమ్యూనికేషన్ సేవలు అందించే సంస్థలన్నింటికీ ఒకే రకం నిబంధనలు అమలు చేయాలని టెల్కోల సమాఖ్య సీవోఏఐ డిమాండ్ చేసింది. తమకు వర్తింపచేస్తున్న నిబంధనలను ఓటీటీ (ఓవర్–ది–టాప్) కమ్యూనికేషన్ యాప్స్‌కు కూడా వర్తింపచేయాలని కోరింది. అలా చేయని పక్షంలో తమ లైసెన్సులు, నియంత్రణపరమైన నిబంధనలనైనా సడలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అన్ని ‘ఓటీటీ కమ్యూనికేషన్ సేవల విషయంలో అన్ని టెక్నాలజీలకు సమానంగా రూల్స్‌ను అమలు చేయాలి. తద్వారా పరిశ్రమలో సముచితమైన, ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది‘ అని ఒక ప్రకటనలో సీవోఏఐ పేర్కొంది. ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీసులను కూడా ఇటీవలి టెలికమ్యూనికేషన్స్ బిల్లు ముసాయిదాలో పొందుపర్చడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే ఈ తరహా సేవల విషయంలో ఎటువంటి గందరగోళం లేకుండా స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలని కోరుకుంటున్నామని వివరించింది. టెలికం సంస్థలు స్పెక్ట్రం కొనుగోలు చేయం మొదలుకుని నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకోవడం వరకూ భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని, అనేక నిబంధనలను పాటించాల్సి ఉంటోందని సీవోఏఐ తెలిపింది. మరోవైపు ఓటీటీలు మాత్రం టెలికం సర్వీసులను ఇలాంటి బాదరబందీలేమీ లేకుండా, ఎలాంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం లేకుండా అందించడం ద్వారా ప్రయోజనాలు పొందుతున్నాయని పేర్కొంది. సీవోఏఐలో టెలికం సంస్థలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొదలైనవి సభ్యులుగా ఉన్నాయి. వాట్సాప్ వంటి ఓటీటీ కమ్యూనికేషన్ యాప్‌లు .. ఇంటర్నెట్ టెక్నాలజీ ఆధారంగా టెలికం సంస్థల తరహాలోనే వాయిస్, వీడియో కాలింగ్ సేవలను అందిస్తున్నాయి. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
సుంకాల పెంపుతో దిగుమతులు భారం
న్యూఢిల్లీ: కమ్యూనికేషన్ రంగంలో ఉపయోగించే కొన్ని ఉత్పత్తులపై సుంకాలను పెంచడం వల్ల దిగుమతుల వ్యయాలు దాదాపు పది శాతం మేర పెరిగిపోతాయని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పరిశ్రమకు ఇది మరింత భారంగా మారుతుందని పేర్కొంది. అయితే, దేశ ప్రయోజనాలు కాపాడేందుకు తమ వంతు బాధ్యత నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నామని సీవోఏఐ తెలియజేసింది. సాధారణంగా ఆపరేటర్లు ఏటా దాదాపు 8 బిలియన్ డాలర్ల విలువ చేసే నెట్వర్క్ పరికరాలను దిగుమతి చేసుకుంటారని, గత రెండు త్రైమాసికాల్లో దాదాపు 2–3 బిలియన్ డాలర్ల మేర దిగుమతులు జరిగి ఉంటాయని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. కొత్తగా సుంకాల పెంపుతో దిగుమతుల వ్యయాలు 10 శాతం మేర పెరగవచ్చని చెప్పారు. బేస్ స్టేషన్స్ సహా కొన్ని కమ్యూనికేషన్స్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను 20 శాతం దాకా పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మాథ్యూస్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
27 నుంచి ఎస్సై అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
- షెడ్యూల్ ప్రకటించిన రిక్రూట్మెంట్ బోర్డు - జూలై 9 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు సాక్షి, హైదరాబాద్: సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సై) ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య, సామర్థ్య పరీక్ష (పీఎంటీ, పీఈటీ)ల షెడ్యూల్‌ను రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఈనెల 27 నుంచి జూలై 5 వరకు అభ్యర్థులకు పీఎంటీ, పీఈటీ నిర్వహించనున్నట్లు బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్రావు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అభ్యర్థుల పరీక్షలకు సంబంధించిన ఇన్టిమేషన్ లెటర్‌ను ఈనెల 18న మధ్యాహ్నం 2 గంటల నుంచి రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ www.tslprb.in లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ప్రతీ రోజు రెండు విడతలుగా 1,200 మందికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు మొదటి బ్యాచ్‌లో 600 మందికి, ఉదయం 10 గంటలకు మరో 600 మందికి టెస్టులు నిర్వహిస్తారు. ఎస్సై (సివిల్/ఏఆర్/టీఎస్ఎస్పీ/ఎస్పీఎఫ్/ఎస్ఎఫ్వో)లకు సంబంధించి మొత్తం 88,875 మంది అర్హత సాధించారు. వీరికి దేహదారుఢ్య పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 13 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇన్టిమేషన్ లెటర్ ఆధారంగా సంబంధిత తేదీల్లో కేటాయించిన సమయానికి అభ్యర్థులు చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే జూలై 4న నిర్వహించే పీటీవో విభాగం అభ్యర్థులు 388 మందికి ఒకే కేంద్రాన్ని కేటాయించారు. కమ్యూనికేషన్ విభాగం (జూలై 5) అభ్యర్థులు 1,709 మందికి రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేహదారుఢ్య పరీక్షలకు వచ్చే అభ్యర్థులు ధ్రువపత్రాలతోపాటు విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలను తీసుకురావాలని రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టం చేసింది. ఇన్టిమేషన్ లెటర్లు పొందే విషయంలో సందేహాలు తలెత్తితే 040-23150362, లేదా 040-23150462 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు. మరోవైపు కానిస్టేబుల్ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు జూలై 9 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పూర్ణచందర్రావు తెలిపారు. అభ్యర్థుల షెడ్యూల్‌ను ఒకట్రెండు రోజుల్లో వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. -
మరో 332 కానిస్టేబుల్ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు కూమ్యూనికేషన్ విభాగంలో 332 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే వివిధ విభాగాల్లో 9,281 కానిస్టేబుల్, 539 ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయిన విషయం తెలిసిందే. తాజాగా కమ్యూనికేషన్ విభాగంలో ఖాళీల భర్తీ కోసం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 25 నుంచి మార్చి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మూడేళ్ల వయోపరిమితి సడలింపు ఈ పోస్టులకు కూడా వర్తిస్తుంది. వాస్తవానికి జనరల్ కేటగిరీలో 18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య వయసు వారే ఈ కానిస్టేబుల్ పోస్టులకు అర్హులుకాగా... సడలింపుతో 25 ఏళ్ల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నిబంధనల మేరకు అదనపు వయోపరిమితి వర్తిస్తుంది. 360 పనిదినాలు పూర్తిచేసుకున్న హోంగార్డులు 33 ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సాంకేతిక విద్య తప్పనిసరి..: కమ్యూనికేషన్ విభాగంలోని ఈ కానిస్టేబుల్ పోస్టులకు సాంకేతిక విద్యను అభ్యసించిన వారే అర్హులు. ఎస్సెస్సీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రానిక్, మెకానికల్ విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నికల్ (ఈఈటీ), ఎలక్ట్రికల్ టెక్నిషియన్ (ఈటీ) కోర్సులను ఈ ఏడాది జూలై 1 నాటికి పూర్తి చేసుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష ఫీజు ఓసీ, బీసీ కేటగిరీల వారికి రూ.400... ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200. ఈ ఫీజును టీఎస్ ఆన్లైన్, ఏపీ ఆన్లైన్, మీసేవ కేంద్రాల్లోగానీ.. క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారాగానీ చెల్లించవచ్చు. ప్రిలిమినరీ పరీక్ష ఉండదు గతంలో విడుదల చేసిన కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు ప్రిలిమినరీ, శరీర దారుఢ్య పరీక్షలు, తుది పరీక్షలు నిర్వహించేలా నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ కమ్యూనికేషన్ విభాగం పూర్తిగా సాంకేతిక అంశాలతో కూడినదైనందున ఈ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష ఉండబోదు. నేరుగా శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులో ఎంపికైన వారికి సాంకేతిక అంశాలతో కూడిన 200 మార్కుల రాతపరీక్ష నిర్వహిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో, బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్, టెలిఫోన్ సిస్టం సిలబస్‌కు సంబంధించిన అంశాలపై ప్రశ్నలుంటాయి. ఇక శరీర దారుఢ్య పరీక్షలకు సంబంధించి పురుషుల కనీస ఎత్తు 162 సెంటీమీటర్లు, ఛాతీ గాలి పీల్చినప్పుడు 84 సెంటీమీటర్లు ఉండాలి, వదిలినప్పుడు 3 సెంటీమీటర్లు తగ్గవచ్చు. మహిళలకు కనీస ఎత్తు 152.5 సెంటీమీటర్లు. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఎస్టీ పురుష అభ్యర్థులకు కనీస ఎత్తు 160 సెంటీమీటర్లు, ఛాతీ గాలి పీల్చినప్పుడు 80 సెంటీమీటర్లు ఉండాలి, వదిలినప్పుడు 3 సెంటీమీటర్లు తగ్గవచ్చు. ఈ జిల్లాకు చెందిన ఎస్టీ మహిళా అభ్యర్థుల కనీస ఎత్తు 150 సెంటీమీటర్లు ఉండాలి. శరీర దారుఢ్య పరీక్షలు.. ఈవెంట్స్ జనరల్ ఎక్స్‌సర్వీస్ మహిళలు 100 మీటర్ల పరుగు 15 సెకన్లు 16.5 సెకన్లు 20 సెకన్లు లాంగ్‌జంప్ 3.80 మీటర్లు 3.65 మీటర్లు 2.50 మీటర్లు షాట్‌పుట్ 5.60 మీటర్లు 5.60 మీటర్లు 3.75 మీటర్లు హైజంప్ 1.20 మీటర్లు 1.05 మీటర్లు - 800 మీటర్ల పరుగు 170 సెకన్లు 200 సెకన్లు - (షాట్‌పుట్ బరువు పురుషులకు 7.26 కేజీలు, మహిళలకు 4 కేజీలు)